
5 లోగా దరఖాస్తు చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: ఒడిశా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఫస్టియర్ డిప్లొమా కోర్సులో చేరేందుకు ఆసక్తి, అర్హత గలవారు జూన్ 5లోగా దరఖాస్తు చేసు కోవాలని చేనేత, జౌళిశాఖ డెప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 17 నుంచి 25 ఏళ్లలోపు వ యసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గలవారు కరీంనగర్‌లోని చేనేత, జౌళిశాఖ ఆఫీసులో దరఖాస్తు సమర్పించాలని కోరారు.
సరస్వతీ పుష్కరాల ఉత్సవ కమిటీ నియామకం
మంథని: త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతీ పుష్కరాలకు దేవాదాయ శాఖ 14 మంది స భ్యులతో ఉత్సవ కమిటీని మంగళవారం నియమించింది. కమిటీలో మంథనికి చెందిన మో హన్‌శర్మ అవధాని, సీతారాంశర్మతోపాటు 14 మందిని నియమించింది. కాగా ఉత్సవ కమిటీ చైర్మన్‌గా మోహన్‌శర్మ పేరు దాదాపుగా ఖరా రైంది. సభ్యులంతా మోహన్‌శర్మను ప్రకటించడమే మిగిలింది. కాగా 2015లో జరిగిన గోదా వరి పుష్కరాల్లో సైతం మోహన్‌శర్మ ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. గోదావరి పుష్కరాల సమయంలో సమర్థవంతంగా సేవలందించినందుకు గాను మరోమారు సరస్వతీ పుష్కరాలకు ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
చికిత్స పొందుతూ మృతి
గోదావరిఖని: ఒంటిపై పెట్రోల్‌పోసుకొని సోమవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముత్తునూరి శ్రీనివాస్(38) మంగళవారం మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి 60శాతం కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ఈక్రమంలో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
పేపర్‌ప్లేట్ల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
పెద్దపల్లిరూరల్: పట్టణంలోని ఎన్‌ఎస్ పేపర్‌ప్లేట్ల తయారీ కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు వ్యా పించడంతో అప్రమత్తమై స్థానికులతో కలిసి మంటలను అదుపు చేస్తూనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ల క్ష్మణ్‌రావుతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.
డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
ధర్మపురి: ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడి డ్రై వర్, క్లీనర్‌కు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని ఆకసాయిపల్లిలో మంగళవారం జరి గింది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది.