
పీఆర్పీ సాధనకు ఆందోళనలు
గోదావరిఖని: ఫెర్ఫార్మెన్స్ రి లేటెడ్ పేమెంట్(పీఆర్‌పీ) చే యాలని కోరుతూ సింగరేణి వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు నిర్వహించేందుకు తీర్మానించినట్లు కోల్‌మైన్స్ ఆ ఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రధాన కార్యదర్శి నర్సింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవా రం రాత్రి స్థానిక బీ గెస్ట్‌హౌస్‌లోని సీఎంవోఏఐ కా ర్యాలయంలో రీజియన్‌స్థాయి సమావేశం నిర్వహించారు. వేతనాల్లో భాగమైన 2022–23 పీఆర్పీ, 2017–2014 బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఇందుకోసం రోజుకో ఏరియాలో నల్లబ్యాడ్జీలతో ని రసన తెలపాలని నిర్ణయించారు. అలాగే వర్క్‌టూరూల్స్ కొనసాగించాలి, జీఎం కార్యాలయాల్లో ప్రతీరోజు సాయంత్రం నిరసన తెలపాలని తీర్మానించారు. సెంట్రల్ కమిటీకి ఈ ప్రతిపాదనలు చేసి వెంటనే కార్యాచరణ ప్రకటించాలని రామగుండం రీజియన్ కోరింది. సమావేశంలో నాయకులు కోల మల్లేశ్, విష్ణు, పెరుమాళ్ల శ్రీనివాస్, దామోదర్, కట్ట శ్రీధర్, మధు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.