
వ్యాధుల నియంత్రణకు చర్యలు
జ్యోతినగర్(రామగుండం): కీటకజనిత, సీజన ల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాల ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) అన్న ప్రసన్నకుమారి సూచించారు. వ్యాధు ల నియంత్రణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై మ ల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్), ల్యాబ్ టెక్నీషియన్లతో తన కార్యాలయంలో డీఎంహెచ్‌వో శనివారం సమీక్షించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెలలోనే అన్నిగ్రామాల్లోగల పబ్లిక్ వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయించాలన్నారు. ప్రతీరోజు సరఫరా చేసే తాగునీటిని క్లోరినేషన్ చేయాలని, ఆ తర్వాత పరీక్ష నిర్వహించి రికార్డు ల్లో నమోదు చేయాలని సూచించారు. మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తరలించాలని ఆదేశించారు. నీటిని ల్వ గుంతలను గుర్తించి పూడ్చి వేయాలని అ న్నారు. హోటళ్లల్లో పనిచేసే వారు, ఫుడ్ సప్లయర్స్‌కు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. హైపటైటిస్ – బి, టైఫాయిడ్ లాంటి లక్షణాలతో బాధపడేవారి నుంచి బ్లడ్ శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపించాలని అన్నా రు. ఇందుకోసం వివిధ శాఖలతో సమన్వయంచేసుకోవాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శాంపిల్ కలెక్షన్లు పెంచాలని, రిజెక్టెడ్ శాతం తగ్గించాలని అ న్నారు. కార్యక్రమములో డాక్టర్లు శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, రాజమౌళి పాల్గొన్నారు.
● డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి