
వీహెచ్‌పీ నేతల నిరసన
గోదావరిఖనిటౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడంతోపాటు పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట ఆదివారం ధర్నా చేశారు. డీఎం నాగభూషణంకు వినతిపత్రం అందజేశారు. వీహెచ్‌పీ విభాగ కార్యదర్శి అయోధ్య ర వి మాట్లాడుతూ, బస్టాండ్‌లో హిందూ దేవతలను దూషిస్తూ మతప్రచారం చేయడం సరికాదన్నారు. మతమార్పిడిలను అడ్డుకోవాలని డి మాండ్ చేశారు. మ్యాడగోని రవీందర్, సంపత్‌యాదవ్, రాజు, సంపత్, లింగన్న, రాజు, శ్రీధ ర్‌కుమార్, దిగంబర్, అంజయ్య, అరవింద్, వెంకటేశ్, రమేశ్‌యాదవ్, అనిరుధ్ ఉన్నారు.