
సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలి
జూలపల్లి(పెద్దపల్లి): సమాజంలో శాంతి, స్నేహభావం పెంచేందుకు మనకు వారసత్వంగా వస్తున్న సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని చిన్మయ మిషన్ స్వామిజీ శ్రీ సాక్షిరూపానందస్వామి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి విచ్చేసిన ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుమ్మరికుంట శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అనంతరం జూలపల్లిలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి భక్తులకు భగవద్గీత ప్రవచనాలు వినిపించారు. భగవద్గీత ప్రవచనం వారం రోజులు సాయంత్రం వేళ ఉంటుందని ఆలయ పునర్నిర్మాణ దాత నల్ల మనోహర్‌రెడ్డి వివరించారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పోట్టాల మల్లేశం, కొప్పుల మహేశ్, వెంకటరమణ, ప్రదీప్‌కుమార్, మెండె మల్లేశం, నొముల గోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, అర్చకులు ఉద్దండ నవీన్, భక్తులు పాల్గొన్నారు.