పారమిత విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

పారమిత విద్యార్థుల ప్రతిభ

May 14 2025 2:05 AM | Updated on May 14 2025 2:05 AM

పారమి

పారమిత విద్యార్థుల ప్రతిభ

ఎన్టీపీసీ కేవీలో వందశాతం ఉత్తీర్ణత
‘సీబీఎస్‌ఈ’ ఫలితాల్లో అల్ఫోర్స్‌ ప్రభంజనం
మానేరు విజయకేతనం

జ్యోతినగర్‌(రామగుండం): సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(సీబీఎస్‌ఈ)లో ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు విజయదుందుబి మోగించారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు. పదో తరగతిలో 67 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 67 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓం సాహూ(484/500), 12వ తరగతిలో 18 మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. సైన్స్‌ విభాగంలో పెండ్యాల ఆగస్త్యశర్మ (398/500), కుడితేటి ప్రద్యుమ్నరావు (396/ 500), కామర్స్‌ విభాగంలో హ్రిశికేశ్‌ (44 1/500) మార్కులు సాధించారు. దీంతో విద్యాలయ మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు, ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌కుమార్‌ సామంత, నామిని చైర్మన్‌ బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌, ప్రిన్సిపాల్‌ ఓరుగంటి శోభన్‌బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

చొప్పదండి నవోదయ ప్రభంజనం

చొప్పదండి: జవహర్‌ నవోదయ విద్యాలయం 2024–25 పదోతరగతి, పన్నెండో తరగతి సీబీ ఎస్‌ఈ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. పన్నెండో తరగతిలో 500మార్కులకు 483మార్కులు సాధించి పి.రుత్విక్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. పదోతరగతిలో వి.వశిష్ట యాదవ్‌ 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ మంగతాయారు అభినందించారు.

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): సీబీఎస్‌ఈ పదోతరగతి, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ సీబీఎస్‌ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించినట్లు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. పదో తరగతిలో 500మార్కులకు గాను మహమ్మద్‌ షాజ్‌నీన్‌ తబాసుమ్‌ జాతీయస్థాయిలో 99.4శాతంతో 497మార్కులతో జిల్లాస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఎం.సుచీత్‌రెడ్డి 493 మార్కులు, జె.సుప్రభ 492, ఆర్‌.వేదిక, టి.హర్షిణి 491, డి.హర్షిత్‌489, బి.ఆకృతి, సీహెచ్‌.అనీశ్‌కుమార్‌, రయానుద్దీన్‌ 488, ఏ.నక్షత్ర, పి.శ్రీవర్షిత, కె.నక్షత్రరెడ్డి 486మార్కులు సాధించారని పేర్కొన్నారు. 12వ తరగతిలో 500 మార్కులకు గాను వి.సంజీతరెడ్డి 482మార్కులు, ఎన్‌.అనిరుద్‌ సాయి 482, వి.శశాంక్‌రెడ్డి 478, జె.వమీకా 473 మార్కులు సాధించారని తెలిపారు. 10వ తరగతిలో అత్యధికసంఖ్యలో విద్యార్థులు 90శాతం మార్కులు సాధించారని, 12వ తరగతిలో 13మంది 90శాతం మార్కులు సాధించారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో పారమిత హెరిటే జ్‌, వరల్డ్‌ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీకర్‌, పి.గోపికృష్ణ తెలిపారు. 500మార్కులకు గాను ఆకుల శ్రీరామచంద్ర 488 మార్కులు, రూపనిగమ, మనోజ్ఞలు 487, స్ఫూర్తి 481, బి.వర్షిణి480మార్కులు సాధించినట్లు తెలిపా రు. పాఠశాలకు చెందిన 62మంది 90శాతం పైన మార్కులు సాధించగా 80 నుంచి 100శా తం సాధించిన విద్యార్థులు 160మంది ఉన్నారని అన్నారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత ఈ.ప్రసాద్‌రావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్‌రావు, రశ్మిత, రాకేశ్‌, ప్రాచీ, వినోద్‌రావు, వీయూఎం.ప్రసాద్‌, టీఎస్వీ.రమణ, హన్మంతరావు, రవీంద్ర పాత్రో, నాగరాజు అభినందించారు.

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): సీబీఎస్‌ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్‌ పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్‌ఈ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. పాఠశాల నుంచి మొత్తం 98మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు తెలుగులో 100 మార్కులు, ఇంగ్లిష్‌లో 98మార్కులు, హిందీలో 97మార్కులు, సైన్స్‌, సోషల్‌లో 96మార్కులు, గణితంలో 95 మార్కులు సాధించారని అన్నారు. 500 మార్కులకు పాఠశాలకు చెందిన ఏ.ఆత్రేయ 471మార్కులు, మస్రా మహావీన్‌ 461, ఏ.అరవింద్‌రెడ్డి 458, ఏ.శరత్‌ చంద్ర 456మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతరెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డి అభినందించారు.

పది, పన్నెండో తరగతి విద్యార్థుల సత్తా

పారమిత విద్యార్థుల ప్రతిభ 1
1/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 2
2/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 3
3/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 4
4/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 5
5/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 6
6/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 7
7/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 8
8/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 9
9/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 10
10/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 11
11/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 12
12/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

పారమిత విద్యార్థుల ప్రతిభ 13
13/13

పారమిత విద్యార్థుల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement