
ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్‌లో ఇషా అంబానీ అట్రాక్టివ్ దుస్తుల్లో కనిపించారు.

భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఇషా డిజైనర్ వేర్‌ని రూపొందించారు.

టాప్ గోల్డ్ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్ కలర్ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్ తెల్లటి క్యాప్ లుక్‌లో అత్యంత స్టైలిష్ లుక్‌లో ఇషా కనిపించారు.

డిజైనర్ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట.

ఒక పక్క చేతితో చేసిన బెనరస్ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్ వేర్‌లా డిజైన్ చేశారామె.





