
ఉద్యోగులపై కొనసాగుతున్న దాడుల పరంపర
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఆర్జీ–3 డివిజన్‌లో కొద్దిరోజులుగా అధికారులు, ఉద్యోగులపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల చేప ట్టిన కాలువ మళ్లింపు పనుల్లో చోటుచేసుకున్న బ్లా స్టింగ్‌ల్లో నాగెపల్లిలోని నివాసాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసమైన విషయం విదితమే. అయితే, ని వాసాలు మరమ్మత్తు చేస్తున్న క్రమంలో గ్రామస్తు లు, సింగరేణి ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం సింగరేణి సివిల్ ట్రైనీ ఉద్యోగి శ్రీనివాస్‌పై కొందరు దాడి చేశారు. సివిల్ సూపర్‌వైజర్ సాయికృష్ణ బైక్ లాక్కున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు.. అధి కారులు తమతో దురుసుగా ప్రవర్తించారని గ్రామ స్తులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇరువర్గాలు పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సింగరేణి ఉద్యోగులు, గ్రామస్తుల మధ్య రాజీకి నాయకులు అధికారులతో చర్చలు జరుపుతున్నారని, మళ్లీ దాడిలు జరగనివ్వబోమని హామీ ఇచ్చా రని తెలిసింది. ఇప్పటికే రాజాపూర్‌లో ఓసీపీ–2 భూ సేకరణకు వెళ్లిన అడిషనల్ మేనేజర్ శ్రీనివాస్‌పై దాడి జరగ్గా.. పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆర్జీ–3లో సింగరేణి ఉద్యోగం చేయలాంటే భయం భయంగా బతకాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.