సమ్మె చేసుడే.. | - | Sakshi
Sakshi News home page

సమ్మె చేసుడే..

May 5 2025 9:00 AM | Updated on May 5 2025 9:00 AM

సమ్మె చేసుడే..

సమ్మె చేసుడే..

● సై అంటున్న సింగరేణి కార్మికులు ● వెనుకాడబోమంటున్న ఎన్టీపీసీ ఉద్యోగులు ● ఆర్‌ఎఫ్‌సీఎల్‌, కేశోరాం సిబ్బంది సైతం ● బ్యాంకులు, ఎల్‌ఐసీ ప్రతినిధులు కూడా ● 20న సార్వత్రిక సమ్మె ● ఆందోళనలు ఉధృతం చేసిన కార్మిక సంఘాల నాయకులు
పారిశ్రామిక ప్రాంతంలో ఉద్యోగులు(కాంట్రాక్టు కార్మికులతో కలిపి)

గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికు లు, ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికులు ఈనెల 20న సమ్మె చేసేందు కు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం వివిధ యూనియన్లు కార్యాచరణను అమలు చేస్తున్నా యి. ఒకరోజు సమ్మెతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రభుత్వ పరిశ్రమలతోపాటు ప్రై వేట్‌ సంస్థలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కోల్‌బెల్ట్‌లోని సింగ రేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, కేశోరాం పరిశ్రమ ల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అంటున్నారు. బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు స్తంభించే అవకాశం ఉందంటు న్నారు. బీజేపీ అనుబంధ బీఎంఎస్‌ సమ్మెకు దూ రంగా ఉండగా.. జాతీయ కార్మిక సంఘాలైన ఏ ఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంస్‌ సమ్మె విజయవంతానికి వ్యూహాత్మకంగా ముందుకు సా గు తున్నాయి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబ ర్‌ కోడ్‌లుగా సవరించేందుకు కేంద్రప్రభుత్వం చే స్తున్న కుట్రలను వ్యతిరేకించాలనే తదితర డి మాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చాయి.

గేట్‌మీటింగ్‌ల ద్వారా ప్రచారం..

ఉద్యోగులు, కార్మికులు టోకెన్‌ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దీనికోసం ఆయా ప్రాంతాల్లో గేట్‌ మీటింగ్‌లు నిర్వహిస్తూ కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేస్తున్నాయి. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, టీబీజీకేఎస్‌, విప్లవ కార్మిక సంఘాలు ప్రచారం ముమ్మరం చేశాయి.

బొగ్గుగనుల్లో కార్మిక చట్టాలు రద్దు..

బొగ్గు గనుల్లో కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్‌ కోడ్‌లను ప్రవేశ పెట్టారని, దీనిద్వారా కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్మినెంట్‌ కార్మికులతోనే బొగ్గు వెలికితీతలు పనులు చేపట్టాలని ఆ సంఘాలు కోరుతున్నాయి.

సింగరేణిలో ప్రధాన డిమాండ్లు ఇవే..

● రద్దు చేసిన కార్మిక చట్టాలను కొనసాగించాలి.

● వాటిస్థానంలోని కోడ్‌ల విధానం రద్దు చేయాలి.

● సింగరేణి సంస్థ యంత్రాలు, కార్మికులతోనే బొగ్గు వెలికి తీత పనులు చేపట్టాలి.

● సత్తుపల్లి ఓసీపీలో ప్రైవేట్‌ సంస్థ వెలికి తీస్తున్న ఓబీ(మట్టి)ని సింగరేణి స్థలంలో పోయడానికి అవకాశం ఇవ్వవద్దు.

● తాడిచర్ల–2, వెంకటాపూర్‌ బొగ్గు గనులను సింగరేణి సంస్థకే ఇవ్వాలి.

● సింగరేణికి రావాల్సిన రూ.40వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.

● కొత్త బొగ్గు గనులు తవ్వించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.

(బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ, రైల్వే, సంఘటిత, అసంఘటిత రంగంలోని ఉద్యోగులు అదనం)

సింగరేణి 77,000

ఎన్టీపీసీ 5,290

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ 1,480

అల్ట్రాటెక్‌(కేశోరాం) 1,325

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement