
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి భా రీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షం కష్టాలను తెచ్చి పెట్టింది. మార్కెట్ యార్డు ఆవరణ, పలు ప్రాంతాల్లో చెట్లు నేలవాలాయి. వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలోనే దాదాపు 20 చెట్లు నేల వాలాయని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప తెలిపారు. కాగా, నేలవాలిన చెట్లను తొలగించే పనులు ఆదివారం చేపట్టారు.
నీడపట్టున ఉంటుందనుకుంటే..
పెద్దపల్లి మార్కెట్ యార్డులో పత్తి వ్యాపారి బంధువుకు చెందిన కారును నీడ పట్టున ఉంటుందని భావించి శనివారం మధ్యాహ్నం పార్కింగ్ చేశాడు. రాత్రి ఈదురుగాలులకు చెట్టు కారుపై పడగా, ధ్వంసమైంది. పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోనూ కారుపై చెట్టు పడి కారు దెబ్బ తింది. భారీ వానకు మార్కెట్‌లో ధాన్యం తడిసింది. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు తంటాలుపడ్డారు.
గాలివాన వచ్చి.. కష్టాలను తెచ్చి..

సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025

సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025