
ఇంకెప్పుడు మారును
మా బతుకులు
గోదావరిఖని(రామగుండం): ‘మారుపేర్ల వారసుల నియామకాలకు ఓకే.. దీనిపై కమిటీ వేసి వాస్తవాలు పరిశీలించి సమస్యను పరిష్కరించుకుందాం. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేద్దాం’ అని స్వయంగా సింగరేణి సీఎండీ హామీ ఇచ్చారు. కాగా, హామీ ఇచ్చి రెండునెలలు గడిచింది. ఉద్యోగాల కోసం పోరాడిన వారిలో ఇద్దరు యువకులు జీవితానికి దూరమయ్యారు. ఇంకా ఎంత మంది పోయాక ఉద్యోగాలొస్తాయని మారుపేర్ల వారసులు ఆవేదన చెందుతున్నారు. విజిలెన్స్ విచారణ, వయస్సు సరిగా లేదని తదితర కారణాలతో పెండింగ్‌లో పెట్టిన మారుపేర్ల వారసులకు ఇప్పటికీ ఉద్యోగాలు లభించలేదు. సంస్థ వ్యాప్తంగా సుమారు 1,200 మంది బాధితులు ఉన్నారు. యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సమస్యను పరిష్కరించాల్సి ఉండగా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. సంస్థ సీఎండీ ఈఅంశంపై దృష్టి సారించి త్వరగా ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నారు.
విజిలెన్స్ విచారణ పేరిట..
నాలుగు దశాబ్దాల పాటు సింగరేణిలో పని చేయించుకున్న యాజమాన్యం అప్పుడు లేని సమస్యను వారి పిల్లలకు ఉద్యోగాలివ్వడంలో మాత్రం చూపిస్తోందని బాధితులు వాపోతున్నారు. ఊర్లో ఒకపేరు, పని వద్ద మరో పేరు ఉందనే సాకుతో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో చాలామంది కార్మికుల పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలు, యూనియన్ల నాయకులను కలిసి వినతిపత్రాలు అందజేసి వేడుకున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. విజిలెన్స్ విచారణ పేరుతో చాలా మంది డిపెండెంట్ల ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం, గుర్తింపు, ప్రాతినిధ్య, జాతీయ సంఘాలు సానుకూల ధోరణితో వ్యవహరించి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. డిపెండెంట్లకు వయోపరిమితి 40 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో అందరికీ అవకాశం కల్పించాలంటున్నారు.
ఈనెల 16న ధర్నా
మారుపేర్ల వారసుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ ఈనెల 16న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు మారుపేర్ల డిపెండెంట్ల సంఘం నాయకుడు శ్రావణ్ పేర్కొన్నారు. ధర్నా తర్వాత యాజమాన్యం తీరులో మార్పు రాకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.
సింగరేణిలో కార్యరూపం దాల్చని మారుపేర్ల వారసుల సమస్య
కమిటీల పేరుతో కాలయాపన
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకుసాగని వైనం
ఫొటోలోని వ్యక్తి వేముల ప్రదీప్. ఊరు హుజూరాబాద్ మండలం ఆముదాలపల్లి. ఇతడి తండ్రి వేముల మల్లయ్య రామగుండం రీజియన్ జీడీకే 10ఏ గనిలో పనిచేసి 2016లో మెడికల్ అన్‌ఫిట్ అయ్యాడు. దీంతో ప్రదీప్ పదేళ్లుగా తండ్రి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ప్రస్తుతం గోదావరిఖనిలో కూలీ పనులకు వెళ్తున్నాడు. యాజమాన్యం స్పందించి ఇప్పటికై నా ఉద్యోగం ఇచ్చి తన బతుకును నిలబెట్టాలని కోరుతున్నాడుశ్రీ.. ఇలా ఇతనొక్కడే కాదు.. సింగరేణి వ్యాప్తంగా చాలా మంది కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇంకెప్పుడు మారును