
ట్రాఫిక్ ఏసీపీగా శ్రీనివాస్
గోదావరిఖని: రామగుండం ట్రాఫిక్ ఏసీపీగా సీహెచ్ శ్రీనివాస్‌ను నియమిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ జానీ నర్సింహులును డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్‌బీ డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను రామగుండం బదిలీ చేశారు. కాగా గతంలో ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ట్రాఫిక్ ఏసీపీ మధ్య ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఈక్రమంలో ఏసీపీ వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. త్వరలోనే ఏసీపీ బదిలీ ఉంటుందని ప్రచారం జరిగినా ఎట్టకేలకు ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్‌బీ ఏసీపీ ఎస్‌వీ రాఘవేంద్రరావును హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ ఏసీపీగా బదిలీ చేశారు. సీసీఎస్ ఏసీపీ ఎన్.వెంకటస్వామిని ఎస్‌డీగా జగిత్యాలకు బదిలీ చేశారు.