
కోతలు లేకుండానే కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులను కోతల పేరిట రైస్‌మిల్లు యజమానులు ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకున్నామని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం పనులు సాఫీగా సాగుతున్నాయన్నారు. ధాన్యం డ బ్బులు రైతు బ్యాంకు ఖాతాల్లో 48గంటల్లో జమ చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 319 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 35వేల మంది రైతుల నుంచి రూ.592కోట్ల 78 లక్షల విలువైన 2లక్షల 56 వేల 810 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో డీఎస్‌వో రాజేందర్, డీఎం శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.