
ప్రమాదకర కల్వర్టు.. స్పందించిన కమిషనర్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా పరిధిలోని ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొ త్త కల్వర్టు ప్రమాదకరంగా ఉండడం, ఇరువైపులా సైడ్‌వాల్ నిర్మించకపోవడంతోపాటు కనీ స ం రోడ్డుకు సమానంగా మట్టి కూడా పోయలేదు. దీంతో ప్రమాదాలు చో టు చేసుకుంటాయి. ఈ సమస్యపై మా ర్చి 21న ‘సాక్షి’లో కథ నం ప్రచురించగా, బల్దియా కమి షనర్ జె.అరుణశ్రీ స్పందించారు. మార్చి 25న కల్వర్టును పరిశీలించి యుద్ధప్రాతిదికన పనులు చేపట్టాలని ఆదేశించారు.
కృతజ్ఞతలు
ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొత్తగా నిర్మించిన కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకున్నందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. ము న్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే స్పందించారు. పనులు ప్రారంభించారు. 33వ డివిజన్ పరిధిలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– మద్దెల దినేశ్, ఫైవింక్లయిన్ ఏరియా,
గోదావరిఖని

ప్రమాదకర కల్వర్టు.. స్పందించిన కమిషనర్

ప్రమాదకర కల్వర్టు.. స్పందించిన కమిషనర్