
అభివృద్ధి పనులు పూర్తిచేయండి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు
కోల్‌సిటీ/రామగుండం: అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కమిషనర్ అరుణశ్రీ తో కలిసి రామగుండం బల్దియా పరిధిలో కలెక్టర్ పర్యటించారు. వీధివ్యాపారుల కో సం రైల్వేస్టేషన్ ఎదుట చేపట్టిన భవన ని ర్మాణం, యువతకు ఉపాధి కల్పించే ఏటీసీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లో స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఏటీసీల తో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పీకే రామయ్యకాలనీలో చేపట్టిన రోడ్డు, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో చేపట్టిన డ్రైనేజీ పనులు పరిశీ లించారు. జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని సీఎస్‌ఆర్ క్లబ్‌లో 126 మంది అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్న అగ్నివీర్ యువశక్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అభ్యర్థులకు నాణ్యమైన భోజనం, విద్య, శిక్షణ అందించాలని సూచించారు. జీజీహెచ్‌లో చే పట్టిన భవన నిర్మాణ ప్రగతిపై ఆరా తీశా రు. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఎర్లీబర్డ్ స్కీం కింద ఆస్తిపన్ను వసూలు చేసి, రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఇన్‌చార్జి ఆర్డీవో సురేశ్, ఈఈ రామన్, తహసీల్దార్ ఈశ్వర్, ఐటీఐ ప్రిన్సిపాల్ సురేందర్ తదితరులు ఉన్నారు.