డిప్యూటీ సీఎంను కలుస్తాం
విజిలెన్స్ అధికారులను కలిశాం. సంస్థ సీఎండీతో చర్చించాం. యాజమాన్యం సానుకూలంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా డిప్యూటీ సీఎంను కలిసి విజిలెన్స్ పెండింగ్ కేసులన్నీ క్లియర్ చేసేలా చూస్తాం. నెలరోజుల్లో పరిష్కారం లభించేలా ప్రయత్నాలు చేస్తున్నాం.
– జనక్‌ప్రసాద్,
ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్
అడ్వకేట్ జనరల్‌కు పంపాం
మారుపేర్ల సమస్యపై న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్‌కు పంపాం. న్యాయ ప్రక్రియ క్లియరెన్స్ తర్వాత మారుపేర్ల ఉద్యోగాలకు ముందుకెళ్తాం. ఈనెల 20న సమ్మె తర్వాత మారుపేర్ల ఉద్యోగ ప్రక్రియ వేగవంతం చేసేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం.
– కొరివి రాజ్‌కుమార్,
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
దశలవారీగా పరిష్కారం
మార్చి చివరి వారంలో జరిగిన సమావేశంలో విజిలెన్స్ పెండింగ్ కేసులపై కమిటీ వేసి పరిష్కరించుకునేందుకు నిర్ణయానికి వచ్చాం. దశలవారీగా సమస్యలను బట్టి ఉద్యోగాలిచ్చే ప్రక్రియ ప్రారంభిస్తాం. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో భేటి అయి సమస్యను పరిష్కరిస్తాం.
– ఎన్.బలరాం, సంస్థ సీఎండీ
డిప్యూటీ సీఎంను కలుస్తాం
డిప్యూటీ సీఎంను కలుస్తాం


