
కమల వికాసానికి ‘ఆధిపత్యమే’ అవరోధం
● నియామకానికి నోచని మండల, జిల్లా కమిటీలు ● గ్రూపు రాజకీయాలతో బీజేపీ కార్యకర్తల్లో నైరాశ్యం ● పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌పై కేంద్రమంత్రి సంజయ్ ప్రభావం..! ● ‘బండి’కి దుగ్యాలతో విభేదాలే ‘గుజ్జుల’ దోస్తీకి కారణమా?
పెద్దపల్లిరూరల్: బీజేపీలో ఆధిపత్యపోరు ఆగడం లేదు. ఇప్పటివరకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ మధ్య ఉన్న విభేదాలు కొత్తమలుపు తిరిగాయి. కేంద్రమంత్రి బండి సంజయ్, ప్రదీప్‌కుమార్ మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు పెద్దపల్లి నియోజవర్గంపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయని కమలం నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
‘గుజ్జుల’ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక..
టీడీపీతో పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో బీజేపీ కి చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి అనూహ్యంగా ఎ మ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ ఏ నాడూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. మరోవైపు.. పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, బండి సంజయ్‌కు మధ్య ఉన్న విభేదాలు.. అప్పటికే బీజేపీలో కొనసాగుతున్న బండి సంజయ్‌కుమార్, గుజ్జుల రామకృష్ణారెడ్డికి మధ్య ఉన్న వై రం.. ఇప్పుడు దోస్తీకి దారితీయడం గమనార్హం.
బీజేపీలో ‘అధ్యక్ష’ పాలన
దాదాపు ఆరేళ్లుగా బీజేపీలో అధ్యక్షులు మినహా పూ ర్తిస్థాయి కార్యవర్గం నియమించిన దాఖలాలులేవు. ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా.. గ్రూపు రా జకీయాలు, ఇతర కారణాలతో ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్ప ట్నుంచి రెండున్నరేళ్లలో ముగ్గురు అధ్యక్షులు మారి నా.. కార్యవర్గ నియామకం లేకుండాపోయింది. ఆ తర్వాత రామగుండం నియోజకవర్గానికి చెందిన రావుల రాజేందర్, మంథనికి చెందిన సునీల్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కమిటీ వేయలేక పోయారు. ఇటీవల పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కర్రె సంజీవరెడ్డి కేంద్రమంత్రి బండి సంజయ్ ఆశీస్సులతో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత జిల్లాకమిటీని కూడా ఖరారు చేశారు.. కానీ, గంటల వ్యవధిలోనే దానిని రద్దు చేశారు.
పోటాపోటీ కార్యక్రమాలు..
పెద్దపల్లిలో గుజ్జుల రామకృష్ణారెడ్డి తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన వారెవరూ ఎ మ్మెల్యేగా విజయం సాధించలేకపోయారు. స్థానిక సంస్థల్లో కొన్నిచోట్ల గెలిచినా ప్రభావం అంతంత మాత్రమే చూపించింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పెద్లపల్లి శివారు బందంప ల్లికి చెందిన మల్క కొమురయ్య బీజేపీ నుంచి అనూహ్యంగా విజయం సాధించి పార్టీలో నూతనోత్తేజం నింపారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ కూడా కమలం జాబితాలో చేరింది.
గ్రూపు రాజకీయాలు ఆగేదెలా..
ప్రదీప్‌కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీచేశారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు తనకు సహకరించలేదని ఆరోపణలు చేశా రు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నిౖకైన గుజ్జులకు గత ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. అయితే, వచ్చేఎన్నికల నాటికి ప్రదీప్‌ను నియోజకవర్గం వైపు రా కుండా ఎలా చేయాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
ఏకాభిప్రాయం కుదిరేనా..?
జిల్లాలోని మండల కమిటీలను ఈనెల 15లోగా ఖ రారు చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఇందుకో సం మండలానికో ప్రభారిని నియమించి పేర్లను ఖ రారు చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో పెద్దపల్లి సెగ్మెంట్‌లో గుజ్జుల వర్గానికి చెందిన పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంజీవరెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ వర్గీయులు వేర్వేరు జాబితాలు అందించినట్లు సమాచారం. అదేవిధంగా పాక్ జాతీయులను ఇక్కడి నుంచి పంపించి వేయాలనే డిమాండ్‌తో ఆ పార్టీలోని రెండు వర్గాలు వేర్వేరుగా అధికారులకు మంగళవారం వినతిపత్రాలు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకం, బీజేపీకి మంచి ఆదరణ ఉన్నా స్థాని కంగా ఉన్న గ్రూపు రాజకీయాలతో తామేమీ చేయా లోననే మీమాంస క్రియాశీల కార్యకర్తలు, ముఖ్యనేతల్లో నె లకొంది. పార్టీ అధిష్టానం స్పందించి ఆధిపత్యపోరుకు చెక్‌పెట్టి పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పెద్దపల్లిపై ‘బండి’ మార్క్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్, ప్రధాన కార్యదర్శిగా దుగ్యాల ప్రదీప్‌కుమార్ పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పార్టీవర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో రామకృష్ణారెడ్డి.. బండి సంజయ్‌ను వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టినా.. ప్రస్తుత సమీకరణలను బట్టి దుగ్యాల ప్రదీప్‌ను ఒంటరిని చేస్తే రాష్ట్ర కమిటీలో సంజయ్‌కు, పెద్దపల్లి సెగ్మెంట్‌లో గుజ్జులకు ఎదురు ఉండదనే ఆలోచనతో కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్‌తో గుజ్జుల దోస్తీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే గుజ్జులకు సన్నిహితుడైన కర్రె సంజీవరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.

కమల వికాసానికి ‘ఆధిపత్యమే’ అవరోధం