
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఆరోగ్య ఉపకేంద్రాలు, పాఠశాలలు, ప్రహరీలు, వసతి గృహ భవన మ రమ్మతులపై ఆరా తీశారు. ఈఈ గిరీశ్‌బాబు, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వారంలోగా కూల్చివేతలు పూర్తిచేయాలి
కొత్త భవన నిర్మాణం కోసంన ఆస్పత్రి పాతభవనా న్ని కూల్చివేతలు వారంరోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన కూల్చివేత పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
రోడ్డు పనులు వేగవంతం
మంథని/రామగిరి: వరంగల్–మంచిర్యాల మధ్య చేపట్టిన జాతీయ రహదారి సీఎన్‌జీ పనులను పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంథని మండలం వేంపాడు, పుట్టపాక, రామగిరి మండ లం ఆదివారంపేట వద్ద చేపట్టిన జాతీయ రహదా రి పనులను కలెక్టర్ పరిశీలించారు. మంథని మా ర్కెట్ యార్డు, ఎగ్లాస్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పాత పాలకేంద్రంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా సహకార అధికారి శ్రీమాల, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్లు కుమారస్వామి, సుమన్, గిర్దావర్‌లు మహేశ్, రవిశంకర్ తదితరులు ఉన్నారు.