Prakasam District News
-
పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి
విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో గంజాయి, ఇతర చెడు వ్యసనాలకు బానిసలై నేరస్తులుగా మారిపోతున్నారు. గంజాయి కేసులో పిల్లలు మొదటిసారి పట్టుబడితే ఒంగోలులోని రిహాబిలిటేషన్ సెంటరుకు పంపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. రెండోసారి పట్టుబడితే కేసు నమోదు చేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరైనా గంజాయి సేవిస్తున్నా, విక్రయాలు జరుపుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – కె.మల్లికార్జున, కంభం సీఐ -
సబ్‌స్టేషన్‌కు పసుపు రంగు
రాచర్ల: ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపై గతంలో నానా రచ్చ చేసిన కూటమి నాయకులు.. తాము అధికారంలోకి రాగానే తాపీగా పసుపు రంగు రాస్తున్నారు. రాచర్ల మండలంలోని మేడంవారిపల్లెలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు నిధులు మంజూరు చేశారు. సోమిదేవిపల్లె, గుడిమెట్ట, రామాపురం, సత్యవోలు, శీలంవెంకటరెడ్డిపల్లె, సంగపేట, ఒద్దులవాగుపల్లె, మేడంవారిపల్లెలో విద్యుత్ లోఓల్టేజీ సమస్యతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో గత ప్రభుత్వం రూ.30 లోలతో సబ్‌స్టేషన్ నిర్మించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నా రాంబాబు భూమి పూజ చేయగా.. కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేశారు. సబ్ స్టేషన్ గదితోపాటు ప్రధాన గేటుకు గ్రామ కూటమి నాయకులు పసుపు రంగు వేయించడం చర్చనీయాంశమైంది. ‘‘కడాన మీ మొహానికి రంగులేసుకోండి..’’ అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను గ్రామస్తులు గుర్తుచేస్తూ.. మరి ఇప్పుడు పసుపు రంగు ఎలా వేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
బంగారు దుకాణంలో చోరీ
● 40 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణ కనిగిరిరూరల్: పట్టణంలోని బోడ్డుచావిడి సెంటర్లో ఉన్న అచ్చుత పద్మ శివ జ్యూయలరీ షాపులో మంగళవారం చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యుయలరీ షాపు యజమాని అచ్చుత పద్మ సొంత పనులపై తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లగా దుండగులు షాపులోకి ప్రవేశించి షాపులోని సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఈ మేరకు పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరాం తెలిపారు. సీఐ ఎస్కే ఖాజావలి, ఎస్సైలు టీ శ్రీరాం, మాధవరావులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంపై లోతుగా సమీక్షించారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగించి, రీ సర్వే, రెవెన్యూ సర్వీసులు, వాటర్ టాక్స్ తదితర అంశాలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేసేలా మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ చట్టాలు, రెవెన్యూ అంశాలపై అధికారులు పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు. రెగ్యులరైజేషన్ స్కీం 2025 ప్రక్రియపై రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అందుకనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో వాటర్ టాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి స్థల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. భూముల రీ సర్వేలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు తయారు చేసి పంపాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, వెంకట శివరామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు వరకుమార్, సత్యనారాయణ, శ్రీధర్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్‌బాషా, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్, వివిధ సెక్షన్స్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో మహిళ అరెస్టు
మార్కాపురం: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలిగా నటిస్తూ సుమారు రూ.10 లక్షల విలువైన 127 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసిన మహిళను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్టు చేసి సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం సీఐ పి.సుబ్బారావు పేర్కొన్నారు. మంగళవారం సీఐ తన కార్యాలయంలో ఎస్సైలు సైదుబాబు, డాక్టర్ రాజమోహన్రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొమరోలు మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన మజ్జారి బాల వెంకటయ్య మార్కాపురం పట్టణంలో ఉన్న తన అన్న మనవడి పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. మార్కాపురం డిపోలో దిగి తన లగేజీని చూసుకోగా బంగారు ఆభరణాలు ఉంచిన బ్యాగ్ కనిపించలేదు. ఆ బ్యాగును ఓ గుర్తుతెలియని వ్యక్తి కంభం సెంటర్లో దిగుతూ తీసుకెళ్లినట్లు తోటి ప్రయాణికులు చెప్పారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ సుబ్బారావు, ఎస్సైలు సైదుబాబు, రాజమోహన్‌రావు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కంభం సెంటర్లో ఓ మహిళ అనుమానాస్పద కదలికలను గుర్తించి వివరాలు సేకరించారు. పట్టణంలోని జగదీశ్వరీ థియేటర్ వద్ద నివాసముండే దూదేకుల హుస్సేన్బీగా గుర్తించి మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి 25 గ్రాముల గోల్డ్ బ్రాస్లెట్, 25 గ్రాముల బంగారు చెవిదుద్దులు, 2 గ్రాముల 3 పూసల దండ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ షేక్ షరీఫ్, డి.కోటి నాయక్‌కు రివార్డులు అందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులను సీఐ సన్మానించారు. 127 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం నిందితురాలిని పట్టించిన సీసీ కెమెరాలు -
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
యర్రగొండపాలెం: పోలీసులు తాను ఇచ్చిన కేసు నమోదు చేయడం లేదని స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన అలేటి సురేష్ మంగళవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..సురేష్ పట్టణంలోని ఇద్దరు వ్యాపారుల వద్ద నుంచి కొంతమేర అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించడం లేదని వారు అతన్ని తీవ్రంగా హింసించడంతో పాటు దాడి చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ దాడిలో అతని కుడిచేయి విరిగిపోయింది. దీంతో సురేష్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఈ కేసును తీసుకోకుండా నిందితులను పిలిపించి విచారిస్తామని చెప్పి అతన్ని పంపించేవారు. పోలీస్‌స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. లేకుంటే దూకి ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించాడు. కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అతను కిందికి దిగివచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతోనే.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దిగివచ్చిన వైనం -
హిందీ పరీక్షకు 215 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు రెండో రోజు హిందీ పరీక్షకు 215 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 286 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 71 మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం జరిగాయి. ఇంటర్‌కు తెలుగు పరీక్షకు మొత్తం 1013 మంది విద్యార్థులకు గాను 838 హాజరు కాగా 175 మంది గైర్హజరయ్యారు. హిందీ పరీక్షకు 14 మందికి గాను ముగ్గురు గైర్హాజరయ్యారు. ఇంగ్లిష్ పరీక్షకు మొత్తం 653 మంది విద్యార్థులకు గాను 511 మంది హాజరుకాగా 142 మంది గైర్హజరయ్యారు. డీఈఓ కిరణ్‌కుమార్ 12 కేంద్రాలను పరిశీలించారు. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ ● ప్రమాదంలో డ్రైవర్ మృతి త్రిపురాంతకం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై మేడపి సమీపంలో చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలంలోని ముడివేముల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటనారాయణ.. వినుకొండ వైపు నుంచి యర్రగొండపాలెం వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. లారీ అదుపు తప్పి పాత మిద్దెలోకి దూసుకెళ్లడంతో క్యాబిన్లో ఇరుక్కుపోయిన వెంకటనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను రక్షించేందకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి.. ● పొన్నలూరు చెరువులో పడి వ్యక్తి మృతి పొన్నలూరు: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన మంగళవారం పొన్నలూరు చెరువు వద్ద చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని పైరెడ్డిపాలెం గ్రామాకి చెందిన కొడవల్లూరి శేషయ్య(48)కు వివాహమై భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పొన్నలూరు చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడటంతో మృతి చెందారు. చెరువు దగ్గర ఉన్న శేషయ్య వద్దకు వెళ్లిన ఆయన బంధువు.. విగతజీవిగా నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో గ్రామస్తులు వచ్చి శేషయ్య మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. శేషయ్యకు మూర్చ వ్యాధి ఉండటం వల్ల చేపలు పట్టే సమయంలో చెరువులో పడి మృతి చెంది ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనూక్ తెలిపారు. -
తూర్పుగోదావరి మైసూరు ఎడ్లు
సత్తా చాటిన ● ఆకట్టుకున్న రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పరుగు పోటీలు స్వర్ణ(కారంచేడు): మండలంలోని స్వర్ణ గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మైసూర్ ఎడ్ల బండి పరుగు పందెం పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వల్లూరు నరేంద్రకుమార్‌కు చెందిన మైసూర్ ఎడ్లు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నాయి. స్వర్ణమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా తిమిడెదపాడు డొంకలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 23 ఎడ్ల జతలు తమ పేర్లు నమోదు చేసుకోగా వర్షం కారణంగా కేవలం 18 ఎడ్ల జతలు మాత్రమే పాల్గొన్నాయి. ఎంపిక చేసిన రెండు కిలోమీటర్ల దూరాన్ని ఎడ్లు టైరు బండితో కలిసి పరుగెత్తాయి. మొదటి స్థానం పొందిన నరేంద్రకుమార్ ఎడ్ల జత 4 నిమిషాల 29 సెకన్ల, 69 మిల్లీ సెకన్ల సమయంలో గమ్యం చేరుకున్నాయి. తరువాత రెండో స్థానంను బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కఠారి వేణుబాబుకు చెందిన ఎడ్ల జత 4 నిమిషాల 36 సెకన్ల, 50 మిల్లీ సెకన్లలో, మూడో స్థానం.. భవనం క్రితిక్షరెడ్డికి చెందిన ఎడ్ల జత 4.37 నిమిషాల్లో, నాలుగో స్థానాన్ని ప్రకాశం జిల్లా అల్లూరుకు చెందిన జరుగుమల్లి మోహన్‌చంద్ ఎడ్ల జత 4.38 నిమిషాల వ్యవధిలో నిర్దిష్ట గమ్యం చేరుకున్నాయి. ప్రథమ బహుమతిని గ్రామానికి చెందిన శివరామకృష్ణప్రసాద్ రూ. 20000, రెండో బహుమతి రూ. 15000ను కట్టా బుజ్జి, నక్కా పిచ్చియ్య, కొమ్మాలపాటి వెంకటేశ్వర్లు అందించారు. మూడో బహుమతి రూ. 10000 నార్నె వాసు, చైతన్య పంపిణీ చేశారు. నాలుగో బహుమతి రూ. 5000ను భాను, రోహిత్‌సాయి అందించారు. న్యాయనిర్ణేతలుగా శివరామకృష్ణప్రసాద్, కట్టా ప్రసాద్, పూల గోపిలు వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహక కమిటీ సభ్యులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
ఒకే ఫొటోతో 50 మందికి మస్టర్
మార్కాపురం: నిన్న కొనకనమిట్ల... నేడు మార్కాపురం... కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పధకంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, కూటమినాయకుల పెత్తనం వెరసి ఉపాధి హామీ పథకం చిత్ర విచిత్రంగా జరుగుతోంది. ఏరోజు ఎవరికి ఎలా మస్టర్ వేస్తారో.. ఆ దేవుడికి కూడా అర్థం కావడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టం వచ్చినట్లుగా ఫొటోలు తీసి అప్లోడ్చేస్తూ కూటమి నాయకుల మెప్పు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే. మండలంలోని బోడపాడు గ్రామంలో రామన్నకుంటలో నీటికుంట తవ్వేందుకు పనులు చేపట్టారు. అయితే ఒకే ఫోటోతో 50 మందికి మస్టర్లు వేయడం పెద్దఎత్తున విమర్శలకు తావిస్తోంది. ఫీల్డు అసిస్టెంట్ కె.శ్రీనివాసులు ఒకే ఫొటోతో 50 మందికి మస్టర్లు వేసి అప్లోడ్ చేశారు. పనికి హాజరైన కూలీల ఫొటోలనే అన్నీ మస్టర్లకు చూపడం గమనార్హం. కొరవడిన అధికారుల పర్యవేక్షణ కేవలం అధికారపార్టీ నాయకుల జేబులు నింపేందుకే ఉపాధిహామీ పథకం తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలను వదిలి బయటకు రాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు వేసిందే మస్టరు... పంపిందే ఫొటో... వచ్చిందే వేతనం.. లాగా తయారైంది. కూలీలు రాకపోయినా, మస్టర్ వేస్తూ కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పథకం నిర్వహణపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారు. అలా జరిగిందా.. జరగదే.. చూస్తాంలే అంటూ సమాధానాలు దాటవేస్తున్నారు. కొంతమంది సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పనులకు రాకపోయినా వచ్చినట్లుగా మస్టర్ వేసి వారి వద్ద నుంచి కమీషన్లు తీసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా జరిగే అవకాశం లేదు:ఏపీఓఈ విషయమై మార్కాపురం ఏపీఓ నాగరాజును వివరణ కోరగా అలా జరిగే అవకాశం లేదని, కూలీలు హాజరైనా హడావుడిలో ఒకే ఫొటోతో మస్టర్ వేసి ఉండవచ్చని, అయినా కచ్చితంగా విచారణ చేస్తానని చెప్పారు. ఉపాధిహామీలో చిత్రవిచిత్రాలు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ -
పొగాకు వేలం అడ్డగింత
టంగుటూరు: ‘లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. మీడియం రకం పొగాకుకు రోజు రోజుకు ధరలు తగ్గిస్తున్నారు. పెరిగిన పెట్టుబడులకు మీరు ఇస్తున్న ధరలకు ఏమాత్రం పొంతనం ఉండటం లేదు. ధరలు తగ్గించుకుంటూ పోతే మేం ఎలా బతకాలంటూ’ పొగాకు రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. టంగుటూరు వేలం కేంద్రం పరిధిలో మంగళవారం పొందూరు, ఆలకూరపాడు గ్రామాల రైతులు పొగాకు బేళ్లను వేలానికి తీసుకువచ్చారు. అయితే వేలం ప్రారంభం తరువాత ధరలను చూసిన రైతులు ఆగ్రహంతో వేలాన్ని అడ్డుకున్నారు. మీడియం రకం పొగాకుకు కేవలం రూ.205 వేయడాన్ని రైతులు మండిపడ్డారు. గత ఏడాది ఇదే రకం పొగాకును రూ.360లకు కొనుగోలు చేశారని, ఇప్పుడు ఇంత తక్కువ ధరలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఆర్ఎం లక్ష్మణరావు కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. అరగంట పాటు రైతు నాయకులు, రైతులతో చర్చల అనంతరం వేలాన్ని కొనసాగించారు. రైతులు వేలానికి 447 బేళ్లను తీసుకురాగా 362 బేళ్లను కొనుగోలుచేసి 85 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.205, సరాసరి ధర రూ.241.20గా నమోదైంది. వేలంలో 23 కంపెనీలు పాల్గొన్నాయి. లో గ్రేడ్ కొనుగోలు చేయడం లేదని రైతుల ఆగ్రహం రోజు రోజుకూ ధరలు పతనమవుతున్నాయని మండిపాటు కంపెనీ ప్రతినిధులతో చర్చల అనంతరం తిరిగి ప్రారంభం -
భూ సేకరణ వేగవంతం చేయండి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: జిల్లా నుంచి వెళుతున్న ప్రధాన రహదారులు, రైల్వే మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో కలిసి సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రహదారులు, రైల్వే మార్గాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని పూర్తి చేయాలన్నారు. 565, 544(డీ), 167 (బి). 765, 544 (జి) జాతీయ రహదారులు, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గాల నిర్మాణ ప్రాజెక్టులపై చర్చించారు. ఆయా నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ కోసం నిధుల చెల్లింపు, పెండింగ్ క్లెయిమ్స్, యాజమాన్య హక్కుల వివాదాలపై కలెక్టర్ ఆరా తీశారు. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. వీటి పురోగతిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాస కేంద్రాల ఏర్పాటు, నిధుల చెల్లింపులపై కలెక్టర్ ఆరా తీశారు. కొత్తపట్నం మండలంలో ఫిష్షింగ్ హార్బర్ ఏర్పాటుకు భూ సేకరణపై సమావేశంలో చర్చించారు. పాదర్తి, గుండాయపాలెం, పిన్నివారిపాలెం తదితర గ్రామాల్లో భూముల లభ్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరాన్ని బట్టి వాటిని సేకరించే విషయంలో ఒక స్పష్టత తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో డీఆర్ఓ బి.చినఓబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, కనిగిరి ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఎన్హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు. -
ముక్కలు చెక్కలు
సంక్షేమం రేషనలైజేషన్ పేరుతో గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం రెవెన్యూ శాఖను ఓ కుదుపు కుదిపింది. సచివాలయ ఉద్యోగులను మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అనే మూడు కేటగిరీలుగా విభజస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషనలైజేషన్ తర్వాత మిగులుగా ఉన్నవారిని ఎక్కడ, ఎలా వినియోగిస్తారనే స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుండగా, సేవలు సక్రమంగా అందవేమోనని ప్రజలు అనుమానిస్తున్నారు. కంభం: రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వీఆర్వోలు ఆందోళనకు గురవుతున్నారు. సచివాలయాలను క్లస్టర్లుగా విభజించడంతోపాటు సిబ్బందిని రేషనలైజేషన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన జీవో నంబర్ 4 విడుదల చేసింది. దీని ప్రకారం జనాభా ప్రాతిపదికన రెండు లేదా మూడు గ్రామ/వార్డు సచివాలయాలను ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఉద్యోగుల సంఖ్యను సైతం కుదిస్తున్నారు. ఈ విధానంపై రెవెన్యూ శాఖలోని వీఆర్వోలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఒక సచివాలయలో ఒక వీఆర్వో, ఒక సర్వేయర్ పనిచేస్తుండగా నూతన విధానంలో మాత్రం ఆ క్లస్టర్‌లోని ఒక సచివాలయంలో వీఆర్వో, మరోదానిలో సర్వేయర్ ఉంటారు. ఈ లెక్కన జిల్లాలో 353 మంది వీఆర్వోలు, 278 మంది సర్వేయర్లను మిగులు సిబ్బందిగా చూపుతున్నారు. మిగులు సిబ్బందిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో ప్రభుత్వం గానీ, ఉన్నతాధికారులుగానీ స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా సతమతమవుతున్నారు. గతంలో ఏఆర్ఐ పోస్టులను తొలగించి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కేటాయించిన నేపథ్యలో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రస్తుతం వీఆర్వోలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో మండలంలోని సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగులు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతే రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు. పదోన్నతి కోసం ఎదురుచూపులు వీఆర్వోలను పాత విధానంలోనే కొనసాగించాలని వీఆర్వోలు కోరుతున్నారు. ఇప్పటికే చాలా మంది వీఆర్వోలు ప్రమోషన్ పొందేందుకు అర్హులైన వారు సర్కారు నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగి శాఖాపరమైన పరీక్షలు, సర్వే శిక్షణ, సీపీటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అందరికీ సీనియారిటీ ప్రకారం ఏక కాలంలో సీనియర్ అసిస్టెంట్ లేదా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించాలన్నది వీఆర్వోల డిమాండ్. ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ వేతనం పొందుతున్న సీనియర్ వీఆర్వోలకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు చెబుతున్నారు. మిగులుగా ఉన్న వీఆర్వోలకు రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సృష్టించి పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. రెవెన్యూ వ్యవస్థ రెక్కలు విరిచేలా కూటమి ప్రభుత్వం అడుగులు సచివాలయాలను క్లస్టర్లుగా విభజిస్తూ జీవో నంబర్ 4 విడుదల ప్రస్తుతం ఒక్కో సచివాలయానికి ఒక వీఆర్వో, ఒక సర్వేయర్ కొత్త జీవో ప్రకారం రెండు సచివాలయాలకు కలిపి ఒక్కరే వీఆర్వో జిల్లాలో మిగులు ఉద్యోగులుగా 285 వీఆర్వోలు, 278 మంది సర్వేయర్లు పని భారం పెంచొద్దని, అర్హులకు ప్రమోషన్ ఇచ్చి రేషనలైజ్ చేయాలని డిమాండ్ -
ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం
● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశస్వాతంత్య్ర పోరాటంలో, దేశాభివృద్ధిలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు. తొలుత టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్ కుమార్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డీఆర్ఓ సీహెచ్.ఓబులేసు, కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర రావు, సీఈఓ శ్రీమన్నారాయణ, ప్రకాశం భవనంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు టౌన్ : బ్రిటీష్ ముష్కరుల తుపాకులకు ఎదురొడ్డి గుండె తీసి చూపించిన ధీరుడు, స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు వాడి దమ్ము చాటి చెప్పిన సాహసి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోదని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ప్రకాశం పంతులు వర్ధంతి నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ఎన్నో సేవలు చేశారని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, సీసీస్ సీఐ జగదీష్, ఆర్ఐ రమణారెడ్డి, ఏఆర్ ఎస్సైలు ప్రసాద్, పాపిరెడ్డి పాల్గొన్నారు. -
26 నుంచి వ్యాక్సిన్ డ్రైవ్
ఒంగోలు టౌన్: మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ ప్రత్యేక కార్యక్రమాన్ని మే 26న ప్రారంభించి, జూలై 26వ తేదీ వరకు వ్యాక్సిన్లు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాక్సిన్లతో ప్రమాదకర న్యూమోనియా, అతిసార, మెదడుకు సంబంధించిన వ్యాధులు నివారించవచ్చని తెలిపారు. 9 నుంచి 12 నెలల మధ్య మొదటి డోసు, 16 నుంచి 24 నెలల మధ్య రెండో డోసు వేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నిర్దేశిత సమయంలో టీకాలు వేయించని 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రత్యేక కార్యక్రమంలో తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. మే 26 నుంచి 31 వరకు మొదటి రౌండ్, జూన్ 23 నుంచి 28 వరకు రెండవ రౌండ్, జూలై 21 నుంచి 26 వరకు మూడో రౌండ్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో టీకాలు వేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటి నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ యాజమాన్యాల్లో పనిచేస్తున్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ కిరణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు, అభ్యర్థన బదిలీ కోరుకునే వారు ఈ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరిలో బదిలీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్ బోర్డు చెకప్‌కు హాజరు కాకుంటే..వెంటనే మెడికల్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ కార్మిక, కర్షక వ్యతిరేక మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నాలుగేళ్లుగా పోరాటలు చేస్తున్నా మోడీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా సర్క్యులర్ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి పోరాటాల ద్వారా కేంద్రం కుట్రలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు. దేశంలోని కార్మికులు కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో దయనీయ స్థితిలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయకుండా హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా కేంద్రం దిగివచ్చి లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు వీరా రెడ్డి, పి.కల్పన, చీకటి శ్రీనివాసరావు, హనుమంతు, రాజశేఖర్, దాసరి సుందరం, తంబి శ్రీనివాసరావు, జార్జి, సారధి పాల్గొన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి ఒంగోలు సిటీ: మాతృభాషలో విద్యా బోధన చేయడంతోనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ జిల్లా కార్యదర్శి గవిని శివశంకర్ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల పునర్వవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతులు బోధించే ప్రాథమికోన్నత స్థాయిలో తెలుగు ఉపాధ్యాయులను తొలగించడం, తెలుగు మాధ్యమం లేదని ఉత్తర్వులు ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి తగదని ఆక్షేపించారు. కూటమి పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమాన్ని విస్మరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. విద్యార్థులు మాతృభాషలో చదువుకుంటే సులభంగా నేర్చుకొని భావ వ్యక్తీకరణ చేయగలుగుతారని, తెలుగు మాధ్యమం కొనసాగించి పిల్లలు వారికి ఇష్టమైన మాధ్యమాన్ని ఎంచుకునే విధంగా అవకాశం ప్రభుత్వం కల్పించాలన్నారు. -
వైభవంగా మహా కుంభాభిషేకం
అద్దంకి/అద్దంకి రూరల్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ప్రాంగణం ‘జై శ్రీరామ్.. జై ఆంజనేయం, ప్రసన్నాంజనేయం’ నామస్మరణతో మార్మోగిపోయింది. సోమవారం మహా కుంభాభిషేక నూతన ఆలయ ప్రారంభం, విమాన శిఖర కలశ ప్రతిష్ట, జీవ ధ్వజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు దేవదాయశాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ నెల 14న ప్రారంభమైన కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. కుంభాభిషేకంలో భాగంగా విమాన శిఖర కలశ ప్రతిష్ట, నూతన ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 3 వేల మంది మహిళా భక్తులతో ఉదయాన్నే అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నుంచి మూడు వేల కళశాలతో జలాన్ని తీసుకుని ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ నామస్మరణ చేసుకుంటూ శింగరకొండ వరకు శోభాయాత్ర నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలతో, దేవతా వేషధారుల విన్యాసాలతో కన్నుల పండువగా సాగింది. కిక్కిరిసిన క్యూలైన్ల్లు.. కుంభాభిషేక కార్యక్రమాన్ని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి నిర్వహించారు. కుంభాభిషేకానికి హాజరైన భక్తులతో క్షేత్రంలోని ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సామాజిక వర్గాల్లోని సత్రాల్లో అన్నదానంతోపాటు, దేవాలయ అధికారుల ఆధ్వర్యంలో 30 వేల మందికి అన్న సంతర్పణ చేశారు. అద్దంకి బస్టాండ్ నుంచి భవిష్య పాఠశాలకు చెందిన రెండు బస్సులు భక్తులను ఉచితంగా చేరవేశాయి. కోటా శ్రీనివాసకుమార్ భక్తులకు తాగునీరు సరఫరా చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి ప్రసన్నాంజనేయ స్వామికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్‌శాఖ మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం తిమ్మనాయుడు, సిబ్బంది పర్యవేక్షించారు. 700 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. బందోబస్తును చీరాల డీఎస్పీ మొయిన్, అద్దంకి సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన శింగరకొండ క్షేత్రం గుండ్లకమ్మ నది నుంచి శింగరకొండ వరకు 3 వేల మంది మహిళలతో శోభాయాత్ర యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మేనక(ఏనుగు) ప్రత్యేక అతిథిగా హాజరైన శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామిమహిమాన్వితుడు అంజన సుతుడు విధుశేఖర భారతిస్వామి లక్షల డబ్బు ఖర్చు పెట్టే పని లేకుండా 108 సార్లు రామనామ జపం చేస్తే చాలా ఎక్కువ ఫలితం పొందవచ్చని శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతిస్వామి అన్నారు. మహా కుంభాభిషేకం అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. రామాయణంలోని సుందరకాండలో, కిష్కిందకాండలో ఆంజనేయస్వామి దివ్యమైన చరిత్ర మనకు తెలుస్తుందని చెప్పారు. అనాది కాలం నుంచి ఆంజనేయస్వామి ఆరాధనను చేయడం సంప్రదాయంగా వస్తుందని, ఆయన మహిమ అపారమైనదన్నారు. శింగరకొండలో ఒకే దేవతను రెండు రూపాల్లో కొండపైన లక్ష్మీ నరసింహాస్వామి గానూ, కొండ కింద ఆంజనేయస్వామిగానూ మనకు దర్శనం ఇస్తున్నారన్నారు. శింగరకొండ దివ్య క్షేత్రమని చెప్పారు. అటువంటి క్షేత్రంలో ఆ స్వామికి నూతనాలయం, నూతన విమాన గోపుర, కలశ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా భగవత్ అనుగ్రహానికి పాత్రులు అయ్యారన్నారు. ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారని చెప్పారు. -
బాధితులకు న్యాయం చేయాలి
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్ ఒంగోలు టౌన్ : ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితి లోగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 70 ఫిర్యాదులు రాగా, ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు.. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకునే చర్యలపై నివేదిక కూడా ఇవ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్లు/కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదు దారులతో పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించి చట్ట పరిధిలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ సురేష్‌బాబు, మహిళా పీఎస్ డీఎస్పీ రమణకుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, డీటీసీ ఇన్స్పెక్టర్ షమీముల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్, సిబ్బంది పాల్గొన్నారు. -
పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
పొదిలి రూరల్: పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విమర్శించారు. సోమవారం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని వారు సందర్శించారు. వారికి పూలమాలలతో రైతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేలం బిడ్డింగ్‌లో పొగాకు కొనుగోళ్ల తీరును పరిశీలించి అధికారులు, రైతులతో మాట్లాడి వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై తీవ్ర మనోవేదనతో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అప్పల బాధలు తట్టుకోలేక ఇటీవల పర్చూరు నియోజకవర్గంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు కంపెనీల ప్రతినిధులు రైతులను ప్రోత్సహించి పంట సాగు చేయించారని, తీరా కొనుగోళ్ల సమయంలో వారు కనిపించకపోవడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అప్‌గ్రేడ్ ఉన్న ఎస్–2, ఎఫ్–1 రూ.240 నుంచి రూ.250కి కూడా అమ్ముడుపోయే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, కానీ, పంటలు పండించే రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు... సూపర్‌సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినప్పటికీ రైతుల గురించి పట్టించుకోకపోవడంతో మిర్చి, పొగాకు, ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్‌ఫెడ్ ద్వారా సుమారు రూ.100 కోట్లు వెచ్చించి పొగాకు కొనుగోళ్లు చేయించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం లో గ్రేడ్ అని చెప్పి నో బిడ్ కింద వెనక్కి పంపిస్తున్నారని, పొగాకు ధరలు దారుణంగా పడిపోయి రైతులు అప్పల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడి ఎక్కువై పంట దిగుబడి కూడా తగ్గిందన్నారు. దీనికితోడు పొగాకు బోర్డు కొనుగోలు చేసే రేట్లు కూడా తగ్గడం వలన రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుకు అన్నిరకాలుగా అండగా నిలబడిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం దుర్మార్గంగా ప్రైవేటు వ్యాపారులు వారికిష్టమైన రేట్లు ఇవ్వడం వలన రైతాంగం పూర్తిగా నష్టపోతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃపరిశీలన చేసి గత ప్రభుత్వ విధానాలు అవలంబించి రైతులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి గిరిరాజ్‌కుమార్, అధికారులు, పొదిలి, కొనకనమిట్ల మండలాల వైఎస్సార్ సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, జి.శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, ఎం.మురళి, గుజ్జుల సంజీవరెడ్డి, ఫిరోజ్, రైతులు పాల్గొన్నారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పొదిలి పొగాకు వేలం కేంద్రం సందర్శన -
ఐదు గ్రానైట్ టిప్పర్ల సీజ్
చీమకుర్తి: ఓవర్ లోడుతో వెళ్తున్న ఐదు గ్రానైట్ టిప్పర్లను చీమకుర్తి సీఐ ఎం.సుబ్బారావు సోమవారం సీజ్ చేశారు. రామతీర్థం డంపింగ్‌ల నుంచి రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గ్రానైట్ వేస్ట్ రాళ్లతో వెళ్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఓవర్ లోడు కారణంగా తరచూ ట్రాఫిక్ అంతరాయం, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆర్టీఓ డిపార్టుమెంట్ అధికారులతో పాటు విజిలెన్స్ డిపార్టుమెంట్ వారు దృష్టి పెట్టి ఓవర్‌లోడుతో వెళ్లే వాహనాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. -
పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంక వద్ద గల జిల్లా మహిళా ప్రాంగణంలో త్వరలో బ్యూటీషియన్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడర్, ఫ్యాబ్రిక్ కట్టర్ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు మహిళా ప్రాంగణ జిల్లా మేనేజర్ వై.అంజమ్మ తెలిపారు. ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో మహిళా ప్రాంగణ కార్యాలయానికి వచ్చి 18 నుంచి 45 సంవత్సరాల్లోపు మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండుమూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 83339 21346 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ప్రతి అర్జీపై శ్రద్ధ పెట్టాలి ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు బదిలీ చేస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మీ కోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వాటికి అర్ధవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతిరోజూ లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలని, రీ ఓపెన్ కేసులు రాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్ఓ బి.చినఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, శ్రీధర్, వరకుమార్, డిప్యూటీ కలెక్టర్ పార్ధసారధి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నాయకులకు పదవులు ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దివ్యాంగుల విభాగం రాష్ట్ర సెక్రటరీగా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన కాట్రగడ్డ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా దర్శి నియోజకవర్గానికి చెందిన దగ్గుల బ్రహ్మానందరెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. జోరువానలోనూ సీహెచ్‌ఓల పోరుఒంగోలు టౌన్: పదోన్నతులు, క్రమబద్దీకరణ, పీఎఫ్ పునరుద్ధరణ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన సమ్మె సోమవారంతో 21వ రోజుకు చేరింది. సోమవారం భారీ వర్షంలోనూ సీహెచ్‌ఓలు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందగిరి రాజేష్ మాట్లాడుతూ.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. సీహెచ్‌ఓల సమస్యలు పరిష్కరించడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్థిక భారం పడదని చెప్పారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, పెరిగిన నిత్యావసరాల వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని వేతనం పెంచాలని కోరారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్‌ఓల్లో 85 శాతం మహిళలు ఉన్నారని, ఆడబిడ్డల మొహం చూసైనా న్యాయం చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు శ్రీకాంత్, శైలజ, కామేష్, ఖాదర్ వలి, బాబురావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
వైస్ ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం
మార్కాపురం టౌన్/త్రిపురాంతకం: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై సత్తా చాటారు. జిల్లాలో మార్కాపురం, త్రిపురాంతకం మండలాల్లో ఖాళీ అయిన ఉపాధ్యక్ష స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. మార్కాపురం మండలం వైస్ ఎంపీపీ–2గా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు కుందురు మాల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్కాపురం మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, డీఎల్పీవో కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు, ఒక కోఆప్షన్ సభ్యుడు ఉన్నారు. వీరిలో 11 మంది సభ్యులు వైస్ ఎంపీపీగా కుందురు మల్లారెడ్డిని బలపరిచారు. మల్లారెడ్డికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం అందించి, ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా వైస్ ఎంపీపీ స్థానానికి బరిలో నిలిచిన కుందురు మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు తన నివాసంలో సోమవారం బి–ఫారం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, ఎంపీపీ బి.లక్ష్మీదేవి, ఎంపీటీసీ సభ్యులు పి.అరుణ చెంచిరెడ్డి, లక్ష్మమ్మ, పేతురు, సంధ్యారాణి, లక్ష్మీదేవి, వీరమ్మ, వెంకటసుబ్బమ్మ, వీరనారాయణమ్మ, ఎల్లమ్మ, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మల్లారెడ్డికి అభినందనలు మార్కాపురం మండల వైస్ ఎంపీపీగా ఎన్నికై న మల్లారెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందురు నాగార్జునరెడ్డి అభినందించారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఏపీ మున్సిపల్ విభాగ కమిటీ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు నాయకులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. త్రిపురాంతకంలో.. త్రిపురాంతకం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ మేడపి ఎంపీటీసీ సభ్యుడు కృష్ణ పేరును ప్రతిపాదించగా ముడివేముల ఎంపీటీసీ సాయపునేని సుబ్బారావు, మిగిలిన సభ్యులు బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎంపీటీసీ సభ్యులను సమన్వయపరిచి ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా కృషి చేశారు. ఈ మేరకు పాటిబండ్ల కృష్ణతో ఎన్నికల అధికారి, మండల ప్రత్యేకాధికారి అయిన వండర్‌మేన్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎంపీడీఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం, త్రిపురాంతకంలో మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికలు రెండు మండలాల్లోనూ సత్తా చాటిన వైఎస్సార్ సీపీ వైస్ ఎంపీపీలుగా ఎన్నికై న కుందురు మల్లారెడ్డి, పాటిబండ్ల కృష్ణ -
వైఎస్సార్ సీపీపై అభిమానం అభినందనీయం
● పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు సిటీ: మార్కాపురం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షునిగా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షునిగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికవడం, వైఎస్సార్ సీపీ పట్ల వారు చూపిన అంకితభావం ఎంతో అభినందనీయమని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అవుతుందనడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. జిల్లాలో పార్టీ ప్రతిష్ట పెంచుతూ నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుండి నడిపిస్తున్న జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. -
ద్రోహం!
ప్రతిష్టాత్మకఒంగోలులోని ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లపై కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసిందా..? అంటే, పరిశీలకులు అవుననే అంటున్నారు. అద్దె చెల్లించడం భారమవుతుందన్న సాకులు చెప్పి జిల్లా కేంద్రమైన ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌ను ఇడుపులపాయ, నూజివీడు సెంటర్లకు తరలిస్తూ గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అదే కారణంతో ఎస్ఎస్ఎన్ క్యాంపస్‌ను కూడా ఎత్తేసేందుకు తెరవెనుక యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు క్యాంపస్‌లకు సంబంధించి రూ.3 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కాలేజీని పూర్తిగా ఎత్తేయాలన్న కుట్రతోనే అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విద్యుత్ బిల్లులు ఎందుకు చెల్లించలేదు..? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రావ్ అండ్ నాయుడు క్యాంపస్ కరెంటు బిల్లు రూ.90,96,753, ఎస్ఎస్ఎన్ క్యాంపస్ విద్యుత్ బిల్లు రూ.1,82,00,262 చెల్లించాల్సి ఉంది. ఈ వారంలో రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌కు విద్యుత్ సరఫరా కట్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్యాంపస్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఈ విషయం బయటకు తెలియకుండా విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఇలా తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యార్థులు విమర్శిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత భవనాలు లేకపోవడంతో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఐదు బ్రాంచీలతో, రెండో సంవత్సరం సీఎస్ఈ విద్యార్థులతో నగరంలోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌లో కొనసాగుతోంది. చీమకుర్తి రోడ్డులోని ఎస్ఎస్ఎన్ క్యాంపస్‌లో 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులు విద్యనభ్యస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల నుంచి రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌కు అద్దె చెల్లించడం నిలిపివేసింది. దాంతో అద్దె బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అయినా క్యాంపస్ యజమాని మాలకొండయ్య నాయుడు కాలేజీపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని సమాచారం. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వం ఒంగోలు క్యాంపస్‌ను తరలించేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దీని కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒంగోలు క్యాంపస్‌ను తరలించేందుకుగానూ కమిటీ వేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆ కమిటీ ఒంగోలు క్యాంపస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతోగానీ, విద్యార్థులతోగానీ మాట్లాడలేదు. పోనీ, ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీలోని అధికారులతో కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరితోనూ మాట్లాడకుండానే క్యాంపస్ తరలింపునకు అనుకూలంగా ఏప్రిల్ 28వ తేదీ వైస్ చాన్సిలర్‌కు నివేదిక ఇచ్చింది. దీనిపై ఈ నెల 6వ తేదీ ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో డైరెక్టర్, ఏఓ, అకడమిక్ డీన్లు క్యాంపస్ తరలించనున్నట్లు ప్రకటించారు. దీంతో విస్తుపోయిన రావ్ అండ్ నాయుడు క్యాంపస్ ఉద్యోగులు ఆర్టీయూకేటీలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందికి ఈ విషయం తెలియజేయాలని కోరారు. దీంతో 7వ తేదీ ఎస్ఎస్ఎన్ క్యాంపస్‌లో కూడా సమావేశం పెట్టి రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌ను తరలిస్తున్నట్లు వెల్లడించారు. క్యాంపస్‌ను తరలించవద్దంటూ 80 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 12వ తేదీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ముగుస్తున్న ఎస్ఎస్ఎన్ క్యాంపస్ లీజు... చీమకుర్తి రోడ్డులోని ఎస్ఎస్ఎన్ క్యాంపస్ లీజు 2027 జనవరిలో ముగియనుంది. దీనికి నెలకు రూ.40 లక్షల అద్దె చెల్లించేలా అగ్రిమెంటు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు అక్కడ క్యాంపస్ కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్న అధికారులు.. ఆ తర్వాత మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు. విద్యుత్ బిల్లులనే చెల్లించని ప్రభుత్వం, రూ.40 లక్షల అద్దె మాత్రం ఎందుకు చెల్లిస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. లీజు ముగిసిన తర్వాత ఎస్ఎస్ఎన్ క్యాంపస్‌ను కూడా తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. స్పందించని టీడీపీ ఎమ్మెల్యేలు... ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీని ఇడుపులపాయకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునే విషయంలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులలో స్పందన కానరావడం లేదు. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ కాలేజీని తరలిస్తూ వైస్ చాన్సిలర్ ఉత్తర్వులు జారీ చేసినా, ఆ విషయాన్ని అధికారులు, ఉద్యోగుల దృష్టికి తీసుకొచ్చినా టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు నటిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఉన్న ట్రిపుల్ ఐటీని ఒంగోలు నుంచి తరలించడంపై జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లయినా లేదని పలువురు మండిపడుతున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి కష్టాలు విద్యుత్ బిల్లు, అద్దెలు చెల్లించకుండా కుట్రలు ఇప్పటికే రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌కు మంగళం ఎస్ఎస్ఎన్ క్యాంపస్‌పై కూడా కన్ను 2027 జనవరితో ముగియనున్న ఎస్ఎస్ఎన్ క్యాంపస్ లీజు అగ్రిమెంట్ రూ.3 కోట్ల విద్యుత్ బకాయిలు స్పందించని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు -
కటకటాల్లోకి కిలేడీ
కొండపి: ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో ఏమరపాటుగా ఉన్న మహిళ నుంచి బంగారు ఆభరాల బ్యాగ్ చోరీ చేసిన మహిళను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 12న కొండపి బస్టాండ్‌లో జరిగిన చోరీ కేసులో సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన జి.కుమారి ఈ నెల 12న కందుకూరు మండలం విక్కిరాలపేటలో బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో కొండపి బస్టాండ్‌లో కందుకూరు బస్సు కోసం కొంత సమయం వేచి ఉన్నారు. బస్సు ఎక్కే క్రమంలో కర్రల సంచిలో ఉన్న బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయగా కాసేపటికే గుర్తించారు. బ్యాగ్‌లో 130 గ్రాముల బంగారు ఆభరణాలు, 120 గ్రాముల వెండి వస్తువులు, పాస్‌పోర్ట్ ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దీంతో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్ రెండు బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తు చేశారు. చీరాలకు చెందిన చవట అంజలిని నిందితురాలిగా గుర్తించారు. కందుకూరులో బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వెళ్తున్న అంజలిని మద్దులూరు–అనకర్లపూడి గ్రామాల మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి మొత్తం 165 గ్రాముల బంగారు ఆభరణాలు, 120 గ్రాముల వెండి, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. చోరీ కేసును వారం వ్యవధిలో ఛేదించిన కొండపి సీఐ, ఎస్సై బృందాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. సమావేశంలో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్, కానిస్టేబుళ్లు రవి, శంకర్, సుధాకర్, సురేష్, నాగలక్ష్మి పాల్గొన్నారు. చోరీ కేసు ఛేదించిన కొండపి పోలీసులు నిందితురాలి నుంచి 165 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండి, పాస్‌పోర్ట్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ -
కోర్టు కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకం
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: నేరస్తులకు శిక్ష విధించి, బాధితులకు న్యాయం చేయడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం కోర్టు మానిటరింగ్ సిబ్బందితో ఎస్పీ సమావేశమయ్యారు. కోర్టు ట్రయల్ దశలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని సూచనలు, సలహాలు ఇచ్చారు. సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పేలా తర్ఫీదు ఇవ్వాలని, సేకరించిన సాక్ష్యాలను సరైన పద్ధతిలో కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పారు. పోలీసు స్టేషన్లో నమోదయ్యే కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలని ఆదేశించారు. లోక్ అదాలత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి కొమరోలు: కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. వివరాలు.. కొమరోలు మండలంలోని క్రిష్ణంపల్లె గ్రామానికి చెందిన కె.మహేష్ ఈ నెల 16వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి గిద్దలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఒంగోలు జీజీహెచ్‌కు సిఫార్సు చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మహేష్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. బ్యాంకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్దదోర్నాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఖాతాదారులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ తీగలు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తేవడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. -
గంజాయి విక్రేతలు ముగ్గురు అరెస్టు
● నిందితుల నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన కంభం సీఐ మల్లికార్జున కంభం: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కంభం సీఐ మల్లిఖార్జున తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సీఐ విలేకర్ల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. వైజాగ్‌కు చెందిన ఓ సాధువు బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలోని ముక్తేశ్వరం గుడి వద్ద ఉన్న మావిళ్ల శ్రీనివాసులు అనే సాధువుతో పరిచయం ఏర్పచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి గంజాయి అమ్మితే మంచి డబ్బులు వస్తాయని ఆశ చూపాడు. దీంతో శ్రీనివాసులు బేస్తవారిపేటకు చెందిన వీరిశెట్టి వెంకటేష్, కంభానికి చెందిన గంటా నవీన్‌కు సమాచారం ఇచ్చాడు. ముగ్గురూ కలిసి వైజాగ్ నుంచి వచ్చిన సాధువు వద్ద కేజీ రూ.8 వేల చొప్పున 2.150 గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. గంజాయిని గుడి వద్దనే ప్యాకెట్లుగా చేస్తే గ్రామస్తులకు తెలిసిపోతుందని భావించి కంభం చేరుకున్నారు. ఓ కిరాణా షాపులో చిన్న సైజు ప్లాస్టిక్ కవర్లు కొనుగోలు చేసి రావిపాడు రోడ్డులోని పంట పొలాల వద్దకు బయలుదేరారు. అదే మార్గంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయితో పట్టుబడ్డారు. తహసీల్దార్ వి.కిరణ్ సమక్షంలో గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గరినీ అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై నరసింహారావు పాల్గొన్నారు. -
19వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల సమ్మె
ఒంగోలు టౌన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది. సమ్మెలో వుయ్ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సీహెచ్‌ఓల్లో 85 శాతం మహిళలు పనిచేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలు, కొండప్రాంతాల్లో పనిచేసే మహిళలు అభద్ర వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాత్రి 8 గంటల వరకు హెడ్ క్వార్టర్స్‌లో ఉండి ముఖ హాజరు వేయాలని కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీస్ వెల్ఫేర్ ఉత్తర్వులను జారీ చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ నాయకులు షేక్ ఆదిల్, గంటా ప్రసన్న, జీవనజ్యోతి, పసుపులేటి శైలజ, దీప్తి, కామేష్, రమాదేవి పాల్గొన్నారు. -
నీటి ముల్లు..!
పురం గొంతులోపశ్చిమ ప్రకాశానికి ముఖ ద్వారం మార్కాపురం. అక్కడ బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు పట్టణవాసులు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లోపం వెరసి ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వారం రోజులకోసారి సాగర్ నీటిని ప్రజలకు అందిస్తుండడంతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. దూపాడు ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లున్నా అందించలేని దుస్థితి. సుమారు లక్ష జనాభా ఉన్న పట్టణంలో అధికారుల మధ్య సమన్వయలోపం నీటి సమస్య తీవ్రరూపానికి కారణంగా మారుతోంది.మార్కాపురం టౌన్: పట్టణ ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి రాజీవ్ నగరబాటలో భాగంగా మార్కాపురం పర్యటనకు వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ఆయన రూ.45 కోట్లు మంజూరు చేశారు. దీంతో దూపాడు వద్ద నుంచి సుమారు 28 కిలోమీటర్ల మేర మార్కాపురానికి పైపులైన్లు ఏర్పాటు చేసి సాగర్ నీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. 2,200 మిలియన్ లీటర్ల కెపాసిటీతో దూపాడు వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. నాటి నుంచి ప్రజలకు సాగర్‌నీటిని అందిస్తుండటంతో ఇబ్బందిలేకుండా కొనసాగింది. ప్రస్తుతం పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. వారి అవసరాలకు సరిపడా నీటిని అందించలేకపోతున్నారు. అయితే, దూపాడు నుంచి కేశినేనిపల్లి వరకూ సుమారు 3 కిలోమీటర్ల మేర జీఆర్పీ పైపులైను తరచూ మరమ్మతులకు గురికావడంతో ప్రజలకు నీటి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. పైపులైన్లు పగిలితే ప్రజలకు నరకమే. గతంలో నాలుగు రోజులకొకసారి నీటిని అందించేవారు. ప్రస్తుతం వారానికొకసారి అందించడం కూడా గగనంగా మారింది. పైపులైన్లు మరమ్మతులకు గురైతే మరో మూడు రోజులు అదనంగా సమయం పడుతోంది. ఇదే అదునుగా నీటి వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ట్యాంకర్ నీటిని రూ.500 వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉంటే మరో రూ.200 అదనంగా తీసుకుంటున్నారు. 6 రోజులకొకసారి సాగర్ నీటి సరఫరా పైపులైన్లు పాడైతే నరకమే అడుగంటిన డీప్ బోర్లు శివారు కాలనీల్లో నీటి సమస్యలు ఎస్ఎస్ ట్యాంకులో నీరున్నా.. ప్రజలకు తప్పని నీటి కష్టాలు శివారు ప్రాంతాల్లో నీటి కష్టాలు... మార్కాపురం పట్టణంలోని శివారు ప్రాంతాలైన రాజ్యలక్ష్మినగర్, చెన్నకేశవనగర్, బాపూజీకాలనీ, పూలసుబ్బయ్యకాలనీ, కొండారెడ్డికాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎస్సీ, బీసీకాలనీ, సుందరయ్యకాలనీ, ఎస్టేట్, డ్రైవర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న డీప్‌బోర్లలో కొన్ని అడుగంటిపోవడంతో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా నీరు వచ్చే డీప్‌బోర్ల వద్ద నీటిని పట్టుకుని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో సుమారు 185 వరకూ డీప్‌బోర్లు ఉన్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతూ వస్తున్నాయి. 180 బోర్లలో నీరు పూర్తి స్థాయిలో రావడంలేదు. బోర్లు ఎండిపోయిన ప్రాంతాలకు మున్సిపాలిటీకి చెందిన రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అవి కూడా సక్రమంగా రాకపోవడంతో బిందెనీటిని రూ.పదికి కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. -
స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వాములు కండి
● బీట్ ద హీట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియా కొత్తపట్నం: వేసవిలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అల్లూరులో బీట్ ద హీట్ అనే కార్యక్రమం నిర్వహించారు. తొలుత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం రాజీవ్ కళామందిర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో సేకరించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించి చెత్తను ఎరువుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అల్లూరు గ్రామాన్ని కూడా విజువల్ క్లీన్ వీలేజ్‌గా తీర్చిదిద్దేలా గ్రామస్తులు కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో అనేక పనులు చేపడతామన్నారు. గ్రామంలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి మండలంలో 15 పంచాయతీల్లో పెండింగ్ పనులు ఉన్నాయని, పూర్తి చేయాలని ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి కలెక్టర్‌ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రావెల్, మట్టి రోడ్లకు రూ.11 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులు ఇప్పుడు నిలిచిపోయాయని, వాటిని తిరిగి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. అల్లూరు చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో డీకే భూములు 70 శాతం ఉన్నాయని, వాటిని వారి వారసుల పేర్లపై మార్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్వర్ణాంధ్ర–స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి పంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నంబూరి సూర్యనారాయణ, ఆర్డీఓ లక్ష్మిప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ బాల శంకరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాశాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ పి.మధుసూధన్‌రావు, ఎంపీడీఓ శ్రీకృష్ణ, ఈవోఆర్డీ వేణుగోపాల్ మూర్తి, ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి
రాచర్ల: పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..జేపీచెరువు గ్రామానికి చెందిన ఒంటేరు రంగయ్య, పామూరు శ్రీనివాసులు, గోతం వలి కలిసి గొర్రెల మేత కోసం నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి. ఒంటేరు రంగయ్యకు చెందిన 12 గొర్రెలు, పామూరు శ్రీనివాసులకు చెందిన 5, గోతం వలికి చెందిన 5 గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. -
నిబంధనాలు
ఉచిత విద్యకు● విద్యాహక్కు చట్టం–2009కు తూట్లు ● నిబంధనలతో పేద పిల్లలు కార్పొరేట్ విద్య దూరం ● ఉచిత సీట్లు పొందలేకపోతున్న గ్రామీణ విద్యార్థులు ● నిబంధనలు సడలించాలంటున్న విద్యావేత్తలు బేస్తవారిపేట: విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. అయితే విద్యార్థి నివాసం నుంచి ఒకటి లేదా మూడు కిలోమీటర్ల లోపు పాఠశాల ఉండాలనే నిబంధన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శాపంగా మారింది. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువ శాతం పట్టణాల్లోనే ఉండటంతో ఆ పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఉచిత సీట్లు పొందుతున్నారు. దీంతో గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల్లో సీట్లను పొందలేకపోతున్నారు. నోటిఫికేషన్ విడుదల.. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉచిత సీట్లు పొందేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 2009 జూలై 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులకు 5 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు 10 శాతం సీట్ల ప్రకారం మొత్తం 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. డ్రాపౌట్లు లేకుండా చర్యలు చేపట్టడమే కాకుండా, పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి అడ్మిషన్లకు డొనేషన్లు, ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు వంటి నిబంధనలు కూడా ఉన్నాయి. గ్రామీణ విద్యార్థులకు శాపంగా నిబంధనలు.. ఉచిత సీట్ల కేటాయింపులో ప్రభుత్వ నిబంధనలు గ్రామీణ పేద విద్యార్థులకు శాపంగా మారాయి. ప్రైవేట్ పాఠశాలలో సీట్లు పొందేందుకు విద్యార్థి నివాసం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న వారికి మొదటగా అవకాశం కల్పిస్తారు. కిలోమీటర్ పరిధిలోని విద్యార్థుల సీట్లు కేటాయింపులో మిగిలి ఉంటే 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యార్థికి కేటాయించేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలలు పట్టణాల్లోనే ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల వారికే ఉచిత సీట్లు దక్కుతాయి. దీంతో గ్రామీణ పేద విద్యార్థులకు దక్కే అవకాశం లేదు. ప్రభుత్వం నిబంధనలను సడలించి ఉచిత సీట్లు కేటాయింపులో గ్రామీణ విద్యార్థులకు కూడా సీట్లు పొందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ సేవా, ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. – చేగిరెడ్డి రమణారెడ్డి, ఎంఈఓ, బేస్తవారిపేట మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో నిబంధనలు సడలించాలి. ఒక కిలో మీటరు, మూడు కిలో మీటర్ పరిధి విధించడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు సీట్లు పొందే అవకాశం లేకుండా పోతుంది. మండలాన్ని యూనిట్‌గా సీట్లను కేటాయిస్తే గ్రామీణ విద్యార్థులకు ఉచిత సీట్లు పొందే అవకాశం కలుగుతుంది. – వేగినాటి ఓసూరారెడ్డి, ఎంపీపీ, బేస్తవారిపేట -
తిరగబడ్డ జెండా రంగులు
దర్శి(కురిచేడు): వీర సైనికులకు మద్దతుగా శనివారం దర్శి పట్టణంలో త్రివర్ణపతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ మహేష్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, సీఐ రామారావు, మాజీ సైనికోద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. త్రివర్ణపతాకానికి ఎక్కడా అవమానం జరగకూడదు. అది దేశానికి అవమానం జరిగినట్లు అవుతుందని ప్రతి పౌరుడు భావిస్తారు. అయితే ర్యాలీలో చాలా మంది ధరించిన తీవ్రర్ణ పతాకం టీ షర్టులపై త్రివర్ణాలు తిరగబడ్డాయి. ఈ విషయాన్ని ర్యాలీ నిర్వాహకులు సైతం గమనించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు ఒంగోలు టౌన్: వేగంగా వెళుతున్న ట్రావెల్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం..అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం నుంచి తమిళనాడులోని నాగపట్నం వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నగర శివారులోని త్రోవగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో 26 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన జుజ్జవరపు కోటమ్మ, మంద బుల్లమ్మాయి, పులిషారం పుష్ప, తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామానికి చెందిన చలివేంద్ర శ్రీలేఖ, రాయనపాడు గ్రామానికి చెందిన జుజ్జవరపు విక్రమ్, ఉద్దండరాయనిపాలెం గ్రామానికి చెందిన పులి పుష్పలను జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలపై మండిపడ్డారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్‌రెడ్డిలకు మద్యం పాలసీతో సంబంధం లేకపోయినా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని ఖండించారు. లేని స్కాంలను సృష్టించి తప్పుడు సాక్ష్యాలతో నచ్చిన విధంగా స్టేట్మెంట్లు రాసుకొని ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. జీవితంలో ఒక్క కేసు కూడా లేని నిజాయితీపరులైన అధికారులను రాజకీయ కక్షతో బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టినట్లు ఉందని, రాజకీయ ప్రతికారంతో కేసులు పెడితే తగిన పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ మాఫియా నడిపించడం నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లిక్కర్ వ్యవహారాన్ని ప్రైవేట్ మాఫియాకు అప్పగించి కమీషన్లు దండుకోవడం ప్రజలంతా చూస్తున్నారన్నారు. మద్యం దుకాణాలకు పదింతలు బెల్ట్ షాపులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. మంచినీళ్లు లేక గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో మద్యం మాఫియా నడ్డి విరగ్గొట్టి బెల్ట్ షాపులను తీసేసి మద్యం విక్రయాలపై నియంత్రణ విధించామన్నారు. ప్రభుత్వం మద్యం అమ్మితే విమర్శలు చేస్తున్న కూటమి పాలకులు ప్రైవేట్ మాఫియాకు మద్యం వ్యాపారాన్ని అప్పగించడాన్ని సమర్ధించుకోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా విజృంభిస్తోందని, బెల్ట్‌షాపులు పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకొని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్పుడు కేసులు నమోదు చేసి డైవర్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు చరమగీతం పాడి సూపర్‌సిక్స్ పథకాలను అటకెక్కించారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న ప్రజలను, సోషల్‌మీడియా యాక్టివిస్టులను, ప్రజా పోరాటాలకు అండగా నిలుస్తున్న ప్రతిపక్ష పార్టీలను అణిచివేసే కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని తప్పులను చంద్రబాబు చేస్తున్నారని, చట్టాన్ని గౌరవించకుండా న్యాయ ప్రక్రియను సక్రమంగా అమలు చేయకుండా తప్పు డు సంప్రదాయాలతో వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. మద్యం రూ.99కే..ఎకరం భూమి 99 పైసలే.. రాష్ట్రంలో మద్యాన్ని రూ.99లకు విక్రయిస్తూ కోట్ల విలువైన భూమిని మాత్రం 99 పైసలకే విక్రయిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. ప్రపంచీకరణను అమలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం అవినీతిలో నమోదైన కేసుపై బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నాడని చెప్పారు. ఎన్టీ రామారావు మద్యాన్ని నిషేధిస్తే దానికి తూట్లు పొడిచి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో బెల్టుషాపులను పూర్తిగా తొలగించామని, కానీ కూటమి ప్రభుత్వంలో గ్రామానికి నాలుగైదు బెల్టుషాపులు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. తప్పుడు కేసులు సరికాదు కక్ష్య సాధింపు రాజకీయాలు మానుకొని ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేయాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవిబాబు అన్నారు. ప్రభుత్వాధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, కేసులు పెట్టి వేధించడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టడం మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నారు. మద్యంలో కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు దండుకుంటుంతోదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్ పాల్గొన్నారు. మాజీ ప్రభుత్వ అధికారులపై అక్రమ కేసులు అన్యాయం కూటమి ప్రభుత్వంలో విజృంభిస్తున్న లిక్కర్ మాఫియా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి -
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు
మార్కాపురం: సీఎం చంద్రబాబుకు పాలన చేతగాక హామీల అమలులో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. హామీల అమలు విషయంలో అన్నీ వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకున్నా మద్యం స్కామ్ జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని జంకె ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో బెల్టుషాపులు పూర్తిగా రద్దు చేసి మద్యం షాపులను తగ్గించి అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్నీ డిస్టలరీలకు చంద్రబాబే అనుమతులు ఇచ్చారని, వైఎస్సార్ సీపీ పాలనలో ఒక్క డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. వీధి వీధినా బెల్టుషాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్, లిక్కర్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంటు కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో పాలన వెనక్కి వెళ్లిందన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం బెదిరింపులతో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం లేదని, అరాచక పాలనతో ప్రజా చైతన్యాన్ని అడ్డుకోలేరన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని జంకె హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జంకె -
భారీ వర్షం
నల్లమల అటవీ ప్రాంతంలో● రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టు రాచర్ల: మండలంలోని జేపీ చెరువు సమీపం నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం సమీపంలోని లక్ష్మమ్మ వనం వద్ద భారీ చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలడంతో నెమిలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై కోటేశ్వరరావు సంఘటన స్థలానికి చెరుకుని జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించారు. మిషన్లతో చెట్టు కొమ్మలను కత్తిరించి పక్కకు తిప్పంచారు. అనంతరం ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాలను పంపించారు. భారీ వర్షం కారణంగా కొండపై నుంచి వరద నీరు అధికంగా వచ్చింది. చాలా కష్టంతో భక్తులు వాగు దాటారు. ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన భారీ వర్షం కారణంగా ఎలాంటి అస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. -
ట్రాక్టర్ల సామగ్రి దొంగకు బేడీలు
పుల్లలచెరువు: ట్రాక్టర్ల సామగ్రి దొంగను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను యర్రగొండపాలెం సీఐ ప్రభాకర్ స్థానిక పోలీసుస్టేషన్లో శనివారం విలేకరులకు వెల్లడించారు. ముటుకుల, కొండారెడ్డి కొష్టాలకు చెందిన రైతులు వాగ్యానాయక్, విష్ణువర్ధన్‌రెడ్డిలు ఈ నెల 10వ తేదీన తమ పొలంలో ట్రాక్టర్, ట్రాలీ, రోటావేటర్‌ను దొంగలు అపహరించారని ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్ నేతృత్వంలో ఎస్ఐ సంపత్‌కుమార్ తమ సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. సీఐ ప్రభాకర్ కథనం ప్రకారం.. నిందితుడి కోసం పోలీసులు అందుబాటులో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. అనుమానం ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం మృత్యుంజపురానికి చెందిన దూదేకుల హుస్సేన్‌గా తేలింది. అతను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. వ్యవసాయ పనులకు ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. చెడు వ్యసనాలకు బానిసై తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో పొలాల్లో ఉండే రొటావేటర్లు, కల్టివేటర్లు, ట్యాంకర్లను దొంగలించి వాటిని అమ్ముకునేవాడు. ఈ క్రమంలో మార్చి 23వ తేదీన ఐటీ వరంలో ట్రక్కు, రోటావేటర్‌ను దొంగలించి వాటిని తన స్వగ్రామం తీసుకెళ్లాడు. ఈ నెల 9వ తేదీన త్రిపురాంతకంలో నీటి ట్యాంకర్‌ను దొంగలించాడు, మే 10న మానేపల్లి వద్ద ట్రాక్టర్‌ను, ట్రాలీను తీసుకెళ్లాడు. మళ్లీ దొంగతనం చేసేందుకు తన ట్రాక్టర్‌తో ముటుకుల వస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి ట్రాక్టర్, రెండు రోటావేటర్లు, నీళ్ల ట్యాంకర్, రెండు ట్రక్కులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ.14.60 లక్షలు ఉంటుందని సీఐ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. నిందితుడి దూదేకుల హుస్సేన్‌ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టినట్లు ఆయన వివరించారు. ఎస్పీ ప్రత్యేక అభినందనలు కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడంలో కీలకప్రాత పోషించిన డీఎస్పీ నాగరాజు, సీఐ ప్రభాకర్, ఎస్ఐ సంపత్‌కుమార్, ఏఎస్ఐ ప్రసాద్, సిబ్బంది రమేష్, అరుణ్‌కుమార్, వీరాంజనేయులు, నాగరాజు, సురేష్, కాశీబాబు, శివనాగరాజులను ఎస్పీ దామోదర్ అభినందించారు. ఎస్పీ రివార్డులు ప్రకటించగా వాటిని సంబంధిత సిబ్బందికి అందించినట్లు సీఐ ప్రభాకర్ వివరించారు. -
మిర్చి రైతు కంట్లో కారం
కూటమి ప్రభుత్వం మిర్చి రైతు కంట్లో కారం కొడుతోంది. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారు. గుంటూరు యార్డులోనే క్వింటా ధర రకాన్ని బట్టి రూ.8500 నుంచి రూ.10 వేల మధ్య పలుకుతోంది. జిల్లాలో మిర్చి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో గుంటూరు వెళ్లి మిర్చి యార్డులో అమ్ముకోవాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి క్వింటా మిర్చిని రూ.11,740కి కొనుగోలు చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మబలికి రెండు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో క్వింటా మిర్చి రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు పలికింది. దీంతో మిర్చి రైతులు లాభాల బాట పట్టారు. మళ్లీ జీవితంలో ఆ పరిస్థితులను చూడలేమనుకుంటూ రైతులు నిట్టూరుస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు జగనన్నకే సాధ్యంతడిసి రంగుమారిన మిర్చిని కుప్పగా పోస్తున్న రైతుఆలయం వద్ద స్తంభించిన ట్రాఫిక్ రాచర్ల: మండలంలోని నెమలిగుండ్లరంగనాయక స్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు అధిక సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ ఏర్పడింది. లక్ష్మమ్మ వనం నుంచి నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయానికి సుమారు కిలో మీటర్ ఉంటుంది. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయానికి వెళ్లేందుకు కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేశారు. దీంతో వచ్చేపోయే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటపాటు ట్రాఫిక్ స్తంభించి పోవడంతో కాలినడక వెళ్లే భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుని రంగస్వామి ఆలయం వద్ద వాహనాలు పార్కింగ్ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు బేస్తవారిపేట: మండలంలోని పీవీ పురంలో పేరంటాలమ్మ–పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా శనివారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలు ప్రారంభించేందుకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వెళ్లారు. పార్టీలకు అతీతంగా పండగ జరుపుకుందామని, వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులను ఎవరినీ బండ పందేలు ప్రారంభించేందుకు పిలవొద్దని గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు ముందే తీర్మానం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరికీ చెప్పకుండా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని పిలిపించి బండ ఎక్కించేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు, కమిటీ మెంబర్లు అడ్డుకున్నారు. గ్రామరాశి డబ్బుతో బండలాగుడు పోటీలు పెట్టామని, పార్టీల మధ్య గొడవలు వస్తాయని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించొద్దని ముందే నిర్ణయించుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గంట సేపు టీడీపీ నాయకులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి ఎంత ప్రయత్నించినా గ్రామస్తులు ఒప్పుకోలేదు. చేసేది లేక బండలాగుడు ఎడ్ల ముందు నిలబడి గ్రూప్‌ఫొటో దిగి ఎమ్మెల్యే ముత్తుముల వెనక్కి వెళ్లిపోయారు.పీసీపల్లి: ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జగనన్నకే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పాలేటి గంగమ్మ తిరునాళ్లలో భాగంగా వెంగలాపురం సమీపంలో పాలేటి నది ఒడ్డున వెలసిన గంగమ్మ ప్రాంగణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకొట్టు పిచ్చిరెడ్డి, ఎన్నికల శ్రీనివాస్‌రెడ్డి, వడ్డంపుడి వెంకటేశ్వర్లు, వెంకట భాస్కర్, మరిమి వెంకటేశ్వర్లు చౌదరి, చెన్నుపాటి వెంకటేశ్వరరావు చౌదరి ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్చార్జి చుండూరు రవిబాబు, కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్, చింతలచెరువు సత్యనారాయణరెడ్డితో కలిసి శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ మళ్లీ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగనన్న సీఎం కావాలని ప్రజలంతా కోరుతున్నారన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని, పొగాకు, కంది రైతులంతా రోడ్డును పడ్డారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా వలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానని చెప్పి పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు మోసగించారని బూచేపల్లి ధ్వజమెత్తారు. ఇది దోచుకుని దాచుకునే ప్రభుత్వమేనని, సంక్షేమ పథకాలు గాలికి వదిలారని మండిపడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లివెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ఓడిపోతారన్న భయంతోనే ఉమ్మడిగా వచ్చి మోసపూరితమైన మాటలు ప్రజలకు చెప్పి గెలిచారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేయడం వైఎస్ కుటుంబానికే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు సంక్షేమ, పరిపాలన గాలికి వదిలి విలాసాలకి సొంతంగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదని సంక్షోభ ప్రభుత్వమని విమర్శించారు. చుండూరి రవిబాబు మాట్లాడుతూ రైతులు తరఫున గళం విప్పేందుకు త్వరలో జగనన్న జిల్లాకు వస్తున్నారని, మనమంతా కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ తాను అతి సామాన్యుడినని, మీలో ఒక్కడినని, ఎమ్మెల్యేగా అభ్యర్థిగా తనను ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబం పట్ల ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటానని స్పష్టం చేశారు. రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో అందరినీ బెదిరిస్తోందని, ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడేవారు లేరన్నారు. కార్యక్రమంలో కేవీ రమణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గోపవరపు బొర్రారెడ్డి, ఓకే రెడ్డి, పోలు జయరామ్‌రెడ్డి, మడతల కస్తూరిరెడ్డి, వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, మూల రాజశేఖర్‌రెడ్డి, కోన్ నరసింహారావు, లింగాలది నరసింహారెడ్డి, మడతల ఓబుల్‌రెడ్డి, నరాల కొండారెడ్డి, రేగుల బాలయ్య, భూమిరెడ్డి కొండారెడ్డి, శ్రీకాంత్, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, తమ్మినేని సుజాత పాల్గొన్నారుక్లుప్తంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి– సాక్షి,ఒంగోలు -
చోద్యంగాక ఇంకేంటి?
పొదిలి రూరల్: మూసీవాగు సమీపంలో ఉన్న రైతులు తమ సొంత పొలాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్నారు. పంటలు పండించుకుంటూ పశువులకు మేత పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ వ్యవహారం మూసీవాగు పరిసర ప్రాంతంలో చాలాకాలంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిపై కొందరు కూటమి నాయకులు కన్నేశారు. ఎలాగైనా వీటిని తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా నెల క్రితం కూటమి నాయకులు అధికారులను కలిశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని, ఆక్రమణదారుల చెర నుంచి ఆ భూమిని విడిపించాలని కోరారు. కూటమి నేతలకు తలొగ్గిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఆక్రమణలు తొలగించాలని కొందరు రైతులకు మాత్రమే చెప్పారు. మిగిలిన రైతులను పట్టించుకోలేదు. అందరిపై చర్యలు తీసుకోవాలని, కొందరికి మాత్రమే భూములు ఖాళీ చేయాలని చెప్పడం ఏమిటని బాధిత రైతులు ప్రశ్నించారు. చివరకు కొందరు రైతులకు మాత్రమే అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి రైతులు ప్రస్తుతం పశుగ్రాసం ఉందని, కోతలైన వెంటనే తొలగిస్తామని సమాధానం చెప్పారు. అయినా రెవెన్యూ సిబ్బంది వినకుండా పొదిలి మండలం కుంచేపల్లి పంచాయతీలోని దాసళ్లపల్లి గ్రామ ససర్వే నెంబరు 11, కుంచేపల్లిలో సర్వే నెంబరు 25, 17 సర్వే నంబర్లలో ఉన్న 17 ఎకరాల వాగు పోరంబోకు భూమిలో ఆక్రమణలు జరిగాయని వారం క్రితం 8 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. 8 మందిలో కుంచేపల్లికు చెందిన పేరం నాగిరెడ్డి, మేడం నారాయణరెడ్డి, పేరం శ్రీనివాసరెడ్డి, బాదం శ్రీనివాసరెడ్డి ,దాసళ్లపల్లికు చెందిన గంగుల వెంకట్రావు, సీదా తిరుపతయ్య, గంగుల నరసింహారావు, గంగుల అచ్చయ్య ఉన్నారు. శనివారం ఆక్రమణలు తొలగించేందుకు తహసీల్దార్ ఎంవీ కృష్ణారెడ్డి పోలీసులు, జేసీబీతో వచ్చారు. పశువుల కోసం సాగు చేసుకున్న పశు గ్రాసాన్ని పొక్లెయిన్‌తో ధ్వంసం చేశారు. పొలం చుట్టూ ఉన్న గట్లను చదును చేసి తొలగించారు. కొంతమంది రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రెండు నెలల్లో తీసివేసే పశుగ్రాసాన్ని యంత్ర సాయంతో తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆక్రమణలు తొలగించాలనుకుంటే మూసీవాగుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి తీసివేయాలని, అధికారులు వివక్ష చూపారని మండిపడుతున్నారు. దీనిపై తహసీల్దార్ కృష్ణారెడ్డిని వివరణ కోరగా ముందుగా వచ్చిన ఫిర్యాదుపై రైతులకు నోటీసులు ఇచ్చామని, ఆ తర్వాత మిగిలిన వారికి కూడా నోటీసులు ఇచ్చి తొలగిస్తామని స్పష్టం చేశారు. -
రెండు ఎంపీయూపీ పాఠశాలలను యథావిధిగా ఉంచండి
● డీగ్రేడ్ చేయవద్దంటూ హైకోర్టు స్టేటస్ కో సీఎస్‌పురం(పామూరు): సీఎస్‌పురం మండలంలోని కోవిలంపాడు, పెదగోగులపల్లె ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను డీగ్రేడ్ చేయకుండా ప్రస్తుతానికి యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయా పాఠశాలలను డీగ్రేడ్ చేయవద్దంటూ ఎస్ఎంసీ చైర్మన్లు, గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జూన్ 27న విచారణ ఉన్నందున అంతవరకు రెండు పాఠశాలలను డీగ్రేడ్ చేయకుండా యథావిధిగా కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. రైలు ఢీకొని వ్యక్తి మృతి కురిచేడు: రైలు దూసుకొస్తున్న సమయంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన ్చఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కాటంవారిపల్లె గ్రామానికి చెందిన సంగు రమణారెడ్డి(55) గురువారం వేకువ జామున పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొంది. నరసరావుపేట రైల్వే ఎస్సై శ్రీనివాసనాయక్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రమణారెడ్డి మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి ఏడాది జైలు గిద్దలూరు రూరల్: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు పరిహారం కింద రూ.లక్ష చెల్లించాలని గిద్దలూరు అడిషనల్ జ్యుడీషియల్ సివిల్ జడ్జి కె.భరత్‌చంద్ర గురువారం తీర్పునిచ్చారు. జె.పంగులూరు మండలానికి చెందిన ఎన్.ఎన్ స్మార్ట్ టెక్నాలజీ ప్రొప్రైటర్ నాగార్జున కంభంకు చెందిన ఎస్.శ్రీనివాసులు వద్ద ఏడేళ్ల క్రితం రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. బాకీ చెల్లింపు నిమిత్తం ఇచ్చిన చెక్కును శ్రీనివాసులు బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అయింది. దీంతో నాగార్జునపై కోర్టులో కేసు వేయడంతో తుది విచారణ చేపట్టిన జడ్జి పైన పేర్కొన్న విధంగా తీర్పు వెల్లడించారు. పిచ్చికుక్క స్వైర విహారం ● ఇద్దరు చిన్నారులకు గాయాలు తాళ్లూరు: పిచ్చికుక్క స్వైర విహారం చేసి పలువురిని గాయపరిచిన సంఘటన తాళ్లూరు మండలం మాధవరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సాయి అనే బాలుడి తల, గొంతు వద్ద పిచ్చికుక్క కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలక్ష్మి అనే బాలికను పిచ్చికుక్క కరుస్తున్న సమయంలో పక్కనే ఉన్న స్థానికులు కేకలు వేసి తరిమికొట్టడంతో పారిపోయింది. క్షతగాత్రులను తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. సాయి తీవ్రంగా గాయపడటంతో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. -
ఆగి.. సాగిన పొగాకు వేలం
కనిగిరి రూరల్: ధరల దోబూచులాటలో పొగాకు రైతులు విలవిల్లాడుతున్నారు. గురువారం కనిగిరి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైన కాసేపటికే వేలం నిలిచిపోయింది. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేలాన్ని బహిష్కరించారు. అలవలపాడు క్లస్టర్ పరిధిలోని 7 గ్రామాల నుంచి సుమారు 403 పొగాకు బేళ్లను రైతులు తీసుకొచ్చారు. వేలంలో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు, బయ్యర్లు ఒకటీరెండు బేళ్లకు కేజీ రూ.280 ధర ఇచ్చి.. మిగిలిన వాటిని రూ.240 చెల్లిస్తూ వచ్చారు. సుమారు 50 బేళ్లకు ఇదే ధర కొనసాగడం రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఎఫ్1, ఎఫ్2 మంచి రకం బేళ్లకు కూడా రూ.230, రూ.240కి మించి ధర ఇవ్వక పోవడంతో రైతులు మూకుమ్మడిగా వేలాన్ని నిలిపేశారు. బయ్యర్లు, కంపెనీల ప్రతినిధులు కుమ్మకై ్క.. ధర లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరుణంలో రైతులు, కంపెనీ బయ్యర్లతో బోర్డు అధికారులు సమావేశం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం ఆగిన పొగాకు వేలం బోర్డు అధికారుల బుజ్జగింపులతో మధ్యాహ్నం తర్వాత మళ్లీ కొనసాగింది. మొత్తం 403 బేళ్లకుగాను 51 బేళ్లు నోబిడ్ కింద నిలవగా, మిగతా వాటిని కొనుగోలు చేశారు. గరిష్ట ధర కేజీ రూ.280, కనిష్ట ధర రూ.200, సరాసరి ధర రూ.230 పలికిందని వేలం నిర్వహణాధికారి కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 9 కంపెనీల ప్రతినిధులు వేలం కేంద్రం వద్దకు వచ్చినా.. మూడు కంపెనీలు మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన 353 బేళ్లలో గరిష్ట ధర పలికినవి 25కు మించి లేవని రైతులు పెదవి విరిచారు. పొగాకుకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని రైతు సంఘం నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేదని వేలాన్ని బహిష్కరించిన రైతులు సర్దిచెప్పి మధ్యాహ్నం తర్వాత కొనసాగించిన బోర్డు అధికారులు అయినా సరైన ధర ఇవ్వకపోవడంపై రైతుల తీవ్ర ఆగ్రహం వేలంలో అరకొరగా పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు పొగాకు రైతుల గోడు పట్టదా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఏపీ రైతు సంఘం ఆగ్రహం ఒంగోలు టౌన్: వ్యాపారుల తీరుతో కష్టనష్టాలు చవిచూస్తున్న పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి. హనుమారెడ్డి, కె.వీరారెడ్డి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో విమర్శించారు. మిర్చి పంట సాగు చేసి తెగుళ్ల వల్ల సరైన దిగుబడి రాక, ధర లేక నష్టపోయిన రైతులు.. ప్రత్యామ్నాయ పంటగా బర్లీ, వర్జీనియా పొగాకు పండించారని తెలిపారు. క్వింటాకు 15 వేల రుపాయలు తక్కువ కాకుండా తీసుకుంటామని చెప్పిన పొగాకు కంపెనీల ప్రతినిధులు తీరా పంట చేతికొచ్చాక మొహం చాటేయడం దారుణమని మండిపడ్డారు. తీవ్ర ఆందోళనకు గురైన రైతులు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధ తట్టుకోలేక ఇప్పటికే ఇద్దరు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ఇప్పటికీ ప్రారంభించకపోవడం సరికాదని, రోజుకు రెండుమూడొందల బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయని, పచ్చ మాడును పూర్తిగా కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. మేలు రకం పొగాకుకు సరైన ధర ఇవ్వకపోతున్నా టుబాకో బోర్డు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. జిల్లా ప్రజాప్రతినిధులు తూతూ మంత్రంగా సమావేశాలతో సరిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షభంలోకి కూరుకుపోవడంతో 18 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. గత చేదు అనుభవాలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేలుకోవాలని, తక్షణమే ప్రభుత్వరంగ సంస్థలను రంగంలోకి దింపి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
మర్కటంగారి.. పానీ కహానీ..
ఎండ దెబ్బకు ఠారెత్తిపోయిన ఓ మర్కటం దప్పిక తీర్చుకునేందుకు నానాపాట్లు పడింది. నీళ్ల ట్యాంక్‌పై కూర్చుని ఇది ప్రదర్శించిన హావభావాలు చూసినవారు కాసేపు ఆశ్యర్యచకితులయ్యారు. భక్తులు ఇచ్చిన ఆహారం తాపీగా తినేసిన తర్వాత ఎవరైనా గుక్కెడు నీళ్లు పోయకపోరా అని ఎదురుచూసింది. అంతలోనే ఇక లాభం లేదనుకుని ట్యాంక్ వద్ద కుప్పిగంతులేసి ఓ కుళాయి తిప్పి దాహం తీర్చుకుంది. ఈ దృశ్యాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – కొనకనమిట్ల -
ఆదాయం పావలా.. హడావుడి చాలా!
హైవేపై దూసుకెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు ఇలా ఇరుకు వీధిలో తిరుగుతోంది ఏమిటని అనుకుంటున్నారా? ఈ బస్సు రోజూ ఇంతే తిరుగుతుంది! గిద్దలూరు ఆర్టీసీ డిపోకు రోజువారీగా వచ్చే సుమారు రూ.10 లక్షల ఆదాయాన్ని స్థానిక ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు ఆర్టీసీ బస్సును వినియోగిస్తున్నారు. అయితే మంచిదే కదా అని అనుకుంటే పొరపాటే. ఇరుకు వీధిలో ఆర్టీసీ బస్సును తిప్పుతుండటంతో నగర వాసులకు రోజూ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. నగదుతో కూడిన బాక్స్‌ను గన్‌మెన్, క్యాషియర్ కలిసి రోజూ బస్సులో వెళ్లి తిరిగి డిపోకు చేరుకోవడం సవాల్‌గా మారుతోంది. ఇరుకు వీధిలో పార్కింగ్ చేసిన వాహనాలను అడ్డు తొలగించాలని డ్రైవర్ బతిమాలుకోవాల్సి వస్తోంది. పోనీ ఆర్టీసీ బస్సు ఏమైనా నేరుగా బ్యాంక్ వద్దకు వెళ్తుందా అంటే అదీ లేదు. బ్యాంక్ సమీపంలోనే బస్సు నిలిపేసి అక్కడి నుంచి నగదు బాక్స్‌ను మోసుకెళ్తున్నారు. ఈలోగా బస్సు యూటర్న్ చేసుకోవడానికి 15 నిమిషాల సమయం పడుతోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే బైకులు, కార్లు, ఆటోలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి జీపులో నగదు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని నగర పౌరులు కోరుతున్నారు. – గిద్దలూరు రూరల్ -
1.60 కేజీల గంజాయి పట్టివేత!
పుల్లలచెరువు: మండలంలోని ఐటీ వరం పరిసరాల్లో బుధవారం సాయంత్రం 1.60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేయడంతో నిందితులు దొరికిపోయినట్లు తెలుస్తోంది. రెండు బైకులపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఐటీ వరం సమీపంలో తనిఖీ చేయగా 1600 గ్రాముల గంజాయి లభ్యమైందని ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సీజ్ చేజిన గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. ముగ్గురు నిందితులను మార్కాపురం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా పుల్లలచెరువు మండలంలోని పలు తండాల్లో మద్యం బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటికి తోడు కొత్తగా గంజాయి వ్యాపారం కూడా ప్రారంభం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. రెండు కేజీల గంజాయి స్వాధీనం? బేస్తవారిపేట: నియోజకవర్గంలోని బేస్తవారిపేట, మోక్షగుండం, కంభంలో పలువురి వద్ద రెండు కేజీల కంభం సీఐ మల్లికార్జున స్వాధీనం చేసుకున్నారు. కంభంలో గంజాయి అమ్ముతున్న ఒకరిని అదుపులోకి తీసుకోవడంతో గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలో ఒకరు, బేస్తవారిపేటలో ఇద్దరు, కంభంలో ఏడుగురు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని లోతుగా విచారణ చేపడుతున్నారు. -
సాగు పేరుతో భూమి.. చేస్తున్నదేమి?
సింగరాయకొండ: సాగు చేసుకోవడానికి దేవదాయ శాఖ భూమిని వేలంలో దక్కించుకున్న వ్యక్తి ఒక్క పంట పండించలేదు. ఆ స్థలంలో దర్జాగా షాపులు నిర్మించడమే కాకుండా అద్దెకిచ్చి అదనంగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మూలగుంటపాడు పంచాయతీ సర్వే నంబర్ 44–1బీలో 0.84 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. జాతీయ రహదారిపై ఎయిర్ బేస్ పక్కనే ఉండటంతో ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయలు పలుకుతోంది. గత ఏడాది దేవదాయ శాఖ అధికారులు నిర్వహించిన వేలంలో కలికవాయ గ్రామానికి చెందిన కూటమి సానుభూతిపరుడు ఈ భూమిని దక్కించుకున్నాడు. మూడేళ్ల పరిమితితో ఏడాదికి 2,500 రూపాయల చొప్పున కౌలు చెల్లించాలనేది నిబంధన. ఈ సంగతి పక్కనబెడితే.. కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆ భూమిలో పంటలు పండించకుండా షాపులు ఏర్పాటు చేసి అద్దెకివ్వడం ప్రారంభించాడు. కరెంట్ మీటరు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. దేవదాయ శాఖ భూమిలో ప్రస్తుతం ఒక ఫంక్చర్ షాపు, హోటల్ ఏర్పాటు చేసి భారీగా అద్దె వసూలు చేస్తున్న సదరు నాయకుడు.. మిగిలిన స్థలాన్ని సాగు చేయకుండా ఖాళీగా వదిలేశాడు. వాస్తవానికి సాగు కోసం తీసుకున్న భూమిలో ఎటువంటి కట్టడాలు నిర్మించకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే లీజును రద్దు చేసే హక్కు ఆలయ అధికారులకు ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఆలయ అధికారులు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి దుకాణాలు తొలగించాలని వేడుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేలం రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోకుండా బతిమాలడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై దేవస్థానం ఈఓ పి కృష్ణవేణిని వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించినప్పటికీ ఆమె స్పందించలేదు. దేవదాయ శాఖ భూమిలో అక్రమ కట్టడాలు పంక్చర్ షాపు, హోటల్ ఏర్పాటు చేసి భారీ మొత్తంలో అద్దె వసూలు కూటమి నాయకుడి నిర్వాకంపై నోరు మెదపని అధికారులు విద్యుత్ కనెక్షన్ దరఖాస్తుతో విషయం వెలుగులోకి. -
తెల్ల గ్రానైట్ మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
హనుమంతునిపాడు: మండల కేంద్రమైన హనుమంతునిపాడు రెవెన్యూ సర్వే నంబర్ 299లో తెల్ల గ్రానైట్ మైనింగ్‌కు సంబంధించి జిల్లా మైనింగ్ అధికారులు, జిల్లా పర్యావరణ అధికారులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గురువారం తహసీల్దార్ దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో మైనింగ్ నిర్వహించే ప్రదేశంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హనుమంతునిపాడు పంచాయతీ సర్వే నంబర్ 299లో 21 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఎర్ర కొండ(బొల్లిగుండ్ల కొండ)లో వైట్ గ్రానైట్ తవ్వకాలకు మిడ్వెస్ట్ కంపెనీ 2018లో ఎన్ఓసీ పొందిందని తెలిపారు. గత ఏడాది మే నెలలో గనుల తవ్వకానికి మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. మైనింగ్‌తో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు వెంకట సుబ్బయ్య, గంటా రాఘవేంద్రరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. రోడ్లు నిర్మించడంతోపాటు గుర్రప్పుడు ఆలయానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గుడి పక్కన తవ్వకాలు చేపట్టవద్దని, పక్కనే ఉన్న పశువుల కుంటను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి జి.రాఘవరెడ్డి, ఆర్ఐ గవదకట్ల కృష్ణ చైతన్య, సర్వేయర్ రమణయ్య, వీఆర్వోలు చిన్నయ్య, కాశయ్య, బాదుల్లా, ఝాన్సీ, రసూల్, మిడ్వెస్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కర్రల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
త్రిపురాంతకం: కర్రల లోడ్ వెళ్తున్న ట్రాక్టర్‌ను మార్జిన్ గమనించక కారు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన త్రిపురాంతకం మండలంలోని గుట్లపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కురిచేడు మండలంలోని మృత్యుంజయపురం గ్రామానికి చెందిన వజ్రగిరి కొండమ్మ(45), కొదమల కుమారి, షారోన్, ప్రశాంత్‌రాజ్ పుల్లలచెరువు మండలంలోని చౌటపాచర్ల గ్రామంలో బంధువుల ఇంట శుభ కార్యానికి హాజరయ్యారు. కారులో స్వగ్రామానికి బయలుదేరిన వీరు మార్గమధ్యంలో గుట్లపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కర్రల లోడ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. వజ్రగిరి కొండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్రిపురాంతకం పోలీసులు తెలిపారు. మహిళ మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు గుట్లపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన -
ఆశా వర్కర్లపై కర్రపెత్తనం తగదు
● ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఒంగోలు టౌన్: ఆశా వర్కర్లపై కర్రపెత్తనం తగదని, ఏఎన్ఎంల నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు పెత్తనం చలాయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి అన్నారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన యూనియన్ జిల్లా సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఆశా వర్కర్ల సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని చెప్పారు. కోవిడ్ సమయంలో ఆశాలు అందించిన సేవలను ప్రజలు ప్రశంసించారన్నారు. 20 ఏళ్లుగా ఎన్హెచ్ఎం విభాగంలో ఆరోగ్య సేవలందిస్తున్నారని, ప్రతి కాన్పు ఆస్పత్రిలో జరిగే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. 2007లో యూనియన్ ఏర్పడిన తర్వాత జీతాల కోసం చేసిన ఉద్యమం ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం 3 వేల రూపాయల జీతం ప్రకటించిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 10 వేల రూపాయలకు పెంచి ఇచ్చిందని తెలిపారు. ఆశాలకు నిర్దిష్టమైన పని విధానం రూపొందించకపోవడం విచారకరమన్నారు. నిర్దిష్టమైన పనిగంటలు, సెలవులు అమలు కాకపోవడం, ఉద్యోగ భద్రత, పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించకపోవడం వంటి అనేక సమస్యలు వేధిస్తున్నాయని చెప్పారు. ఉదయం, సాయంత్రం ఇంటింటికి తిరిగి సర్వేలు చేయమని, వెల్నెస్ సెంటర్లలో పనిచేయమని ఒత్తిళ్లు చేస్తున్నారని చెప్పారు. దీంతో ఆశా వర్కర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సేవలు అందించినప్పటికీ ఆశావర్కర్లు రిటైర్డ్ అయినా, మరణించినా ఎలాంటి సహాయం అందకపోవడం దారుణమన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి పెండ్యాల కల్పన ప్రసంగిస్తూ వేతనాలు లేకుండా 14 ఏళ్లపాటు పనిచేశారని, 14 ఏళ్ల ఉద్యమం తరువాత వేతనాలు సాధించామని చెప్పారు. ఉద్యోగ భద్రత కోసం మరోసారి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మే 20న జరిగే సమ్మెలో ఆశా వర్కర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల ఉద్యమానికి ఐద్వా అండగా నిలుస్తుందని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి చెప్పారు. కార్యక్రమంలో కాలం సుబ్బారావు, జీవీ కొండారెడ్డి, శేషయ్య, రమేష్, అరుణ, అనూష, సిఫోరా, విజయ, కోటేశ్వరి, నాగమ్మ, విశ్రాంతమ్మ, సుశీల, బాలమ్మ, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఒంగోలు అధ్యక్షునిగా శంకర్
ఒంగోలు టౌన్ : వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షునిగా కటారి శంకరరావును ఎంపిక చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఒంగోలు నగర కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కోడూరి కిషోర్, కొణికి రోశయ్య, జనరల్ సెక్రటరీలుగా దుగ్గిరెడ్డి జయరామిరెడ్డి, షేక్ మూసా, ఆవుల వెంకట సురేంద్ర, అంబటి అర్జున్, నెరుసుల రామకృష్ణను ప్రకటించారు. అలాగే కార్యదర్శులుగా పల్లపోతుల వెంకయ్య నాయుడు, షేక్ రమిజా, తేల్ల అవినాష్, ఆవుల రవితేజ, నంద్యాల సాయిరెడ్డి, తోటపల్లి రవి, కొక్కిలిగడ్డ వెంకటేశ్వర్లు, పొనుగోటి రాజేశ్వరి, షేక్ అబ్దుల్ సలాం, గోనెల శివకుమార్‌ను నియమించారు. వీరితో పాటు 37 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించారు. అనుబంధ విభాగాల అధ్యక్షుల ఎన్నిక... వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా కాకుమాను సునీల్‌రాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బత్తుల ప్రమీల, బీసీ సెల్ అధ్యక్షునిగా సూతరం శ్రీనివాసులు, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా పసుమర్తి గోపీచంద్, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా గాలేటి వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ అధ్యక్షునిగా మహమ్మద్ చాన్బాషాలను నియమించారు. క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా కావూరి కృపాకిరీటి, విద్యార్థి విభాగం అధ్యక్షునిగా సయ్యద్ ఖాదర్ బాషా, మున్సిపల్ విభాగం అధ్యక్షునిగా షేక్ రషీద్ నాగూర్, ఆర్టీఐ విభాగం అధ్యక్షునిగా తోటా సుధారాణి, వలంటీర్ల విభాగం అధ్యక్షునిగా అబ్దుల్ఖుద్దూస్ను నియమించారు. గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షునిగా షేక్ హిదాయతుల్లా, వాణిజ్య విభాగం అధ్యక్షునిగా ఏ యలమందారెడ్డి, చేనేత విభాగం అధ్యక్షునిగా మొగిలి ఆనందరావు, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షునిగా మిర్యాల శ్రీనివాసరావు, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా బడుగు ఇందిర, లీగల్ సెల్ అధ్యక్షునిగా కాకటూరి సంపత్ కుమార్, కల్చరల్ విభాగం అధ్యక్షునిగా పఠాన్ సమీర్‌ఖాన్, సోషల్ మీడియా అధ్యక్షునిగా చావల పీటర్‌పాల్, ఐటీ విభాగం అధ్యక్షునిగా ఉల్లగంటి సతీష్ కుమార్, దివ్యాంగుల విభాగం అధ్యక్షునిగా షేక్ మీరావలి, డాక్డర్స్ విభాగం అధ్యక్షునిగా కొల్లం దీపక్ సాహిత్య, పబ్లిసిటీ విభాగం అధ్యక్షునిగా పిగిలి శ్రీనివాసరావును నియమించారు. -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
చీమకుర్తి రూరల్: ఒకసారి ప్రజలకు మాటిస్తే కచ్చితంగా నెరవేర్చే వ్యక్తి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కొనియాడారు. కానీ, సీఎం చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కూటమి ప్రభుత్వంపై 11 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. చీమకుర్తి మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ 24వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభపై బూచేపల్లి పాల్గొన్నారు. పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవితో కలిసి పాల్గొన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా జగనన్న అండగా నిలిచారని తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా మనమంతా సమష్టి కృషితో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవాలని అన్నారు. వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రం సస్యశ్యామలం : మేరుగు నాగార్జున వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంటుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున అన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందాయన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలు, మహిళల గురించి పట్టించుకునేవారే లేరన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలివ్వకపోవడంతో నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకుండా అన్నదాతలను నిలువునా మోసం చేస్తోందన్నారు. ప్రజలంతా 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని అన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా.. ఇచ్చిన హామీల ఊసే లేదన్నారు. స్కీములు లేకపోగా, స్కాములు మాత్రం ఉంటున్నాయన్నారు. అధికారం ఉన్నా..లేకున్నా జగనన్న సింగిల్‌గా పోటీచేసే దమ్మున్న నాయకుడని అన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి 2029లో జగనన్నను సీఎం చేసుకుంటేనే పేద ప్రజలకు అండగా దొరుకుతుందని అన్నారు. కార్యక్రమంలో చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాయకులు శివన్నారాయణ, యర్రగుంట్ల వసంతరావు, యర్రగుంట్ల మోహన్, డాక్టర్ బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, నల్లూరి చంద్రారావు, గోరంట్ల రామకృష్ణ, వేమూరి బాలకృష్ణ, పేరాబత్తిన పేరయ్య, పాటిబండ్ల గంగయ్య, ఏలూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 11 నెలల్లోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు సూపర్ సిక్స్ హామీలిచ్చి నెరవేర్చని చంద్రబాబు పేదలు, మహిళలను మోసం చేయడం అన్యాయం మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందాం ఇచ్చిన మాట నెరవేర్చే వ్యక్తి జగనన్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు అండగా నిలిచారు రాష్ట్రానికి మళ్లీ జగనన్నే కావాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా నాగులుప్పలపాడు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. గురువారం ఉదయం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించారు. పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ట్రాకింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఎన్టీఆర్ వైద్య సేవల కౌంటర్‌ను, రోగుల రిజిస్ట్రేషన్ గదిని సందర్శించి రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ను, క్యాజువాలిటీ గదులు, అత్యవసర సేవా విభాగం, ల్యాబ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ ఒనారియల్ ఉన్నారు. అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఒంగోలు సబర్బన్: ‘మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం’ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని తన చాంబర్లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై రూపొందించిన క్యూ ఆర్ కోడ్ సేవలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 ప్రభుత్వ సేవలను మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ సేవలు సాంకేతికంగా సురక్షితంగా ఉంటాయని, ప్రజల గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందని కలెక్టర్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు, రెండో విడతలో 360 రకాల సేవలను వాట్సాప్‌లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వాట్సాప్ ద్వారా వివిధ సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇందుకోసం 9552300009 మొబైల్ నంబర్‌ను వాట్సాప్ ద్వారా వినియోగించుకోవచ్చని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకట నాయుడు, డీఆర్డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి, సీపీఓ వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు పాల్గొన్నారు. -
అవినీతి..!
చిత్రమైన బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన ద్వారకచర్ల రవికుమార్‌రెడ్డి, సావిత్రి దంపతులు హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. రవికుమార్‌రెడ్డి ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఆయన పేరుపై మోక్షగుండంలో ఉపాధి హామీ జాబ్‌కార్డు ఉంది. ఇదే గ్రామానికి చెందిన సీహెచ్ సునీత, తిరుపతిరెడ్డి గుంటూరులో నివాసం ఉంటుంటారు. పోలయ్య, లక్ష్మీదేవి కడప, నాగేశ్వరరెడ్డి, మధులత విజయవాడలో ఉంటారు. ఆవుల జ్యోతి, రమణారెడ్డి కర్ణాటకలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరందరికీ వారి స్వగ్రామాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. అంతేగాకుండా వారు ప్రతిరోజూ పనులు చేస్తున్నట్లు హాజరు వేస్తున్నారు. ఇంకా చిత్రమేమిటంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా వారి స్వగ్రామాల్లో ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీల నేతలు ఉపాధి హామీ పథకాన్ని హైజాక్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. వారి స్థానంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులను పట్టుబట్టి మరీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకుని అక్రమాలకు తెరదీశారు. అందినకాడికి మేసేస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో వారానికి రూ.3 కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించడం సంచలనం సృష్టించింది. దీంతో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జిల్లాలో దోపిడీ ఇలా... జిల్లాలో మొత్తం 4.42 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. 2024–25లో కోటీ 29 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 3 లక్షల కార్డులకు చెందిన 5.06 లక్షల మంది పనులు చేసినట్లు చెబుతున్నారు. రికార్డుల్లో ఇదంతా బాగానే ఉంది. కానీ, వాస్తవంలో మాత్రం అధికారులు చెబుతున్న దానికి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి మే నెలలో 3 లక్షల మందికిపైగా పనులు చేయాల్సి ఉంది. కానీ 1.80 లక్షల మంది మాత్రమే పనులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మిగతా 1.20 లక్షల మంది ఎందుకు పనులకు రావడం లేదంటే అధికారుల నుంచి సమాధానం లేదు. వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు... ఉపాధి హామీ పనులు చేసేవారికి గతంలో 14 రోజులకు ఒకసారి వేతనాలు ఇచ్చేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గత మార్చి 16వ తేదీ వరకు చేసిన పనుల తాలూకా వేతనాలు ఇటీవలే ఇచ్చారు. తిరిగి మార్చి 17 నుంచి చేసిన పనులకు ఇంత వరకు ఇవ్వలేదు. 60 రోజులు కావస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కూలీలు అవస్థపడుతున్నారు. నిధులున్నా ఉద్దేశపూర్వకంగానే వేతనాలు ఇవ్వడం లేదని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రతోనే కూటమి ప్రభుత్వం వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వం కనీస వేతనం రూ.307 ప్రకటించింది. కానీ, ఎవరికీ కనీస వేతనం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చేసిన పనులకు కొలతలు వేసి వేతనం ఇవ్వడం జరుగుతోంది. దీని ప్రకారం ఒక్కొక్కరికి రూ.200 దక్కడమే మహాభాగ్యమని ఉపాధి కూలీలు చెబుతున్నారు. ఒకటే ఫొటో.. పది బిల్లులు... ఉపాధి హామీలో కూలీల గ్రూపు ఫొటో చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందేనని చెబుతున్నారు. కూలీలతో పనులు చేయించినట్లు ఎన్ఎంఎంఎస్ యాప్‌లో గ్రూపు ఫొటోలు పెట్టాల్సి ఉంటుంది. అయితే, పది మందితో పది గ్రూపుల ఫొటోలు సృష్టిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పని ప్రాంతంలో దగ్గరగా ఉన్న వారిని ఫొటోలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఆశా వర్కర్లు, వికలాంగులు, చిన్నపిల్లలు, వృద్ద్ధుల ఫొటోలు తీసుకుని అప్లోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక ఫొటోను అనేక పంచాయతీలలో అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదంతా జిల్లా అధికారులకు తెలియదా అంటే.. అంతా తెలిసే జరుగుతుందనే మాట వినిపిస్తోంది. మరి జిల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే నెలనెలా మామూళ్లు తీసుకుని చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అవినీతే ఉపాధి హామీకి శాపంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో పెచ్చుమీరిన అక్రమాలు అందినకాడికి మేసేస్తున్న పచ్చ తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా జాబ్‌కార్డుల నమోదు పనులు చేయకుండానే కూలి దొంగ మస్టర్లతో జేబులు నింపుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వారానికి రూ.3 కోట్లు పంచుకుంటున్నారు : డీఆర్సీలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి -
కేంద్ర బృందం తనిఖీలు
● ఈ క్రాప్ నమోదు, తదితర అంశాలపై పలు ప్రాంతాల్లో తనిఖీ జరుగుమల్లి (సింగరాయకొండ): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం కేంద్ర బృందం తనిఖీలు చేపట్టింది. జరుగుమల్లి మండలంలోని పాలేటిపాడు గ్రామంలో ఈ క్రాప్ నమోదుపై కేంద్ర గణాంక బృందం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రాప్ నమోదు సక్రమంగా జరిగిందా..లేదా..? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర గణాంక అధికారి జేవీ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించి 5 సర్వే నంబర్లు ఎంపిక చేసి వాటిలోని భూముల్లో రైతులు ఏయే పంటలు వేశారు.. ఆ భూముల్లో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ఏయే పంటలను ఈ క్రాప్‌లో నమోదు చేశారనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. పంటలు వేయని భూములు వాస్తవమేనా అని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల నమోదును పరిశీలిస్తామని బృంద సభ్యులు వివరించారు. తనిఖీ బృందం వెంట మండల వ్యవసాయ అధికారి యుగంధర్‌రెడ్డి, సూపరింటెండెంట్ రామకృష్ణ, ఏఎస్ఓ సుబ్రహ్మణ్యం, వీఆర్ఓ రాకేష్, గ్రామ వ్యవసాయ సహాయకుడు రామస్వామి పాల్గొన్నారు. మర్లపాడు గ్రామంలో తనిఖీలు... టంగుటూరు: మండలంలోని మర్లపాడు గ్రామంలో పంటల విస్తీర్ణంపై గురువారం కేంద్ర బృందం తనిఖీలు నిర్వహించింది. గ్రామంలోని రైతుల పొలాల్లో కేంద్ర, రాష్ట్ర గణాంకాల అధికారులు వ్యవసాయ, రెవెన్యూ సిబ్బందితో కలిసి వ్యవసాయ భూములు, భూ కమతాల వినియోగంపై ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బృంద అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మర్లపాడు గ్రామానికి సంబంధించిన వ్యవసాయ కమతాలలో ఏఏ పంటలను రైతులు పండించారు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా..లేదా..? ఈ క్రాప్‌లో నమోదు చేసిన పంటల వివరాలను సేకరించామని వివరించారు. వీఏఏలు ఈ క్రాప్‌లో నమోదు చేసిన పంటలకు, పంట పొలాల్లో ఉన్న పంటలకు మధ్య అంతరాన్ని నమోదు చేసి వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు సలహాలు, సూచనలు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాసరావు, సీనియర్ గణాంకాధికారి రామకృష్ణ, డిప్యూటీ ఎస్ఓ సీపీఓ ప్రసాద్‌రావు, ఏవో స్వర్ణలత, మండల సహాయ గణాంకాధికారి శ్రీవాణి, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు సౌమ్య పాల్గొన్నారు. -
దొంగ మస్టర్లతో నిధులు స్వాహా...
జిల్లాలో దొంగ మస్టర్ల వివాదం సంచలనం సృష్టిస్తోంది. ప్రతి మండలంలోనూ దొంగ మస్టర్ల దందా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్కన అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు దొంగ మస్టర్లకు తెరదీసినట్లు చెప్పుకుంటున్నారు. ఒక్కో మండలంలో 5 నుంచి 7 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు నమోదవుతోంది. వాస్తవానికి అందులో సగం మంది కూడా ఫీల్డ్‌లో కనిపించడం లేదు. ఇటీవల పుల్లలచెరువు మండలంలోని మర్రివేములలో రికార్డుల్లో చూపిన సంఖ్య కంటే ఫీల్డ్‌లో పనులు చేస్తున్న కూలీలు చాలా తక్కువగా కనిపించడంతో తనిఖీకి వెళ్లిన అధికారులు వామ్మో అంటూ నోరెళ్లబెట్టినట్లు తెలిసింది. ఉదయం 150 మంది మట్టి తవ్వకాలకు వచ్చినట్లు హాజరులో చూపించారు, తనిఖీ అధికారులకు 15 మందే కనిపించారు. దీనికితోడు ఒక్కో మస్టర్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలోని బేస్తవారిపేట, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, అర్ధవీడు, కొనకనమిట్ల మండలాల్లో దొంగ మస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
భక్తిశ్రద్ధలతో కంపకల్లి
ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతిహనుమంతునిపాడు: హరి నామ స్మరణతో హనుమంతునిపాడు మండలంలోని గొల్లపల్లి మారుమోగింది. ఇక్కడి నాగులేటి ఒడ్డున వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశ్వస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం కంపకల్లి ఉత్సవంతో ముగిశాయి. పాలెగాళ్లు తమ ఆచార సంప్రదాయల ప్రకారం పూజలు చేసి మేకపోతు గావు నిర్వహించారు. పోతురాజుల వీర కేకల నడుమ స్వామి వారి ఉత్సవమూర్తులతో కంపకల్లి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారు. వాలిచర్ల, పెద్దగొల్లపల్లికి చెందిన చెక్కా వంశస్తులు ముందుగా కంపకల్లిపై దొర్లగా అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించారు. కంపకల్లిపై దొర్లితే సంతాన ప్రాప్తి కలుగుతుందన్న విశ్వాసంతో దంపతులు, ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. కనిగిరి సీఐ ఖాజావలి, ఎస్సైలు మాధవరావు, కొండయ్య, శ్రీరామ్, పోలీసులు, అంగన్వాడీ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. -
రెవెన్యూ నకరాలు!
ఘనుల చెరలో వందల ఎకరాలుభూకబ్జాపై అధికారులు స్పందించడం లేదు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ పంచాయతీల పరిధిలో విలువైన గ్రానైట్ భూములను కొన్ని క్వారీల యజమానులు ఆక్రమించారు. వాటిని వెలుగులోకి తీయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా సర్వే చేశారు. వెలుగులోకి రావాల్సిన భూముల వివరాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అఽధికారులపై ఉంది. కానీ వారు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. – బంకా చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలుసాక్షి టాస్క్‌ఫోర్స్: పేదవాడు సాగు చేసుకుంటానంటే ఎకరం పొలం ఇవ్వరు. రోడ్డు పక్కన గుడిసె వేసుకుంటే తక్షణమే తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు పరుగులు పెడుతుంటారు. అలాంటిది గ్రానైట్ ఖనిజ నిక్షేపాలున్న వేల కోట్ల రూపాయల విలువ చేసే 1500 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే లేశమంతైనా చలించలేదు. ఈ అక్రమ భాగోతం వెనుక రెవెన్యూ, మైనింగ్ శాఖలకు చెందిన కొందరు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలుకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంకా చిరంజీవి చీమకుర్తి మండలంలోని రామతీర్థం పరిసరాల్లో విలువైన గ్రానైట్ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాల మేరకు చీమకుర్తి తహసీల్దార్ ఆర్.బ్రహ్మయ్య, డీటీ, సర్వేయర్, ఇతర సిబ్బందితో కలిసి ఇటీవల సర్వే నిర్వహించి గ్రానైట్ భూములు ఆక్రమణలకు గురైనట్లు ధ్రువీకరించారు. సర్వేలో తేలింది ఇవేనా? రెవెన్యూ అధికారులు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ పంచాయతీల పరిధిలో మొక్కుబడిగా నిర్వహించిన సర్వేలో ఆక్రమణలకు గురైన కొన్ని భూములను మాత్రమే గుర్తించారు. బూదవాడ పంచాయతీలో సర్వే నంబర్ 107లో 2.29 ఎకరాలు(వాగు), సర్వే నంబర్ 108లో 4.32 ఎకరాలు(వాగు), 109 సర్వే నంబర్లో 2.29 ఎకరాల(వాగు) భూములను హంస గ్రానైట్ సంస్థ ఆక్రమించినట్లు తేల్చారు. ● ఆర్ఎల్.పురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 65/1ఏ, 66/1లో కొంత భూమిని జయ మినరల్స్, 67/1ఏ, 67/2ఏ, 70/2, 70/3లో కొంత భూమిని హంస మినరల్స్ ఆక్రమించుకున్నట్లు సర్వేలో వెల్లడైంది. ● చీమకుర్తి రూరల్ పరిధిలో 580/1, 580/2, 584/1, 585లో మొత్తం 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కృష్ణసాయి గ్రానైట్స్ ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో నిర్ధారణ అయింది. సర్వే వివరాలు ఇటీవల బయటకు పొక్కడంతో పలుకుబడిగల నాయకులు, క్వారీల యజమానులు ఆక్రమించుకున్న భూముల వివరాలను పూర్తిగా వెల్లడించేందుకు రెవెన్యూ అధికారులు జంకుతున్నారు. ఆక్రమణల చెరలో 1500 ఎకరాలు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడ పంచాయతీల పరిధిలో విలువైన గ్రానైట్ భూములు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 22ఏలో అనెక్షర్–1, 2లో కలిపి మొత్తం 2,947 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో చీమకుర్తి రూరల్ పరిధిలో 1909.12 ఎకరాలు, బూదవాడ పంచాయతీ పరిధిలో 330.66 ఎకరాలు, ఆర్.ఎల్.పురం పంచాయతీలో 708.51 ఎకరాలు విస్తరించి ఉండగా గ్రానైట్ క్వారీల పరిసరాల్లో ఆక్రమణలకు గురైన భూమి 1500 ఎకరాలు ఉంటుందని ఫిర్యాదుదారుల అంచనా. లీజులు, ఎన్ఓసీల పేరుతో పేదలను బెదిరించి తమ దారికి తెచ్చుకుని ఆక్రమించుకున్న భూములు 1200 ఎకరాలకు పైగా ఉన్నాయని సమాచారం. మరో 300 ఎకరాలకు పైగా భూములు ఎలాంటి ఆధారాలు లేకుండానే బడా నేతలు, గ్రానైట్ యజమానులు, రాజకీయ పలుకుబడిగల నేతలు చెప్పుచేతల్లో ఉన్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చీమకుర్తిలో బలమైన సామాజికవర్గానికి చెందిన ఓ కుటుంబం చేతుల్లో దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అంచనా. డంపింగ్ పేరుతో ప్రభుత్వ భూముల్లో పాగా గ్రానైట్ వ్యాపారంలో ఆరితేరిన కొందరు వ్యక్తులు గతంలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన భూముల పట్టాలను బలవంతంగా రద్దు చేయించి పావలా బేడా చేతిలో పెట్టి లీజులు, ఎన్ఓసీలు పొందారు. ఇప్పటికే క్వారీల పక్కన భూములను తమ ఆధీనంలోకి తీసుకుని డంపింగ్, ఇతర అవసరాల పేరుతో పాగా వేశారు. ధన బలం పుష్కలంగా కలిగిన కొందరు వ్యాపారులు రెవెన్యూ, మైన్స్ అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టీపట్టనట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. భూకబ్జాపై ప్రజా సంఘాల నాయకులు స్పందించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలన్న ధ్యాస రెవెన్యూ అధికారుల్లో లేకపోవడం శోచనీయమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీమకుర్తి పోస్టింగ్ యమా కాస్ట్లీ! గ్రానైట్ భూముల కారణంగానే చీమకుర్తి మండలంలో తహసీల్దార్ పోస్టింగ్ వేయించుకోవడానికి రూ.లక్షలకు లక్షలు లంచాలు ఇచ్చి పోటీపడుతున్నారన్నది బహిరంగ రహస్యం. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్లలో కొందరు ఏడాదికి రూ.2 కోట్లకు పైగా సంపాదించుకుని వెళ్లారన్న విషయం చీమకుర్తిలోనే కాదు రెవెన్యూ శాఖలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఆక్రమణదారులు రాజకీయ ప్రాబల్యం కలిగిన బడాబాబులు కావడం వల్లే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల వివరాలు బయటకు తీయడానికి వెనుకంజ వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడలో 22ఏ జాబితాలో 2,947 ఎకరాల ప్రభుత్వ భూములు క్వారీల యజమానుల చేతిలో 1500 ఎకరాలకు పైగా భూములు లీజులు, ఎన్ఓసీల పేరుతో అధికారికంగా 1200 ఎకరాల్లో పాగా అనధికారికంగా మరో 300 ఎకరాలు అక్రమార్కుల చెప్పుచేతల్లో.. గ్రీవెన్స్‌లో ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారుల సర్వే అక్రమార్కుల భూకబ్జా భాగోతం బట్టబయలు చీమకుర్తిలో ఒకే కుటుంబం ఆధీనంలో 150 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి విలువైన భూములు అన్యాక్రాంతం వెనుక రెవెన్యూ, మైన్స్ అధికారుల హస్తంగత 30 ఏళ్ల నుంచి పర్మిషన్ ఇస్తున్నారు గ్రానైట్ క్వారీలకు గత 30 ఏళ్ల నుంచి పర్మిషన్లు ఇస్తున్నారు. ఇప్పుడు నేను కొత్తగా ఇచ్చేదేముండదు. ఒక వేళ ఎన్ఓసీ ఇచ్చినా కాంపిటెంట్ అథారిటీస్ ఇస్తుంది. మా ఆఫీస్ తరఫున ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మాత్రమే చేస్తాం. ఇదంతా ఏంటనేది నాకు తెలియదు. – ఆర్.బ్రహ్మయ్య, తహసీల్దార్, చీమకుర్తి -
ఉర్దూ విద్యకు ఉరి..?
మార్కాపురం: కూటమి ప్రభుత్వం నిర్ణయం ముస్లిం విద్యార్థులను ఉర్దూ విద్యకు దూరం చేస్తోంది. పాఠశాల పునర్నిర్మాణ ప్రక్రియ పేరుతో ముస్లిం విద్యార్థులకు ప్రభుత్వం ఉర్దూ విద్యను దూరం చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల పునప్రారంభం నాటికి జిల్లాలో ఉర్దూ టీచర్లు పలు చోట్ల కనుమరుగు కానున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఓ నంబర్ 117ను రద్దుచేసి దాని స్థానంలో ఉన్నతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెబుతున్న కూటమి నాయకులు ఉర్దూను దూరం పెట్టడంపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మార్చి నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పాఠశాలలకు పోస్టులను మంజూరు చేస్తోంది. దీనితో ఉర్దూ యూపీ పాఠశాలల సెక్షన్ స్కూళ్లకు అన్యాయం జరుగుతోంది. జిల్లాలో 49 ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్స్, 16 అప్పర్ ప్రైమరీ ఉర్దూ మీడియం స్కూల్స్, 2 ఉన్నత స్థాయి ఉర్దూ మీడియం హైస్కూల్స్ ఉన్నాయి. వీటిలో 57 ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ సెక్షన్లు, 28 హైస్కూల్స్‌లో ఉర్దూ సెక్షన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 211 మంది ఉర్దూ టీచర్లు ఉన్నారు. ఉర్దూ విద్య దూరం చేసేందుకే.. పాఠశాల వ్యవస్థ పునర్నిర్మాణంలో భాగంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, ముస్లిం విద్యార్థులకు ఉర్దూ విద్యను దూరం చేస్తున్నాయి. యూపీ పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 30కి పైగా విద్యార్థులు ఉండాలి. ఏ పాఠశాలల్లో నైనా ఇంతకంటే తక్కువ ఉంటే డి గ్రేడ్ చేస్తారు. దీంతో అనేక ఉర్దూ యూపీ పాఠశాలల్లో చదివే మైనార్టీ విద్యార్థులు ఉర్దూ చదువుకు దూరమవుతున్నారు. మార్కాపురం మండలంలో మార్కాపురం టౌన్, రాయవరం, బొడిచర్ల, తర్లుపాడు, తుమ్మలచెరువు, దేవరాజుగట్టు తదితర పాఠశాలల్లో ఉర్దూ చదివే విద్యార్థులు ఉన్నారు. వీరంతా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉర్దూ చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. జిల్లాలో మొత్తం 42 ఉర్దూ పోస్టులను సర్‌ప్లస్‌గా చూపారు. వీటి స్థానాల్లో వేరే టీచర్లను నియమించనున్నారు. దీంతో పలు స్కూళ్లలో ఉర్దూ పోస్టులు మాయమైపోతున్నాయి. గతంలో ఒక పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉంటే అందులో 15 మంది తెలుగు, 15 మంది ఉర్దూ చదివే విద్యార్థులు ఉంటే ఆయా సబ్జెక్టు టీచర్లను నియమించేవారు. నూతన నిబంధనల ప్రకారం ఉర్దూ టీచరు పోస్టును తొలగించనున్నారు. తర్లుపాడు మండలంలోని ఉర్దూ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను తొలగించి తెలుగు ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. రాష్ట్రంలో ఉర్దూ రెండవ అఽధికార భాషగా ఉన్నా ప్రభుత్వ నిర్ణయంతో ఉర్దూకు దూరమవుతున్నారు. సర్ప్లస్ పేరుతో పోస్టుల తొలగింపు జిల్లాలో 42 ఉర్దూ టీచర్ పోస్టులకు మంగళం ఆందోళనలో ఉర్దూ విద్యార్థులు -
తాత గొంతు కోసిన మనవడు
● రూ.500 కోసం ఘాతుకం ● వృద్ధుడి పరిస్థితి విషమం ఒంగోలు టౌన్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఒక యువకుడు నిరూపించాడు! ఒంగోలు నగరానికి చెందిన షేక్ షబ్బీర్(56) ట్రంకు రోడ్డులోని పూలకొట్ల బజారులో జామియా మసీదు వద్ద టైలరింగ్ షాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మనవడి వరసయ్యే షేక్ ఇద్రిస్ టైలరింగ్ షాపు వద్దకు వచ్చి 500 రుపాయలు కావాలని కోరగా ఇచ్చారు. అంతలోనే మరో రూ.500 కావాలని ఒత్తిడి చేయగా షబ్బీర్ తన వద్ద అంత డబ్బు లేదని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఇద్రిస్ పక్కనే ఉన్న చిన్నపాటి కత్తి తీసుకుని షబ్బీర్ గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమవుతున్న షబ్బీర్‌ను స్థానికులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉదయ్‌కృష్ణారెడ్డి నేటి యువతకు స్ఫూర్తి
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ: నేటి యువతకు ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తి అని, కష్టపడితే లక్ష్యాన్ని ఏ విధంగా సులువుగా సాధించవచ్చో సివిల్స్‌లో 350వ ర్యాంకు సాధించి నిరూపించారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ కొనియాడారు. మండలంలో ఊళ్లపాలెం గ్రామానికి చెందిన సివిల్ ర్యాంకర్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం స్వయంగా కలుసుకున్నారు. సివిల్స్ సాధనలో ఉదయ్ కృష్ణారెడ్డి కృషిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ చిన్నతనంలో తల్లిని, యుక్తవయస్సులో తండ్రిని కోల్పోయినా నాయనమ్మ సంరక్షణలో ఈ ఘనత సాధించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక మెమెంటో అందజేశారు. కృష్ణారెడ్డి నాయనమ్మ రమణమ్మకు ధన్యవాదములు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, కొండపి మండల అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఢాకా పిచ్చిరెడ్డి, పాకనాటి సుబ్బారెడ్డి, ఉప సర్పంచ్ కాళహస్తి వెంకారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా కిరణ్‌కుమార్, సర్పంచ్ భువనగిరి సత్యన్నారాయణ, షేక్ కరీం, పెరికాల సునీల్, పాలూరి శ్రీనివాసులరెడ్డి, చొప్పర శివ, సోమిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అదే బరితెగింపు..
వైఎస్సార్ సీపీ జెండా తొలగింపు.. కొనకనమిట్ల: కూటమి నేతలు మళ్లీ బరితెగించారు. వైఎస్సార్ సీపీ జెండా తమ ముందు రెపరెపలాడటాన్ని జీర్ణించుకోలేక అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టి కళ్ల మంట తీర్చుకున్నారు. కొనకనమిట్ల మండలం వెలిగండ్ల గ్రామంలో వరుస ఘటనలు అధికారుల తీరును ఛీకొట్టేలా చేశాయి. వివరాల్లోకి వెళ్లే.. వెలిగండ్ల గ్రామంలో రెండేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ జెండా ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డిపై ఆధిపత్యం ప్రదర్శించే ధోరణితో ఉన్న టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుట్రలకు తెరలేపారు. ఈ నెల 7వ తేదీన సర్పంచ్ వెంకటరెడ్డిని స్టేషన్‌కు రప్పించి.. గ్రామానికి వెళ్లిన పోలీసులు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు వైఎస్సార్ సీపీ జెండా తొలగించారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏమాత్రం సంయమనం కోల్పోలేదు. జెండా తొలగింపు విషయాన్ని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 12వ తేదీన వెలిగండ్ల గ్రామంలో రెండు చోట్ల వైఎస్సార్ సీపీ జెండాలు ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యేలు అన్నా, ఉడుముల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఎస్సీ కాలనీ వాసులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనడం టీడీపీ నాయకులకు కంటగింపుగా మారింది. కూటమి పాలనలో అధికార దుర్వినియోగాన్ని, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అరాచకాలకు పాల్పడుతున్న తీరును వైఎస్సార్ సీపీ నేతలు ఎండగట్టడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత సహకారంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి బుధవారం సాయంత్రం మరోమారు దురాగతానికి ఒడిగట్టారు. పోలీసుల పహరా నడుమ తహసీల్దార్, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఆర్ఐ, గ్రామ సచివాలయ ఉద్యోగులు దగ్గరుండి మరీ జేసీబీతో వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను పెకిలించారు. అధికారమా.. అహంకారమా? సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి తమ స్థలంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెను పెకలించేందుకు అధికారులు, పోలీసులు అత్యుత్సాహం చూపడంపై స్థానిక మహిళలు దుమ్మెత్తిపోశారు. టీడీపీ నాయకులు ఆదేశించగానే విచక్షణ మరిచి అధికారులు ప్రవర్తించిన తీరుపై నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారుల తీరును పార్టీ జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. సర్పంచ్ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సిన పంచాయతీ కార్యదర్శి.. జెండా తొలగించాలంటూ సర్పంచ్‌కే నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కొనకనమిట్ల మండలం వెలిగండ్లలో వైఎస్సార్ సీపీ జెండా తొలగింపు టీడీపీ నాయకులతో చేతులు కలిపిన అధికార యంత్రాంగం ప్రైవేట్ స్థలంలో జెండాను జేసీబీతో పెకలించడంపై పార్టీ శ్రేణుల ఆగ్రహం -
పాలీసెట్‌లో జిల్లా విద్యార్థుల సత్తా
ఒంగోలు సిటీ/ చీమకుర్తి : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 30న నిర్వహించిన పాలీసెట్‌లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పరీక్షకు మొత్తం 3,950 మంది విద్యార్థులు హాజరు కాగా 3804 మంది అర్హత సాధించారు. చీమకుర్తికి చెందిన ఖదిరీష్ 120/120 మార్కులు సాధించి జిల్లా ప్రథమస్థానం, రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంక్ సాధించినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 120/120 మార్కులను పలువురు సాధించడంతో రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంక్ సాధించాడు. ఖదిరీష్ను శ్రీసూర్య పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రుషి, తల్లిదండ్రులు, బంధువులు, కాలేజీ అధ్యాపకులు అభినందించారు. అలాగే బెల్లంకొండ వెంకట్ జిల్లాస్థాయిలో రెండోర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించాడు. పి.లారారోజ్ జిల్లాస్థాయి మూడవ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 196వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 11 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఒంగోలులో ఏడు, మార్కాపురంలో నాలుగు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.జాతీయస్థాయి ఉషూ పోటీలకు ఎంపికమార్కాపురం: కర్నూల్లో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన జాతీయస్థాయి ఉషూ పోటీల్లో మార్కాపురం పట్టణానికి చెందిన పొట్టేళ్ల బసవేశ్వరరావు గోల్డ్ మెడల్ సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా బసవేశ్వరరావు మాట్లాడుతూ జూన్‌లో భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు. బసవేశ్వరరావును పలువురు అభినందించారు. రాష్ట్ర వుష్ అసోసియేషన్ కార్యదర్శి నరసింహారావు, జిల్లా సెక్రటరీ నేషనల్ కోచ్ చంద్రశేఖర్ అభినందించారు.‘మీకు ఇష్టమొచ్చినట్లు చేయలేను’కొత్తపట్నం: ‘మీకు ఇష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు. రికార్డులన్నీ సక్రమంగా ఉంటేనే చేస్తామ’ని కొత్తపట్నం తహసీల్దార్ పి.మధుసూదన్‌రావు స్పష్టం చేశారు. స్థానిక నల్లూరి గార్డెన్స్‌లో బుధవారం అధికారులతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీడీపీ నాయకుడు చంపాని రామచంద్రయ్య తహసీల్దార్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉండాలని, మీకు ఇష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదని చెప్పారు. అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ చేయాల్సిన మాపై ఉందని సమాధానం ఇచ్చారు.నేడు ఆర్మీ జవాన్ అంత్యక్రియలు రాచర్ల: రాచర్లకు చెందిన ఆర్మీ జవాన్ గంజికుంట్ల మౌళిమనోహర్ (40) ముంబయిలోని ఏఎంసీ సెంటర్లో వీధులు నిర్వహిస్తూ మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. మౌళిమనోహర్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులైన సుబేదార్ బీన్బీ, హవల్దారులు రాధాకృష్ణనాయర్, నాగసాయిబాబు బుధవారం రాత్రి 7:30 గంటలకు రాచర్లలోని నివాసానికి తీసుకువచ్చారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
మార్కాపురం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని డిపో మేనేజర్ ఏఎస్ నరసింహులు తెలిపారు. గత నెల 27న సాక్షిలో ‘ప్రయాణం.. చక్రబంధం’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని, శ్లాబ్ పెచ్చులూడి పోయి ప్రమాదకరంగా మారిన విషయాన్ని కథనంలో వివరించారు. దీనికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం ఆర్ఓ నీటి సౌకర్యం ఏర్పాటు చేశామని, పెచ్చులూడిన శ్లాబ్‌కు మరమ్మతులు చేయించామని, ప్రయాణికులు కూర్చునేందుకు బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని డీఎం తెలిపారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఆరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని డీఎం కోరారు. ప్రతి పౌర్ణమి ముందురోజు బస్సు బయలుదేరుతుందని, రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో టిక్కెట్ రూ.2,500 ధరగా నిర్ణయించామన్నారు. బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం, శ్లాబుకు మరమ్మతులు ఆర్టీసీ డీఎం నరసింహులు -
కడతేర్చింది..!
ఆధిపత్య పోరే నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన పాత్రధారు లందరూ తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులే అని మొదట్నుంచి సాక్షి చెప్పింది. అదే నేడు వాస్తవమైంది. వీరయ్య చౌదరి హత్యకు పథక రచన చేసిన ప్రధాన సూత్రధారులందరూ అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులేనని తేలడంతో అధికార పార్టీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. గ్రామంలో జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగిందని ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రకటించడంతో 23 రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమని తేలింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత నెల 22వ తేదీ రాత్రి 7.30 నిమిషాలకు హత్య జరింగింది. అదే రోజు రాత్రి హోం మంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన ఒంగోలుకు చేరుకున్నారు. మరుసటి రోజు జరిగిన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. దీంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుందో అందరికీ అర్థమైపోయింది. హత్యకు గురైన వీరయ్య చౌదరి, హత్యకు పథక రచన చేసిన ప్రధాన సూత్రధారులంతా తెలుగుదేశం పార్టీ నాయకులే కావడంతో కేసులో మొదట కనిపించిన సీరియస్ తరువాత కనిపించలేదని, అందుకే కేసు విచారణ ఆలస్యమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు హత్యను ఎక్కడ నీరుగారుస్తారోనన్న సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. వీరయ్యకు పదవి వస్తుందన్న సమాచారంతో.. వీరయ్య చౌదరి గతంలో నాగులుప్పలపాడు ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం మద్యం వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అదే సమయంలో స్వగ్రామమైన అమ్మనబ్రోలు టీడీపీలో నాయకుడిగా గ్రామ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు సన్నిహితులైన ముప్పా సురేష్, అతడి మామ, సిద్దాంతి ఆళ్ల సాంబయ్య, వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి తదితరులతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో వీరయ్య చౌదరి మద్దతు ఇచ్చిన అభ్యర్థికి పోటీగా ముప్పా వర్గం మరో అభ్యర్థిని పోటీకి దింపి విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పోరు తీవ్రమైంది. ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో వీరయ్య చౌదరి ఆధిపత్యం పెరిగింది. యువగళంలో నారాలోకేష్‌తో తిరిగిన సాన్నిహిత్యంతో పార్టీలో పట్టుసాధించాడు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా వీరయ్య చౌదరి పేరును లోకేష్ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. దాంతో ప్రత్యర్థి వర్గం అప్రమత్తమైంది. వీరయ్యకు కనుక పీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి దక్కితే అతడిని ఎదుర్కోవడం కష్టమైపోతుందని భావించింది. అప్పటికే అతని కారణంగా వారు చాలా ఇబ్బందులు పడ్డారు. వీరయ్య బలపడితే తన మేనల్లుడు ముప్పా సురేష్‌కు రాజకీయ భవిష్యత్ ఉండదని ఆళ్ల సాంబయ్య భయపడ్డాడు. ఒంగోలు సమీపంలోని కొప్పోలుకు చెందిన వినోద్‌కు వీరయ్య చౌదరి అనుచరులకు మధ్య వివాదం ఉంది. ఇసుక వ్యాపారానికి సంబంధించి లారీని వారు పోలీసులకు పట్టించారు. దీనిని ఆసరాగా తీకుసుని వినోద్‌ను సంప్రదించాడు సాంబయ్య. నెల్లూరుకు చెందిన కిరాయి హంతకుల చేత వీరయ్యచౌదరిని అత్యంత క్రూరంగా హత్య చేయించాడు. కేసుల్లేకుండా చేస్తామని నమ్మబలికి... వీరయ్య చౌదరి హత్యలో ప్రధాన పాత్ర పోషించిన వినోద్‌కు ఎలాంటి కేసులు లేకుండా చేస్తానని, పోలీసులకు లొంగిపోయిన రెండో రోజే బయటకు తీసుకొస్తానని చెప్పి ఒప్పించినట్లు ఎస్పీ దామోదర్ విలేకరుల సమావేశంలో వెల్లడించడం గమనార్హం. అంతేకాకుండా నిందితులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని, జీవితంలో స్థిరపడవచ్చని నమ్మబలికినట్లు తెలిపారు. ప్రధాన పాత్రధారుడు ఆళ్ల సాంబయ్య, మరో నిందితుడైన అతడి మేనల్లుడు ముప్పా సురేష్‌లకు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ అధిష్టానంతో సన్నిహిత పరిచయాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం మనది కనుక ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాతోనే నిందితులకు అభయహస్తం ఇచ్చినట్లు భావిస్తున్నారు. సాంబయ్య ఇచ్చిన హామీతో వినోద్ నెల్లూరుకు చెందిన నిందితులకు చెప్పాడు. ఈ ఒక్క హత్యతో తమ కష్టాలు గట్టెక్కుతాయని నమ్మబలికాడు. దాంతో నిందితులు ఈ హత్యకు అంగీకరించారు. చివరికి నేరం చేసి జైలు పాలయ్యారు. మూడు నెలల ముందు నుంచే .. వీరయ్య చౌదరిని అంతమొందించేందుకు నిందితులు మూడు నెలల ముందునుంచే పలు మార్లు ప్రయత్నించారు. జనవరిలోనే వారు ఒంగోలుకు వచ్చారు. స్థానికంగా ఉంటూ హోటళ్లలో బసచేసి వీరయ్య కదలికలను తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకుని హత్యకు పథక రచన చేశారు. గత నెల 22వ తేదీ పక్కా స్కెచ్ వేశారు. ఎలాగైనా ఆరోజు అతనిని హత్య చేయాలని నిర్ణయానికి వచ్చారు. వీరయ్య చౌదరి తన కార్యాలయానికి చేరుకోగానే వారు కొద్ది సేపటికి రెండు వాహనాల్లో వచ్చారు. రెండో అంతస్తులో ఉన్న అతనిపై విచక్షణారహితంగా కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. కేసును మలుపు తిప్పిన స్కూటీ... చీమకుర్తి సమీపంలో జాతీయ రహదారికి పక్కన ఉన్న ఒక డాబా వద్ద హంతకులు వినియోగించినట్లు చెబుతున్న స్కూటీని గత నెల 25వ తేదీన పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. దానిపై రక్తపు మరకలు ఉండంతో పక్కనే ఉన్న వారిని విచారించారు. అప్పటికే మూడు రోజులుగా ఆ స్కూటీ ఇక్కడ ఉన్నట్లు స్థానికులు చెప్పడంతో వెంటనే చీమకుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే రంగంలోకి దిగిన చీమకుర్తి పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్కూటీ మీద ఉన్న రక్తం మరకలను వైద్య పరీక్షలు చేయించగా వీరయ్య చౌదరి రక్తంతో సరిపోయాయి. దీంతో కేసు విచారణ వేగం అందుకుంది. మరో రోజు వ్యవధిలో మరో వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో కేసులో కీలక పురోగతి సాధించింది. ఎల్లో మీడియా గొంతులో పచ్చివెలక్కాయ... వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా దేవేంద్ర చౌదరి పేరును ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఆ తరువాత కేసు విచారణ జరుగుతున్న క్రమంలో అంతా తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లే బయటకు రావడంతో ఆత్మరక్షణలో పడింది. ఎలాగైనా సరే కేసుకు రాజకీయ రంగు పులిమి ప్రత్యర్థి పార్టీలకు బురద పూయాలని చేయని ప్రయత్నం లేదు. దీనికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. చివరి ప్రయత్నంగా ఎస్పీ ప్రెస్ మీట్లో సైతం వీరయ్య హత్య కేసులో రాజకీయాలను లాగేందుకు ఒక రాయి వేశారు. ఈ హత్యకు రాజకీయాలతో ఎలాంటి ప్రమేయం లేదని, కేవలం గ్రామ స్థాయిలో జరిగిన ఆధిపత్య పోరు వల్లే వీరయ్య హత్య జరిగిందని ఎస్పీ తేల్చి చెప్పడంతో వారి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లుయింది. టీడీపీ చుట్టే వీరయ్య చౌదరి హత్యకేసు నిందితులంతా అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకులే పాత్రధారులంతా నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులు పరారీలో టీడీపీ నాయకుడు ముప్పా సురేష్ కేసులు లేకుండా చేస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పాత్రధారులకు హామీ ఇచ్చిన సూత్రధారులు మంత్రి లోకేష్ పర్యటనకు ముందు హడావుడిగా ప్రకటన టీడీపీ నాయకులు కావడంతోనే విచారణ ఆలస్యమైందన్న ప్రచారం లోకేష్ పర్యటన నేపథ్యంలోనే హడావుడిగా.. వీరయ్య చౌదరి హత్య జరిగిన మరుసటి రోజు జరిగిన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మనబ్రోలుకు వచ్చారు. వీరయ్యను హత్య చేసిన హంతకులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారు ఈ నేల మీద ఉండేందుకు అర్హులు కాదని ప్రకటించారు. దీంతో నిందితులకు కఠిన శిక్షలు పడతాయని అంతా భావించారు. కానీ అంతా టీడీపీ వాళ్లే కావడంతో కేసు నత్తనడక నడిచిందన్న విమర్శలున్నాయి. వీరయ్య హత్య జరిగిన 24 రోజులకు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించడానికి గురువారం మంత్రి నారా లోకేష్ అమ్మనబ్రోలుకు వస్తున్నారు. ఈ లోగా పోలీసులు హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి నిందితుల వివరాలను ప్రకటించారు. వీరయ్య చౌదరి హత్యకు పథక రచన చేసిన నిందితులంతా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే కావడంతో ఇప్పుడు లోకేష్ ఏం చెప్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరారీలోనే ముప్పా సురేష్... వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుడిగా చెబుతున్న అమ్మనబ్రోలుకు చెందిన ముప్పా సురేష్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ ప్రకటించారు. అయితే వీరయ్య హత్య జరిగిన తరువాత సురేష్ ఒక టీవీ చానెల్‌కు ఆడియో పంపించాడు. మరుసటి రోజు ఆయన సతీమణిని కూడా అదే చానెల్ ఇంటర్వ్యూ చేసింది. పోలీసులు మాత్రం సురేష్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒక టీవీ చానెల్ నిర్వాహకులకు అందుబాటులో వచ్చిన సురేష్ పోలీసులకు మాత్రం చిక్కకపోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముప్పా సురేష్‌కు టీడీపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు వున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా గత టీడీపీ హయాంలో రాష్ట్రంలో కీలకమైన పదవిలో పనిచేసిన ఒక మాజీ ఐఏఎస్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న సదరు ఐఏఎస్ ఈ కేసులో చక్రం తిప్పినట్లు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ సహకారంతోనే ముప్పా సురేష్ దేశ సరిహద్దులు దాటినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. -
ముగిసిన ప్రయాణం
కలిసి ఏడడుగులు నడిచారు. ధర్మేచ ఆర్థేచ కామేచ అంటూ పెళ్లి నాటి ప్రమాణాలను పాటించారు. కష్ట సుఖాలలో తోడు నీడగా మెలిగారు. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కన్నారు. అందుకోసం చేయి చేయి కలిపి ముందుకు కదిలారు. ఈ అన్యోన్య దంపతులను చూసి విధికి కన్నుకుట్టినట్టుంది. కడదాకా నడవక ముందే కర్కషంగా కాటేసింది. కడుపు చేతపట్టుకొని కూలి పనుల కోసం సుదూర ప్రాంతాలకు బయలు దేరిన వారిని మృత్యువు వెంటాడింది. కన్న బిడ్డలకు అమ్మా నాన్నలను లేకుండా చేసింది. ఇప్పుడు గడ్డమీదపల్లి గుండె పగిలింది. ఊరు వాడా ఏకమై గుక్కపట్టి రోదిస్తోంది. ఏ వీధి చూసినా అంతులేని విషాదంతో కన్నీరు పెడుతోంది. మృత్యు దారిలో..పాపం పసివాళ్లు రామాంజి పల్నాడు జిల్లా వెల్దూర్తి మండలంలోని దావుపల్లి గ్రామానికి చెందిన వాడు. దాదాపు 11 ఏళ్ల క్రితం గడ్డమీదిపల్లెకు చెందిన అంకమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి యూకేజీ చదువుతున్న పవన్‌కుమార్, ఈ విద్యా సంవత్సరంలో ఎల్కేజీలో చేరేందుకు సిద్ధమవుతున్న నాగచైతన్య సంతానం. దాచేపల్లిలో చేసుకోవడానికి పనులు లేకపోవడంతో పాటు బొప్పాయి కోతలకు వెళ్తే కూలి ఎక్కువగా వస్తాయన్న ఆశతో ఆ కుటుంబం నెల రోజుల క్రితం గడ్డమీదిపల్లెకు చేరింది. అత్తవారింట్లో ఉంటూ రామాంజి తన భార్యతో కలిసి పనులకు వెళ్లేవాడు. పనికి వెళ్లిన తల్లిదండ్రుల కోసం ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రోడ్డు ప్రమాదం వారిని కబళించిందని, వారు ఇక రారు..ఇక వారి ఆలనా పాలనా ఉండదు అన్న విషయాన్ని ఆ చిన్నారులకు ఎలా చెప్పాలో తెలియక బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంకా ఊహ కూడా రాకముందే పిల్లలు అనాథలుగా మారారని, ఇక వారికి దిక్కెవరంటూ బంధువులు పెద్ద పెట్టున రోదించారు. వీరికి ఎవ్వరూ బంధువులు లేకపోవడంతో తాతయ్య వృద్ధుడు కావటంతో వీరి భవిష్యత్ ఏమవుతుందోనని తండావాసులు చర్చించుకుంటున్నారు. సంఘటన స్థలంలో నుజ్జునుజ్జయిన వాహనాలుయర్రగొండపాలెం: పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఈపూరు గ్రామంలో బొప్పాయి కాయలు కోసేందుకు మంగళవారం ఉదయం యర్రగొండపాలెం మండలంలోని గడ్డమీదిపల్లెకు చెందిన పగడాల రమణారెడ్డి దంపతులు, జొన్నగిరి రామాంజీ దంపతులు, మరికొందరు బొలేరో వాహనంలో బయలుదేరారు. గడ్డమీదిపల్లె గ్రామం నుంచి బయలుదేరిన గంటలోపే వినుకొండ మండలం శివాపురం సమీపంలోని జాతీయ రహదారిపై వీరు వెళుతున్న వాహనాన్ని ఎదురుగా కొబ్బరి బోండాలతో వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పగడాల రమణారెడ్డి(45), ఆయన భార్య సుబ్బమ్మ(40), జొన్నగిరి రామాంజీ (35), ఆయన భార్య అంకమ్మ(28) అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో వాహనం డ్రైవర్ కదిరి నాగేశ్వరరావు, కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాద విషయం తెలియగానే రెండు కుటుంబాలతో పాటు ఆ గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడే అందరినీ పలకరించి వెళ్లిన వారు తిరిగి తమ గ్రామంలోకి రారన్న చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఘటనా ప్రాంతానికి గ్రామం మొత్తం కదలి వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డవారు, క్షతగ్రాతులది ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ.. భవిష్యత్ ఎలా.. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బొలెరో డ్రైవర్ కదిరి నాగేశ్వరరావు కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. తనకు తెలిసిన పని మోటార్ ఫీల్డ్ కావడంతో ఆయన బొలెరోను కొనుగోలు చేసుకొని జీవిస్తున్నాడు. తల్లికి కళ్లు కనపడవు, ఇద్దరు అక్కలు మూగవారు. వారి ఆలనాపాలన అంతా నాగేశ్వరరావు చూసుకునేవాడని, ప్రమాదంలో రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయని, ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో బాధితురాలు నాగమణిది మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామం. కొన్ని కారణాలతో ఇటీవల కాలంలో ఆమె గడ్డమీదిపల్లెకు చేరింది. అక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆ గ్రామానికి చెందిన మరో బాధితురాలు పగడాల శివమ్మ కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుందని ఆ గ్రామస్తులు తెలిపారు. దావుపల్లి తండాలో విషాదఛాయలు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లితండాకు చెందిన జొన్నగిరి రామాంజీ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారన్న విషయం తెలుసుకున్న తండావాసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వీరి మృతదేహాలను దావుపల్లితండాకు తీసుకొచ్చారు. మృతదేహాలు తండాలోకి రాగానే ఒక్కసారిగా రోదనలతో దద్దరిల్లింది. తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలియగానే పవన్‌కుమార్ రోదిస్తుండగా.. చైతన్య దిక్కులు చూస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలోనూ వీడని దాంపత్య బంధాలు బొలెరో వాహన్ని కొబ్బరి బొండాల లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం మరో ముగ్గురికి తీవ్రగాయాలు ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ.. తల్లిదండ్రుల కోసం చిన్నారుల ఎదురుచూపులు రోదిస్తున్న గడ్డమీదిపల్లె...మిన్నంటిన విషాదంపిల్లల భవిష్యత్ కోసమని.. గడ్డమీదిపల్లెకు చెందిన పగడాల రమణారెడ్డి, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్దకుమార్తెకు వివాహం చేశారు. మిగిలిన ఇద్దరిలో కుమారుడు వెంకటరెడ్డి మార్కాపురంలోని ఒక కళాశాలలో బీఫాం చదువుతున్నాడు. కుమార్తె నవిత ఇంటర్ పూర్తిచేసుకొని ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతోంది. తాము కూలీ పనులు చేసుకుంటున్నా తమ పిల్లలు మంచి చదువులు చదవాలన్న ఉద్దేశంతో వారిని పనులకు దూరంగా ఉంచి వారు కాయకష్టం చేసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆసుపత్రి వద్దకు చేరుకున్న కుమార్తెలు, కుమారుడు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ, కష్టపడుతూ తమకు కష్టం తెలియకుండా చూసుకునే తమ తల్లిదండ్రులు ఇలా విగతజీవులుగా మారతారని తాము కలలో సైతం ఊహించలేదంటూ వారు పెట్టే రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. మరణంలోనూ వీడని తోడు.. దాంపత్య బంధాలు జీవిత కాలం ఉంటాయనడానికి గడ్డమీదిపల్లె వాసులు నిరూపించారు. కలిసి జీవించడం, కలిసి మరణించడంలో కూడా వారు ముందున్నారు. రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారారు పగడాల రమణారెడ్డి, సుబ్బమ్మ, జొన్నగిరి రామాంజి, అంకమ్మ దంపతులు. పనికి పోయి వస్తామంటూ కన్నబిడ్డలకు, కుటుంబ సభ్యులకు, ఇంటి పక్కన వాళ్లకు చెప్పి బయలుదేరిన గంట వ్యవధిలో మృత్యువాత పడటం ఆ ఊరిని కుదిపేసింది. -
కూలీల వలసలు నివారించాలి
● వినుకొండ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంత ప్రజలు కూలి పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఈ ప్రయాణంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు వదలుతున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని గడ్డమీదిపల్లె గ్రామానికి చెందిన కూలీలు బొప్పాయి కోతల కోసం వెళ్తు పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామానికి సమీపంలోని హైవే రోడ్డుపై జరిగిన ప్రమాదంలో నలుగురు కూలీలు మరణించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే మంగళవారం ఆయన గడ్డమీదిపల్లెకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతులకు పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని, ఈ కారణాలతో వందల ఎకరాలు ఉన్న రైతులు సైతం కూలి పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులు కూడా సక్రమంగా జరగడం లేదని, ఆ నిధులను కూడా కూటమి నాయకులు మెక్కేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పనులు కల్పించకపోవడంతోనే గడ్డమీదిపల్లెకు చెందిన 300 కుటుంబాలు వలసలు వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థవుతుందన్నారు. మృతుల కుటుంబాలను పరిశీలిస్తే కూలీ పనుల కోసం దూర ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారనే విషయం అర్థం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం యర్రగొండపాలెం మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే వలసలు వెళ్లక తప్పడం లేదన్నారు. వలసలు నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ప్రాజెక్ట్‌కు నీళ్లు వదలడమే సరైన మార్గమన్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు భారీ ఎత్తున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. బదిలీల నోటిఫికేషన్ బుధవారం వెలువడనున్నట్లు సమాచారం. అయితే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీఓ 117 రద్దు మార్గదర్శకాల విడుదలకు సంబంధించి తాము ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం, విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అంతా ఆన్లైన్లోనే.. బదిలీలను ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాతిపదికన నిర్వహించనున్నారు. బదిలీల దరఖాస్తు విధానం, స్థానాల ఎంపిక, కేటాయింపు ప్రక్రియ మొత్తం కూడా ఆన్లైన్లో జరగనుంది. గత ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మే 31వ తేదీ వరకు విద్యాసంవత్సరాన్ని ప్రాతిపదికన తీసుకోనున్నారు. వీటికి సంబంధించి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు కనీస సర్వీసు రెండేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వరకు తీసుకోనున్నారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లుగా నిర్ణయించారు. ఖాళీ వివరాలన్నీ డిస్ప్లేలో.. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి బదిలీ కోరుకునే ఉపాధ్యాయులకు డిస్ప్లే చేస్తారు. 2025 మే నెలాఖరు వరకు ఉన్న ఖాళీలన్నీంటినీ బదిలీల్లో చూపుతారు. 2020 మే 31కు ముందు పాఠశాలల్లో చేరిన ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లు, అదే పాఠశాలల్లో విద్యా సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. 2017 మే 31కి ముందు పాఠశాలల్లో చేరిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. 2027 మే నెలాఖరు లోగా ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లు పూర్తయితే బదిలీ ఉంటుంది. ఎనిమిదేళ్లు పూర్తికాకపోతే బదిలీల నుంచి మినహాయింపు అవకాశం ఉంది. జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో 11,200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో తప్పనిసరి బదిలీలకు సంబంధించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినవారు, మిగులు ఉపాధ్యాయులు 5,255 మంది దాకా ఉండవచ్చని సమాచారం. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలు ● బదిలీల జీఓ తక్షణమే విడుదల చేసి వేసవి సెలవుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలి ● బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్ టూ హైస్కూల్స్‌లో ఇంటర్మీడియెట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి ● ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపట్టాలి ● స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టులు ఖాళీలుగా చూపాలి ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలు.. ● జిల్లాలో ప్రమోషన్ సీనియారిటీ సమస్యలు పరిష్కరించిన తర్వాతే ప్రమోషన్స్ ప్రక్రియ చేపట్టాలి. ● మున్సిపల్ పాఠశాలల్లో అప్‌గ్రేడేషన్ ప్రక్రియ సత్వరమే చేపట్టి ప్రమోషన్లు ఇవ్వాలి. ● స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్) పోస్టుల్లో హైకోర్టు తీర్పు అమలు చేసిన తర్వాత మిగిలిన పోస్టుల్లో లాంగ్వేజ్ పండిట్లు లభ్యం కానప్పుడు అర్హులైన ఎస్జీటీలకు ప్రమోషన్ ఇవ్వాలి. స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టుల్లో కూడా అర్హులైన ఎస్జీటీలకు ప్రమోషన్ ఇవ్వాలి. మా సూచనలు పరిగణలోనకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి అన్నీ ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలనే ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్గా నియమిస్తామనడం సరికాదు. అధిక సంఖ్యలో ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్–2 ఉన్నత పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి అదనంగా పోస్టులను కేటాయించాలి. ప్రభుత్వ విధానాలు విద్యారంగానికి ఉపయోగపడేలా ఉండాలే తప్ప నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. – కొమ్మోజు శ్రీనివాసరావు, యుటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు -
వీరజవాన్ మురళీనాయక్‌కు నివాళి
ఒంగోలు టౌన్: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్‌కు ఒంగోలు ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఘనంగా నివాళులర్పించింది. నగరంలోని బాపూజీ కాంప్లెక్స్‌లో మంగళవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దేశ యువతకు మురళీ నాయక్ త్యాగం స్ఫూర్తిగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, అసోసియేషన్ ప్రసిడెంట్ నరసింహరాజు, కార్యదర్శి చిరంజీవి, సహాయ కార్యదర్శి జై రాజు , ఉన్నం హరిబాబు, బోడపాటి శ్రీనివాసరావు, మోడ్రన్ వెంకటేశ్వరరావు, అనిల్ బాబు,బిపిఎల్ బాషా తదితరులు పాల్గొన్నారు.2026 జూలైకి వెలిగొండ నీళ్లు విడుదల● జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్లుఒంగోలు సబర్బన్: వెలిగొండ ప్రాజెక్టు నుంచి 2026 జూలైలో నీళ్లు విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక కొండ మీద ఉన్న ఎన్ఎస్పీ అతిథి గృహంలో జిల్లా జలవనరుల శాఖ ప్రాజెక్టు అధికారులు, ఆ శాఖ కార్యదర్శి జి.సాయి ప్రసాదు, కలెక్టర్ ఏ.తమీమ్ ఆన్సారియాలో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జూలైలో స్టేజ్–1 కింద సాగు నీరు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా శ్రీశైలం ఎగువ జలాలను రెండు టన్నెళ్ల నుంచి ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌ను నింపేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అందుకుగాను స్టేజ్–1 పరిధిలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. తీగలేరు, గొట్టిపడియ ఛానళ్ల ద్వారా స్టేజ్– 1 కింద నీరిచ్చే విధంగా పనులు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలను పరిష్కరించాలని, అందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఇంకా మిగిలి ఉన్న భూముల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్ జిల్లా సీఈ బి.శ్యాం ప్రసాదు, ఎస్ఈ సి.నాగమురళీ మోహన్, డీఎస్ఈ హరి కిషన్‌రాజ్, మార్కాపురం ఈఈ అబుతలేం, జలవనరుల శాఖ ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు, జేఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.సమస్యకు తగిన పరిష్కారం చూపాలిఒంగోలు సబర్బన్: అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్లోని మీ కోసం సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ’కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక్ఙలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్ధసారధి, వరకుమార్, కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఉర్దూ లైబ్రరీపై అవగాహన ప్రదర్శనఒంగోలు వన్‌టౌన్: ఉర్దూ లైబ్రరీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒంగోలు ఇస్లాంపేటలో మంగళవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి పార్ధసారధి మాట్లాడుతూ ఉర్దూ భాషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో అధికార భాషగా గుర్తించిందన్నారు. ఉర్దూ లైబ్రరీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ఉర్దూ లైబ్రేరియన్ పఠాన్ తాహెరున్నీసా ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది సుధాకర్, అంకమ్మరావు, అశోక్, స్థానిక ముస్లిం సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి
రాచర్ల: మండల కేంద్రమైన రాచర్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గంజికుంట్ల మౌళిమనోహర్(40) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబయిలోని ఆర్మీ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఉదయం 10:30 గంటలకు తమ క్యాంప్‌లోనే గుండెపోటుకు గురయ్యారు. తోటి జవాన్లు హుటాహుటిన ఆర్మీ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆర్మీ ఉన్నధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మౌళిమనోహర్ మృతి విషయం తెలియడంతో భార్య వెంకట నవ్యతోపాటు కుమారుడు, కుమార్తె, బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. జవాన్ భౌతికకాయాన్ని బుధవారం సాయంత్రం రాచర్ల గ్రామానికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎల్లమ్మ గుడిలో హుండీ చోరీ హనుమంతునిపాడు: మండల కేంద్రమైన హనుమంతునిపాడులోని నాగరప్ప ఎల్లమ్మ గుడిలో హుండీని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి కానుకలు అపహరించారు. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. అందిన సమాచారం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లి గ్రామ సమీపంలోని ఊరకుంట వద్ద పగలగొట్టారు. అందులో ఉన్న రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారు వస్తువులు చోరీ చేశారు. గుడి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సర్ప్లస్ ఉర్దూ పోస్టులపై డీఈఓ స్పందించాలి మార్కాపురం టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉర్దూ పోస్టులను సర్‌ప్లస్‌లో చూపిన జిల్లా విద్యాశాఖ అధికారులు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు పి.అబ్దుల్ వహీద్ ఖాన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సర్‌ప్లస్‌లో 40 ఎస్జీటీ, 9 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జీవో ప్రకారం సర్‌ప్లస్‌లో ఎలా చూపారో తెలపాలన్నారు. యుడైస్లో ఉర్దూ మీడియం ఉన్నా ఇంగ్లిష్ మీడియం పెట్టమనడం, ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూళ్లలో ఉర్దూ ఎస్జీటీకి బదులు తెలుగు ఎస్జీటీని ఉంచడంపై ప్రశ్నించారు. ఉర్దూ ఒక భాషగా ఉన్న స్కూళ్లలో ఎస్ఏ ఉర్దూ, ఎస్జీటీ ఉర్దూలను ఏ జీఓ ప్రకారం తీశారని నిలదీశారు. ఉపాధ్యాయులను సర్‌ప్లస్‌గా చూపిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఉర్దూ విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారో సీఎస్సీ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పరిశ్రమల్లో పటిష్ట భద్రతా చర్యలు
ఒంగోలు సబర్బన్: ప్రమాదకర పరిశ్రమల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కల్లెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సీహెచ్ శైలేంద్రకుమార్తో పాటు జిల్లాలోని క్రైసిస్ గ్రూపు ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సఽందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రమాదకర ఫ్యాక్టరీల్లో భద్రతా చర్యలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయరు చేయాలని సూచించారు. ప్రధానంగా అమ్మోనియా వినియోగిస్తున్న ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయో స్వయంగా పరిశీలించాలని క్రైసిస్ గ్రూప్ అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు ఆయా ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాలను నిశితంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో నాలుగు హజార్డస్ ఫ్యాక్టరీలు ఉన్నాయని నెల్లూరు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ తెలిపారు. సేఫ్టీ మెజర్స్‌లో భాగంగా చెరువుకొమ్ముపాలెంలోని భగీరధ ఫ్యాక్టరీలో, అమ్మోనియా వినియోగించే ఫ్యాక్టరీల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఐస్ ప్లాంట్స్, రొయ్యల ప్రొసెసింగ్ ప్లాంట్స్, మిల్క్ చిల్లింగ్ సెంటర్లలో ప్రమాదాల నివారణపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వివిధ పరిశ్రమలు సంయుక్తంగా నిర్వహించినట్లు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. సమావేశంలో ఫైర్, పొల్యూషన్, డీఎంహెచ్ఓ, డీటీఓ, అగ్రికల్చర్, ఏపీపీసీబీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే విద్యుత్ అదాలత్ పొదిలి రూరల్: వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే విద్యుత్ అదాలత్ ముఖ్య ఉద్దేశమని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానియేల్ పేర్కొన్నారు. మంగళవారం పొదిలిలోని మంజునాథ కల్యాణ మండపంలో విద్యుత్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్టర్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేస్తూ వినియోగదారులతో మర్యాదగా మెలగాలని సూచించారు. రెండేళ్ల కాలపరిమితిలోగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై 20 అర్జీలు రాగా 15 అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యుత్ అదాలత్ ప్రతి జిల్లాలో నెలకోసారి ఏర్పాటు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాసరావు, ఏడీఈ హరిబాబు, 10 మండలాలకు చెందిన ఏఈలు, పలవురు వినియోగదారులు పాల్గొన్నారు. అమ్మోనియా వినియోగిస్తున్న ఫ్యాక్టరీల్లో విస్తృత తనిఖీలు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేల్ -
బైకులు ఢీ.. ఒకరు మృతి
మార్కాపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చింతగుంట్ల, తిప్పాయిపాలెం గ్రామాల మధ్య చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై అంకమరావు కథనం మేరకు.. తిప్పాయిపాలెం గ్రామానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు(45) తన బైక్‌పై మార్కాపురం బయలుదేరాడు. గ్రామ శివారు దాటగానే తాడివారిపల్లి నుంచి మార్కాపురం మీదుగా కంభం వైపు బైక్‌పై వెళ్తున్న మహేష్ ఎదురుగా వస్తున్న వెంకటేశ్వర్లును ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం జీజీహెచ్‌కు తరలించగా వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య భారతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జీవనోపాధి కోసం ఉదయాన్నే భార్యపిల్లలకు చెప్పి బయలుదేరిన వెంకటేశ్వర్లు ఊరు దాటగానే మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆరు నెలల పసికందు కిడ్నాప్!
ఒంగోలు టౌన్: తలిదండ్రులు గాఢ నిద్రలో ఉండగా వారి పక్కలోనే హాయిగా కునుకుతీస్తున్న పసికందును కిడ్నాప్ చేసిందో మహిళ. పోలీసుల కథనం ప్రకారం.. కొండపి గ్రామానికి చెందిన గుర్నాథం అంజయ్య, అంజమ్మ దంపతులు ఊరూరూ తిరుగుతూ తల వెంట్రుకలు కొనుక్కోవడం, అమ్మడం చేస్తుంటారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఆ దంపతులు త్రోవగుంటలో నివసిస్తున్నారు. వారికి ఆరు నెలల పాప ఉంది. సోమవారం రాత్రి ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఆ దంపతులు పాపతో కలిసి నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేవగానే పక్కలో ఉన్న పాప కనిపించలేదు. దాంతో ఆందోళనకు గురైన ఆ దంపతులు డిపో పరిసరాల్లో వెదికారు. పాప జాడ లేకపోవడంతో డిపోలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు.పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి మద్దిపాడుకు చెందిన ఇట్లా ప్రియాంకను నిందితురాలిగా గుర్తించారు. ఆమె కోసం గాలించగా జీజీహెచ్ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో హుటాహుటిన వెళ్లి పాపను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి విధుల్లో ఉన్న దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, వన్‌టౌన్ సీఐ నాగరాజు చేతులమీదుగా పాపను తలిదండ్రులకు అప్పగించారు. టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. కిడ్నాప్ అయిన పాపను రెండు గంటల వ్యవధిలోనే అప్పగించడంతో పోలీసులకు తలిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రెండు గంటల్లోనే నిందితురాలి పట్టివేత తెల్లవారుజామున ఒంగోలు ఆర్టీసీ డిపోలో ఘటన -
ఆహ్వానం మన్నించండి.. పెళ్లి చేసుకోండి..!
గిద్దలూరు రూరల్: జీవితంలో ఓ మధురమైన ఘట్టం కల్యాణం. సంతోషంగా పెళ్లి చేసుకోవాలని భావించే పేద, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ గిద్దలూరు పట్టణంలో టీటీడీ నిర్మించిన కల్యాణ మండపం నిరుపయోగంగా మారింది. కల్యాణ ఘడియలు సమీపించిన వధూవరుల రాక కోసం ఎదురు చూస్తోంది.! వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరు కోర్టు భవనం సమీపంలో సుమారు ఎకరా విస్తీర్ణంలో టీడీడీ కల్యాణ మండపం నిర్మించింది. 2018లో ప్రారంభించిన ఈ మండపంలో వధువు, వరుడు ఉండేందుకు ప్రత్యేక గదులు, ప్రహరీ, వంటశాల, మరుగుదొడ్లు, సీసీ రోడ్డు, భోజనశాల తదితర సౌకర్యాలన్నీ కల్పించారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ పెళ్లి చేసుకునేవారే కరువయ్యారు. గడిచిన ఏడేళ్లలో కనీసం ఏడు వివాహాలు కూడా ఇక్కడ జరగలేదంటే పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కల్యాణ మంత్రాలు, మంగళవాయిద్యాలు వినిపించని కల్యాణ మండపంగా పేరు తెచ్చుకుంది. మండపం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం నిర్వహణలో చేతులెత్తేయడంతో శిథిలావస్థకు చేరుకుంటోంది. మండపం ఆవరణతోపాటు ప్రధాన రహదారికి ఇరువైపులా చిల్లచెట్లు పెరిగాయి. గోడలు నెర్రెలిచ్చాయి. కొందరు ఆకతాయిలు మండపం కిటికీల అద్దాలను రాళ్లతో పగలగొట్టారు. అరకొర వసతులు ఉన్న ప్రైవేట్ కల్యాణ మండపాల్లో ప్రతి సీజన్లో పదుల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటే.. అన్ని వసతులు ఉన్న టీటీడీ మండపంలో బాజాభజంత్రీలు ఎందుకు మోగడం లేదో ఆ వెంకన్నకే ఎరుక. కారణం ఇదేనా? గిద్దలూరులోని కొందరు కల్యాణ మండపాల నిర్వాహకులు తమకు అయినవారిని ముందుపెట్టి టీటీడీ మండపం నిర్వహణ టెండర్ దక్కించుకుని అక్కడ వివాహాలు కాకుండా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్యాణ మండపం పట్టణానికి దూరంగా ఉండటం వల్ల వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ కాంట్రాక్టర్ టీటీడీ మండపం టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాదైనా వివాహాలు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే. ఆదరణకు నోచుకోని గిద్దలూరు టీటీడీ కల్యాణ మండపం వినిపించని కల్యాణ మంత్రాలు.. మోగని బాజాలు ప్రారంభించి ఏడేళ్లు.. జరిగింది రెండే పెళ్లిళ్లు! -
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
ఒంగోలు టౌన్/ మద్దిపాడు : వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందున్న లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొట్టింది. ఈ సంఘటన మద్దిపాడు మండలంలోని ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహాబలిపురం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న తేజస్విని ట్రావెల్ బస్సు గ్రోత్ సెంటర్ వద్దకు రాగానే ముందున్న లారీని దాటవేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో లారీని బస్సు ఢీకొనడంతో రెండు వాహనాలు కొంత మేర దెబ్బతిన్నాయి. బస్సులోని ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదం ధాటికి బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్క ఉదుటన లేచి భయాందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మద్దిపాడు ఎస్సై శివరామయ్య తెలిపారు. తప్పిన పెను ప్రమాదం ఐదుగురికి స్వల్ప గాయాలు ఓవర్ టేక్ చేసే క్రమంలో ఘటన -
సంద్రం.. అల్లంతదూరం!
సింగరాయకొండ: సముద్రుడు దోబూచులాడుతున్నాడు. సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెంలో అలలు తీరానికి సుమారు 20 మీటర్ల దూరం వెనక్కి వెళ్లాయి. గత కొద్ది నెలలుగా అలలు ముందుకొస్తూ రెండు అడుగల లోతు వరకు తీరం కోతకు గురైంది. దీంతో తీరంలోని విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతోపాటు రొయ్యల చెరువుల కట్టలు ధ్వంసమయ్యాయి. వేట నిషేధ సమయం కావడంతో మత్స్యకారులు ముందు జాగ్రత్తగా తమ బోట్లు, వలలను తీరానికి దూరంగా ఉంచారు. ఇంతలోనే అలలు 20 మీటర్ల మేర లోపలికి వెళ్లడంతో మత్స్యకారులతోపాటు పర్యాటకులు అయోమయానికి గురవుతున్నారు. ఊళ్లపాలెంలో 20 మీటర్లు వెనక్కి వెళ్లిన అలలు -
పైన పటారం.. లోన లొటారం..!
ఒంగోలు సబర్బన్: జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో అధికార టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర దేవదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారుల తీరుపై చిందులు తొక్కారు. పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా నడుస్తున్న కూటమి ప్రభుత్వ పాలనను టీడీపీ ప్రజాప్రతినిధులే ఎండగట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మండిపడిన మాగుంట... సీఎంతో మాట్లాడి జిల్లాకు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు తీసుకొస్తే కనీసం ఎంపీడీవోలతో మాట్లాడి ప్రొసీడింగ్స్ కూడా ఇప్పించలేని పరిస్థితిలో జిల్లా అధికార యంత్రాంగం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమావేశంలో ధ్వజమెత్తారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. సమీక్ష సమావేశాల్లో చర్చించిన అంశాలను కూడా పూర్తి చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చినా జిల్లా అధికారులు స్పందించడం లేదంటే ఏమనుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖాధికారుల తీరుపై అసహనం... పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మంచినీటి సమస్యపై, వైద్యారోగ్య శాఖాధికారుల తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో వైద్యారోగ్య శాఖ అధికారులపై సభ్యులందరూ అసంతృప్తి చెందడంతో ఆ శాఖపై 24 గంటల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఇన్చార్జ్ మంత్రి ఆనం ఆదేశించారు. దీనిపై అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని గట్టిగా చెప్పారు. తొలుత ఉపాధి హామీ పథకం ద్వారా అమలవుతున్న పనుల పురోగతిపై చర్చించారు. జిల్లాలోని 17 మండలాల్లో కరువు ఉందని అధికారులు నివేదికలు ఇచ్చారని, ఆ ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి సమగ్ర ప్రణాళికతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగాలని ఆదేశించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ ధ్వజం... గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను 93 శాతం పరిష్కరించామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలపగా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కొన్ని అర్జీలు చూపిస్తూ.. ఇవన్నీ పరిష్కారం కాలేదని అన్నారు. అంటే ఇవి మీ దగ్గర నమోదు కాలేదా.. అని ప్రశ్నించారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కల్పించుకుని మాట్లాడుతూ సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో ఒక సర్వే నంబర్ కోసం మొత్తం రిజస్ట్రేషన్లు ఆపేశారని, ఎన్నిసార్లు అర్జీలిచ్చినా పరిష్కారం కాలేదని అన్నారు. విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌రావు, కందుల నారాయణరెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, బీఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఏపీ మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పి.విజయకుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డీఆర్సీ సమావేశం సాక్షిగా బయటపడిన లుకలుకలు అధికారులు – ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం ప్రభుత్వ లక్ష్యాలను పట్టించుకోవడం లేదు.. అధికారులపై ప్రజాప్రతినిధుల అసహనం ఎన్ఆర్ఈజీఎస్ వర్కులకు ప్రొసీడింగ్స్ ఇప్పించకపోవడంపై ఎంపీ మాగుంట అసంతృప్తి గ్రీవెన్స్ అర్జీల పెండింగ్‌పై కలెక్టర్‌ను ప్రశ్నించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల వైద్యారోగ్య శాఖాధికారులపై ఇన్చార్జ్ మంత్రి ఆనం ధ్వజం అమృత్ పథకం పనులు పూర్తి చేయాలన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి వై.పాలెం నియోజకవర్గంలో అక్రమాలపై ఆగ్రహించిన ఎమ్మెల్యే తాటిపర్తి ఆర్ధోపెడిక్ లేక మరణాలు సంభవిస్తున్నాయి డీఆర్సీ సమావేశంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని 100 పడకల వైద్యశాలలో ఆర్ధోపెడిక్ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాదాలకు గురైన వారు మరణిస్తున్నారు. ఆర్ధోపెడిక్ డాక్టర్ గిద్దలూరు నుంచి వస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురై వైద్యశాలకు వస్తే ఆర్ధోపెడిక్ డాక్టర్ లేక రక్తం పోకుండా ఆపి కట్టుకట్టేవారు కూడా లేక నరసరావుపేట వైద్యశాలకు వెళ్లేలోపు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గురిజేపల్లికి చెందిన వెన్నా వెంకటేశ్వరరెడ్డి, ఫారిన్ వెళ్లాల్సిన తొమ్మండ్రు దిలీప్ కుమార్, మూడు రోజుల క్రితం ఒక కానిస్టేబుల్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇకపోతే, మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంచినీరు తోలిన ట్యాంకర్లకు ఇంత వరకు డబ్బు చెల్లించలేదు. రూ.13 కోట్ల బకాయిలున్నాయి. తీవ్ర కరువు కాటకాలతో ఉన్న యర్రగొండపాలేన్ని అధికారులు తీవ్రంగా విస్మరిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో వారానికి రూ.3 కోట్లు దండుకుంటున్నారు. టీడీపీ నాయకులు, అధికారులు పంచుకుంటున్నారు. రైతుల కోసం నిర్మిస్తున్న తొట్లు, షెడ్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోంది. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో సర్పంచుల తీర్మానాలు లేకుండా ఉపాధి పనులు చేపట్టారు. గతంలో ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని రవాణా చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. లక్ష్యం మేరకు జిల్లాలో ఎక్కడా పనులు జరగడం లేదు. ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రజలకు అవసరమైన పనులేమీ చేయడం లేదు. కానీ, అంతా అద్భుతంగా చేస్తున్నట్లు అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికారులు ఏడాది కాలంగా డప్పుకొట్టుకుంటూ వస్తున్నారు. ఇదంతా జిల్లా సమీక్ష కమిటీ సమావేశం సాక్షిగా బయటపడింది. అధికారుల పనితీరుపై కూటమి ప్రజాప్రతినిధులే ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి మధ్య సమన్వయలోపంతో అడుగడుగునా అసహనానికి గురయ్యారు. అధికారులపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు. -
సమస్యలపై కాలయాపన తగదు
ఒంగోలు సిటీ: పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పునర్వ్యవస్థీకరణ ప్రక్రియతో పాటు ఏ విధమైన స్పష్టమైన జీవోలు లేకుండానే రోజుకో ఆలోచనతో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నా శిబిరాన్ని ప్రారంభించిన కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ వారం వారం గుర్తింపు కలిగిన ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహిస్తున్న సమావేశాల దృష్టికి సమస్యలు తెస్తున్నప్పటికీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయుల్లో చెలరేగుతున్న ఆందోళన నేపథ్యంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. జీవో నంబర్ 117ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త జీవో విడుదల చేసి దాని ఆధారంగా మాత్రమే పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలన్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలన్నారు. అన్ని మోడల్ ప్రైమరీ స్కూళ్లలో 5 తరగతులు బోధించడానికి ఐదుగురు టీచర్లను నియమించాలన్నారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్‌హెచ్‌ఎం పోస్టు అదనంగా కేటాయించాలని, అలాగే విద్యార్థుల సంఖ్య 120కి మించితే 6వ ఎస్జీటీ, ఆపైన ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీ చొప్పున కేటాయించాలని అన్నారు. ఉర్దూ, మైనర్ మీడియం బోధించే ఉపాధ్యాయులను తెలుగు మీడియం ఎస్జీటీ/ఎస్ఏలతో కలిపి లెక్కించి పోస్టులు కేటాయించడం సరికాదన్నారు. ఆ పోస్టులు అదనంగా ఇవ్వాలన్నారు. అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలని, రెండు పోస్టులు కేటాయిస్తే ఒక లాంగ్వేజ్‌గా, రెండోది నాన్ లాంగ్వేజ్‌గా, 4 పోస్టులు కేటాయిస్తే రెండు లాంగ్వేజ్, రెండు నాన్ లాంగ్వేజ్ పోస్టులు కేటాయించాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల స్థాయిని దిగజార్చవద్దని, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే నియమించాలని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియం కొనసాగించాలన్నారు. బదిలీల జీఓ తక్షణమే విడుదల చేయాలి... యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై మాట్లాడుతూ బదిలీల జీఓ తక్షణమే విడుదల చేసి వేసవి సెలవుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్ టూ హైస్కూళ్లలో ఇంటర్మీడియట్ తరగతులు బోధించడానికి అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలన్నారు. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరు చేసిన పోస్టులు ఖాళీలుగా చూపాలన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో అప్‌గ్రెడేషన్ ప్రక్రియ సత్వరమే చేపట్టి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్) పోస్టుల్లో హైకోర్టు తీర్పు అమలు చేసిన తర్వాత మిగిలిన పోస్టుల్లో లాంగ్వేజ్ పండితులు లభ్యం కానప్పుడు అర్హులైన ఎస్జీటీలకు ప్రమోషన్ ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని, అలాగే స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టుల్లో కూడా అర్హులైన ఎస్జీటీలకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళన, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు, సహాధ్యక్షుడు ఐవీ రామిరెడ్డి, సహాధ్యక్షురాలు జి.ఉమామహేశ్వరి, జిల్లా కోశాధికారి ఎన్.చిన్నస్వామి, జిల్లా కార్యదర్శులు డి.రాజశేఖర్, పి.వెంకటేశ్వర్లు, ఎం.శ్రీను, టి.రమణారెడ్డి, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, పి.బాలవెంకటేశ్వర్లు, ఎం.రాము, రాష్ట్ర కౌన్సిలర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆడిట్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరావు సర్దుబాటు ప్రక్రియపై ఉపాధ్యాయుల ఆందోళన -
ఆశావహులు రగిలి!
ఆశలు నీరుగారి.. అధికార కూటమిలో నామినేటెడ్పదవుల కాక ఓ రేంజ్లో సాగుతోంది. పైకి అంతా బాగానే ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. అంతర్గతంగా మూడు పార్టీల నేతలు రగిలిపోతున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కడం లేదని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేనకు మొక్కుబడిగా ఒక పదవి దక్కగా, కమలనాథులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తిని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదేం మిత్ర ధర్మమంటూ మండిపడుతున్నారు. ఆదివారం ప్రకటించిన నామినేటెడ్ పదవులు కూటమికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయన్న ప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: విడతలవారీగా భర్తీ అవుతున్న నామినేటెడ్ పదవులపై అధికార కూటమిలో ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పదవులను భర్తీ చేస్తారని అంతా భావించారు. 10 నెలలు గడుస్తున్నా అప్పుడో పదవి, ఇప్పుడో పదవి అంటూ ప్రకటిస్తుండటంతో టీడీపీ నేతలు అసహనానికి గురవుతున్నారు. గత ఎన్నికల సమయంలో పదవుల ఆశ పెట్టి కొంతమంది నాయకులను బాగానే వాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలైపోయాక వారికి ఒట్టి చేతులు చూపడంతో అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నట్లు సమాచారం. జిల్లాకు సంబంధించి ఇంకా కీలక పదవుల భర్తీ పెండింగ్‌లో ఉండటంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీరివీరి గుమ్మడిపండు.. ఒడా పదవి ఎవరికి... కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిల్లా నాయకులంతా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఒడా) చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ నాయకులు అరడజను మందితోపాటు జనసేన నాయకులు కూడా ఈ పదవి కోసం పోటీపడ్డారు. టీడీపీలోని కీలకమైన మహిళా నాయకురాలు కూడా ఈ పదవి కోసం విశ్వప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ పదవిని జనసేన నాయకులకు ఇచ్చేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పదవిని ఓ మాజీ ఎమ్మెల్యేకు ఇచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు అతని పేరు ఖరారయ్యే సమయంలో సదరు నాయకురాలు తనకు సన్నిహితంగా ఉండే మంత్రి ద్వారా దాదాపు అడ్డుకున్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రయత్నించిన నాయకులు తగిన గుర్తింపులేదని పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నట్లు సమాచారం. పీడీసీసీ పదవిపై అసంతృప్తి.. పీడీసీసీ పదవికి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పేరు ప్రకటించడంతో టీడీపీలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పదవి కోసం పచ్చ తమ్ముళ్ల మధ్య పోటాపోటీ నెలకొనడంతో ప్రకటించకుండా పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి పోటీ పడినట్లు ప్రచారం. పార్టీ అధిష్టానం వీరయ్య పేరును ఖరారు చేసిందని, అయితే ఊహించని విధంగా వీరయ్య దారుణ హత్యకు గురవడంతో కామేపల్లికి లైన్ క్లియర్ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఈ పదవి కోసం దర్శి నియోజకవర్గం నుంచి కూడా ఓ నేత తీవ్రంగా ప్రయత్నించారు. సదరు నాయకుడికి మద్దతుగా జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి దగ్గర నుంచి సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు తెలిసింది. ఇతర నియోజకవర్గాల నుంచి సైతం నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ పదవి దక్కకపోవడంతో తమకు మొండిచేయి చూపించారని మండిపడుతున్నట్టు సమాచారం. కీలకమైన పదవులను ఒకే సామాజికవర్గానికి మాత్రమే కట్టబెడుతున్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. జనసేన గ్రూపుల్లో రాజుకున్న అసంతృప్తి... జిల్లా జనసేనలో మొదట్నుంచి రెండు గ్రూపులున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌కు ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ పదవి ఇవ్వడంతో జనసేనలోని ప్రత్యర్థి గ్రూపులు మండిపడుతున్నట్లు సమాచారం. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. రగిలిపోతున్న ఇతర సామాజిక వర్గాలు... టీడీపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కంభం మార్కెట్ యార్డు పదవి, సహకార బ్యాంకు పదవులను ముస్లింలకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ముస్లింలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హజ్ కమిటీలను కూడా భర్తీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవిని కుప్పం ప్రసాద్‌కు ఇచ్చారు. ఈ పదవిపై పొదిలికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడైన గుణిపూడి భాస్కర్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయనను పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మార్కాపురానికి చెందిన ఓ నాయకుడికి కూడా ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. పార్టీలో సీనియర్లకు విలువలేదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులం, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికార కూటమిలో నామినేటెడ్ సెగలు పది నెలలుగా పదవులపై ఆశలు ఇంకా పెండింగ్‌లో కీలక పదవులు ఒడా చైర్మన్‌పై పంతాలకు పోతున్న నాయకులు స్థానికంగా సంబంధాలు లేనివారికి పదవులు మరింత చిచ్చురాజేసిన జనసేన బీజేపీలోనూ వినిపిస్తున్న అసంతృప్తి రాగాలు ఒకరు విజయవాడ.. మరొకరు హైదరాబాద్... తొలివిడత నామినేటెడ్ పదవుల పందేరంలో బీజేపీకి చెందిన లంకా దినకర్‌కు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా ఇచ్చారు. ఒంగోలుకు చెందిన ఆయన విజయవాడకు మకాం మార్చి చాలా రోజులైంది. అలాగే అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులతో సమ్మెలు చేయించినందుకుగానూ భూమి ఫౌండేషన్ నిర్వాహకురాలు పొడపాటి తేజస్వీకి సాంస్కృతిక విభాగం చైర్పర్సన్ పదవి ఇవ్వడం టీడీపీలో చర్చనీయాంశమైంది. తేజస్వీ ఒంగోలు వాసే అయినప్పటికీ ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి తొలివిడతలోనే పదవులు దక్కాయి. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రం మొండిచేయి చూపారని తమ్ముళ్లు గరం గరంగా ఉన్నారు. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కమలనాథులు కుమిలిపోతున్నారు. జిల్లా కోటా నుంచి లంకా దినకర్‌కు పదవి ఇచ్చినప్పటికీ ఆయనకు స్థానిక బీజేపీతో ఎలాంటి అనుబంధంగానీ సంబంధంగానీ లేదని చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
మళ్లీ మంచి రోజులొస్తాయి
కొనకనమిట్ల: అధికారం చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ, వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం కొనకనమిట్ల మండలంలోని వెలిగండ్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామ సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ స్థానిక ఎంపీటీసీ మెట్టు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రెండు చోట్ల ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు అన్నా, ఉడుముల మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీచమైన పనులు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిందని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో మళ్లీ మంచి రోజులొస్తాయని, కార్యకర్తలు, నాయకులు అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. కూటమి నాయకుల ఒత్తిడితో అధికారులు వైఎస్సార్ సీపీ జెండాను తొలగించగా.. రెట్టింపు ఉత్సాహంతో రెండు చోట్ల జెండాలు ఏర్పాట చేయడం అభినందనీయమన్నారు. జెండాల ఆవిష్కరణకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలకు గ్రామ నాయకులతోపాటు ఎస్సీ కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ కన్వీనర్ మోరా శంకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గొంగటి జెనీఫా కరుణయ్య, పార్టీ మాజీ మండల కన్వీనర్ రాచమళ్ల వెంకటరామిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు పార్లపల్లి సిద్దానభి, పాలూరి లక్ష్మిసాంబ వెంకటేశ్వర్లు, గొలమారి భవాని తిరుపతిరెడ్డి, పిన్నిక పిచ్చయ్య, బేతా ధనలక్ష్మి ప్రకాష్‌రెడ్డి, ఎంపీటీసీలు కోండ్రు వెంకటేశ్వర్లు, యూత్ నాయకులు గాడి కోనేటిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, తంగిరాల బ్రహ్మరెడ్డి, గర్రె శ్రీనివాసులు, చంద్రశేఖర్, కట్టా రమణయ్య, బసాపురం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తిస్తే సహించేది లేదు మాజీ ఎమ్మెల్యేలు అన్నా, ఉడుముల భారీ జన సందోహం మధ్య వెలిగండ్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండాల ఆవిష్కరణ -
పొలాల్లోకి దూసుకెళ్లిన బైక్
● స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు● క్షతగాత్రుడిని గుంటూరు తరలించిన పోలీసులుకంభం: విధులకు హాజరయ్యేందుకు కంభం వెళ్తున్న ఓ కానిస్టేబుల్ బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున కంభం మండలంలోని పోరుమామిళ్లపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ మాదిరెడ్డి తిరుపతిరెడ్డి సోమవారం ఉదయం కంభం అర్బన్ కాలనీలో కార్డన్ సెర్చ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తురిమెళ్ల గ్రామంలోని తన అత్తగారింట్లో ఉండి సోమవారం తెల్లవారుజామున బైక్‌పై కంభం బయలుదేరారు. ఈ క్రమంలో పోరుమామిళ్లపల్లి సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కుడి చేతి రెండు వేళ్లు విరిగిపోవడంతోపాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వాహనం అందుబాటులో లేదు. ప్రమాద సమాచారం అందుకున్న కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్ తిరుపత్తిరెడ్డిని కంభంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మార్కాపురంలోని ఓ ఆస్పత్రికి, అక్కడి నుంచి గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బర్లీ రైతులకు ధరాఘాతం
కంపెనీల దురాగతం..నాగులుప్పలపాడు: బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోంది. ధర దారుణంగా పతనం కావడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు చేతికొస్తే చాలని దీనంగా ఎదురుచూస్తున్నారు. అయితే పుండు మీద కారం చల్లినట్టుగా పొగాకు కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకురావడం లేదు. శ్రీమా కంపెనీ నారుతో పంట సాగు చేయండి.. కొనే బాధ్యత మాదిశ్రీ అని జీపీఐతోపాటు మరికొన్ని కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాటలు నమ్మి జిల్లాలో రైతులు నిలువునా మోసపోయారు. తీరా పంట చేతికొచ్చాక నాణ్యత లేదంటూ ధర తెగ్గోయడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. వేలం ప్రారంభమైన తొలినాళ్లలో క్వింటా పొగాకు రూ.8 వేల నుంచి రూ.12 వేలకు కొనుగోలు చేసిన కంపెనీలు.. ఆ సొమ్మును నారు, పట్టలు, ఇతర సామగ్రి కింద జమ వేసుకోవడం గమనార్హం. సర్కారు చొరవ శూన్యం ఈ ఏడాది జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో బర్లీ పొగాకు సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి పొగాకు పండించినా సరైన దిగుబడి రాలేదు. అదే సమయంలో కనీస గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో కొనుగోళ్లు మందగించాయి. గత ఏడాది తొలి విరుపులో అడుగాకు సైతం క్వింటా రూ.8 నుంచి రూ.10 వేలు పలికింది. మలి విరుపులో క్వింటా రూ.15 వేల నుంచి రూ.18 వేలకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది క్వింటా మలి విరుపు ఆకు రూ.10 వేలు కూడా పలకడం లేదు. ప్రైవేట్ కంపెనీలు పొగాకు కొనుగోలుకు ముందుకు రాకపోతే టుబాకో బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సుమారు రూ.500 కోట్లు ప్రత్యేక నిధి కేటాయించి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి కొనుగోలు చేశారు. బర్లీ పొగాకు రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని ఇరవై రోజుల క్రితం వ్యవసాయ శాఖా మంత్రి ప్రకటించినా నేటికీ ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. కోలుకోవడం కష్టమే.. తొలి వలుపులో ఓ రకంగా ధర చెల్లించిన రైతులు రెండో వలుపు వచ్చేసరికి నాణ్యత సాకు చూపి చేతులెత్తేశారు. వేలంలో పాల్గొనకుండా పత్తా లేకుండా పోయిన కంపెనీల ప్రతినిధులు ఫోన్లు సైతం స్విచాఫ్ చేసుకున్నారు. మూడు నెలలుగా రైతులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా బర్లీ పొగాకు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పెట్టుబడి కోసం భారీగా అప్పు చేసిన రైతుల్లో కలవరం మొదలైంది. దిక్కతోచని స్థితిలో రైతులు పొగాకును తగలబెట్టడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పత్తి, మిరప సాగులో నష్టాలు చవిచూసిన రైతులు పొగాకు కంపెనీల మాటలు నమ్మి బర్లీ సాగు చేసి దగాపడ్డారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించి పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రంగు మారే ప్రమాదం పొగాకు రెలిచి రెండు నెలలకు పైగా అయింది. వేసవిలో ఎండలు ఎక్కువ కావడంతో ఆకు పాడైపోతోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి బేళ్లు ఆరబెట్టాలి, ఆకును తిరగేయాలి లేదంటే లోపలకు గాలి చేరి ఆకు కుళ్లిపోయి రంగు మారే ప్రమాదం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం రైతులకు ప్రహసనంగా మారింది. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని పొగాకు రైతులు కోరుతున్నారు. బర్లీ పొగాకు కొనే వారేరి? పేరుకు పోయిన నిల్వలు దిక్కుతోచని స్థితిలో రైతులు కౌలు రైతుల పరిస్థితి మరీ దుర్భరంరైతులతో కలిసి ఉద్యమిస్తాం మిగతా పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడంతో వర్జీనియాతోపాటు బర్లీ పొగాకును రైతులు అధికంగా సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయి. పొగాకు రైతులు ఆందోళనకు దిగుతున్నా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కంపెనీలు మద్దతు ధర ఇవ్వకపోగా, పత్తాలేకుండా పోవడం ప్రభుత్వ వైఫల్యమే. గతంలో పొగాకు కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించారు. కంపెనీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పొగాకు కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అదే చొరవ చూపాలి. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు ఇన్చార్జిజీపీఐ కంపెనీ మోసాన్ని గ్రహించలేకపోయాం 15 ఎకరాల్లో తెల్ల బర్లీ పొగాకు సాగు చేశా. ఇప్పటికే కౌలు, కూలీలకు రూ.లక్షల్లో ఖర్చు చేశా. మొదట్లో జీపీఐ కంపెనీ ప్రతినిధులు పొగాకు కొంటామని మాయమాటలు చెప్పి సాగు చేయించారు. తీరా పంట చేతికొచ్చాక కొద్ది మేర కొనుగోలు చేసి పత్తా లేకుండా పోయారు. లక్షల రూపాయల విలువైన పొగాకు పొలాల్లోనే ఉండిపోయింది. తెచ్చిన అప్పులతోపాటు కూలీలకు డబ్బు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు. ఇంతలా మోసం చేస్తారని గ్రహించలేకపోయాం. – పాలపర్తి సతీష్, పొగాకు రైతు, కండ్లగుంట -
బైకు అదుపుతప్పి ఒకరు మృతి
కురిచేడు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం కురిచేడు మండలంలోని వెంగాయపాలెం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని ఆవులమంద గ్రామానికి చెందిన పల్లె డేవిడ్(40) తమ గ్రామంలోని చర్చికి విద్యుత్ దీపాలంకరణ చేస్తానని పని కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని విద్యుత్ సీరియల్ లైట్లు తక్కువ కావడంతో తన బైక్‌పై వినుకొండ వెళ్లి కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో వెంగాయపాలెం సమీపంలోకి వచ్చేసరికి బైక్ అదుపు తప్పడంతో విద్యుత్ స్తంభాన్ని డీకొట్టాడు. డేవిడ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే మార్గంలో వెళ్తున్న వారు సమాచారం ఇవ్వడంతో బంధువులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.శివ తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి డేవిడ్ తన కుమార్తె మెచ్యూర్ ఫంక్షన్ నిర్వహించారని, మరునాడే ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెద్దారవీడు: రోడ్డు దాటేందుకు పక్కన వేచిఉన్న మహిళను వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లి ఎంపీపీ పాఠశాల వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంజి నారాయణమ్మ వీరభద్రస్వామి గుడిలో ఉత్సవానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకొచ్చింది. అదే సమయంలో హనుమాన్‌జంక్షన్ కుంట వైపు నుంచి లారీ వస్తుండటంతో రోడ్డు దాటకుండా పక్కన వేచిఉంది. జాతీయ రహదారిపై ఎంపీపీ పాఠశాల దగ్గర ఒక లారీకి రూ.50 రుసుం వసూలు చేసేందుకు ప్రభుత్వం చెక్ పోస్టు ఏర్పాటు చేసింది. అయితే చెక్‌పోస్టు వద్ద లారీ ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోతుండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి బైక్‌కు లైట్లు వేయకుండా లారీని వెంబడించాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన వేచి ఉన్న గంజి నారాయణమ్మ(50)ను బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త నారాయణరెడ్డి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారయణమ్మ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొడుకుని చంపిన తల్లి
స్థానిక జయప్రకాశ్ వీధిలో నివాసం ఉంటున్న కదం శ్యాంప్రసాద్ చెడు వ్యసనాలకు బానిసై పనికి వెళ్లకుండా సంపాదన లేకుండా మద్యం తాగుతూ కుటుంబ సభ్యులను, బంధువులను ఇబ్బందులు పెట్టేవాడు. తన సమీప బంధువులైన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించగా పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి మందలించారు. ఫిబ్రవరి 8న తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో అన్న సుబ్రహ్మణ్యం, తమ్ముడు కాశీరావు అతడిని మందలించి భయపెట్టారు. అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సహనం కోల్పోయిన కుటుంబ సభ్యులు 13వ తేదీన తల్లి లక్ష్మీదేవి, అన్న సుబ్రహ్మణ్యం, తమ్ముడు కాశీరావులు శ్యాంప్రసాద్‌ను చంపేయాలని నిర్ణయించుకొని ఆటో డ్రైవర్ వల్లంశెట్టి మోహన్‌ను కలిసి అదేరోజు రాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని ఏం చెయ్యాలో అర్థంగాక నలుగురు కలిసి గొడ్డలి, కత్తితో 8 ముక్కలుగా నరికి అందుబాటులో ఉన్న మూడు గోతాల్లో కుక్కి ఎవరూ లేని సమయంలో మోసుకొని వెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న పంట కాల్వ వెంబడి పడేశారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి, ఇద్దరు సోదరులతో పాటు హత్యకు సహకరించిన ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
సరైన సాక్ష్యాలతోనే నిందితులకు శిక్ష
● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: ఎట్టి పరిస్థితితుల్లోనూ నిందితులకు శిక్ష పడాల్సిందేనని, అప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని, సరైన సాక్ష్యాల సేకరణతోనే నిందితులకు శిక్షలు పడతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. వర్క్‌షాప్‌ను ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ నేరస్తుడు వదిలి పెట్టిన భౌతిక సాక్ష్యాధారాలను సశాసీ్త్రయంగా సేకరించినప్పుడే నేరాన్ని రుజువు చేసి శిక్షలు పడేలా చేయడం సాధ్యమవుతుందన్నారు. సాక్ష్యాలను సేకరించే విషయంలో పోలీసు అధికారులు నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. రోజూ పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల్లో పోలీసు అధికారులకు సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని చెప్పారు. నేరం జరిగిన తీరుతెన్నుల ఆధారంగా కొన్ని కేసులు సులువుగా ఛేదించగలిగితే మరికొన్ని కేసులను ఛేదించడం క్లిష్టతరంగా ఉంటాయని వివరించారు. నేరానికి దారి తీసిన పరిస్థితులను సమగ్రంగా తెలుసుకునే విషయంలో నిష్ణాతులు కావాలని చెప్పారు. సకాలంలో సాక్ష్యాలను సేకరించడం, వాటిని తగిన జాగ్రతల్లో ప్యాకింగ్ చేయడం, వీలైనంత త్వరగా వాటిని ఫోరన్సిక్ ల్యాబరేటరీకీ పంపించడం చాలా అవసరమన్నారు. సాక్ష్యాల సేకరణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీసు అధికారులంతా నైపుణ్యం కలిగి ఉండాలని, శిక్షణలో నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. శిక్షణ తరగతుల్లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్ పాల్గొన్నారు. -
వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్యతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందినట్లు వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారితో అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఆదరణ పొందామన్నారు. భారత ప్రభుత్వం గుర్తింపుతో మరింత బాద్యతగా దేశ భద్రత కోసం వెరిటాస్ సైనిక్ స్కూల్ ముందడుగు వేస్తోందన్నారు. ఉన్నత అధికారులుగా విద్యార్థులను ఎదిగేందుకు అవసరమైన ఉన్నత ప్రమాణాల విద్యను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటి అన్ని సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశానికి అవసరమైన విద్యను యువతకు డిపెన్స్ రంగగాల్లో ఎన్డీఏ, టీఈఎస వంటి ఉత్తమ ఉద్యోగ అవకాశాలను కేవలం 17 ఏళ్ల వయసులోనే పొందే విధంగా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు. వెరిటాస్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి దేశంపై, సమాజంపై బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్మీడియెట్‌తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 22 ఏళ్లుగా తమకు సంస్థ అభివృద్ధికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు, అధ్యాపకులు, అధ్యాపకేతురులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే వెరిటాస్ లక్ష్యం వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి -
నేడు బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి
దర్శి (కురిచేడు): దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి 6వ వర్ధంతి ఆదివారం చీమకుర్తిలోని కమలాకర్‌రెడ్డి పార్కు బూచేపల్లి సుబ్బారెడ్డి ఘాట్ వద్ద నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులు హాజరై నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని ఆయన కోరారు.పిడుగుపాటుకు వ్యక్తి బలిపెద్దారవీడు: మండలంలోని పోతంపల్లి గ్రామానికి చెందిన వలపర్ల పెద్దగాలెయ్య పిడుగుపడి శనివారం సాయంత్రం మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వలపర్ల పెద్దగాలెయ్యకు చెందిన గేదె సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో పొలాల్లో వెతికేందుకు బావమరిది బెజవాడ రామయ్యను తోడుగా తీసుకెళ్లాడు. కర్రోల గ్రామం పొలాల్లో కొన్ని గేదెలు ఉండటంతో అక్కడైమైనా తమ గేదె ఉందోమోనని తొందరగా వెళ్తున్నారు. ఆయన బావమరిది వెనుక నిదానంగా వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు, చిన్నపాటి వర్షం కురుస్తోంది. గేదెను వెతుకుతున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు రావడంతో పిడుగుపడి వలపర్ల పెద్దగాలెయ్య (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు బావమరిది ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని ప్రశ్నించే ప్రయత్నం చేయగా సమాధానం లేదు. రామయ్య అక్కడికి వెళ్లి చూడగా పెద్ద గాలెయ్య నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య● మృతుడిది కర్ణాటక రాష్ట్రంగా అనుమానంపెద్దారవీడు: మండల పరిధిలోని పోతంపల్లి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కింద గుర్తు తెలియని యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమాన్ జంక్షన్ కుంట నుంచి దోర్నాల వరకు జాతీయ రహదారిలో నూతనంగా తారు రోడ్డు నిర్మాణంలో భాగంగా పోతంపల్లి–రాజంపల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఇనుప చువ్వలకు తన చొక్క కట్టుకొని ఊరేసుకున్నాడు. మృతుడికి సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని, ఒంటిపై బ్లూ కలర్ బార్డర్ కలిగిన ఎర్ర రంగు బనియన్, లైట్ షేడ్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ప్యాంటు జేబులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కెఏ 4420160001511 నంబరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మృతుడి గురించి తెలిసిన వారు పెద్దారవీడు పోలీస్‌స్టేషన్ ఎస్ఐ అనిల్‌కుమార్ 9121102186 లేదా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు సెల్ 9908056611 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు. -
కనిగిరిలో ఒకేరోజు నలుగురు మృతి
కనిగిరి రూరల్:పట్టణ సమీపంలోని పొగాకు బోర్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు పి.పోలయ్య, హనోక్లది మండలంలోని పట్టాభిరామపురం. మండలంలోని కృష్ణాపురంలో కుటుంబ, ఆర్థిక సమస్యలతో యూ.పద్మనాభరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా భూతంవారిపల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో గుండాబత్తుని సుజాత (22) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కనిగిరిలో ఒకే రోజు నలుగురు మృతి చెందడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. పట్టాభిరామపురం ఎస్సీ కాలనీకి చెందిన పాలిపోగు పోలయ్య (28), అదే కాలనీకి చెందిన మర్రి హనోక్ (24)లు బైకుపై పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. మార్గంమధ్యలో టుబాకో బోర్డు సమీపంలో పొదిలి రోడ్డు వైపు నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. పోలయ్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా హనోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో కనిగిరి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు తీసుకెళ్తుండగా మృతి చెందాడు. పోలయ్య బేల్దారి పనులు చేసుకుని జీవిస్తుండగా హనోక్ డిగ్రీ వరకు చదివి కూలి పనులకు వెళ్తున్నాడు. మృతులు బంధువులు.వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యమండలంలోని కృష్ణాపురంలో యూ.పద్మానాభరెడ్డి (45) తన ఇంటికి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. పురుగుమందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని భూతంవారిపల్లిలో శనివారం జరిగింది. సీఎస్‌పురానికి చెందిన జి.సుజాత (22)కు కనిగిరి మండలం భూతంవారిపల్లికి చెందిన అశోక్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి 100 కాల్ చేసి మరీ..తాను పురుగుమందు తాగి చనిపోతున్నట్లు తెలిపి ఆత్మహత్యకు పాల్పడింది. సుజాతను స్థానిక వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణంఆత్మహత్య చేసుకుని మరో ఇద్దరు మృతి -
జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయం
కనిగిరి రూరల్: జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం కనిగిరి వచ్చిన ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్‌తో కలిసి మాట్లాడారు. దద్దాల నారాయణకు జగనన్న అండగా ఉన్నారని, పార్టీ శ్రేణులంతా సమష్టిగా, కష్టపడి పనిచేసి కనిగిరి కంచుకోటపై వైఎస్సార్ జెండా ఎగుర వేయాలని పిలుపు నిచ్చారు. గత ఎన్నికల్లో కూడా జిల్లాలో తక్కువ ఓట్లతో కనిగిరి ఓడిపోయామన్నారు. మంచివాడు, మృధుస్వభావి, అందరిలో ఒక్కడిగా ఉంటూ అందరినీ కలుపుకుని పోతున్న దద్దాల నారాయణకు పార్టీ శ్రేణులంతా అండగా ఉండాలన్నారు. 2029 ఎన్నికల్లో కనిగిరిలో వైఎస్సార్ సీపీ దెబ్బకొడితే దిమ్మతిరిగి పోవాలన్నారు. రాబోయే రోజులు వైఎస్సార్ సీపీవేనని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. పార్టీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మనమంతా కలిసి కట్టుకకు పనిచేసి జగనన్న సీఎం చేసుకుందామన్నారు. కష్టపడి పనిచేద్దాం.. ఇదే ఉత్సాహంతో కనిగిరి కొండపై వైఎస్సార్ సీపీ జెండా ఎగురు వేద్దామని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుందోని ధ్వజమెత్తారు. 11 నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. కూటమి సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఘాటుగా విమర్శించారు. తొలుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, కనిగిరి పార్టీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ జన్నదిన వేడుకల్లో పాల్గొన్నారు. నారాయణకు పుష్పగుచ్ఛం అందజేసి కేక్ తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నారాయణ యాదవ్, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘనంగా కనిగిరి ఇన్చార్జి దద్దాల జన్మదిన వేడుకలు -
భార్యను హత్య చేసిన భర్త
కంభం పంచాయతీ పరిధిలోని సాదుమియా వీధిలో నివాసం ఉంటున్న అర్థవీటి నాగ అంజలి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేస్తుండగా భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ వివాహాలు జరిగాయి. ప్రైవేటు స్కూల్లో పని చేస్తున్న తన భార్య ఇతరులతో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న అతను జనవరి 12వ తేదీ రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో దివాన్కాట్పై నిద్రిస్తుండగా ఓ పెద్ద సైజు కర్ర తీసుకొని ఆమె తలపై దాడి చేయడంతో బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
సంక్షోభంలో వ్యవసాయ రంగం
ఒంగోలు టౌన్: వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోవడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఈ ఏడాది అన్నీ రకాల పంటల ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పులపాలయ్యారని సంయుక్త కిసాన్ రైతు మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు చెప్పారు. దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20వ తేదీ చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నారాయణ స్వామి భవనంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి మాట్లాడుతూ ధాన్యాన్ని రూ.400 తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని, గతేడాది రూ.18 వేలకు విక్రయించిన మిర్చిని ఈ ఏడాది రూ.9 వేలకు అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. పత్తిని 2 వేలకు తక్కువగా అమ్ముతుండగా బర్లీ పొగాకును కొనేనాధుడే లేడన్నారు. అపరాలు, రొయ్యలు, జీడి పిక్కలు, కోకో గింజల ధరలు కంపెనీల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరల విషయంలో కలుగజేసుకోకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా రైతులను దగా చేసిందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంతిబాబు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇస్తానన్న రూ.20 వేలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, సుధీర్, ఆర్.మోహన్, కె.నాంచార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని రైతుసంఘాల పిలుపు -
అంకమ్మ తల్లి కొలుపులకు రాజకీయ గ్రహణం
నాగులుప్పలపాడు: వరాలు అందించే అంకమ్మ తల్లి కొలుపులకు ఈ సారి రాజకీయ గ్రహణం పట్టింది. అనాదిగా అమ్మవారి ఆస్తులపై పెత్తనం చేసిన ఊరి పెద్ద వారసుడు అమ్మవారి సొమ్ములను, ఆస్తులను అన్యాక్రాంతం చేయడంతో ఈ సారి సొంతంగానే కొలుపులు నిర్వహించుకుందామనుకున్న ఆలయ కమిటీ ఆలోచనలకు ఓర్వలేని పెత్తందారులు అమ్మవారి కొలుపులు నిర్వహించే కుటుంబ సభ్యులలోనే విభేదాలు సృష్టించి దానికి రాజకీయ రంగు పులిమి చివరకు కొలుపులు ఆగేలా చేసి గ్రామంలో అలజడికి కారణమయ్యారు. వివరాల్లోకి వెళ్తే నాగులుప్పలపాడు గ్రామంలో 6 దశాబ్దాలకు పైగా వడ్డెర రాజుల కులస్తులు తమ కులదైవం అంకమ్మ తల్లికి ప్రతి మూడేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా కొలుపులు నిర్వహిస్తారు. వడ్డెరలు అమ్మవారికి తయారు చేయించిన బంగారు వస్తువులు, నగదును గ్రామంలోనే పేరు మోసిన ఓ పెత్తందారి ఆధీనంలో ఉంచుతూ కొలుపులు నిర్వహించుకుంటున్నారు. ఆ పెద్ద మనిషి కూడా కొలుపులు నిర్వహించుకునే వారికి అండదండగా ఉంటూ వచ్చాడు. అయితే ఆయన తరువాత అమ్మవారి వస్తువులు, నగదు బాధ్యత చేపట్టిన పెత్తందారి కుమారుడు తన వక్రబుద్ధితో రెండేళ్ల క్రితం అమ్మవారి బంగారు ఆభరణాలు దొంగతనం చేశాడన్న అభియోగంతో పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వడ్డెర కులస్తులకు అమ్మవారి బంగారు ఆభరణాల వివరాలు చెప్పని పెత్తందారి కుమారుడు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే అంకమ్మ తల్లి ఆలయంలో పెత్తందారుల పెత్తనం వద్దని, అమ్మవారిని తమ కుల ధైవంగా భావించే గుంజి అనే ఇంటి పేరు గల కుటుంబ సభ్యులు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసుకొని దానిని రిజిస్టర్ చేయించి ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అమ్మవారికి అత్యంత వైభవంగా కొలుపులు నిర్వహించాలని నిర్ణయించిన గుంజి వారసులు కొలుపులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలోని పెత్తందారుల ప్రమేయం లేకుండా చేసుకుంటున్న ఈ కొలుపులకు ఓర్వలేని కొంత మంది పెద్ద మనుషులు అధికార పార్టీ అండదండలతో గుంజి వారి కుటుంబంలోనే కొద్ది మందిని రెచ్చగొట్టి కొలుపులు జరపకుండా చేయాలని కుట్ర పన్నారు. అనుకున్నదే తడవుగా అధికార పార్టీ నాయకుల చేత కొలుపులు నిర్వహించే వారిపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో పాటు వారికి ప్రతిపక్ష పార్టీ వారంటూ పేరు అంటగట్టి పూర్తి స్థాయి అధికార ధర్పాన్ని ప్రదర్శించి వారిపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో ఆలయ కమిటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలకు సమ్మతించిన హైకోర్టు ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేది వరకు కొలుపులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులు అందజేయడానికి వెళ్లిన కమిటీ సభ్యులపై అందరూ కలిసి కొలుపులు నిర్వహించుకోవాలని జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. గతంలో అమ్మవారి సొమ్ములు అన్యాక్రాంతం చేసిన వారిని కమిటీలోకి తీసుకోకుండా కొలుపులు చేసుకోవడానికి అంగీకరిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో అనుకున్నట్లే శనివారం ఉదయం కోర్టు అనుమతి కాగితాలు పోలీసులకు అందజేసి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న కమిటీ సభ్యులపై అప్పటికే అక్కడ వేచిఉన్న మరొక వర్గం వారు ఆలయంలోకి రాకుండా అడ్డుకోవడంతో ఇరు వర్గాల వారు ఘర్షణ ఏర్పడి ఇరు పక్షాల వారికి గాయాలయ్యాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో పోలీసులు తమ పట్ల నిరంకుశంగా వ్యవహరించారంటూ ఆలయ కమిటీ లోని నలుగురు సభ్యులు పురుగుల మందు తాగడంతో వారిని అత్యవసరంగా 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఈ క్రమంలో రోడ్డు పై భైఠాయించి రాస్తారోకో చేసిన ఆలయ కమిటీ వారిని కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆలయం వద్ద పూర్తి స్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో పెత్తనం చేసిన వారు అమ్మవారి సొమ్ము స్వాహా దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు వర్గపోరును రెచ్చగొట్టిన పెత్తందారులు కోర్టు ఆదేశాలను ఖాతరు చేయని పోలీసులు కమిటీ సభ్యులను ఆలయంలోకి రాకుండా పోలీసులతో అడ్డుకున్న అధికార పార్టీ వర్గీయులు దాన్ని నిరసిస్తూ పురుగుల మందు తాగిన నలుగురు కమిటీ సభ్యులు పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా రాస్తారోకో -
మురళీ నాయక్ భరతమాత ముద్దు బిడ్డ
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ యర్రగొండపాలెం: యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్‌కు శనివారం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలంలోని కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ బోర్డర్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతి చెందిన విషయం విదితమే. మురళీ నాయక్ భరతమాత ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే అభివర్ణించారు. ఆయన కుటుంబానికి యావత్ భారతదేశం అండగా ఉంటుందని అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు. ఆర్మీ జవాన్‌కు నివాళులర్పించిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి కె.ఓబులరెడ్డి, సర్పంచ్‌లు ఆర్.అరుణాబాయి, ఆవుల కోటివీరారెడ్డి, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పబ్బిశెట్టి శ్రీనివాసులు, వివిధ విభాగాల నాయకులు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, సయ్యద్ జబీవుల్లా, దొగిపర్తి సంతోష్‌కుమార్, పి.రాములు నాయక్, సయ్యద్ షాబీర్‌బాష, షేక్.బుజ్జి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు నాయక్, బ్రహ్మారెడ్డి, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు. -
గోకులం బిల్లు మని!
పొన్నలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తరువాత పాడిరైతుల అభివృద్ధికి మినీ గోకులం షెడ్లు నిర్మిస్తామని ముందుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ పెంచి పశుపోషకుల జీవన శైలి మెరుగుపర్చాలన్నదే గోకులం షెడ్ల ప్రధాన లక్ష్యం. అయితే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించే గోకులం షెడ్లకు.. పశువుల షెడ్లకు 90 శాతం రాయితీ, గొర్రెలు, మేకలు, కోళ్లకు 70 శాతం రాయితీని చెల్లిస్తారు. ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా అందించే రూ.2.30 లక్షల్లో రూ.23 వేలు లబ్ధిదారుని వాటా ఉండగా మిగిలిన రూ.2.07 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. ఇంత వరకు బాగానే ఉన్నా గ్రామాల్లో రైతులు నిర్మించిన గోకులం షెడ్లకు ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడంతో ఐదు నెలలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మొత్తం 1190 గోకులం షెడ్లు మంజూరు కాగా ఇందులో 799 షెడ్లను పూర్తి స్థాయిలో నిర్మించారు. మిగిలిన 391 వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో నిర్మించిన 799 షెడ్లకు సుమారుగా రూ.16.54 కోట్ల నిధులు మంజూరు చేయాలి. అలాగే కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 268 గోకులం షెడ్లు మంజూరు కాగా ఇందులో 172 షెడ్లను పూర్తిగా నిర్మించగా మిగిలిన 96 వివిధ దశలో ఉన్నాయి. కొన్ని అసలు మొదలు పెట్టలేదు. అయితే పూర్తి స్థాయిలో నిర్మించిన 172 షెడ్లకు సుమారుగా రూ.3.54 కోట్ల నిధులు లబ్ధిదారులకు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులపై చిన్నచూపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పది నెలలుగా రాష్ట్రంలోని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు, మద్దతు ధరలేకపోవడం, ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం శూన్యం. ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం చూపిస్తున్న ద్వంద్వ వైఖరితో రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. అలాగే గ్రామాల్లో పశుపోషకులు గోకులం షెడ్ల పనులు ప్రారంభించిన తరువాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో మధ్యలో నిర్మాణ పనులను వదిలేయలేక రైతులు అప్పులు చేసి షెడ్లును పూర్తి స్థాయిలో నిర్మించారు. మరికొందరు రైతులు గోకులం షెడ్ల నిర్మాణ పనులు అసలు ప్రారంభించలేదు. మొత్తంగా ఐదు నెలలుగా నిధులు మంజూరు చేయకపోవడం వలన గోకులం షెడ్లు లబ్ధిదారులు ఆర్థికంగా అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు. షెడ్లు నిర్మించినా నిధులు రాక రైతుల నిరాశ ఐదు నెలలుగా నిధుల కోసం నిరీక్షణ జిల్లాలో 1190 మంది రైతులకు గోకులం షెడ్లు మంజూరు అప్పులు తెచ్చి 799 షెడ్లు నిర్మించిన రైతులు జిల్లాలో లబ్ధిదారులకు రావాల్సిన నిధులు రూ.16.54 కోట్లు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు త్వరలోనే నిధులు మంజూరవుతాయి జిల్లాలో గోకులం షెడ్లు నిర్మించిన పశుపోషకులకు ఇంకా బిల్లులు మంజూరు కాలేదు. ఉపాధి హామీ పథకం ద్వారా సుమారుగా 799 మంది లబ్ధిదారులు పూర్తి స్థాయిలో గోకులం షెడ్లు నిర్మించారు. ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి అందించాం. నిధులు మంజూరు కాకపోవడంతో వెంటనే బిల్లులు చెల్లించలేకపోయాం. వచ్చే పది రోజుల్లో సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు బిల్లులు అందిస్తాం. – జోసఫ్ కుమార్, డ్వామా పీడీ, ఒంగోలు -
నీటితొట్లలో నాణ్యత డొల్ల
కొనకనమిట్ల: వేసవిలో మూగ జీవాలు పొలాలకు మేత కోసం వెళ్లినప్పుడు గుక్కెడు నీరు దొరకటం గగనంగా ఉంటుంది. మూగ జీవాలను తోలుకెళ్లే కాపరులు వాటికి నీటిని అందించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల పశువులకు ఉపయోగపడేలా నీటి తొట్లు ఏర్పాటుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించింది. ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.30 వేలు మంజూరు చేసింది. అయితే నీటి తొట్ల నిర్మాణాన్ని కూటమి నేతలకు అప్పగించింది. వారికి తొట్ల నిర్మాణం వరంగా మారింది. తూతూ మంత్రంగా నిర్మించి నిధులు బొక్కేస్తున్నారు. అయితే నాసిరకం ఇసుక, కంకర, ఇటుక వాడుతుండటంతో తొట్లు తొందరగా లీకయ్యే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కొనకనమిట్ల మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో 13 గ్రామాల్లో 48 నీటి తొట్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. గొట్లగట్టులో 10, సిద్దవరం 6, ఇరసలగుండం 4, వింజవర్తిపాడు 3, రేగుమానిపల్లి 3, గరిమినపెంట 3, కాట్రగుంట 2, తువ్వపాడు 2తో పాటు పలు గ్రామాల్లో నీటి తొట్లు అవసరమని భావించి నిధులు కేటాయించారు. అయితే 48 నీటి తొట్లు నిర్మాణం చేపట్టేందుకు మండలంలోని ఓ కూటమి నేతకు నియోజకవర్గ నేత కాంట్రాక్ట్ అప్పజెప్పినట్లు సమాచారం. ఇప్పటికే కాంట్రాక్ట్ దక్కించుకున్న నేత నాసిరకం మెటీరియల్ వాడి చకచకా 40 తొట్లు పూర్తి చేశాడు. ఇంకా 8 తొట్లు పూర్తి కాలేదు. పూర్తి చేసనవి కూడా సక్రమంగా క్యూరింగ్ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తొట్లు మంజూరైన గ్రామాల్లో స్థానిక కూటమి నేతలు ఉండగా వారిని కాదని ఒక్క నాయకుడికే 48 తొట్లు నిర్మాణం చేపట్టేలా కాంట్రాక్ట్ ఇవ్వటంతో స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో తొట్ల నిర్మాణాన్ని అధికార పార్టీ నేతలే అడ్డుకుంటున్నట్లు సమాచారం. అదికూడా నాసిరకంగా తొట్లు నిర్మాణం చేపట్టడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. అధికార పార్టీలోనే తొట్ల నిర్మాణంపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వేసవి కాలం సగం పూర్తవుతోంది. అన్నీ పూర్తి చేసి నీటి వసతి కల్పించే సరికి పుణ్య కాలం కాస్త అయిపోతుందని పశుపోషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవుడు దయ వలన ఇటీవల అక్కడక్కడా వర్షాలు పడి కుంటల్లో కాస్తో కూస్తో నీరు ఉండటంతో మూగ జీవాలకు కొంత వరకు ఉపయోగంగా ఉండటంతో కాపరులు ఊపిరి పోసుకున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తొట్ల నిర్మాణం సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకుని నీటి వసతి కల్పిస్తే రాబోవు రోజుల్లోనైనా పశువులకు ఉపయోగంగా ఉంటుంది. నాసిరకం కంకర, వాడుకకు పనికిరాని ఇటుకలతో తొట్లు తొట్ల నిర్మాణం పశువుల కోసమా..బిల్లుల కోసమా అధికార పార్టీలోనే అసంతృప్తులు -
మీ కోసం 13వ తేదీకి మార్పు
ఒంగోలు సబర్బన్: కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 12న జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని 13వ తేదీకి మార్పు చేశారు. ఈ నెల 12న సోమవారం డీఆర్సీ సమావేశం జరగనుంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన డీఆర్సి సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. 12వ తేదీ డీఆర్సీ నేపథ్యంలో మీకోసం కార్యక్రమాన్ని 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఒంగోలు టౌన్: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందగిరి రాజేష్ స్పష్టం చేశారు. సమ్మె చేపట్టి 10 రోజులైనా స్పందించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. విలేజీ క్లినిక్‌లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్లను నిబంధనల మేరకు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన గురువారం 10వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ...సీహెచ్‌ఓల సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం బాధాకరమన్నారు. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను రెగ్యులర్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, హైక్‌ను వెంటనే అమలు చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్‌లను విడుదల చేయాలని, ఈపీఎఫ్టీ బెనిఫిట్‌ను పునరుద్ధరించాలని, ఎక్స్‌గ్రేషియో పాలసీని అమలు చేయాలని, నిర్ధిష్టమైన జాబ్‌చార్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షా శిబిరంలో ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని 538 మంది సీహెచ్‌ఓలతో పాటుగా రాష్ట్ర , జిల్లా నాయకులు శ్రీకాంత్, ప్రసన్న, జీవనజ్యోతి, జయశ్రీ , రమేష్ తదితరులు పాల్గొన్నారు. పొగాకు వేలాన్ని పరిశీలించిన ఈడీ విశ్వశ్రీ కనిగిరిరూరల్: కనిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ విశ్వశ్రీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వేలం జరుగుతున్న ప్రక్రియను, పొగాకు ధరలు, బేళ్ల నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పొగాకు రైతులతో మాట్లాడారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో అమ్మకానికి తగిన పొగాకును తీసుకుని రావాలని రైతులను కోరారు. కంపెనీల ప్రతినిధులు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అనంతరం బోర్డు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత మార్కెట్ ధరలపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి డి.వేణుగోపాల్, బి. కోటేశ్వరరావు, వేలం నిర్వాహణ అధికారి, రైతు నాయకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి నగరాన్ని జల్లెడ..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దారుణ హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి పెద్ద కర్మ జరిగిన రోజు రాత్రి ఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యవేక్షణలో నగరంలో పోలీసులు పెద్ద ఎత్తున తనీఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ రహదారులపై వెళుతున్న కార్లు, ఆటోలు, మోటారు బైకులను తనిఖీలు చేశారు. నగరంలోని లాడ్జీలు, రెస్టారెంట్లులో అణువణువు గాలింపులు చేపట్టారు. స్క్వాడ్ డాగ్‌లను రంగంలోకి దించారు. ఈ తనిఖీలకు వీరయ్య హత్య కేసుకూ ఏమైనా లింకులు ఉన్నాయ్నా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల తనిఖీలు సహజంగా జరిగిదే కదా అంటే ఎస్పీ దామోదర్, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నుంచి సీఐలు, ఎస్ఐలు అంతా తనిఖీలలో పాల్గొనడం విశేషం. ఏదో జరగబోతుందా అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు పహారా మధ్య వీరయ్య చౌదరి పెద్దకర్మ గురువారం అమ్మనబ్రోలు గ్రామంలో వీరయ్య చౌదరి పెద్ద కర్మ పోలీసు పహారా మధ్య జరిగింది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150 మంది పోలీసులు, రూరల్ సీఐ, ముగ్గురుఎస్సైలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులు నిఘా పెట్టారు. వీరయ్య చౌదరి ఇంటి వద్ద నిర్వహించిన పెద్ద కర్మకు టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. కేసు విచారణ కీలక దశకు వచ్చినట్టేనా..? వీరయ్య చౌదరి హత్య జరిగిన నేటికి 18 రోజులైంది. హత్యకు సంబంధించి పోలీసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే వీరయ్య హత్య కేసులో సూత్రధారులను, పాత్రధారులను దాదాపుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్య కేసులో ప్రధాన పాత్రధారుడిగా అనుమానిస్తున్న అమ్మనబ్రోలుకే చెందిన హవాలా వ్యాపారి మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదని సమాచారం. రేపో మాపో కేసును ఫైనల్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మరికొంత మంది పోలీసులపై చర్యలు? వీరయ్య హత్య తాలుకా పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగిన విషయం తెలిసిందే. హత్యకు ముందు నిందితులు వీరయ్య కార్యాలయం వద్ద రోజుల తరబడి రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. అంతేకాకుండా తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న గుంటూరు రోడ్డులోని ఒక లాడ్జీలో నిందితులు కొద్ది రోజుల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. హత్య చేసిన తరువాత కూడా తాలుకాపోలీసు స్టేషన్ మీద నుంచే హంతకులు పరారయ్యారు. అంటే హత్యకు ముందు, హత్య తరువాత కూడా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తొలివేటు తాలుకా సీఐ అజయ్ కుమార్ మీద వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరయ్య హత్య కేసును ముందుగా పసికట్టలేక పోయిన మరింత మంది పోలీసులను బాధ్యులుగా నిర్ణయించినట్లు సమాచారం. వారి మీద కూడా చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చర్చనీయంగా మారిన పోలీసుల రాత్రి తనిఖీలు పోలీసు పహార మధ్య వీరయ్య చౌదరి పెద్దకర్మ వీరయ్య హత్య కేసు రెండు రోజుల్లో ముగింపు ఎస్పీ, డీఎస్పీ, సీఐలు పెద్ద ఎత్తున తనిఖీలు ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరించిన పోలీసు విచారణ బృందం -
1.5 కేజీల గంజాయి పట్టివేత
కనిగిరి రూరల్: నిషేధిత మత్తు పదార్థం గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్ పేర్కొన్నారు. కనిగిరి పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఎస్పీ ఉత్తర్వ్లు మేరకు ఈ నెల 5న కనిగిరిలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన సమయంలో అక్రమంగా గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు గుర్తించామన్నారు. మంచినీటి దొరువు వద్ద గల బ్రహ్మంగారి గుడి దగ్గర మంగలిమాన్యానికి చెందిన నాగులూరి నరసింహ, నాగులూరి రాజేశ్వరి, దొరువు బజార్‌కు చెందిన కట్టా దుర్గ, పాతూరుకు చెందిన నాగులూరి దుర్గాప్రసాద్ అనే వ్యక్తులు నాగులూరి వెంకటేశ్వర్లు, అతని కుమారుడు అంకబాబు వద్ద గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్ల రూపంలోకి మార్చి కనిగిరిలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. బ్రహ్మంగారి గుడి వద్ద బుధవారం సుమారు 1.5 కేజీల గంజాయిని ప్యాకెట్లుగా మారుస్తున్న క్రమంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్లు, అంకబాబు కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించి ఒంగోలు, దరిశి జైలుకు పంపారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అధికారి కనిగిరి సీఐ ఎస్కే ఖాజావలి, కనిగిరి, హెచ్‌ఎంపాడు ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నలుగురు నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన కనిగిరి డీఎస్పీ -
అక్షరంపై అక్కసా సిగ్గు.. సిగ్గు
ఒంగోలు టౌన్: పత్రికా చరిత్రలో ఇదోక బ్లాక్ డే.. కనివినీ ఎరుగని విధంగా ఒక పత్రికా సంపాదకుడిపై పోలీసులు దాడి చేయడాన్ని యావత్ జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్ర స్వరంతో ఖండించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలోకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే చొరబడిన పోలీసులు గంటల తరబడి వేధింపులకు దిగడం పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కంభం తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఎక్కడికక్కడ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో వివిధ జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించిన జర్నలిస్టులు నగరంలోని సాక్షి సీటీ కార్యాలయం నుంచి కోర్టు సెంటర్, రాజాపానగళ్ రోడ్డు, వీఐపీ రోడ్డు మీదుగా జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరిన జర్నలిస్టులు కలెక్టరేట్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. చౌరస్తాలో నిరసన చేపట్టిన జర్నలిస్టులు..రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ చినోబులేసుకు వినతిపత్రం అందజేశారు. పత్రికా స్వేచ్ఛపై దాడులు సమర్ధనీయం కాదు... సాక్షి ఎడిటర్ ఇంటిపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి గంటల తరబడి ఇబ్బందులకు గురిచేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. సురేష్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత దుర్మార్గమైన ఘటనగా అభివర్ణించారు. దేశంలో ఒకవైపు ఉగ్ర దాడుల తరువాత యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో మరేమి పనిలేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలిలో ముగ్గురు జర్నలిస్టులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించడం పత్రికల గొంతునొక్కడమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న మీడియాపై దాడులకు పురిగొల్పడం అభ్యంతరకరం. గతంలో మండల విలేకరులు, జిల్లా స్థాయి విలేకరులపై ఏవో చిన్న చిన్న ఘటనలు జరిగేవని, ఇప్పుడు ఏకంగా ప్రముఖ పత్రికా ఎడిటర్ మీదనే దాడికి పాల్పడడం దారుణమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులను విరమించుకోకపోతే జర్నలిస్టులంతా రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పోలీసులతో సాక్షి ప్రతికా ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై దాడికి పాల్పడడం ఎమర్జెన్సీని తలపిస్తుందని సీనియర్ జర్నలిస్టు జనార్దన్ విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం పత్రికలను స్వాధీనం చేసుకున్న విధంగానే ప్రస్తుత కూటమి పాలకుల తీరు ఉందన్నారు. పాలకులు, పత్రిపక్షాలు ఎవరి పోరాటాలు వారికుంటాయని, పత్రికల ప్రజాస్వామిక హక్కుల మీద దాడికి దిగడం దుర్మార్గమన్నారు. పాత్రికేయులను భయపెట్టేందుకే... సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటో పోలీసులు దౌర్జన్యంగా తనీఖీలు నిర్వహించడం పాత్రికేయులను భయాందోళనకు గురి చేయడమేనని ఏపీయూడబ్ల్యూజే ప్రకాశం జిల్లా కమిటీ గురువారం ఒక ప్రకటనలో ఖండించింది. ఒక ప్రముఖ పత్రికా సంపాదకుడి ఇంట్లో సోదాలు నిర్వహించాలని అనుకుంటే ముందుగా నోటీసులు ఇచ్చి ఉండాల్సిందని, అందుకు విరుద్ధంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటిలోకి చొరబడిన తీరు గర్హనీయమని పేర్కొన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే లక్ష్యంతోనే దాడి చేసినట్లు భావిస్తున్నాం. పత్రికా ఎడిటర్ అన్న గౌరవం కూడా లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు మాకుమ్మడిగా ఇంట్లోకి చొరబడి తనిఖీలు చేయడం గర్హనీయం. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు కొనసాగిస్తే ప్రజాస్వామ్యవాదులంతా ఎదుర్కొంటారు. – ఐవీ సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఉక్కు పాదమా? సాక్షి పత్రిక ఎడిటర్ నివాసంలో అక్రమ సోదాలు ఖండించిన జర్నలిస్టుల సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఒంగోలులో నల్లబ్యాడ్జిలతో భారీ ర్యాలీ మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, కంభంలలో జర్నలిస్టు సంఘాల నిరసన ప్రదర్శనలు ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని ఏపీయూడబ్ల్యూజే ఖండన ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియాపై కూటమి ప్రభుత్వం బరి తెగింపు ప్రదర్శిస్తోంది. లక్షల మెదళ్లను కదిలించే అక్షరాలను చిదిమివేయాలని చూస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రచురించే పత్రికా స్వేచ్ఛను హరించాలని ప్రయత్నిస్తోంది. ‘సాక్షి’పత్రిక ఎడిటర్ ఇంట్లోకి ఖాకీలు చట్టవ్యతిరేకంగా చొరబడి సోదాలు చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు గర్హిస్తున్నారు. విశృంఖల దాష్టీకాలకు పాల్పడిన బ్రిటిష్ పాలకులనే తరిమికొట్టిన అక్షరాలను చెరిపి వేయాలనుకుంటే.. చరిత్ర గర్భంలో కలిసిపోవడం ఖాయమని జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, సామాన్య ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
అవినీతి షికారు..!
డీఎంహెచ్ఓ కార్యాలయానికి అవినీతి జబ్బు చేసింది. జిల్లా వాసులకు మెరుగైన వైద్యసేవలందించే విషయంలో కీలక భూమిక పోషించే వైద్య ఆరోగ్యశాఖ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. నర్సింగ్ పదోన్నతలు మొదలు డిప్యుటేషన్ల వరకూ పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. జేసీ నిర్వహించాల్సిన విచారణ వాయిదాలు పడుతుండడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ పనితీరు మారడం లేదు. ఒక అవినీతి మరచిపోక ముందే మరో అవినీతి ఆరోపణలు వచ్చిపడుతున్నాయి. నర్సింగ్ సిబ్బంది పదోన్నతుల సమయంలో ఫోన్ పే ద్వారా మామూళ్లు వసూలు చేయడం సంచలనం సృష్టించింది. అది మరచిపోకుండానే ముఖ హాజరు విషయంలో ట్యాంపరింగ్ కలకలాన్ని సృష్టించింది. తాజాగా నిబంధనలకు వ్యతిరేకంగా ఓ అధికారి డీఎంహెచ్ఓ కార్యాలయంలో తిష్టవేసి వసూళ్లకు పాల్పడం చర్చనీయాంశమైంది. ఆ మెడికల్ ఆఫీసర్‌కు ఇక్కడేం పని... జిల్లా కేంద్రానికి సమీప మండలంలోని ప్రాథమిక వైద్యశాలలో పనిచేస్తున్న ఒక మెడికల్ ఆఫీసర్ గత ఏడాది జూన్ 31వ తేదీ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఓ విభాగానికి ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలను పూర్తిస్థాయిలో తీసుకొని పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది జనవరి 31వ తేదీన ఆయన స్థానంలో వేరే అధికారి బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. అప్పటి వరకు ఇన్చార్జిగా వ్యవహరించిన సదరు మెడికల్ ఆఫీసర్‌ను పూర్వ స్థానానికి వెళ్లిపోవాలని స్వయంగా డీఎంహెచ్ఓలు వెంకటేశ్వర్లు ఆదేశించినట్లు సమాచారం. ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన మాత్రం విధుల్లో చేరలేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోనే తిష్టవేసినట్లు సమాచారం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో అనధికారికంగా విధులు నిర్వహించిన ఆయన అక్రమంగా వసూళ్లకు తెరదీసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారికి చెందిన కారు డ్రైవర్‌తో కలిసి ప్రైవేటు వైద్యశాలల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసినట్లు సమాచారం. ఒక్కో వైద్యశాల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పటికే కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబుకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్‌కు విచారణ ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు సాక్ష్యంగా వారు సదరు ఆఫీసర్ హయాంలో జరిగిన ప్రైవేట్ వైద్యశాలల రెన్యువల్స్‌ను ప్రస్తావిస్తున్నారు. ఆయన హయాంలో జరిగిన ప్రైవేట్ వైద్యశాలల రెన్యువల్స్‌ను పరిశీలిస్తే సీసీ కెమెరాలలో వాస్తవాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా సదరు మెడికల్ ఆఫీసర్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎఫ్ఆర్ఎస్ వేసినట్లు తెలుస్తుంది. ప్రైవేట్ కారుకు ప్రభుత్వ డ్రైవర్... జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ప్రైవేట్ కారు వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఓ అధికారి పర్యటనల నిమిత్తం ఓ ప్రైవేట్ వాహనాన్ని కేటాయించుకున్నారు. దీనికి ప్రైవేట్ డ్రైవర్‌ను ఉపయోగించుకొని అధికారిక పర్యటనలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా ఇద్దరు ప్రభుత్వ డ్రైవర్లను ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై కూడా ప్రజా సంఘాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రైవేట్ వాహనానికి ఎల్లో నెంబర్ ప్లేటు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ వైట్ ప్లేటు పెట్టుకొని తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నెల నెల బిల్లులు పెట్టుకుంటున్నట్లు సమాచారం. వాయిదాల్లో విచారణ.. ఇప్పటికే నర్సింగ్ సిబ్బంది పదోన్నతుల విషయంలో ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నర్సింగ్ స్టాఫ్ సీనియార్టీ లిస్టును మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కానీ ఇంత వరకు విచారణ జరగలేదు. తాజాగా మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంటుందా లేదో తెలియడం లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. వరుసగా అవినీతి అరోపణలు తీరు మార్చుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా తిష్టవేసి చక్రం తిప్పుతున్న ఓ అధికారి ప్రైవేటు కారుకు ప్రభుత్వ డ్రైవర్ అక్రమంగా డిప్యుటేషన్లు... జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమంగా డిప్యుటేషన్లు వేసినట్లు తెలుస్తుంది. ఒక్కొక్కరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలోని అనుమలవీడు పీహెచ్సీలో ఆఫీసు సబార్డినేటర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని, ఈతముక్కలపాడు పీహెచ్సీలో ఎంపీహెచ్‌ఏగా పనిచేస్తున్న ఉద్యోగిని, కొర్రపోలు పీహెచ్సీలో ఫార్మసీస్ట్గా పనిచేస్తున్న వారిని డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యుటేషన్ వేశారు. పుల్లల చెరువు పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడిని ఈతముక్కల పీహెచ్‌సీకి డిప్యూటేషన్ వేశారు. ఇవన్నీ అధికారికంగా డిప్యుటేషన్ వేసినట్లు సమాచారం. అలాగే కొత్తపట్నం పీహెచ్సీలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్, కొమరోలు పీహెచ్సీలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌ను సైతం డీఎంహెచ్ఓ కారాలయంలో అనధికారికంగా డిప్యూటేషన్ వేసినట్లు ఆరోపణలు వినిపిసున్నాయి. -
కక్ష సాధింపులు ఇంకెన్నాళ్లు?
దొనకొండ: సంక్షేమ పథకాలు అందించి మేలు చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, అరాచకాలకు పాల్పడుతోందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి విమర్శించారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించడం మానుకోవాలని హితవు పలికారు. దొనకొండ మండలంలోని ఆరవల్లిపాడు గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా బుధవారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అక్రమ కేసులు బనాయించడంపైనే శ్రద్ధ చూపుతోందని ఎద్దేవా చేశారు. బడుగు బలహీనవర్గాలకు, రైతులకు, మహిళలకు అని రకాలుగా సంక్షేమాన్ని అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని కొనియాడారు. గతంలో పొగాకు, మిర్చి, కంది, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత మాట దాటవేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు తేటతెల్లమైందన్నారు. సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబునాయుడుతోపాటే రాష్ట్రంలోకి కరువు వచ్చిందని, అరకొరగా పండిన పంటను సైతం అమ్ముకోలేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాబోయే ఎన్నకల్లో వైఎస్సార్ సీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలే వైఎస్సార్ సీపీకి కొండంత బలమని, కేసులు పెట్టినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో పర్యటించి రైతులతో మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ బాపనపల్లి శ్రీను, దర్శి నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు కాలూరి రమణయ్య, జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ గుంటు పోలయ్య, దర్శి నియోజకవర్గ వలంటీర్ వింగ్ అధ్యక్షుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా యాక్టివ్ మెంబర్ బత్తుల వెంకటసుబ్బయ్య, బీమిని వెంకటేశ్వర్లు, గొంగటి మహేష్‌రెడ్డి, కన్నెధార వెంకటసుబ్బయ్య, ఐలూరి శ్రీనివాసరెడ్డి, కసిబిసి నాగరాజు, తమ్మనేని సుబ్బారెడ్డి, ఇండ్ల శ్రీనివాసరావు, పులిమి శివ, కె.ప్రసాద్, ఆరవల్లిపాడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేసులు పెడితే బెదిరేది లేదు కార్యకర్తలే వైఎస్సార్ సీపీ బలం సూపర్ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు సర్కారుకు సిగ్గుచేటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి -
డిమాండ్ ఉన్నా ధర దక్కనివ్వడం లేదు
ఒంగోలు సబర్బన్: మార్కెట్లో పొగాకుకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు ధర దక్కనివ్వడం లేదని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదికంటే ఈ సంవత్సరం భూముల కౌలు, కూలీ రేట్లు పెరిగాయని, గిట్టుబాటు ధర లేకపోవడంతో సంక్షోభంలో చిక్కుకున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పొగాకుకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతుల నుంచి కొనుగోలు చేయకుండా వేలానికి తెచ్చిన బేళ్లను నోబిడ్, కంపెనీ రిజెక్ట్ పేరుతో వెనక్కి పంపిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట వద్ద కొనుగోలు కేంద్రంలో పొగాకు వేలం తీరును కలెక్టర్ పరిశీలించారు. టుబాకో బోర్డు ఆర్ఎం లక్ష్మణరావుతోపాటు వేలం నిర్వహణ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు, ధర తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. పొగాకు సాగు, దిగుబడి, వేలం కేంద్రంలో ఇబ్బందులపై ప్రశ్నించగా వారు తమ ఇబ్బందులను వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. పొగాకు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పొగాకు కొనుగోలు చేయాలని బోర్డు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు, వేలం నిర్వహణాధికారి తులసి, ఒంగోలు రూరల్ తహసీల్దార్ వాసు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎదుట పొగాకు రైతుల ఆవేదన త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని బోర్డు అధికారులకు సూచన -
బైక్ అదుపు తప్పి ఆర్టీసీ ఉద్యోగి మృతి
ముండ్లమూరు(కురిచేడు): ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని వేంపాడు గ్రామం వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. ఒంగోలుకు చెందిన షేక్ మహబూబ్ బాషా(60) చీమకుర్తిలో నివాసముంటూ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పి పడటంతో బలమైన గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మహబూబ్ బాషా మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు హనుమంతునిపాడు: జామాయిల్ కోతకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన హనుమంతునిపాడు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కొండారెడ్డిపల్లి, కోటతిప్పల గ్రామాలకు చెందిన కూలీలు జామాయిల్ కర్ర కోతకు వెళ్లారు. ఈ క్రమంలో తోట గట్టు వెంట ముళ్ల పొదను జేసీబీతో తొలగిస్తుండగా అందులో ఉన్న తేనె తుట్టె కదిలింది. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా కూలీలను చుట్టుముట్టాయి. గాయం శివారెడ్డి, సీహెచ్ దశరథ, నర్సయ్య, వెంకటలక్ష్మిలతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖేల్ ఇండియా బీచ్ గేమ్స్‌కు కొండరాజు కొనకనమిట్ల: మండలంలోని నాగంపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు కసిబిసి కొండరాజు ఖేల్ ఇండియా బీచ్ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో ఎంపీడీ చదువుతున్న కొండరాజు ఈనెల 6వ తేదీన శాప్ ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీచ్ సెపక్తక్రా పోటీల్లో ప్రకాశం జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేల్ ఇండియా బీచ్ గేమ్స్ 2025లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు కొండరాజుకు అవకాశం దక్కిందని కోచ్ ఎం.ప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. రిటైర్డ్ ఎస్సై శిలార్ బాషా మృతి కంభం: పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎస్సై, బిలాల్ మసీదు గౌరవాధ్యక్షుడు షేక్ శిలార్ బాషా(70) గురువారం ఉదయం మృతి చెందారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారని బంధువులు తెలిపారు. శిలార్బాషా మృతికి పలువురు సంతాపం తెలిపారు. -
కూటమి ప్రభుత్వంలో అరాచక పాలన
పొన్నలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన కొనసాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పొన్నలూరు మండలంలోని మాలపాడు గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ మాటల మాంత్రికుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచే ప్రతి విషయంలో అవినీతికి పాల్పడుతూ దర్జాగా ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. తొలి నుంచి యూటర్న్ బాబుగా పేరుపొందిన చంద్రబాబు ఏడాదిగా రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. గ్రామానికి రెండు నుంచి మూడు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అమాయక పేద ప్రజలను మద్యానికి బానిసలుగా తయారు చేయడం నీచమన్నారు. చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనను ప్రజలు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మేధావులు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండాబత్తిన మాధవరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి సిరిగిరి గోపాల్ రెడ్డి, పిల్లి తిరుపతిరెడ్డి, సర్పంచ్ అనుమోలు ప్రసాద్, నవులూరి మధు, కొండపి, జరుగుమల్లి మండలాల కన్వీనర్లు బచ్చల కోటేశ్వరరావు, పిన్నికి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాటల మాంత్రికుడిలా సీఎం చంద్రబాబు తీరు పేదలను మద్యానికి బానిసలు చేయడం నీచం ఏడాది పాలనలో ప్రజలకు చేసిన మేలేమిటో చెప్పాలి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజం -
జీవో 77 వెంటనే రద్దు చేయాలి
ఒంగోలు సిటీ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని లాయర్‌పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద మంగళవారం జీవో నం.77 ను రద్దు చేయాలని కోరుతూ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దహనానికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా ఒన్‌టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు విభాగ్ కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ జీవో నంబర్ 77 రద్దు చేయకుండా బుధవారం ఐసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఆ జీఓపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ఇవ్వకపోతే ఐసెట్ పరీక్షలను అడ్డుకుంటామని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం ఎంతో సిగ్గు పడాల్సిన విషయమన్నారు. ఎన్నికల ముందు తమ ప్రభుత్వం రాగానే జీవో నంబరు 77 ను రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి నేటికి 327 రోజులవుతున్నా దానిని పట్టించుకోలేదన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి కళ్లు తెరిచి విద్యార్థుల సమస్యలు చూడాలని, పీజీ విద్యార్థుల మెడ మీద కత్తిలా తయారైన జీవో నం.77 ను ఐసెట్ పరీక్షలకు ముందే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు సుదర్శన్, గురునాథ్, శామ్యూల్, అయ్యప్ప, నరేంద్ర, ఈశ్వర్ రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు -
రాచర్లలో బంగారు బాల్యం సర్వే పూర్తి
ఒంగోలు సబర్బన్: బంగారు బాల్యం పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన రాచర్ల మండలంలో బంగారు బాల్యం సర్వే పూర్తి చేసినట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. అందుకు సంబంధించి మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాచర్ల మండలంలోని పాఠశాలలకు వెళ్లాల్సిన బాల బాలికలను 380 మందిని గుర్తించారన్నారు. వారి కుటుంబాల స్థితిగతులు తెలుసుకొని వారిని తిరిగి పాఠశాలల్లో చేర్చేందుకు సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే వారికి అవసరమైన వనరుల సమకూర్చాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ సర్వేలో చాలా మంది వికలాంగుల పిల్లలు ఉన్నందున వారికి వీల్ చైర్స్, త్రి సైకిల్స్‌ను సమకూర్చాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. త్వరలో జరగబోయే బంగారు బాల్యం నెలవారీ సమీక్షలో జిల్లా వ్యాప్తంగా బంగారు బాల్యం సర్వేపై తగిన సూచనలు తెలియజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి పి. సుధా మారుతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి. దినేష్ కుమార్, గిరిధర్ శర్మ, సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
కార్యదర్శిపై విచారణ
నాగులుప్పలపాడు: అధికార పార్టీ నాయకుల అక్రమాలకు ఊతం ఇవ్వని అధికారులపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు మరోమారు బహిర్గతం అయ్యాయి. తమ పరిధి కాని గ్రామ పంచాయతీల పేర్లతో ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఓ టీడీపీ చోటా నాయకుడు మట్టిగుంట, ఈదుమూడి, ఉప్పుగుండూరు, ఒమ్మెవరం గ్రామ పంచాయతీల్లో అవినీతి జరిగిందని ఆయా సమయాల్లో పనిచేసిన కార్యదర్శి పై విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని గతంలో డీపీవో కు ఫిర్యాదు చేశాడు. దానిపై విచారణాధికారిగా నియమితులైన డీఎల్పీవో పద్మావతి ఇప్పటికే మూడు సార్లు విచారణ పేరుతో సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు అందజేశారు. పలుమార్లు ఫిర్యాదుదారుడు విచారణకు గైర్హాజరయ్యాడు. ఈక్రమంలో మంగళవారం మళ్లీ విచారణ చేపట్టారు. డీఎల్పీఓ విచారణకు పంచాయతీ కార్యదర్శులు, టీడీపీకి చెందిన ఫిర్యాదుదారుడు హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడి వద్ద నుంచి ఆధారాలు కావాలని డీఎల్పీవో పద్మావతి అడగగా తన వద్ద పూర్తి సమాచారం లేదని చెప్పి విచారణలో సంతకం మాత్రమే చేసి బయటకు వెళ్లిపోయాడు. ఆరోపణలు చేసిన ఫిర్యాదులకు ఆధారాలు కావాలని ఫిర్యాదుదారుడిని డీఎల్పీవో అడిగినా అతని నుంచి సరైన సమాధానం లేదు. తాను పనిచేసిన కాలంలో రికార్డులు చూపించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శిని కోరగా ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగలేదని తగిన రికార్డులు చూపుతూ ఆయన లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దీనిపై సంతృప్తి చెందిన డీఎల్పీవో ఇదే అంశాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నాయకులు తమ మాట వినడానికి పంచాయతీ కార్యదర్శులపై ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం తగదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీహెచ్‌ఓల వినూత్న నిరసన ఒంగోలు టౌన్: జీతభత్యాలు మెరుగుపరచాలని కోరుతూ విలేజి క్లినిక్‌లలో వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్‌ఓలు సమ్మె చేస్తున్నారు. వారం రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకునే తీరిక, ఓపిక లేనట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంతటితో ఊరుకోకుండా సమ్మెలో పాల్గొన్న సీహెచ్ఓ జీతాలను నిలిపివేసి కక్షసాధింపు చర్యలకు దిగింది. వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడంతో సమస్యను న్యాయదేవత దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ఒక మహిళా సీహెచ్ఓ న్యాయదేవత పాత్ర పోషించగా మిగిలిన సీహెచ్‌ఓలు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ వద్ద సీహెచ్‌ఓల దీక్షా శిబిరం వద్ద మంగళవారం కనిపించిన ఈ దృశ్యం చూపరులను ఆలోచింపచేసింది. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ రాష్ట్ర గౌరవ సలహాదారులు అనుమల రామకృష్ణ మాట్లాడుతూ.. సీహెచ్‌ఓల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఈ నిరసన దీక్షలో నాయకులు ఎం రాజేష్, జీవన జ్యోతి, ప్రసన్న, దీప్తీ, కామేష్, రామాంజనేయులు పాల్గొన్నారు. అవినీతి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ధ్రువీకరణ కక్ష సాధింపు చర్యలంటూ కార్యదర్శుల ఆందోళన -
వీరయ్య కేసులో వీడుతున్న చిక్కుముడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు చిక్కుముడి వీడుతున్నట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్న కొప్పోలుకు చెందిన ఇసుక వ్యాపారి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అతడికి పరిచయమున్నట్లు చెబుతున్న యువకుడు మరణించడంతో ఇసుక వ్యాపారి స్వయంగా లొంగిపోయాడా లేక పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా అతడు పట్టుపడితేనే కానీ పూర్తి వివరాలు వెల్లడికావంటూ ఇన్నాళ్లుగా పోలీసులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అతడు దొరికిపోవడంతో దాదాపుగా కేసు ముగిసినట్టేనని తెలుస్తోంది. హత్యకు ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు, ఎవరి పాత్ర ఏమిటి, హత్యలో పాల్గొన్న హంతకులు ఎంతమంది, వారంతా ఎక్కడివారనే సమాచారాన్ని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ హత్యలో నిందితులంతా దాదాపుగా టీడీపీ నాయకులేనని పోలీసుల నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన సూత్రధారిగా చెబుతున్న అమ్మనబ్రోలు టీడీపీ యువనాయకుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. నెల్లూరుకు చెందిన మరో ఇద్దరు పాత్రధారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలో ప్రధాన పాత్రధారి కూడా దొరికిపోవడంతో గురువారం వీరయ్య పెదకర్మలోపే పోలీసులు కేసును ఫైనల్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అందరూ అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకులే... తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి ఏప్రిల్ 22వ తేదీ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడివారంతా వీరయ్య చౌదరి స్వగ్రామమైన అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకులే కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. హత్యకు ప్రధాన సూత్రధారిగా చెబుతున్న వ్యక్తి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రస్తుతం సంతనూతలపాడు టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటుగా మరో ఇద్దరు సూత్రధారులు కూడా అదే గ్రామానికి చెందిన వారిగా ప్రచారం జరుగుతోంది. హత్యకు పథక రచన నుంచి డబ్బు సమకూర్చడం కూడా వీరే చేశారని ప్రచారం జరుగుతోంది. వీరి వెనక పెద్ద తలకాల హస్తమేమన్నా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఈ కేసును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టేందుకు ఎల్లో మీడియా ప్రయత్నం చేసి విఫలమైందని స్థానికులు చెబుతున్నారు. హత్యకు పథకరచన చేసి, డబ్బులు సమకూర్చినవారంతా టీడీపీ నాయకులేనని తేలడంతో వారు చేతులెత్తేశారని చెప్పుకుంటున్నారు. టీడీపీ నాయకుల్లో కలకలం... వీరయ్య చౌదరి హత్య కేసు ఫైనల్‌కు చేరడంతో జిల్లాకు చెందిన టీడీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. హత్యలో ప్రధాన సూత్రధారుడిగా చెబుతున్న అమ్మనబ్రోలు టీడీపీ యువనాయకుడితో జిల్లా టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు సత్సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అతడితో రాసుకొని పూసుకొని తిరిగిన దాఖలాలు ఉన్నాయి. దాంతో ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎవరి తలకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వీరయ్య చౌదరి అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ హంతకులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని చెప్పడం, అసలు హంతకులకు ఈ నేల మీద తిరిగే అర్హతలేదనడంతో పోలీసులు ఈ కేసును ఎటు తీసుకెళతారో అర్థంకాక గుబులు చెందుతున్నారు. వీరయ్య చౌదరి హత్యలో నిందితులంతా తెలుగుదేశం పార్టీకి చెందినవారే ఉండడంతో ఇప్పటికే ఆ పార్టీ పరువు పోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోలీసుల అదుపులో ప్రధాన పాత్రధారుడు కేసు చివరిదశకు రావడంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన నిందితులంతా టీడీపీవారే కావడంతో ఏం జరుగుతుందోనన్న గుబులు -
రెవెన్యూ సమస్యలపై బాధ్యతాయుతంగా పనిచేయాలి
● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి పూర్తి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశమై ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు, ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో వచ్చిన అర్జీల పరిష్కారం, జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన భూ కేటాయింపుల ప్రతిపాదనలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వస్తున్నాయని, వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్లో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలపై క్షేత్ర స్థాయి ఆడిట్‌ను సక్రమంగా నిర్వహించాలన్నారు. అర్జీల పరిష్కారంలో భాగంగా క్షేత్ర స్థాయిలో ఎండార్స్మెంట్ చేసిన వాటి పరిష్కారం చూపిన విధానం సక్రమంగా ఉందా లేదని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలన్నారు. ముఖ్యంగా రీ ఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సక్రమంగా ఎండార్స్మెంట్ చేశారా లేదా అని పరిశీలించాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో నెలకొన్న రెవెన్యూ సమస్యల వివరాలను, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై గ్రామాల వారీగా నివేదికను వెంటనే సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ కేటాయింపులపై వచ్చిన అర్జీలను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరావుతో పాటు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పదవుల కాక
కూటమిలోజిల్లాలో వివిధ కార్పొరేషన్ పదవుల పంపకం కోసం కూటమి నేతలు పోటీపడుతున్నారు. ఎన్నికల సమయంలో పదవుల ఆశచూపి పనిచేయించుకుని తీరా అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోకుండా మొండిచేయి చూపుతున్నారంటూ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కూటమి నేతల మధ్య సఖ్యత లేక పదవుల పంపకంలో జాప్యం జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య పోటీతో పాటుగా, టీడీపీ, జనసేనలోని గ్రూపు రాజకీయాలు కూడా పదవులకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. కూటమిలో సఖ్యత లేకపోవడమే కారణమా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన పదవుల పంపకాల్లో టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా నూకసాని బాలాజీ, మారిటైం బోర్డు చైర్మన్‌గా దామచర్ల సత్యలకు పదవులు దక్కాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వీరిద్దరికీ పదవులను ఇవ్వకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయినా లోకేష్ ద్వారా సత్య, చంద్రబాబు ద్వారా బాలాజీ పదవులు తెచ్చుకున్నారు. పదవుల కోసం ప్రయత్నాలు చేసే వారికంటే నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, అతడికి మాత్రం ఇవ్వవద్దు అంటూ పట్టుపడుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారని తెలిసింది. ఇది అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు చెప్పుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన కార్పొరేషన్ పదవులను భర్తీ చేయకపోవడంతో నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు చాలా మంది నాయకులకు పదవుల ఆశ చూపించి అన్నీ రకాలుగా వాడుకున్నారు. తీరా ఎన్నికలు పూర్తయ్యాక పదవులు భర్తీ చేయకుండా తిప్పుకోవడంపై తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు జనసేన నాయకులు కూడా పదవుల్లో వాటా అడుగుతుండడంతో అధిష్టానం ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ పదవుల విషయంలో తొలుత హడావుడి చేసిన జనసేన నాయకులు ఇప్పుడు ఆశలు వదులుకొని చడీ చప్పుడు లేకుండాపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒడా పదవి కోసం పోటాపోటీ... ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఒడా) పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీల మధ్య మొదట్నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పదవిని జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌కు ఇప్పిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే సీనియర్ నాయకుడు మంత్రి శ్రీనివాస్ కూడా తనకు ఒడా పదవి కావాలని పట్టుపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయనతో పాటుగా సింగరాజు రాంబాబు సైతం ఒడా పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరిగింది. స్థానిక నాయకులతో సంబంధం లేకుండా ఒడా పదవికి దర్శి మాజీ ఎమ్మెల్యే పాపారావు పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన గొట్టిపాటి లక్ష్మి కూడా ఈ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాయకుల మధ్య పోటీ ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకుంటున్నట్లు కనిపించడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా ఈ పదవిని భర్తీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాంతో ఒడా పదవిని ఆశిస్తున్న నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. మిగతా జిల్లాల్లో పదవులను భర్తీ చేసి కేవలం ఒంగోలు ఒడా పదవిని మాత్రమే ఎందుకు భర్తీ చేయడం లేదని గట్టిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పీడీసీసీ బ్యాంకు పదవి సంగతేంటో... జిల్లాలో కీలకమైన మరో పదవి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (పీడీసీసీ) చైర్మన్. ఈ పదవిని టీడీపీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో గత ఎన్నికల్లో దామచర్ల విజయం కోసం పనిచేసిన పలువురు నాయకులు ఈ పదవిపై కన్నేసినట్లు చెప్పుకుంటున్నారు. నగరంలో స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడిగా పేరున్న మండవ మురళీకృష్ణ పీడీసీసీ పదవి కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆయనకు బదులుగా నగరంలోని ప్రముఖ వైద్యశాల నిర్వాహకుడైన డాక్టర్ సీతారామయ్య పేరును అధిష్టానం వద్ద ఎమ్మెల్యే దామచర్ల ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిద్దరే కాకుండా ఇటీవల హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి కూడా పీడీసీసీ రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ ఈ పదవికి వీరయ్య పేరు ఖరారు చేశారని ప్రచారం జరిగింది. అయితే ఈలోపు ఆయన ఊహించని రీతిలో ఆయన హత్యకు గురయ్యారు. తాజాగా ఎమ్మెల్యే దామచర్ల పట్టుబట్టి మరీ సీతారామయ్య పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. యార్డు పదవి ఎప్పుడు భర్తీ చేస్తారో... మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి కూడా మంచి గిరాకీ ఉంది. పార్టీలో ఈ పదవిని ఆశిస్తున్న నాయకుల లిస్టు చాంతాడంత ఉంది. గత ఎన్నికల సమయంలో మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇస్తానంటూ దామచర్ల హామీ ఇచ్చినట్లు చాలా మంది నాయకులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. తొలుత ఈ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయిందని ప్రచారం జరిగింది. నత్తల కనకారావు, శశిభూషణ్లతో పాటుగా నగరానికి చెందిన ఒక మహిళా వైద్యురాలు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి ఇప్పుడు బీసీలకు రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో బీసీల్లో యాదవ సామాజిక వర్గానికే చైర్మన్‌గిరి దక్కాలని నాయకులు పట్టుపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి సిరిపురం వెంకటరావు, కొఠారి నాగేశ్వరరావుల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. దామచర్ల ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారికి పదవి దక్కడం ఖాయం. మిగతా పదవులపై ఆశలు... జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మైనారిటీ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య, డీసీఎంఎస్, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం, దేవాలయ కమిటీల పదవుల కోసం ఎవరికివారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇటు ఎమ్మెల్యేల నుంచి కానీ, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనివార్య పరిస్థితిలో ఎదురు చూస్తున్నారు. ఇటు మైనారిటీ, ఎస్సీ, బీసీ నాయకులు తమకు తగిన గుర్తింపు లభిస్తుందో లేదోనని పడిగాపులు కాస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య పోటీతో పాటుగా, టీడీపీ, జనసేనలోని గ్రూపు రాజకీయాలు కూడా పదవులకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పదవుల్లో జిల్లా నేతలకు మొండిచేయి ఒడా, పీడీసీసీ, డీసీఎంఎస్, మార్కెట్ యార్డు, జిల్లా గ్రంథాలయ సంస్థ, మైనారిటీ కార్పొరేషన్ పదవులన్నీ ఖాళీ కూటమి నాయకుల్లో సఖ్యత లేకే పదవులు భర్తీ చేయడం లేదంటూ ప్రచారం పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో తీవ్ర అసంతృప్తి -
కుట్టు స్కీమ్ కాదు.. రూ.కోట్లు కొల్లగొట్టే స్కామ్
ఒంగోలు సిటీ: మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వ నాయకులు భారీ మోసానికి తెగబడ్డారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ విమర్శించారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహిళా విభాగం నాయకులతో కలిసి ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుంపా రమణమ్మ మాట్లాడుతూ.. కుట్టు మిషన్‌కు కొనుగోలుకు రూ.4300, ఒక వ్యక్తి శిక్షణ నిమిత్తం రూ.3 వేలు వెరసి మొత్తం రూ.7300 ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ.23 వేల చొప్పున కేటాయించడం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు. వాస్తవంగా లబ్ధిదారులకు అయ్యే ఖర్చు రూ.73 కోట్లు అయితే, కూటమి నాయకులకు రూ.167 కోట్లు దోచిపెట్టేందుకు పథక రచన చేశారని విమర్శించారు. శిక్షణ మొదలైననప్పటి నుంచి 50 రోజుల్లోపే రూ.167 కోట్లు పంచుకు తినేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ఒక్కో మహిళా లబ్ధిదారుపై వెచ్చిస్తున్న సొమ్ములో రూ.16,700 కూటమి నేతల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే నగదు చెల్లించేవారని, కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితే లేదన్నారు. చంద్రబాబునాయుడు అధికార యావతో అడ్డగోలు హామీలిచ్చారని, గద్దెనెక్కిన తర్వాత ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసింది లేదని నిప్పులు చెరిగారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1800, 50 ఏళ్లు నిండిన బీసీ మహిళలకు పింఛన్లు, మహిళలకు ఫ్రీ బస్సు, ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇలా ఇష్టారీతిగా హామీలిచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసగించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఆరాచకాలను, మోసాలను ప్రజలు గమనించాలని కోరారు. హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిరా మాట్లాడుతూ.. బీసీ మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో రూ.167 కోట్లు దోపిడీ చేస్తున్న కూటమి పాలకులు, త్వరలోనే కమ్మ, కాపు, ఈబీసీ కార్పొరేషన్ల పేరుతో మరో రూ.81 కోట్లు నొక్కేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ మాట్లాడుతూ.. కుట్టుమిషన్ల పేరుతో జరిగిన అవినీతికి సహకరించిన అధికారుల ఉద్యోగాలు ఊడటం ఖాయమని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్న మాట్లాడుతూ.. కుట్టుమిషన్లను పేద మహిళలకు కేటాయించకుండా మోసగించడం దారుణమన్నారు. వలంటీర్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి గోనెల మేరికుమారి మాట్లాడుతూ.. కూటమి నేతలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మహిళా నాయకులు గోనుగుంట రజని, ముప్పరాజు జ్యోతి, జిల్లా అఽంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు కనపర్తి గోవిందమ్మ, మద్దిపాడు మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మన్నెం సంధ్య, ఎస్.లక్ష్మీకాంతమ్మ, తొగురు మాధవి, పులిగోటి రాజేశ్వరి, కొమ్మతోటి సంధ్య, దుంపా నాగలక్ష్మి, కుందురు లక్ష్మి, సన్నపురెడ్డి రమణమ్మ, కాకర్లమూడి రజిని తదితరులు పాల్గొన్నారు. కుట్టుమిషన్లు, శిక్షణ పేరుతో కూటమి భారీ మోసం మహిళలను నిలువునా మోసగిస్తున్నారు అధికార యావతోనే చంద్రబాబు అడ్డగోలు హామీలు గద్దెనెక్కిన తర్వాత ఒక్కటీ అమలు చేసేది లేదు కూటమి నాయకుల దారుణాలను ప్రజలు గమనిస్తున్నారు విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు -
పెనుగాలుల బీభత్సం
తర్లుపాడు/మార్కాపురం: పెనుగాలులు బొప్పాయి రైతులను అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలుల ధాటికి తర్లుపాడు మండలంలో 197 ఎకరాల్లో బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. రాగసముద్రంలో 15 మంది రైతులకు చెందిన 38 ఎకరాలు, కలుజువ్వలపాడు నలుగురు రైతులకు చెందిన 12 ఎకరాలు, జంగంరెడ్డిపల్లిలో 15 మంది రైతులకు చెందిన 38 ఎకరాలు, కలుజువ్వలపాడులో నలుగురికి చెందిన 12 ఎకరాలు, ఓబాయిపల్లిలో 43 మంది రైతులకు చెందిన 61 ఎకరాల్లో, కొండారెడ్డిపల్లిలో 16 మంది రైతులకు చెందిన 31 ఎకరాలు, లక్ష్మక్కపల్లిలో ఐదుగురు రైతులకు చెందిన 19 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే టన్ను రూ.20 వేల నుంచి రూ.5 వేలకు పడిపోయి తీవ్ర నష్టాల్లో ఉన్న బొప్పాయి రైతులను పెనుగాలులు తీవ్ర విషాదంలోకి నెట్టాయి. చెట్టునిండా కాయలతో కళకళలాడుతున్న బొప్పాయి నేలకు వాలటంతో రైతులు బోరున విలపించారు. అప్పు చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు.. పంట చేతికందే సమయంలో నేలకూలడంతో రైతుల నోట మాటరావడం లేదు. మార్కాపురం హార్టికల్చర్ అధికారి రమేష్, ఏఓ వెంకటేశ్వర్లు గ్రామాల్లో నేలకూలిన బొప్పాయి పంటలను పరిశీలించారు. మార్కాపురం మండలంలోని గజ్జల కొండ పంచాయితీలో సోమవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు 15 మంది రైతులకు చెందిన 38 ఎకరాల బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లిందని మండల ఉద్యాన వనశాఖాధికారి రమేష్ తెలిపారు. దెబ్బతిన్న తోటలను ఆయనతోపాటు ఏఓ శ్రీనివాసులు, వీఆర్ఓ సౌజన్య పరిశీలించారు. తర్లుపాడు మండలంలో 197 ఎకరాలు, మార్కాపురం మండలంలో 38 ఎకరాల్లో బొప్పాయి తోటలకు నష్టం ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతుల విజ్ఞప్తి -
కూటమి నేతలకు రొక్కం.. కూలీలకు దుఃఖం
యర్రగొండపాలెం: ఉపాధి కూలీల కష్టార్జితాన్ని కూటమి నాయకులు, అధికారులు దోచుకుంటున్నారు. ఒక్కొక్క మస్టర్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 89,922 జాబ్‌కార్డులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 53,010 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పనులు చేసే కూలీలు మస్టర్ వేయించుకునేందుకు వారానికి రూ.300, పనులు చేయకుండా మస్టర్లు వేయించుకునేవారు రూ.500 ప్రకారం ముందుగానే చెల్లించాలని కూటమి నేతలు స్పష్టం చేయడంపై దుమారం రేగుతోంది. ఎంపీడీవోల కనుసన్నల్లో ఈ అవినీతి భాగోతం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా మండలాల ఏపీవోలు ముఖ్య భాగస్వాములుగా ఉంటున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. కూలీల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని మూడు భాగాలుగా విభజిస్తారని, అందులో ఒక భాగం నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుడికి, రెండో భాగం ఎంపీడీవోకు, మూడో భాగం ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి చెందేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వారానికి రూ.150 కోట్లు వసూలు ప్రస్తుత లెక్కల ప్రకారం వారానికి దాదాపు రూ.1.50 కోట్ల ప్రకారం రెండు వారాలకు కలిపి దాదాపు రూ.3 కోట్లు ఆయా మండలాల్లో పనులు చేసే కూలీల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. ఈ విధంగా ఒక్కొక్క కూలీ వంద రోజుల పనిదినాల ప్రకారం 16 వారాల పాటు పనులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వలస వెళ్లినవారు పాల్గొనడం లేదు. ఇతర పనులకు వెళ్లేవారు తమ పనిదినాలు పూర్తి చేసుకోవటానికి ఉపాధి హామీ పనులకు ఆలస్యంగా వస్తున్నారు. వీరిని కూడా కలిపితే దాదాపు లక్ష 60 వేల మంది నియోజకవర్గంలో ఉపాధి పొందే జాబితాలో ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం 16 వారాలకు కలిపి రూ.76.80 కోట్లు కూలీల నుంచి వసూలు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దోపిడీని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతోనే యర్రగొండపాలెం, పెద్దదోర్నాల మండల పరిషత్ సమావేశాలు జరగకుండా ఎంపీడీవోలు, అధికారులు డుమ్మా కొడుతున్నారన్న చర్చ నడుస్తోంది. కూలీల కష్టార్జితాన్ని పచ్చ దొంగల ముఠా దోచుకుంటోంది ఉపాధి హామీ నిధులను సైతం టీడీపీ దొంగల ముఠా దోచుకుంటోంది. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఒక ముఠాను తయారు చేసుకొని కూలీల డబ్బు దోచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. దీనికి నియోజకవర్గంలోని 5 మండలాల ఎంపీడీవోలు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఒక్కో కూలీ నుంచి రూ.300, పనిచేయకుండా మస్టర్లు వేయించుకునేవారి నుంచి రూ.600 ప్రకారం వసూలు చేసుకుని పంచుకుంటున్నారు. టీడీపీ దొంగల ముఠా, అధికారులు కలిసి వారానికి రూ.3 కోట్లు ప్రకారం వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కోట్ల రూపాయల ధనాన్ని అడ్డదారుల్లో పందికొక్కుల్లా మెక్కుతున్న వ్యవహారాన్ని ప్రశ్నించే వారిని, వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన వారిని పనుల నుంచి తొలగిస్తున్నారు. ఇటీవల యర్రగొండపాలెం మండల పరిషత్ సమావేశంలో ప్రశ్నిస్తున్న ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీని ఎంపీడీవో అగౌరవపరిచారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ధనదాహంతో అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. – తాటిపర్తి చంద్రశేఖర్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే మస్టర్‌కు రూ.300 వసూలు అధికారులు, కూటమి నేతలు కలిసి రూ.కోట్లు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ప్రశ్నిస్తారని సమావేశాలకు డుమ్మా కొడుతున్న అధికారులు తీవ్ర చర్యగా పరిగణిస్తామన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
వైద్యుల పనితీరుపై పర్యవేక్షణ అవసరం
ఒంగోలు సబర్బన్: వైద్యులు, సిబ్బంది ఆసుపత్రికి హాజరవుతున్న సమయం, వారి పనితీరుపై పటిష్ట పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. ఆయా ఆస్పత్రుల పర్యవేక్షకులు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆసుపత్రుల నిర్వహణపై మంగళవారం ప్రకాశం భవనంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల వారీగా సిబ్బంది ఖాళీలు, రోజువారీ కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, లేబొరేటరీ, ఎక్స్ రే, స్కానింగ్, ఈసీజీ, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, విద్యుత్ జనరేటర్ మరమ్మతులు, ఇతర నిర్మాణ పనులు, ఎన్టీఆర్ వైద్య సేవ క్లెయిమ్స్ పరిష్కారం తీరు తదితర అంశాలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదే అని కలెక్టర్ స్పష్టం చేశారు. పద్ధతి సరిగా లేని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నతాధికారులనే ధిక్కరించే స్థాయిలో సిబ్బంది ఉంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్ల మొత్తం వ్యవస్థ గాడి తప్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ శ్రీనివాస నాయక్, డీఎంహెచ్ఓ టి.వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైద్యశాలల పర్యవేక్షకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులపై సమీక్షలో కలెక్టర్ తమీమ్ అన్సారియా -
జాతిపిత విగ్రహం తొలగింపులో వివాదం
కొండపి: మండలంలోని నేతివారిపాలెం గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం తొలగింపు వివాదానికి దారితీసింది. గ్రామంలో 60 ఏళ్ల క్రితం గాంధీ విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విగ్రహం శిథిలమైందని భావించిన ఓ వర్గం పాతదానికి పది అడుగుల దూరంలో శనివారం నూతన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే పాత విగ్రహం ఉన్నచోటనే కొత్తది ఉంచాలని లేదంటే ఇటీవల మరమ్మతులు చేయించిన పాత విగ్రహాన్నే కొనసాగించాలని మరో వర్గం వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో జేసీబీతో పాత విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరో వర్గం వారు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. కాగా పాత గాంధీ విగ్రహాన్ని తొలగించి టీడీపీ నాయకుల విగ్రహాలు పెట్టాలని చూస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ వివరణ కోరగా నూతన విగ్రహాన్ని పెట్టడానికి లేదా పాత విగ్రహాన్ని తీసివేయడానికి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, ఆ స్థలం ఆర్అండ్బీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. నూతన బొమ్మతోపాటు పాత బొమ్మకు కూడా అనుమతి లేదని ఆర్అండ్బీ అధికారి మాధవరావు చెప్పారు. కొండపి మండలం నేతివారిపాలెంలో ఘటన పాత విగ్రహానికి 10 అడుగుల దూరంలో కొత్త విగ్రహం పెట్టిన ఓ వర్గం పాత విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి తొలగించేందుకు మరో వర్గం ప్రయత్నం పోలీసుల రాకతో సద్దుమణిగిన ఉద్రిక్తత -
మార్కాపురంలో కేంద్ర బృందం పర్యటన
మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. 2022 నుంచి 2024 వరకు ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర బృంద సభ్యులైన రాజు, విజయేందర్ పరిశీలించారు. మార్కాపురం మండలంలోని కొట్టాలపల్లి ఎస్సీ కాలనీలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, జమ్మనపల్లి ఎస్సీ కాలనీలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలు, తర్లుపాడులో రోడ్డు, కొనకనమిట్ల మండలంలోని సలనూతల గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను తనిఖీ చేశారు. వీరి వెంట మార్కాపురం పంచాయతీరాజ్ డీఈ రవి ప్రకాష్, ఏఈ విజయ్మోహన్రాజా, తర్లుపాడు ఏఈ శ్రీనివాసరెడ్డి, కొనకనమిట్ల ఏఈ మహంకాలయ్య ఉన్నారు. పిడుగుపాటుకు చింత చెట్టు దగ్ధం మార్కాపురం: పిడుగుపాటుకు చింత చెట్టు నిలువునా దగ్ధమైంది. ఈ సంఘటన మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న చింత చెట్టుపై పిడుగు పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో గ్రామస్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. క్రీడాస్ఫూర్తి అవసరం ఒంగోలు టౌన్: చిన్నారులు ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, పోటీతత్వాన్ని, క్రీడాస్పూర్తిని అలవర్చుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్–2025ను ప్రారంభించారు. పిల్లలతో కాసేపు టగ్ ఆఫ్ వార్ ఆడి ప్రోత్సహించారు. క్యాంపులో భాగంగా మొదట ఫుట్‌బాల్ శిక్షణను ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. వేసవి క్రీడా శిక్షణ శిబిరం జూన్ 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఇస్తారని, పోలీసుల పిల్లలతో పాటు ఇతర చిన్నారులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. అనంత సాగర ప్రయాణం పుస్తకావిష్కరణ ఒంగోలు సబర్బన్: అభాగ్యుల జీవితాల్లో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవీ సాగర్ కొత్త వెలుగులు నింపారని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్వీఎస్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాజీవ్‌నగర్‌లోని హెల్ప్ కార్యాలయంలో ‘అనంతసాగర ప్రయాణం నా జీవన ప్రస్థానం’ పుస్తకాన్ని రామ్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్ప్ సంస్థలో సామాన్య కార్యకర్తగా జీవనాన్ని ప్రారంభించిన సాగర్.. రెండు దశాబ్దాలుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో పనిచేశారన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మికుల నివారణ, మానవ అక్రమ రవాణా నిర్మూలన, బాలలపై లైంగిక వేధింపుల నిర్మూలన, దివ్యాంగులు, మానసిక దివ్యాంగుల, నిరుపేదలు, నిరాధరణకు గురైన వృద్ధులను చేరదీయడం.. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ క్రమంలోనే జాతీయ పురస్కరాలు, మరెన్నో ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. సాగర్ దంపతులను హెల్ప్ సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన పోరాడతాం
ఒంగోలు సిటీ: జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి, ప్రజల పక్షాన పోరాడతామని వైఎస్సార్ సీపీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైఎస్సార్సీపీ ఇన్చార్జులతో వారు సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. తొలుత ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ అందరం ఐక్యంగా ఉండి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయి కమిటీలను పూర్తి చేసుకున్నామన్నారు. త్వరలో గ్రామస్థాయి, వివిధ అనుబంధ సంఘాల కమిటీలను సైతం ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. రెడ్‌బుక్ సిద్ధాంతంతో పావులుగా మారొద్దు: కారుమూరి పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి, పార్టీ పునర్నిర్మాణం చేసే విషయంలో జిల్లా నాయకులు ముందున్నారని మాజీ మంత్రి, రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అభినందించారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌బుక్ సిద్ధాంతం నడుస్తోంది. పోలీసులు అదే దారిలో నడుస్తుండడం సరికాదు. అకారణంగా అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లు తిప్పుతూ కొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ప్రభుత్వాలు మారుతుంటాయి, పోలీసులు మాత్రం ప్రజల పక్షాన నిలిచి అండగా నిలవాలి’ అని ఆయన సూచించారు. 70 శాతం మంది టీడీపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారన్నారు. వలంటీరు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పింఛన్లలో భారీ కోత పెట్టి నెలనెలా ఆ కార్యక్రమాన్ని ఆయన ఒక ఫార్సులా మార్చేశారన్నారు. ప్రతి నెలా ఒక కులానికి చెందిన దుకాణదారుడికి ఇచ్చి రాష్ట్రమంతా ఆ కులస్తులకు ఇచ్చినట్టు షో చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని రకాల రైతులు మద్దతు ధర లభించక అవస్థలు పడుతున్నారన్నారు. రైతులకు కనీసం గోతాము ఇవ్వలేని దుస్థితిలో మన సివిల్ సప్లయీస్ మంత్రి ఉన్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని చెప్పారు. అమరావతి పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తల్ని వేధిస్తే ఊరుకోం: బూచేపల్లి.. జిల్లాలో పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వారికి న్యాయం చేసేందుకు ముందుంటామన్నారు. దర్శిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సురేష్ డీఎస్పీ కార్యాలయం పక్కనే దుకాణాన్ని పెట్టుకుంటే ఓర్వలేక సదరు డీఎస్పీ ఒక సీఐని, నలుగురు ఎస్ఐలను, కానిస్టేబుళ్లను పంపి కూల్చివేయించారన్నారు. ‘‘మీరు 60 ఏళ్ల పాటు ఉద్యోగం చేయాలి.. ఐదేళ్ల పాటు ఉండే వారి పక్షాన పనిచేస్తే సరికాదు.. రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది..మాకు పదవులూ వస్తాయి.. అది గుర్తుంచుకోవాలి. మీరు ప్రజల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాలి’’ అని బూచేపల్లి అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కొట్టే లా అండ్ ఆర్డర్ కింద పోలీసు వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పొగాకు, పత్తి, మిర్చి, వరి తదితర పంటలు సాగుచేసిన వారికి కనీస గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలవుతున్నారన్నారు. పొగాకు రైతుకు మద్దతుగా నిలుస్తామన్నారు. అవసరమైతే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తాం త్వరలో గ్రామ, బూత్ స్థాయి కమిటీలు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం మద్దతు ధరలు లభించక అల్లాడుతున్న రైతులు విలేకర్ల సమావేశంలో చెవిరెడ్డి, కారుమూరి, బూచేపల్లి -
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోనని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జేసీ ఆర్.గోపాలకృష్ణ తో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, పార్ధసారథి, వరకుమార్, విజయజ్యోతితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్టీ వర్గీకరణతో యానాదులకు న్యాయం ఒంగోలు వన్‌టౌన్: ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యానాది పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద యానాదులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న యానాది సంఘ నాయకుడు కేసీ పెంచలయ్య యానాది మాట్లాడుతూ ఏపీలో 10 లక్షల మంది యానాదులు ఉన్నారన్నారు. రాష్ట్రంలోనే గిరిజన తెగల్లో అత్యధిక జనాభా యానాదులు ఉన్నారన్నారు. గిరిజన జాతుల్లో జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న యానాదులు నేటికీ అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారన్నారు. యనాదులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ఎస్సీ వర్గీకరణలా ఎస్టీలను కూడా వర్గీకరిస్తే యానాదులు అభివృద్ధి చెందుతారన్నారు. యానాదుల అభివృద్ధి కోసం యానాదుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. సమితి జిల్లా అధ్యక్షుడు కే మాల్యాద్రి యానాది అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జండ్రోజుపల్లి ఆంజనేయులు, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు. కళ్లకు గంతలతో సీహెచ్‌ఓల నిరసన ఒంగోలు టౌన్: పదోన్నతులు, ఇంక్రిమెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీహెచ్‌ఓలు చేస్తున్న సమ్మె సోమవారం 7వ రోజుకు చేరింది. రోజుకో విధమైన వినూత్న నిరసనలు చేస్తున్న సీహెచ్‌ఓలు కళ్లకు నల్లటి గంతలు కట్టుకొని దీక్షలో పాల్గొన్నారు. ఏపీఎన్జీవో ప్రసిడెంట్ కె.శరత్‌బాబు దీక్షా శిబిరాన్ని సందర్శించి సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెతో గ్రామీణ ప్రజలు వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్న సంగతిని గ్రహించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్జీజీఓ తాలుకా ప్రసిడెంట్ మంజీష్, ఏపీఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యం.రాజేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్, కార్యదర్శి ప్రసన్న, ఉపాధ్యక్షురాలు జీవన జ్యోతి, రామాంజనేయులు, కామేష్ తదితరులు పాల్గొన్నారు. కగార్ పేరుతో ఆదివాసీలను బలిగొంటున్న కేంద్రం ఒంగోలు టౌన్: కగార్ ఆపరేషన్ పేరుతో అమాయక ఆదివాసీలను బలిగొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మండిపడ్డారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. అడవుల్లో జీవించే ఆదివాసీలను తరిమికొట్టి ఖనిజ సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్లను దోచిపెట్టే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. -
కబ్జాచేసి..!
కంచేసి.. ఖాళీ జాగాలపై వాలిపోతున్న పచ్చదండుఅధికారం అండ.. అధికారుల సహకారం..ఖాళీ జాగా కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోతున్నారు కూటమి నేతలు. ప్రభుత్వ..ప్రైవేటు భూములు దర్జాగా కబ్జాచేసేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రికార్డులను సైతం తారుమారు చేసేందుకు వెనుకాడడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల భూముల రికార్డులను తమ పేర్లతో ఆన్లైన్ చేసుకుంటూ పాగా వేస్తున్నారు. ఇదేమిటని అడిగితే నీకు చేతనైంది చేసుకో అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమార్కుల చెర నుంచి తమ భూములను కాపాడుకునేందుకు స్థోమత ఉన్నవారైతే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. నిరుపేదలు జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భూ కబ్జాలకు తెరతీశారు. ఇసుక, గ్రావెల్, మద్యం దందాలతో సమాంతరంగా భూ ఆక్రమణలకు తెగబడుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదుల్లో సింహభాగం భూ వివాదాలే ఉండడం గమనార్హం. జిల్లా కేంద్రం ఒంగోలు మొదలు ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల ఆక్రమణల పర్వాలే కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో తెలుగు భూచోళ్ల బెడద ఎక్కువైంది. ఇటీవల నగర శివారులోని ముక్తినూతలపాడు సర్వే నంబర్ 15లో మొత్తం 21.80 ఎకరాల భూమి ఉంది. దీనిలో 5.6 ఎకరాల భూమిని కబ్జా చేసిన టీడీపీ నాయకులు చుట్టూ ఫెన్సింగ్ వేసేశారు. దీని విలువ సుమారు రూ.15 కోట్లపైగానే ఉన్నట్టు తెలుస్తోంది. వీరు అధికార పార్టీ కీలక నాయకుడి అండదండలతోనే కబ్జాకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తినూతలపాడు వెళ్లి కబ్జాకు గురైన భూములను పరిశీలించారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఈ కబ్జా గురించి కీలక నాయకుడు నోరు తెరచి మాట్లాడకపోవడం గమనార్హం. ఇటీవల ఒంగోలు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో భూ కబ్జాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కబ్జాదారులంతా టీడీపీ నాయకులే కావడంతో రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కురిచేడులో వేయి ఎకరాలు హాంఫట్ కురిచేడు మండలంలోని పొట్లపాడు గ్రామంలో 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. దర్శి నియోజకవర్గ టీడీపీ కీలక నాయకురాలిచేత తహశీల్దారుకు ఫోన్ చేసి లైన్ క్లియర్ చేసుకున్న స్థానిక టీడీపీ నాయకులు ఇతర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులకు బేరం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సమీపంలో బయో గ్యాస్ ప్లాంట్ మంజూరు కావడంతో ఎకరా రూ.10 లక్షల వరకు పలుకుతోంది. అంటే రూ.8 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. పడమర వీరాయపాలెం గ్రామంలో సర్వే నంబర్ 8లో ఏకంగా 528 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు పచ్చ దండు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.60 కోట్ల విలువైన ఈ భూమిని ఇప్పటికే క్రయవిక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కల్లూరు గ్రామంలో సుమారు 200 ఎకరాల భూమిని సాగుదారుల నుంచి టీడీపీ నాయకులు బలవంతంగా లాక్కోవడంతో న్యాయం కోసం బాధితులు కోర్టుకు వెళ్లారు. దీని విలువ ప్రస్తుతం రూ.20 కోట్ల వరకు ఉంది. మండలంలోని పెద్దవరం గ్రామంలో తెలుగు తమ్ముళ్లు 150 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. దీని విలువ ఎకరా రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భూముల్లోకి ప్రవేశించకూడదంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టినా వాటిని లెక్క చేయకుండా పచ్చ నేతలు కబ్జాకు పాల్పడ్డారు. కొండపి, కనిగిరిల్లో కబ్జాల పర్వం... ప్రభుత్వం వచ్చీరాగానే కొండపి మండలం పెట్లూరు గ్రామంలో రూ.6 కోట్ల విలువైన సుమారు 4.4 ఎకరాల భూమిని కొందరు టీడీపీ నాయకులు కబ్జా చేశారు. సదరు భూమిలో ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలు పెట్టారు. బాధితులు కోర్టుకు పోవడంతో ప్రస్తుతం కబ్జా కథకు బ్రేక్ పడింది. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలంలోని పెద ఇర్లపాడు గ్రామంలో సర్వే నంబర్ 870లో 9.82 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఇక్కడ ఎకరా రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఉంది. సుమారు రూ.4 కోట్ల విలువ చేసే భూమిని కాజేయడానికి టీడీపీ నాయకులు స్కెచ్ వేశారని సమాచారం. బాధితులు కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతం ఆ భూమిలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. అయినా పచ్చదండు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గ్రీవెన్స్‌లో భూములపైనే ఫిర్యాదులు... ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తోంది. ఉన్నతాధికారులందరూ ఉంటారు కనుక వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి బాధితులు ఇక్కడకు వస్తుంటారు. వందలాది మంది ఫిర్యాదులు చేస్తుంటారు. ఈ ఫిర్యాదుల్లో సింహభాగం భూ వివాదాలు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. తమ భూములను కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండడంలేదని బాధితులు వాపోతున్నారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల అండదండలుండడంతో ఎవరూ చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిచేడులో దాదాపుగా వెయ్యి ఎకరాల ఆక్రమణ ఒంగోలులో 5.6 ఎకరాల భూమి కబ్జాకు యత్నం మరో 2 ఎకరాలు కాజేసే పనిలో టీడీపీ నేతలు కనిగిరిలో 10 ఎకరాల గ్రామకంఠం భూమి స్వాహా కొండపిలో కోర్టుకు వెళ్లి భూములను కాపాడుకున్న వైనం అధికారుల అండదండలతో కబ్జాలపర్వానికి తెరదీసిన తమ్ముళ్లు -
పులి..!
బాబోయ్..అర్థవీడు: అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మండలంలోని పలు గ్రామాల్లో తరచూ పెద్దపులి, చిరుత పులులు సంచరిస్తున్నాయి. మండలంలోని లక్ష్మీపురం, మాగుటూరు, కాకర్ల, వెలగలపాయ, మోహిద్దీన్ పురం, అచ్చంపేట, దొనకొండ, తాండ గ్రామాలకు తరుచూ పులులు వచ్చి వెళుతున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం మిట్టమీదపల్లి రహదారి పై రాత్రివేళ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పులిరావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు: పులుల సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ అవసరమైన చోట ట్రాప్ కెమెరాలను అమర్చి పులుల జాడలను పసిగడుతున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవి ఎక్కువగా రాత్రి పూట తిరుగుతుంటాయని రైతులెవరూ రాత్రిపూట అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని, అదే విధంగా పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆహారం కోసం తిరిగే క్రమంలో.. నాగార్జునసాగర్ టైగర్ జోన్ పరిధిలో పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో పెద్దపులల సంతతి పెరిగింది. అవి ఆహారం వేటలో భాగంగా, ఒక చోట నుంచి మరోచోటుకు వెళ్తున్న క్రమంలో ఎద్దులపై, గేదెలపై, ఇతర పశువులపై దాడి చేస్తున్నాయని వాటి వల్ల మనుషులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని అధికారులు చెబుతున్నారు. పులులు ఎక్కువగా రాత్రి పూట, తెల్లవారుజామున మాత్రమే తిరుగుతుంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల పులి సంచరించిన ఘటనలివీ.. ● వెలగలపాయకొండ పెద్దపులి దాడి చేయడంతో ఓ ఎద్దు మృతి చెందింది. ● వెలగలపాయకొండ సమీపంలో ఎద్దులను మేతకు తీసుకెళ్లగా ఎద్దుపై పెద్దపులి దాడి చేస్తున్న సమయంలో చూసిన రైతు కేకలు వేయడంతో పులి పారిపోయింది. ● లక్ష్మీపురం, మాగుటూరు గ్రామాల సమీపంలో ఉన్న కోమటికుంట వద్దకు పెద్దపులి వచ్చి నీళ్లు తాగి వెళ్తున్నట్లు స్థానికులు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ● ఐదు నెలల క్రితం మండలంలోని మొహిద్దీన్‌పురం వద్ద రాత్రి పూట కారులో వెళ్తున్న వారికి చిరుతపులి రోడ్డు దాటుతూ కనిపించిందని స్థానికులకు సమాచారం ఇచ్చారు. ● కొన్ని రోజుల తర్వాత అచ్చంపేట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. నాలుగు రోజుల క్రితం మండలంలోని దొనకొండ, తాండ గ్రామాల్లో రెండు గేదెలను పెద్దపులి దాడి చేసి చంపగా ఫారెస్టు అధికారులు రైతులకు నష్టపరిహారం అందించారు. అర్థవీడు మండలంలో తరచూ సంచారం పశువులపై దాడి చేసి చంపితింటున్న పులులు ఆందోళనలో రైతులు, ప్రజలు భయపడాల్సిన పనిలేదంటున్న ఫారెస్టు అధికారులు అటవీ ప్రాంతంలో ట్రాప్‌కెమెరాలు అమర్చుతున్న అధికారులు -
ఉపాధి పని కోసం 8 కి.మీ నడక..
రాచర్ల: అక్కడ ఉపాధి హామీ పనికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు వెళ్లాలి. పాలకవీడు పంచాయతీ అనుమలవీడు గ్రామానికి చెందిన 40 మంది కూలీలకు శీలంవెంకటరెడ్డిపల్లె గ్రామ సమీపంలో ఎత్తైన అటవీ ప్రాంతంలో ఉపాధి పనులు ఏర్పాటు చేశారు. సోమవారం కొంత మంది కూలీలు ఆటోల్లో వెళ్లగా, మరికొందరు 8 కి.మీ దూరాన్ని కాలినడకన వెళ్లారు. ఉదయం ఉపాధి కూలీలకు పనులు చేసే ప్రాంతాన్ని చూపించి మస్టర్లో పేర్లు నమోదు చేసి మళ్లీ పని ముగిసిన తరువాత మస్టర్వారీగా కూలీల ఫొటోలను అప్లోడ్ చేయడానికి సర్వర్ సక్రమంగా పనిచేయలేదు. దాదాపు 12 గంటల వరకూ సమయం పట్టడంతో కూలీలు తీవ్రమైన ఎండలకు నానా అవస్థలు పడ్డారు. ఎండలకు పనులు చేసి ఎత్తైన కొండలపై నుంచి దిగేందుకు వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో గ్రామాల వారీగా ఉపాధి కూలీలకు పనులు చూపించి పనులు చేస్తుంటే పాలకవీడు పంచాయతీలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎండతీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎత్తైన కొండ ప్రాంతాల్లో కాకుండా పనులు ఏర్పాటు చేయాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు. -
కొత్తపాలెంలో నీటి సమస్య పరిష్కారం
పొన్నలూరు: పొన్నలూరు మండలం రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో సుమారు 25 ఏళ్ల క్రితం రూ.1.60 కోట్లతో సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ స్కీమ్ పంచాయతీలతో సంబంధం లేకుండా పనిచేసేందుకు ప్రత్యేకంగా టెండర్ ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ ప్రక్రియను నిలిపేసి సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీళ్లు వదిలే పనిని స్థానిక తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలై గత నాలుగు రోజుల నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా గ్రామస్తులకు నీటి సరఫరా ఆగింది. దీంతో గ్రామస్తులు తాగు, వాడుక నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ‘ఆధిపత్య పోరు.. నిలిచిన నీరు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు. ఓ వ్యక్తిని నియమించి సోమవారం నీటిని సరఫరా చేశారు. గత నాలుగు రోజులుగా ఉన్న నీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి కనిగిరి రూరల్: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం కనిగిరిలో చోటుచేసుకుంది. వివరాలు.. కనిగిరి పదో వార్డులోని హనీఫ్ నగర్‌కు చెందిన సయ్యద్ అలీ(15) అతని స్నేహితుడు కలిసి బైక్‌పై మాచవరం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో చాకిరాల రోడ్డు వైపు నుంచి ఆర్.సాయి(విద్యార్థి) బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తూరు సమీపంలోని మలుపు వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైక్‌పై వెనుక వైపు కూర్చుని ఉన్న సయ్యద్ అలీ తలకు బలమైన గాయాలు కావడంతో ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత ఒంగోలుకు, అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ అలీ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అందరివాడు అలీ.. చిన్న తనంలోనే అలీ తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో పెరుగుతున్నాడు. హనీఫ్ నగర్లో ప్రతి ఒక్కరికీ తలలో నాలుకలా మారాడు. ప్రమాదానికి ముందు వరకు తమతో ఆడుకున్న అలీ.. అనుకోని రీతిలో మృత్యు ఒడికి చేరడంతో స్నేహితులంతా రోధించారు. తాతయ్య కరీముల్లా, అమ్మమ్మ, పిన్ని రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టాండింగ్ కమిటీ లేనట్లే..!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఇక లేనట్లేనా అంటే ఔననే సమాధానం వస్తోంది. స్టాండింగ్ కమిటీ కాలపరిమితి పూర్తయి ఏడాది దాటినా నోటిఫికేషన్ ఇవ్వకుండా వదిలేయడంతో పురపాలన తీరును తేటతెల్లం చేస్తోంది. నగరంలో చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు ముందస్తుగా మేయర్ అనుమతి తీసుకుని, ఆ తర్వాత కౌన్సిల్లో ప్రవేశపెట్టి మంజూరు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రూ.10 లక్షలలోపు పనులకు కమిషనర్, రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పనులను స్టాండింగ్ కమిటీ ఆమోదించవచ్చు. కానీ ఒంగోలు నగర పాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఊసే లేకుండా చేశారు. కూటమి పార్టీల నేతల మధ్య పొంతన కుదరకపోవడం ఇందుకు ఒక కారణం. మూడు నెలలకు ఒకసారి ఏర్పాటు చేసే ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ టీడీపీ కార్పొరేటర్లతో అంతర్గత సమావేశం నిర్వహించారు. వీరి మధ్య స్టాండింగ్ కమిటీ ప్రస్తావన రాగా అందరూ స్టాండింగ్ కమిటీలో స్థానం కోసం పోటీపడినట్లు విశ్వసనీయ సమాచారం. 50 మంది కార్పొరేటర్లలో 25 మంది టీడీపీ, 21 మంది జనసేనలో ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో నియమించేది ఐదుగురు సభ్యులను మాత్రమే కావడంతో ఇప్పుడు సాధ్యమయ్యే పనికాదని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ పనుల కోసం ఇసుక, కంకర, ఇటుక తోలిన ప్రాంతాలకు వెళ్లి కూటమి నేతలు తనకు చెడ్డ పేరు తెస్తున్నారని దామచర్ల అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 124 అంశాల్లో 50కి పైగా ముందస్తు అనుమతులే.. మంగళవారం నిర్వహిస్తున్న సాధారణ కౌన్సిల్ సమావేశంలో దాదాపు రూ.20 కోట్లకు పైగా నిధుల మంజూరు కోసం మొత్తం 124 అంశాలు పొందుపరిచారు. వాటిలో 50కి పైగా అంశాలు ముందస్తు అనుమతుల కోసం పొందుపరిచినవే కావడం గమనార్హం. గతంలో వైఎస్సార్సీపీకి కౌన్సిల్లో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పుడు ముందస్తు అనుమతులు తీసుకుని కౌన్సిల్లో రాటిఫికేషన్‌కు పెడితే టీడీపీ ఫ్లోర్ లీడర్ రమణయ్య నానా యాగీ చేశారు. ప్రస్తుతం టీడీపీ కూటమికి కౌన్సిల్లో మెజారిటీ ఉన్నా ఇబ్బడిముబ్బడిగా రాటిఫికేషన్లు పెడుతున్నారు. అయినా నాడు యాగీ చేసిన నాయకులు నేడు కిమ్మనడం లేదు. జీరో అవర్‌కు మంగళం నగరంలో సాధారణ సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా చేశారు. అజెండాలో పొందుపరిచిన అంశాలపైనే చర్చించి ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. కౌన్సిల్ సమావేశాల్లో ‘‘జీరో’’ అవర్ ప్రవేశపెడితే ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను సభ్యులు లేవనెత్తే అవకాశం ఉంటుంది. మంచినీరు, పారిశుధ్యం, చెత్త ఆటోల తొలగింపు, డ్రెయినేజీలు తదితర సమస్యలపై సభ్యులు మాట్లాడే అవకాశం ఒక్క జీరో అవర్లోనే ఉంటుంది. అందుకోసం కౌన్సిల్ సమావేశంలో జీరో అవర్‌ను ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరుతున్నారు. కాల పరిమితి పూర్తయ్యి ఏడాదైనా నేటికీ వెలువడని నోటిఫికేషన్ రూ.40 లక్షల వరకు పనులు స్టాండింగ్ కమిటీ ఆమోదంతో పూర్తి చేయవచ్చు అజెండాలోని అంశాలకే పరిమితమవుతున్న కౌన్సిల్ సాధారణ సమస్యలపై చర్చించే జీరో అవర్‌కు మంగళం నేటి కౌన్సిల్ సమావేశంలో 124 అంశాలు.. 50కి పైగా ముందస్తు అనుమతులపైనే.. -
ఆమె ఆదేశం.. అధికారుల అత్యుత్సాహం!
సాక్షి టాస్క్‌ఫోర్స్: దర్శి పట్టణంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల వ్యాపారాలపై కూటమి నేతల కక్షసాధింపులు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. అధికారులు సైతం కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల దుకాణాలు తొలగించేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు. దర్శి టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి కనుసన్నల్లో సాగుతున్న కక్ష సాధింపుల పర్వానికి స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంస్కృతిని దర్శికి అలవాటు చేసి కూటమి మద్దతుదారులే వ్యాపారాలు చేయాలని భీష్మించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నగర పంచాయతీ అభివృద్ధిని గాలికొదిలేసి వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల వ్యాపారాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి దర్శిలోని కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డు, తూర్పుచౌటపాలెం రోడ్డులో సైడు కాలువలు దాటి ముందుకు వచ్చి మరీ దుకాణాలు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటుంటే గుడ్లప్పగించి చూస్తున్న నగర పంచాయతీ అధికారులు.. కేవలం వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే టార్గెట్ చేస్తున్నారనేందుకు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనే తాజా నిదర్శనం. కొణతం అపర్ణ, సురేష్‌రెడ్డికి చెందిన దుకాణాన్ని తొలగించేందుకు పదుల సంఖ్యలో పోలీసులను పురమాయించిన తీరు చూసి విస్తుపోవడం స్థానికుల వంతయింది. అద్దంకి రోడ్డు శివారులో వైఎస్సార్ సీపీ నాయకుడు తన ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న దుకాణాన్ని తొలగించారు. పొదిలి రోడ్డులో వైఎస్సార్ సీపీ నాయకుల దుకాణాలు రోడ్డుపైకి వచ్చాయంటూ వాటిని తొలగించారు. టీడీపీకి చెందిన వారి దుకాణాల జోలికి మాత్రం అధికారులు వెళ్లలేదు. టిఫిన్ సెంటర్ వంట సామగ్రి కాలువపై అడ్డుగా ఉందంటూనగర పంచాయతీ అధికారులు నిర్దాక్షిణ్యంగా ట్రాక్టరులో వేసుకుని వెళ్లారు. మరో షాపు రోడ్డుపై ఉందని చెప్పి బెదిరింపులకు దిగారు. డ్రెయినేజీ హద్దుకు లోపలి వైపు ఉన్న చిరు వ్యాపారులను సైతం బెదిరించి మూసేయించారు. కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డులో డ్రైనేజీ దాటి రోడ్డుపైకి వచ్చిమరీ దుకాణాలు నిర్వహిస్తున్నా టీడీపీ వ్యక్తులనే కారణంతో నగర పంచాయతీ కమిషనర్ మహేష్ పట్టించుకోవటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. దీనికి తోడు నగరపంచాయతీ కి చెందిన ఓ ఉద్యోగి చిరువ్యాపారుల వద్ద రోజూ అనధికార శిస్తు వసూలు చేసి కూటమి నేతలు, అధికారుల జేబులు నింపుతున్నాడని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆ ఉద్యోగి దోపిడీని ఎదిరించలేని చిరువ్యాపారులు మనోవేదన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటే అందరికీ ఒకే న్యాయం వర్తింపజేయాలని, ఇలా కొందరినే లక్ష్యంగా చేసుకుని వేధించడం సబబు కాదని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ పేరుతో దర్శిలో అడ్డగోలుగా దుకాణల తొలగింపు టీడీపీ సానుభూతిపరుల జోలికి వెళ్లని నగర పంచాయతీ అధికారులు టీడీపీ అయితే సరే.. వైఎస్సార్ సీపీ అయితే ఒప్పుకోమన్నట్లుగా తీరు -
సత్తాచాటిన బొడిచర్ల ఎడ్లు
బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో మార్కాపురం మండలం బొడిచర్లకు చెందిన టి.నక్షత్రారెడ్డి, ధ్రువసాయిరామ్ సంయుక్త ఎడ్ల జత 2,750 అడుగుల దూరం బండ లాగి మొదటి స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా అలగనూరు రోలిమోడం ఎడ్లు 2,516 అడుగులు, నంద్యాల జిల్లా జిల్లెలకు చెందిన గొటిక దినేష్‌రెడ్డి ఎడ్లు 2,509 అడుగులు, నంద్యాల జిల్లా పెసరవాయికి చెందిన సయ్యద్ కలాం ఎడ్లు 2,502 అడుగులు, బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి ఎడ్లు 2,384 అడుగులు, వీరాస్వామికి చెందిన మరో జత ఎడ్లు 2,266 అడుగులు, గిద్దలూరుకు చెందిన దుర్వాసుల అశ్వని ఎడ్లు 2,000 అడుగులు, జేసీ అగ్రహారానికి చెందిన లక్కు నాగశివశంకర్ ఎడ్లు 1,843 అడుగుల దూరం లాగి వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలను దాతలు పంపిణీ చేశారు. -
ప్రాణ నష్టాన్ని నివారించాలి
ప్రకృతి విపత్తుల్లో● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గాలి, దుమారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సోమవారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తుల సమయంలో గ్రామస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పిడుగుపాటుకు దారితీసే పరిస్థితులు, ఆయా సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డప్పు, చాటింపుతోపాటు ప్రసార మధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. వాతావరణ మార్పులపై వస్తున్న హెచ్చరికలను ప్రజలకు చేరవేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ ఓబులేసు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్‌కు 80 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి 80 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఏఆర్ దామోదర్, ఇతర పోలీసు అధికారులు అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన ఎస్పీ చట్టపరిధిలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసాలకు సంబందించిన ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ రవణ కుమార్, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, సీసీఎస్ సీఐ జగదీష్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్ ●
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ ఒంగోలు సిటీ: జిల్లాలో ఆదివారం నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒంగోలులోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయం, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీలలో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 1473 మంది అభ్యర్థులకుగాను 1428 మంది పరీక్షలకు హాజరైనట్లు పరీక్షల నిర్వహణ సిటీ కోఆర్డినేటర్ మనీష్ తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేసి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో నీట్ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్‌లు, బ్లూ టూత్, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్సును అనుమతించరాదన్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే హాల్లోకి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల వెలుపల 144 సెక్షన్ అమలులో ఉందని, ఈ పరీక్షలు ముగిశాక ఆ పత్రాలు పటిష్ట భద్రతా నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నీట్ పరీక్ష కేంద్రం వద్ద డ్రోన్ కెమెరా తో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ వెంట ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎస్బీ సీఐ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు సిబ్బంది ఉన్నారు. -
సత్తాచాటిన నంద్యాల జిల్లా ఎడ్లు
బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన బండలాగుడు పోటీలు హోరా హోరీగా సాగాయి. ఈ పోటీలను వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు మేళతాళాలతో, శాలువ, పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. నంద్యాల జిల్లా సంజమాల మండలం ఆకుమళ్లకు చెందిన కాకర్ల నాగజ్యోతి ఎడ్లు 4444 అడుగుల దూరం మొదటి స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా కోసూరు మండలం బయ్యవరానికి చెందిన కడియం మణికంఠ ఎడ్లు 3918 అడుగులు, నంద్యాల జిల్లా రోళ్లపాడుకు చెందిన డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎడ్లు 3750 అడుగులు, గిద్దలూరు మండలం ముళ్లపాడుకు చెందిన కంచర్ల తనీస్ ఎడ్లు 3750 అడుగులు, కంభం మండలం ఎర్రబాలేనికి చెందిన వెంకటగిరి హేమలతానాయుడు ఎడ్లు 3328 అడుగులు దూరంలాగి రెండోవ, మూడోవ, నాల్గోవ స్థానంలో నిలిచాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.12,500, రూ.12,500, రూ.5 వేల నగదు బహుమతులను దప్పిలి బ్రదర్స్ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, జెడ్పీటీసీ బీవీ రాజయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆవుల శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెన్నా భాస్కర్‌రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ కన్వీనర్ మల్లెల శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ దప్పిలి రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ బుగ్గారెడ్డి, నాయకులు రామిరెడ్డి, సిద్దారెడ్డి, కాశిరెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు సీనియర్ ఎడ్ల బండలాగుడు పోటీలు బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామస్వామి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా సోమవారం సీనియర్ ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 1 నుంచి 8వ బహుమతులు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు,రూ. 15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలను అందజేస్తారన్నారు. పూర్తి వివరాలకు 77022 92595, 97058 94632, 91777 09989 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
నాగులుప్పలపాడు: పిడుగు పడి గొర్రెల కాపరి మృతిచెందిన సంఘటన మండలంలోని ఈదుమూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, సమీపంలోని రైతులు తెలిపిన సమాచారం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి చీకటి మేఘాలు కమ్ముకోవడంతో పాటు తీవ్రమైన గాలి వీస్తూ స్వల్పంగా వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగులు పడటంతో ఈదుమూడి–మట్టిగుంట గ్రామాల మధ్య భీమన్నకుంట సమీపంలో గొర్రెలు కాస్తున్న ఈదుమూడి గ్రామానికి చెందిన కొండపి నాగమల్లేశ్వరరావు (40) అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన గతంలో ఓ ప్రమాదంలో తన చేతిని పోగొట్టుకుని దివ్యాంగుడయ్యాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నిలిచిన నీరు!
ఆధిపత్య పోరు..గ్రామంలో ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్న మాజీ వలంటీర్సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో కొత్తపాలెంలో అలంకారప్రాయంగా మారిన ఓవర్‌హెడ్ ట్యాంక్ పొన్నలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు తమ్ముళ్ల పిచ్చి చేష్టలతో గ్రామాల్లోని సామాన్య ప్రజలు అనేక రకాలుగా అవస్థలకు గురవుతున్నారు. అధికార పార్టీ కావడంతో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు. ఆఖరికి గ్రామాల్లోని స్కీం బావుల నుంచి ప్రజలకు అందించే నీటి విషయంలో కూడా పచ్చనేతలు పెత్తనం చలాయించాలని చూస్తున్నారు. వారి మధ్య ఆధిపత్య పోరుతో ప్రజలకు తాగునీరు, వాడుకనీరు లేకుండా పోయింది. పొన్నలూరు మండలంలోని రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే.. 1995–2000 మధ్య కాలంలో కొత్తపాలెం గ్రామంతో పాటు పొన్నలూరు మండలంలోని మరో ఎనిమిది గ్రామాలకు తాగునీరు, వాడుకనీటి కోసం రూ.1.60 కోట్లతో సీపీడబ్ల్యూఎస్ స్కీం ఏర్పాటు చేశారు. పంచాయతీలతో సంబంధం లేకుండా ఈ స్కీమ్ పనిచేసేందుకు ప్రత్యేకంగా టెండర్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహించే టెండర్లో స్కీంను దక్కించుకున్న వారు కొన్నేళ్లపాటు సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా తాగునీరు, వాడుకనీటిని తొమ్మిది గ్రామాల ప్రజలకు అందిస్తున్నారు. ఇటీవల ఈ స్కీమ్‌ను కొనసాగించేందుకు టెండర్ ఏర్పాటు చేయకుండా నిలిపివేశారు. ఆయా పంచాయతీలకు అప్పజెప్పి వదిలేశారు. దీంతో కొత్తపాలెం కాకుండా మిగిలిన ఎనిమిది గ్రామాల ప్రజలకు ఆయా పంచాయతీల్లో ఏర్పాటు చేసిన స్కీం బావుల నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరుతో అవస్థలు... ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తపాలెం గ్రామంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీళ్లు వదిలే పనిని స్థానిక తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. గత మార్చి వరకు సక్రమంగానే పనిచేసి గ్రామస్తులకు నీళ్లు సరఫరా చేశారు. అయితే, రెండు నెలలుగా సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీళ్లు వదిలే విషయంలో స్థానిక తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నీళ్లు వదిలే దగ్గర మేమంటే మేము పనిచేస్తామంటూ ఆధిపత్య పోరుతో రెండు నెలలుగా గ్రామస్తులకు తాగునీరు, వాడుకనీటిని సక్రమంగా అందించడం లేదు. ప్రతిరోజూ నీరివ్వాల్సి ఉండగా, అరకొరగా రోజు మార్చి రోజు నీళ్లు సరఫరా చేస్తుండటంతో గ్రామస్తులు చేసేదేమీ లేక సర్దుకునిపోతున్నారు. అయితే, నీళ్లు వదిలే దగ్గర తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో గత నాలుగు రోజుల నుంచి సీపీడబ్ల్యూఎస్ స్కీం ద్వారా గ్రామస్తులకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్‌తో నీరందించిన మాజీ వలంటీర్... కొత్తపాలెం గ్రామంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరుతో సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి గత నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. స్థానిక మాజీ వలంటీర్ చావకూరి రాజా స్థానిక సర్పంచ్ మార్తాల వెంకటేశ్వరరెడ్డి సహకారంతో గ్రామంలో సొంతంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామస్తులకు ఇంటింటికి తిరిగి నీరు సరఫరా చేస్తున్నారు. కాగా, తెలుగు తమ్ముళ్ల నిర్వాకంతో నాలుగు రోజులుగా గ్రామంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కొత్తపాలెంలో సీపీడబ్ల్యూఎస్ స్కీంపై పెత్తనం కోసం తెలుగు తమ్ముళ్ల మధ్య పోటీ టీడీపీ నేతల తీరుతో మూడు రోజులుగా నిలిచిన నీటి సరఫరా వేసవి కావడంతో నీటి కోసం గ్రామస్తులకు ఇబ్బందులునీళ్లు వదిలే వ్యక్తి రావడం లేదు కొత్తపాలెం గ్రామంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం నుంచి నీళ్లు వదిలే వ్యక్తి రాకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. గతంలో సీపీడబ్ల్యూఎస్ స్కీం పర్యవేక్షణకు టెండర్ ద్వారా నిధులు కేటాయించేవారు. కొన్నేళ్లుగా టెండర్ ప్రక్రియ నిలిపివేశారు. దీంతో స్కీం పర్యవేక్షణకు డబ్బుల్లేవు. సీపీడబ్ల్యూఎస్ స్కీంను స్థానికంగా పంచాయతీలో కలిపి దాని ద్వారా గ్రామస్తులకు నీరు సరఫరా చేస్తాం. గ్రామస్తులు నీటి కోసం ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా వ్యక్తిని ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరిస్తాం. – మహీంద్రరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ -
చిరు వ్యాపారిపై అధికారుల దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్సు: దర్శిలో డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందనే సాకుతో భారీగా పోలీసులను మొహరించి మరీ ఓ దుకాణాన్ని తొలగించి చిరువ్యాపారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటనతో స్థానికులు సైతం అవాక్కయ్యారంటే అధికారులు, అధికార పార్టీ నేతల దాష్టీకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దర్శి డీఎస్పీ కార్యాలయం ప్రహరీకి రెండు అడుగుల లోపలకు ఉన్నప్పటికీ అడ్డంకి సాకుతో దుకాణాన్ని తొలగించడం కక్ష్యసాధింపులో భాగమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలు కొణతం అపర్ణ, ఆమె భర్త సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. దర్శి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం పక్కనున్న సూరే చెంచుసుబ్బారావు (టీచర్)కు చెందిన ఖాళీస్థలాన్ని అపర్ణ, సురేష్ అద్దెకు తీసుకున్నారు. అందులో సుమారు రూ.2 లక్షల పెట్టుబడితో విజయపార్లర్ కోసం రేకులతో ఓ దుకాణం నిర్మించుకున్నారు. నిర్మాణ సమయంలో చూస్తూనే ఉన్న డీఎస్పీ లక్ష్మీనారాయణ ఏమీ అడ్డుచెప్పలేదు. తీరా నిర్మాణం పూర్తయ్యాక దుకాణాన్ని తొలగించాలని అపర్ణ, సురేష్‌లకు హుకుం జారీ చేశారు. దీంతో మరుసటిరోజు సురేష్ తన వద్ద ఉన్న ప్రభుత్వ అనుమతుల పత్రాలను డీఎస్పీకి చూపించారు. వాటిని పరిశీలించి నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోమని డీఎస్పీ చెప్పారు. కానీ, సురేష్‌ను వెంటనే సీఐ రామారావు పిలిపించి అక్కడి నుంచి ఆ దుకాణాన్ని తొలగించాలని, లేనిపక్షంలో అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపుతానని బెదిరించారు. అప్పటికే అన్నీ సిద్ధం చేసుకుని ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకున్న సురేష్, అపర్ణలకు ఏం చేయాలో అర్థంగాక అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా వారు కనికరించకపోగా, నగర పంచాయతీ కమిషనర్‌ను రంగంలోకి దించారు. శనివారం సాయంత్రం ట్రాక్టర్, పంచాయతీ సిబ్బందిని పిలిపించి పోలీసులను మొహరించి దుకాణాన్ని బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు. నిలదీసిన స్థానికులు... దుకాణం తొలగించడాన్ని చూసిన స్థానిక ప్రజలు సైతం అక్కడకు వచ్చి ఇదేమి న్యాయమంటూ కమిషనర్‌ను నిలదీశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందని తొలగిస్తున్నామని కమిషనర్ మహేష్ బదులిచ్చారు. దీంతో స్థానికులు అలా ఎలా తొలగిస్తారని భారీగా అక్కడకు చేరుకోవడంతో దర్శి డీఎస్పీ పరిధిలోని నలుగురు ఎస్సైలు, 20 మంది పోలీసులు జనాలను పక్కకు నెట్టి బంకును బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారు. కొలతలు వేసి అడ్డుగా ఉంటేనే బంకును తొలగించాలని, అలా కాకుండా ప్రైవేటు స్థలంలో ఉన్న బంకును తొలగించడం ఏమి న్యాయమంటూ కమిషనర్‌ను స్థానికులంతా నిలదీశారు. కనీసం ముందస్తు సమాచారంగానీ, నోటీసుగానీ ఇవ్వకండా ఉన్నపలంగా ఎలా తొలగిస్తారని ప్రజలు ప్రశ్నించినప్పటికీ ఆర్అండ్బీ స్థలంలో ఉందంటూ ఆర్అండ్బీ అధికారులు లేకుండానే నిర్ధారించారు. దీంతో స్థలం యజమాని సుబ్బారావు అక్కడకు చేరుకుని స్థలానికి కొలతలు వేయించగా, అతని స్థలంలోనే దుకాణం ఉందని రుజువైంది. చేసేదేమీ లేక దర్శి ఎస్సై మురళి అక్కడున్న ప్రజలపై లాఠీచార్జి చేస్తూ తిట్లపురాణం అందుకుని భయబ్రాంతులకు గురిచేశారు. కమిషనర్ కూడా తన సిబ్బంది ద్వారా షాపును పెకిళించి అక్కడి నుంచి బలంవతంగా తొలగించారు. రాత్రి 12.30 గంటల వరకు కమిషనర్ అక్కడే ఉండి బంకు తొలగింపు చర్యల్లో పాల్గొనడం ఆయన అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. ఒక సమయంలో కమిషనర్‌ను సైతం బాధితులు వేడుకున్నారు. తమ పొట్ట కొట్టొద్దంటూ చేతులెత్తి దండంపెట్టారు. కానీ, కనికరించకపోవడంపై స్థానికులు ఇదేమి కక్ష సాధింపు అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసి అధికారులు, పోలీసుల తీరును చీత్కరించుకుంటున్నారు. పోలీసు అధికారులు, నగర పంచాయతీ అఽధికారులు తమ నోటికాడి కూడు తీసివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు చొరవచూపి తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేసి జీవనాధారం కల్పించాలని అపర్ణ, సురేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. దర్శిలో డీఎస్పీ కార్యాలయానికి అడ్డుగా ఉందనే కారణంతో దుకాణం తొలగింపు మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంతో భారీగా పోలీసుల మొహరింపు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఒత్తిడి మేరకే తొలగించారని బాధితుల ఆరోపణ -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు చీమకుర్తి: దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం చీమకుర్తిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు పావులు కదుపుతోందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక కోడ్లను తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయన్నారు. అందుకు నిరసనగా చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం● గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలి ● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఒంగోలు వన్‌టౌన్: మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మైదాన ప్రాంత గిరిజన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రకారం రాష్ట్రంలో జనాభా 4.32 కోట్లయితే.. వారిలో ఎస్టీలు 25,34,795 మంది ఉన్నారన్నారు. ఎస్టీల్లో ప్రధానంగా యానాదులు, చెంచులు, ఎరుకలు, సుగాలీలు, కమ్మర్లు, కొండదొరలు, కోయలు, జాతాపులు, కోర్లు, సవర్లు, కొండ రెడ్లు, బగతలు.. ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు. వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు. రాష్ట్రంలో కమ్మ రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం ఇస్తున్న 7 అసెంబ్లీ సీట్లను ఏజెన్సీ ప్రాంత ఎస్టీలకే ఇస్తున్నారన్నారు. మైదాన ప్రాంతం వారిని పట్టించుకోవడంలేదన్నారు. రాయలసీమ, కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని మైదాన ప్రాంతాల గిరిజనులకు ఎస్టీ నియోజకవర్గాలను రిజర్వు చేయడం లేదన్నారు. ప్రధానంగా యానాదులు, ఎరుకలు, సుగాలీలు, చెంచులు, కమ్మర్లు తదితరులు వారిలో ఉంటారన్నారు. యానాదులు, ఎరుకలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఎస్టీలలో అత్యధికంగా యానాది కులస్తులు ఉన్నారని తెలిపారు. 5 లక్షల మందికిపైగా వారు ఉన్నారన్నారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో మైదాన ప్రాంత గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ప్రతి జిల్లాలోనూ ఐటీడీఏ ఏర్పాటు చేసి బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందించాలన్నారు. ఎస్టీలకు రాజకీయ ప్రాతిఽనిధ్యం ఉండాలన్నారు. కార్యక్రమంలో బక్కా పరంజ్యోతి, పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు. -
వేధింపులు తాళలేక..
కరెంటు ఇవ్వండి సారూ.. ● పోలవరంలో మూడు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా ● విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రాస్తారోకో ముండ్లమూరు (కురిచేడు): మండలంలోని పోలవరంలో మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం గంటపాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో బోర్లు పనిచేయక తాగేందుకు ప్రజలకు, మూగజీవాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరాపురం వెళ్లి నీళ్లు తెచ్చుకుని గొంతు తడుపుకోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ జీవాలకు తాగునీరు లేక ఒక ఆవు చనిపోయిందని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవి ప్రాణంపోయిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా విద్యుత్ శాఖ అధికారులు వచ్చి మాట్లాడే వరకు రాస్తారోకో విరమించబోమని తేల్చిచెప్పారు. మండల టీడీపీ ఇన్చార్జి సోమేపల్లి శ్రీనివాసరావు రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరణ చేయిస్తానని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు. కంభం: స్థానిక కాపవీధిలో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన షేక్ వలి (37) కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. మద్యం మత్తులో గొడవకు దిగడంతో అతని భార్యే కండువాను గొంతుకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అర్థవీడుకు చెందిన షేక్ వలి కంభం పంచాయతీ పరిధిలోని సాధుమియా వీధికి చెందిన మహిళను వివాహం చేసుకుని భార్యతో కలిసి కొంతకాలంగా కంభంలోని కాపవీధిలో నివాసం ఉంటున్నాడు. మృతుడు పెయింటింగ్ పనులకు వెవెళ్తుండగా, అతని భార్య రిజ్వాన కూలి పనులకు వెళ్తుంటుంది. మద్యానికి బానిసైన వలి తరచూ భార్యతో గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పనికి వెళ్లకుండా మద్యం సేవించి భార్యతో గొడవపడి ఇంట్లోనే పడుకున్నాడు. సుమారు రాత్రి 9 గంటల సమయంలో ఎంత నిద్రలేపినా లేవకపోవడంతో వెంటనే కంభం ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు. తొలుత పురుగుమంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, మద్యం సేవించి డీహైడ్రేషన్‌తో మృతి చెందాడని ప్రచారం జరిగింది. మృతుడి గొంతు వద్ద అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్యను విచారించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. మద్యం మత్తుకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవపడేవాడని, ఈ నేపథ్యంలో శనివారం భార్యతో గొడవపడి ఘర్షణకు దిగిన నేపథ్యంలో కండువాను భర్త మెడకు బిగించడంతో అతను ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుడి భార్య, బంధువులను విచారించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. డీఎస్పీ నాగరాజు దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. భర్తను హత్య చేసిన భార్య మద్యం మత్తులో గొడవకు దిగడంతో కండువా మెడకు చుట్టి హత్య కంభంలో అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు -
సత్వర న్యాయంతోనే ప్రజల నుంచి ఆదరణ
● హైకోర్టు జడ్జి డాక్టర్ కె.మన్మథరావు ఒంగోలు: సత్వర న్యాయంతోనే ప్రజల నుంచి మంచి ఆదరణ పొందగలుగుతామని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కె.మన్మథరావు అన్నారు. ఒంగోలులోని జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఒంగోలు బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసుల పరిష్కారంలో ఇటు న్యాయమూర్తులు, అటు న్యాయవాదుల మధ్య మంచి వాతావరణం ఉండటం ద్వారానే సత్వర న్యాయం సాధ్యపడుతుందన్నారు. పాజిటివ్ దృక్పథంతో అందరికీ న్యాయవ్యవస్థ అందుబాటులో ఉందన్న భావన కలిగించాలంటే బార్ అండ్ బెంచ్ సంబఽంధాలే ముఖ్యమన్నారు. ప్రజలకు ఏం అవసరమో.. అదే అందించాలన్న ఆకాంక్షను ప్రతిఒక్కరూ కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యుడిగానే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించానని, 33 ఏళ్లపాటు న్యాయవాదిగా కొనసాగి గత 3 సంవత్సరాలుగా హైకోర్టు జడ్జిగా సేవలందిస్తున్నానని అన్నారు. అనేక కేసులను సత్వరమే పరిష్కరించే అవకాశం తనకు రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. రోజుకు 30 నుంచి 40 ఉత్తర్వులను ఆంగ్లంలో ఇవ్వగలుగుతున్న తాను.. ఒక తెలుగులో తీర్పు ఇవ్వడానికి 42 రోజులు కృషిచేయాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ తెలుగులో తీర్పు ఇవ్వాలన్న ఆకాంక్షను కూడా తీర్చుకోగలిగానన్నారు. ఒంగోలులో ఓనమాలు నేర్చుకుని నేడు ఏపీ హైకోర్టు జడ్జిగా మంచి పేరు తెచ్చుకోగలిగానని, అందుకు మీ అందరి ఆశీర్వాదమే కారణమని అన్నారు. మంచి తీర్పులు ఇవ్వాలనే దృక్పథంతో నాకు ఉన్న నిర్ణయాలు, నా ముందు ఉన్న అంశాలు సంపూర్ణంగా పరిశీలించుకుని అంతరాత్మ సాక్షిగా తీర్పులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు బార్ అసోసియేషన్ పాత పాలకవర్గం ఒరవడికి మరింతగా మెరుగుల దిద్ది ఉన్నతమైన సేవలతో నూతన కార్యవర్గం కొనసాగాలని సూచిస్తూ వారిని అభినందించారు. 40 సంవత్సరాలుగా ఒంగోలు బార్ అసోసియేషన్‌లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కె.మన్మథరావును, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతిని ఒంగోలు బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానంతో పాటు నాగిశెట్టి మోహన్‌దాస్ అధ్యక్షతన ఒంగోలు బార్ అసోసియేషన్ రూపొందించిన టెలిఫోన్ డైరెక్టరీని ఆయన ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ప్రస్తుతం తెలంగాణలో జడ్జిగా పనిచేస్తూ మరణించిన ఎంజీ ప్రియదర్శినిని స్మరించుకుంటూ మౌనం పాటించారు. -
మండుటెండలో.. మిర్చి ఘాటులో..
● మిర్చి గ్రేడింగ్ పనుల్లో మహిళలు పెద్దారవీడు: మిర్చి కోతలు, కల్లాల్లో మిర్చి గ్రేడింగ్ చేయాలంటే కూలీలు చాలా అవసరం. మండలంలో ఓ వైపు భగభగమంటున్న భానుడు, మరో వైపు మిర్చి ఘాటులను పట్టించుకోకుండా మహిళలు తలకు గుడ్డ చుట్టుకుని మండు టెండలను అధిగమిస్తూ, ఘాటును భరిస్తూ కోతలు, గ్రేడింగ్ పనులు చేస్తున్నారు. చూసేవారంతా ఎండను తట్టుకొని ఎలా పనులు చేస్తున్నారు తల్లీ అంటున్నారు. మండలం పరిధిలో పెద్దారవీడు, గొబ్బూరు, ఓబులక్కపల్లి గ్రామాల్లో ఒక వైపు మిర్చి కోతలు, మరో వైపు కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి గ్రేడింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీలకు మంచి నీటి సౌకర్యం రైతులు అందుబాటులో ఉంచుతున్నారు. ఎండలకు ఎంత నీరు తాగినా చాలటం లేదంటున్నారు మహిళలు. ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతను భరిస్తూ మహిళలు కూలి పనులు చేస్తున్నారు. -
అమరావతి రీలాంచ్ పేరుతో రూ.700 కోట్లు వృథా
ఒంగోలు సిటీ: అమరావతి రీలాంచ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఒంగోలుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చి చేసిందేమీ లేదని, ఆయన ఏదో ఇచ్చేస్తారని కూటమి నేతలు ఆర్భాటం చేశారని, అయితే ఆయన పవన్ కళ్యాణ్ చేతిలో చాక్లెట్ పెట్టారని ఎద్దేవా చేశారు. గతంలో న్యాయమూర్తుల పర్యవేక్షణలో రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు కేటాయిస్తూ వచ్చారని, మీరు అధికారంలోకి వచ్చాక దానికి స్వస్తి పలికి మీ సొంతవాళ్లకి పనులు కేటాయించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. చదరపు అడుగుకు రూ.1800 అయ్యే చోట రూ.10,065 ఖర్చు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణాల విషయంలో కిలోమీటరుకు రూ.25 కోట్లకు ఇస్తుంటే.. మీరు రూ.60 కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంపద సృష్టించి ప్రజలకు లబ్ధి చేకూరుస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారని, ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే మీ ఇంట్లోవారికి సంపద సృష్టిస్తున్నారన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేశారని నాడు ప్రధాని మోదీ ఆరోపించారని, నేడు అమరావతిని ఏటీఎంగా మార్చేసుకున్నారని కారుమూరి ధ్వజమెత్తారు. అమరావతిలో చేపడుతున్న నిర్మాణాల్లో రూ.లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలుస్తూ దోచేస్తున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారన్నారు. భ్రమరావతి పేరుతో రైతులను గాలికొదిలేశారు.. భ్రమరావతి పేరుతో చంద్రబాబు రైతులను గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. ఫీజు రీయింబర్స్ కట్టకపోవడంతో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద ఎత్తున హడావుడి చేశారని, నేడు అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని దోచేస్తుంటే ఆయన ఎందుకు నోరుమెదపడంలేదని కారుమూరి ప్రశ్నించారు. నాడు సీజ్‌ద షిప్ అన్నారు.. నేడేమో స్టార్ట్ ద షిప్ అన్న విధంగా పేదల బియ్యం అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు వాటాలు పంచుకుంటూ పోర్టుల ద్వారా బియ్యాన్ని తరలించేస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లయిస్ మంత్రి రైతుల విషయంలో, బియ్యం దోపిడీ విషయంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం గాలికొదిలేసినా రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్ పాల్గొన్నారు. ప్రధాని వచ్చి పవన్ చేతిలో చాక్లెట్ పెట్టారు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటున్నారు ప్రతీ నియోజకవర్గంలోనూ రేషన్ మాఫియా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి ధ్వజం -
మృత్యుఘోష
వేకువన ● జాతీయ రహదారిపై నిమిషాల వ్యవధిలో మూడు ప్రమాదాలు ● ఐదుగురి దుర్మరణం, నలుగురికి గాయాలు ● వారిలో ఒకరి పరిస్థితి విషమం ● మృతులు నెల్లూరు, గుంటూరు జిల్లావాసులు ● నుజ్జునుజ్జయిన లారీ, కారు ● మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన తల్లీ కొడుకు ● గమ్యస్థానం చేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిన బాబాయ్, అబ్బాయ్ ● సురక్షితంగా బయటపడిన రెండేళ్ల చిన్నారి వేకువజామున గం.4.50 సమయం.. ఒంగోలులో నిమిషాల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాలతో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఈ దారుణ ఘటనల్లో ఐదుగురు విగతజీవులు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలం చూపరులకు ఒళ్లుగగుర్పాటు కలిగించేలా ఉంది. చెల్లా చెదురైన లారీ, నుజ్జు నుజ్జయిన కారులో ఇరుక్కొని పోయిన మృతదేహాలతో భయకంపితంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు మీద వందలాది వాహనాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు, బాబాయ్, అబ్బాయ్ విగతజీవులయ్యారు. ఒంగోలు టౌన్: జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాలతో నగరం ఉలిక్కిపడింది. వెంట వెంటనే మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించడం... ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం నిముషాల వ్యవధిలోనే జరిగిపోయింది. నలుగురికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటిన తరువాత కొద్ది దూరంలో టైరు పంక్చర్ కావడంతో ఒక లారీ ఆగి ఉంది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఇటుక లోడుతో వస్తున్న ట్రాక్టర్, కారు, ఒక మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దానికి 500 మీటర్ల దూరంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి తిరుపతి వెళుతున్న కారును వెనక నుంచి వచ్చిన భారీ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. భర్త ఒంగోలులో...భార్య గుంటూరులో.. ఈ ప్రమాదంలో బూసి వినయ్ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉంది. తలకు తీవ్రంగా గాయాలైన వినయ్ కోమాలోకి వెళ్లి పోయారు. ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వినయ్ భార్య బూసి లావణ్యకు వెన్నెముకకు గాయం కావడంతో పాటుగా కాలు విరిగింది. దీంతో ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఈ దంపతుల రెండేళ్ల కుమారుడు లోక్షిత్ సురక్షితంగా బయటపడ్డాడు. అమ్మా నాన్నలు కనిపించకపోవడంతో ఆ చిన్నారి రోదిస్తుండడం స్థానికులను కలిచివేసింది. బాబాయ్..అబ్బాయ్ దుర్మరణం: నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి చెందిన రావినూతల బాబు (42), రావినూతల నాగేంద్ర (20) వరసకు బాబాయ్, అబ్బాయ్ అవుతారు. కోడిగుడ్లు తీసుకొని తెలంగాణలోని భువనగిరి నుంచి శనివారం రాత్రి బయలుదేరారు. మరో రెండు గంటలు గడిస్తే గమ్యం చేరుకుంటారనగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొంది. ఒంగోలు–నెల్లూరు జాతీయ రహదారి మీద కొప్పోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాటగానే కొద్ది దూరం ప్రయాణించారో లేదో ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. కళ్లు తెరచి చూసే లోపలే పెద్ద శబ్దం వచ్చింది. కోడిగుడ్లన్నీ ఎగిరి రోడ్డు మీద పడ్డాయి. లారీ ముందు భాగం మొత్తం తుక్కుతుక్కయిపోయింది. లారీ డ్రైవర్ రవణయ్య అలియాస్ షేక్ రహీం (60)తో సహా బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరి తల పగిలిపోయి ఛిద్రమైంది. నాగేంద్రకు వచ్చే నెలలో వివాహం జరగనున్నట్లు సమాచారం. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో రోడ్డుపై బోల్తాపడిన కోడిగుడ్ల లారీ తల్లీ, కుమారుడు మృతి... పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తిరుమలశెట్టి కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లావణ్యను అమరావతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బూసి వినయ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారి రెండేళ్ల బాబు లోక్షిత్‌కు పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు గుంటూరు నుంచి తిరుపతికి కారులో బయలు దేరారు. వినయ్ కారులో వారికి సైతం మొక్కు ఉండడంతో గుంటూరులో ఉంటున్న ఆర్ఎంపీ కృష్ణ పెద్ద అన్నయ్య కుమారుడు, ఒక ప్రైవేటు కాలేజీలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన భార్య పావని(40), వారి చిన్నకుమారుడు చంద్రకౌశిక్ (15)లు సైతం ఎక్కారు. సరిగ్గా తెల్లవారుజామున గం.4.50 కు జాతీయ రహదారిపై ఒంగోలు చేరుకున్నారు. బైపాస్ నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగిన తరువాత కొద్ది దూరంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఉండడంతో కారు ఆపారు. అంతలోనే వేగంగా వచ్చిన ఒక భారీ కంటైనర్ ఢీ కొట్టింది. ముందున్న లారీ, వెనక ఉన్న కంటైనర్ల మధ్య చిక్కుకున్న కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకులు తిరుమలశెట్టి పావని, చంద్ర కౌశిక్ అక్కడికక్కడే మృతి చెందారు. భర్త వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం షాక్‌లో ఉన్న ఆయనకు నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చంద్రకౌశిక్ గత నెలలో విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 576 మార్కులు సాధించాడు. దీంతో తల నీలాలు సమర్పించేందుకు తిరుమల బయలుదేరగా మృత్యువు కబళించింది. తల్లీకుమారులు మృత్యువాత పడడంతో కొప్పురావూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్ఎంపీ కృష్ణ చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితమే వివాహం జరిగి ఇంటి ముందు వేసిన పందిరి కూడా తీయలేదు. ఇంతలోనే ఊహించని విషాదంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. -
డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ
ఒంగోలు టౌన్: నేరాల నియంత్రణలో డ్రోన్ కెమెరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, నేర స్థలాలను పరిశీలించేందుకు, ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు వీలవుతుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాల యజమాని రవికుమార్ శనివారం పోలీసు శాఖకు డ్రోన్‌ను బహూకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీసుస్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతరా నేరాలకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగానే గుర్తించి అక్కడకు డ్రోన్లను పంపించినట్లు తెలిపారు. ప్రముఖుల బందోబస్తుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. డ్రోన్ కెమెరాలు పోలీసుల సామర్థ్యాన్ని మరింత మెరుగు పరుస్తుందన్నారు. రూరల్ సీఐ శ్రీకాంత్, మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య పాల్గొన్నారు. నేడు సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం ● ప్రారంభోత్సవానికి హాజరు కానున్న హైకోర్టు జడ్జిలు ● ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా జడ్జి భారతి సింగరాయకొండ: కొండపి నియోజకవర్గ ప్రజల కల అయిన సివిల్ జడ్జి (జూనియర్ విభాగం) కోర్టు ఆదివారం ఉదయం 9.30 గంటలకు స్థానికంగా ప్రారంభించనున్నట్లు సింగరాయకొండ బార్ అసోసియేషన్ తెలిపింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి టి.రాజశేఖరరావు, హైకోర్టు జడ్జిలు డాక్టర్ కె.మన్మథరావు, జి.రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ వై.లక్ష్మణరావు, జిల్లా జడ్జి భారతి, జిల్లాలోని అన్ని కోర్టుల జడ్జిలు పాల్గొంటారన్నారు. కోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లా జడ్జి భారతి స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 35 టన్నుల తెల్లరాయి పట్టివేత ● లారీ స్వాధీనం, పోలీసుస్టేషన్‌కు తరలింపు కొనకనమిట్ల: కనిగిరి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 35 టన్నుల తెల్లరాయి లారీని శనివారం రాత్రి భూగర్భ గనుల ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. మార్కాపురం భూగర్భ గనుల ఖనిజాభివృద్ధి సంస్థ డివిజన్ కార్యాలయం ఏజీ పోలిరెడ్డికి అందిన సమాచారం మేరకు ఆయన తన సిబ్బందితో వెళ్లి అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయి లోడు లారీని పట్టుకున్నారు. ఏజీ తెలిపిన వివరాల మేరకు కనిగిరి నుంచి హైదరాబాద్‌కు తెల్లరాయితో వెళ్తున్న లారీని కొనకనమిట్ల మండలం చినారికట్ల జంక్షన్ సమీపంలో తనిఖీ చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తెల్లరాయి లారీని స్వాధీనం చేసుకొని కొనకనమిట్ల పోలీసుస్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన రాయి, లారీ విషయంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పోలిరెడ్డి స్పష్టం చేశారు. టీఏ బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్ష్మీచెన్నకేశవునికి ప్రత్యేక పూజలు
మార్కాపురం టౌన్: పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి, కంభంరోడ్డులోని ప్రసన్న వేంకటేశ్వరస్వామికి అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్లకు అర్చక బృందం ఆధ్వర్యంలో అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణం, అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈవో జీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
సింగరాయకొండ: సార్.. మా బిడ్డ ఐశ్వర్య (3) కనబడటం లేదు.. రక్షించి మాకు అప్పగించడండి.. అంటూ తండ్రి చిలకూరి హరికృష్ణ ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగి రెండు రోజుల్లో కేసును ఛేదించిన సీఐ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్రలను ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 30వ తేదీ బుధవారం నుంచి కుమార్తె ఐశ్వర్య కనబడటం లేదని పాతసింగరాయకొండ పంచాయతీ బాలిరెడ్డినగర్‌కు చెందిన హరికృష్ణ ఈ నెల ఒకటో తేదీన ఎస్సై బి.మహేంద్రకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో సీఐ హజరత్తయ్య సూచనలతో దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై మహేంద్ర పాప తప్పిపోయిన రైల్వేస్టేషన్ రోడ్డులోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలతో నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలేనికి చెందిన యువకుడు నరసింహం పాపను రైల్వేస్టేషన్ నుంచి పోలీస్‌స్టేషన్ సెంటర్‌కు వచ్చి కందుకూరు వైపు వెళ్లే బస్సు ఎక్కడాన్ని గుర్తించారు. వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు కరపత్రికలు కందుకూరు, వలేటివారిపాలెం తదితర ప్రాంతాల్లో పోలీసులు పంపిణీ చేశారు. ఈ ప్రయత్నంలో చివరికి నెల్లూరు జిల్లా వలేటివారిపాలెంలో ఉన్నట్లు సమాచారం అందటంతో అక్కడికి వెళ్లి పాపను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడు నరసింహను పట్టుకున్న ఎస్సై మహేంద్ర వివరాలు రాబట్టగా రైల్వేస్టేషన్ వద్ద ఐశ్వర్య నాయనమ్మ మద్యం తాగి పడిపోయిందని, దీంతో తనకు దిక్కుతోచక పాపను తీసుకెళ్లానే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పాడన్నారు. ఐశ్వర్యను తమకు అప్పగించిన ఎస్సై మహేంద్రను తల్లి శిరీష అభినందించారు. పాప తప్పిపోవడంతో రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా రోదించానని, ఏం చేయాలో అర్థం కాలేదని, చివరికి దేవుల్లా మా అమ్మాయిని మా ఒడికి చేర్చారని ఆమె కన్నీటి పర్యంతమైంది. కేసును పట్టుదలతో ఛేదించిన ఎస్సై మహేంద్రను మండల ప్రజలు అభినందించారు. కేసును రెండు రోజుల్లో ఛేదించిన పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఐశ్వర్య తల్లిదండ్రులు సింగరాయకొండ సీఐ, ఎస్సైను అభినందించిన ఎస్పీ -
ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా సబ్ జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు శనివారం కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది బాలురు, 30 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో నైపుణ్యం కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ జట్లకు పామూరులోని సెయింట్ మార్క్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శిక్షణ శిబిరం ఉంటుందన్నారు. 15 నుంచి 18వ తేదీ వరకు చిత్తూరులో జరిగే సబ్ జూనియర్స్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. ఎంపికలో జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి టి.సుబ్బారావు, కోశాధికారి ముప్పారపు జయకుమార్, మెంబర్ సయ్యద్ జిలానీబాషా, పలువురు పీడీలు పాల్గొన్నారు. -
పింఛన్లకూ బ్రేకులు
కంభం: పింఛన్ డబ్బులు పెంచామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా కొత్తగా ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయక పోవడంపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అధిక శాతం మంది పేద, మధ్య తరగతి వారున్నారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు వితంతువులు కూడా పింఛన్లు మంజూరు చేయక పోవడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అవస్థలు పడుతున్నారు. తాజాగా స్పౌజ్ కేటగిరిలో పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా పింఛన్ పొందుతూ భర్త మృతి చెందిన మహిళలకు మాత్రమే ఈ కేటగిరిలో పింఛన్లు మంజూరు చేస్తారు. వివిధ కేటగిరిల్లో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. పింఛన్ల కోసం ఎదురుచూపులు కూటమి పాలనలో కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య సామాజిక పింఛన్‌దారు మరణిస్తే వారి భార్యలను స్పౌజ్ కేటగిరిలో పింఛన్ మంజూరుకు అర్హులుగా నిర్థారిస్తున్నారు. దీంతో ఎటువంటి పింఛన్ పొందని వ్యక్తి మరణించినా ఆ కుటుంబంలో అర్హులకు నిరాశ ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది వితంతువులు పింఛన్ పొందేందుకు అర్హులుగా ఉన్నారు. పింఛన్ల సంఖ్య పెంచకుండా ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు పింఛన్ల మంజూరులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనుసరించిన విధానమే సరైందని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. పింఛన్ బదలాయింపు వంటివి లేకుండా సచివాలయం, వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారు. భర్త చనిపోయిన వారికి వితంతు పింఛన్లు మరుసటి నెలలోనే మంజూరు చేసేలా చర్యలు తీసుకునే వారు. అదే విధంగా ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్ల మంజూరుకు అవకాశం కల్పించే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేక పోవడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారు.దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలి నా భర్త 2024 డిసెంబర్ 27వ తేదీన చనిపోయాడు. నేను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. భర్త చనిపోయి జీవనోపాధి కోల్పోయిన నాకు వితంతు పింఛను కూడా రావడం లేదు. ప్రభుత్వం స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. – పట్రా మార్తమ్మ, పాపినేనిపల్లి కొత్తగా దరఖాస్తుకు అవకాశం లేదు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య సామాజిక పింఛన్‌దారు మరణిస్తే వారి భార్యలకు స్పౌజ్ కేటగిరిలో పింఛన్ మంజూరు చేసేందుకు వెరిఫికేషన్ చేస్తున్నాం. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రస్తుతానికి అవకాశం లేదు. సర్వర్ ఓపెన్ అయితే అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. – వీరభద్రాచారి, ఎంపీడీఓ, కంభం -
రేపటి నుంచి చిల్డ్రన్ సమ్మర్ క్యాంపు
ఒంగోలు టౌన్: ప్రకాశం బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి చిల్డ్రన్ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ కమిటీ నాయకులు సీహెచ్ వినోద్, వీరాస్వామి తెలిపారు. శనివారం ఎల్బీజీ భవనంలో క్యాంపు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ మూడేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేసవి తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో చిన్నారులు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కొనిపోయి విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా చేయాలన్న ఉద్దేశంతోనే సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడం, వారిలోని నైపుణ్యాల ఆధారంగా మరింతగా రాణించేందుకు తోడ్పాటు ఇస్తున్నట్లు చెప్పారు. సైన్స్ ప్రయోగాలు, మెమరీ గేమ్స్, మ్యాజిక్, పాటలు ఆటలు, కథలు నేర్పించడం, మహనీయుల జీవిత చరిత్రలను పరిచయం చేయనున్నట్లు చెప్పారు. 4 నుంచి 10వ తరగతి లోపు విద్యార్థులు రిజిస్ట్రేషన్ కోసం 94903 00412 ఫోన్ చేయాలని కోరారు. ప్రజా నాట్యమండలి నగర కార్యదర్శి ఇంద్రజ్యోతి, మ్యాజిక్ రామన్, జన విజ్ఞాన వేదిక నగర కార్యదర్శి రంగారెడ్డి పాల్గొన్నారు. -
చిన్నారులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవాలి
ఒంగోలు టౌన్: చిన్నారులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి సూచించారు. జిల్లా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతులు శనివారం 5వ రోజుకు చేరాయి. 65 మంది చిన్నారులు హాజరుకాగా వారితో కథలు చదివించారు. ఇంగ్లిష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లిష్, లూసిడా హ్యాండ్ రైటింగ్, యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆదిలక్షి తరగతులను సందర్శించారు. క్రాఫ్ట్ క్లాసులో పిల్లలు తయారు చేసిన వస్తువులు చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి విజ్ఞాన తరగతులతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. సెల్ఫోన్లు, ఆన్లైన్ గేమ్‌లతో చిన్నారుల విలువైన సమయం పాడు కాకుండా మంచి అలవాట్లతో చిన్నారులను తీర్చిదిద్దొచ్చన్నారు. వేసవి విజ్ఞాణ తరగతులకు హాజరయ్యేలా చిన్నారులను ప్రోత్సహించాలని తలిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా గ్రంథాలయ ఉపపాలకురాలు బొమ్మల కోటేశ్వరి మాట్లాడుతూ చిన్నారులకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే వారిలోని ఆలోచనలను మేలుకొల్పొవచ్చని చెప్పారు. చిన్నతనం నుంచే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దితే పెద్దయ్యాక బాధ్యత కలిగిన పౌరులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. శిరీష, టి.రవీంద్ర, డి.ప్రసాద్, ఆర్.విందుమణి, టి.శ్రీనివాసరావు, వెంకయ్య పాల్గొన్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
కంభం: మద్యం తాగి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి స్థానిక కాప వీధిలో జరిగింది. వివరాలు.. అర్థవీడుకు చెందిన షేక్ వలి (45) కంభం పంచాయతీ పరిధి సాధుమియా వీధిలో వివాహం చేసుకొని భార్యతో కలిసి కొంతకాలంగా కాప వీధిలో నివాసం ఉంటున్నాడు. పెయింటింగ్, ఇతర కూలి పనులకు వెళ్లే వలి మద్యానికి బానిసై తరుచూ భార్యతో గొడవపడే వాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన అతను నిద్రపోయాడని, చీకటి పడుతున్నా లేవక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యం తాగిన అతను డీహైడ్రేషన్‌తో మృతి చెందాడా? ఇంకా ఏదైనా కారణంతో మృతి చెందాడా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
మహా మేతగాళ్లు
కూటమి నేతలు.. నదీగర్భాలను ఇసుకాసురులు కుళ్లబొడిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, అక్రమార్కులు ఒక్కటై కొండపి నియోజకవర్గంలో పాలేరు, మన్నేరు, అట్లేరు నదులపై రాబందుల్లా వాలిపోయారు. భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అధికారం చేతిలో ఉందికదా అడిగేవాళ్లెవరు అంటూ రెచ్చిపోయారు. నిబంధనలు అతిక్రమించి నిత్యం వేలాది ట్రాక్టర్లలో వేల టన్నుల ఇసుకను దోచేశారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా సహజ సంపదను కొల్లగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లో జరుగుతున్న దోపిడీపై అధికారులు కిమ్మనడంలేదు. మంత్రి ఇలాఖాలో ఇసుక దోపిడీ సాక్షాత్తు మంత్రి స్వామి నియోజకవర్గంలోని జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి, సింగరాయకొండ మండలాల్లో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతంలో స్థానికులు ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడంలేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ట్రాక్టర్లకు అక్రమంగా ఇసుకను లోడ్ చేస్తూ భారీగా వసూలు చేస్తున్నారు. 10 కిలోమీటర్ల వరకే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లాలన్న నిబంధన ఉన్నా జరుగుమల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఒంగోలుకు వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. మైనింగ్, పోలీసు అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై అధికారులకు సవాల్ విసురుతున్నా. రీచ్‌ల వద్దకు వెళదాం. అక్రమ దందాను నిరూపిస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకునే దమ్ముందా..? ఆ ప్రాంతంలో పహారా పెడతారా... ప్రభుత్వ ఖనిజాలు దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా. అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోంది. ప్రభుత్వ ధనం లూటీ అవుతోంది. గతంలో ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వచ్చేది. ఖనిజ సంపదకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే ఇసుక దందాకు తెరతీశారు. కౌంటింగ్ పూర్తయిన క్షణం నుంచే పచ్చనేతలు రెచ్చిపోయారు. జిల్లాలో ఎక్కువ నదీ పరీవాహక ప్రాంతమున్న ఈ నియోజకవర్గంలోని సహజ వనరులపై కన్నేశారు. మొదట్లో జరుగుమల్లి మండలం సతుకుపాడు వద్ద ప్రభుత్వం ఇసుక స్టాకు పాయింట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ టన్ను రూ. 275 చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం ట్రాక్టరు ఇసుకకు రూ.1500 చెల్లించి బయట మార్కెట్లో రూ. 5000 లకు విక్రయిస్తూ దోపిడీని షురూ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో రాత్రి పూట అక్రమంగా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు ఎవరూ మామూళ్ల మత్తులో అడ్డగించలేకపోయారన్న ప్రచారం జరిగింది. అడపాదడపా అధికారులు అడ్డగించినా వారికి పనిచేసుకుంటావా లేక బదిలీ చేయాలా అన్న బెదిరింపులకు దిగారు అధికార పార్టీ నేతలు. నిబంధనలు మీరి... తమ పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవచ్చని ఎవరూ ఆపవద్దని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఇసుక కోసం వాహనం తీసుకుని నది వద్దకు వెళితే పచ్చనేతలు ట్రాక్టరుకు లోడింగ్ చేసిన దానికి రూ.300, తమ వాటా రూ.500 మొత్తం రూ.800 చెల్లించి మరీ ఇసుక తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అదేమని అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ట్రాక్టరును సీజ్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాక నదుల్లో మనుషులతోనే ఇసుకను ట్రాక్టరుకు లోడ్ చేయాలి తప్ప యంత్రాలను వాడకూడదన్న నిబంధనను కూడా టీడీపీ నేతలు గాలికి వదిలేశారు. యథేచ్ఛగా యంత్రాల ద్వారా ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. నదీపరివాహక ప్రాంతం నుంచి ఇంటి అవసరాలకు వాడుకోవాలే తప్ప వ్యాపారం చేయకూడదన్న నిబంధన కూడా ఉంది. కానీ దానిని ఒక్కరోజు కూడా అమలు కాలేదు. ప్రతి రోజు జరుగుమల్లి నుంచి 30 కిలోమీటర్లు ఉన్న ఒంగోలుకు రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఒంగోలు పరిధిలో ఇసుక స్టాకు పాయింట్లు ఉన్నప్పటికీ జరుగుమల్లి నుంచే ఇసుక అక్రమ రవాణా జరగటంతో అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయిఇటీవల ఒంగోలు, కొండపి లోని పచ్చపార్టీకి చెందిన అధినాయకుల అండదండలతో ద్వితీయశ్రేణి నాయకుల మధ్య గొడవలు జరిగిన సంగతి విదితమే. అధికార పార్టీ నేతలు అనుమతులు ఇవ్వాలి.. జరుగుమల్లి మండలం కామేపల్లి, సతుకుపాడు ప్రాంతంలో టీడీపీ నాయకుల ట్రాక్టర్లకే ఇసుక లోడింగ్ జరుగుతుంతోందని, ఇతరులు వెళితే టీడీపీ నేతల అనుమతి తప్పనిసరి తెలుస్తోంది. దీంతో కాలువలు, నదుల్లో ఇసుకను ఉచితంగా ఏవిధంగా తీసుకుని వెళ్లాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అంతేకాక ఇష్టారాజ్యంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో పొలాలకు వెళ్లే రోడ్లన్నీ ధ్వంసమై ద్విచక్ర వాహనాలపై పొలాలకు వెళ్లలేకపోతున్నామని దీంతో కిలోమీటర్ల దూరం నడిచి పోవాల్సి వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయా మండలాల పరిధిలో భూగర్భ జలాలు అడుగంటాయని, రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ఇసుక మింగేశారు కొండపి నియోజకవర్గంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా పాలేరు, మన్నేరు, అట్లేరు నదుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు టీడీపీ అధినాయకుని కనుసన్నల్లో అక్రమ రవాణా 24 గంటలు ఇసుక తరలిపోతున్నా చోద్యం చూస్తున్న అధికారులు నియోజకవర్గంలో అడుగంటుతున్న భూగర్భ జలాలుచోద్యం చూస్తున్న అధికారులుఈ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రాత్రి పూట టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరగగా, ప్రస్తుతం 24 గంటలూ ట్రాక్టర్ల ద్వారా దందా జోరుగా సాగుతోందని ప్రచారం. ప్రస్తుతం జరుగుమల్లి నుంచి ఒంగోలుకు ప్రతిరోజు సుమారు 300 వరకు, కామేపల్లి నుంచి కొండపి, ఇతర ప్రాంతాలకు సుమారు 300, పొన్నలూరు మండలం వేంపాడు, ఉప్పలదిన్నెప్రాంతాల నుంచి సుమారు 300, సింగరాయకొండ మండలం మన్నేరు, కొండపి మండలం అట్లేరు నుంచి సుమారు 100 కు పైగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం విక్రయిస్తున్న ధరల ఆధారంగా ఇప్పటి వరకూ నియోజకవర్గంలో దాదాపు రూ.100 కోట్లకు పైగా ఇసుక దందా సాగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
హెచ్ఎం పదోన్నతుల్లో అవకతవకలు సవరించాలి
ఒంగోలు సిటీ: స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్మాస్టర్ పదోన్నతుల జాబితాలో అవకతవకలు సవరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ కిరణ్‌కుమార్‌ను కోరారు. స్థానిక ఎస్ఎస్ఏ కార్యాలయంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శనివారం డీఈఓ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా, జీవో నంబర్ 117 తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ స్కూల్ సిస్టెంట్ నుంచి హెచ్ఎంల పదోన్నతుల గురించి చర్చించారు. ఉర్దూ మైనర్ మీడియం సెక్షన్ కొనసాగించాలని, ఉర్దూ ఎస్జీటీ పోస్టును ఉంచాలని కోరారు. మార్కాపురం మున్సిపాలిటీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సీనియార్టీ లిస్టులో లోపాలను డీఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇటీవల మెడికల్ సర్టిఫికెట్ల జారీకి రిమ్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిబిరానికి హాజరుకాలేని వారికి మరో సారి అవకాశం కల్పించాల్సిందిగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. కమిషనర్ నుంచి ప్రొసీడింగ్ వచ్చిన వెంటనే అవకాశం కల్పిస్తామని డీఈఓ చెప్పారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై, లక్ష్మీనారాయణ, ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్ రెడ్డి, శ్రీనివాసులు, పీవీ.సుబ్బారావు, పీఆర్టీయూ నాయకులు శ్రీనివాసరావు, ఎస్టీయూ నాయకులు చల్లా శ్రీను, నరసింహారెడ్డి, టీఎన్‌యూఎస్ నాయకులు ఆంజనేయులు, పండిత పరిషత్ నాయకులు రఘు, ఎస్ఏఎపీ నుంచి రఫీ, బీటీఏ నాయకులు వెంకట్రావు, మల్లిఖార్జునరావు, దిలీప్ చక్రవర్తి, ఏడీ లు వరప్రసాద్, ఉదయ భాస్కర్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ రెడ్డి, రమణయ్య, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
నేడు 5 కేంద్రాల్లో నీట్
ఒంగోలు సబర్బన్: నీట్ పరీక్షలు ఆదివారం జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు మొత్తం 1,473 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయం, జవహర్ నవోదయ, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కాలేజి, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజి, డీఆర్ఆర్ఎం మున్సిపల్ స్కూల్లను కేంద్రాలుగా ఎన్టీఏ ఎంపిక చేసిందన్నారు. ఈ 5 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగేందుకు భద్రతా పరమైన చర్యలతో పాటు అభ్యర్థులకు అవసరమైన రవాణా సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, విద్యుత్ అంతరాయం లేకుండా చూడటం, పారిశుధ్యం, దివ్యాంగులకు వీల్ చైర్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రశ్నపత్రాల ఓపెనింగ్, అభ్యర్థుల తనిఖీలు, తదితర విషయాల్లో ఎన్టీఏ మార్గదర్శకాలను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్విజిలేటర్లకు అవసరమైన శిక్షణ గురువారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పరీక్షల సిటీ కో ఆర్డినేటర్‌కు ఆమె సూచించారు. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే వాతావరణాన్ని కల్పించే బాధ్యత ఆయా సెంటర్ల సూపరింటెండెంట్లపై ఉందన్నారు. పరీక్ష కేంద్రాల పరిశీలనలో కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు ఉన్నారు. నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం -
వీరయ్య కేసులో పుకార్లు షికార్లు
ఒంగోలు టౌన్: తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య జరిగి రెండు వారాలు కావస్తోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు ఇప్పటికీ విచారణ దశలోనే ఉండడంతో రోజుకో రకంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరయ్య హత్యలో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా టీడీపీ నాయకులే కావడంతో కేసు విచారణ విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హత్య విచారణ ఆలస్యమవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వీరయ్య కేసులో ప్రధాన అనుమానితులను చాలా మందినే పోలీసులు విచారించారు. ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయినా ఇంకా కొలిక్కిరాలేదని చెబుతున్నారు. ఆ నలుగురూ నెల్లూరు వాళ్లేనా... ఏప్రిల్ 22వ తేదీన ఒంగోలులోని జాతీయ రహదారికి అనుకొని ఉన్న కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిని నలుగురు యువకులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఎస్పీ కార్యాలయం, తాలూకా పోలీసు స్టేషన్లకు కూత వేటు దూరంలో ఈ హత్య జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. హత్య తరువాత ఒక స్కూటీ మీద ఇద్దరు, మరో మోటారు బైకు మీద మరో ఇద్దరు నిందితులు పారిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ నలుగురిలో ఇద్దరు మాత్రం చీమకుర్తి సమీపంలో ఒక డాబా పక్కన స్కూటీని నిలిపివేసి కనిగిరి ఆర్టీసీ బస్సెక్కి పొదిలి వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మిగిలిన నిందితులు ఎటు వైపు వెళ్లారన్నది నిర్ధారణ కాలేదు. అయితే ఇప్పటి వరకు ఒంగోలు నగర శివారులోని కొప్పోలులో ఒక ప్రైవేటు పాఠశాల సమీపంలో నివశించే వ్యక్తి నేరుగా హత్యలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎంత వరకు నిజమో పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. అసలు హత్యలో పాల్గొన్న నలుగురు కూడా నెల్లూరుకు చెందిన పాత నేరస్తులేనన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై తే నెల్లూరు నుంచి ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలోని పలు పట్టణాల్లో గాలిస్తున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా తడ పరిసరాల్లో కూడా నిందితుడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొప్పోలు అనుమానితుడిపైనే ప్రధాన దృష్టి అయితే వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటి నుంచి కొప్పోలుకు చెందిన వ్యక్తి మీదే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో అతడు స్వయంగా పాల్గొనడమే కాకుండా మిగతా నిందితులను కూడా అతడే సమకూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. హత్యకు ముందు నిందితులు నగరంలోని గుంటూరు రోడ్డులో ఒక లాడ్జీలో ఉన్నారని, వారికి కొప్పోలు వ్యక్తే భోజనాలను పంపించేవాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. హత్య జరిగిన తరువాత వైజాగ్ పారిపోయినట్లు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు అతడు వైజాగ్‌లోనే తలదాచుకునే ఉన్నాడో లేక ఎక్కడికై నా జారుకున్నాడో తెలియదు. అతడు దొరికితే కీలకమైన వ్యక్తులు దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాత్రధారులంతా నెల్లూరు వాళ్లేనని ప్రచారం హత్య జరిగి రెండు వారాలు కావస్తున్నా దొరకని నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన అనుమానితుడు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకం
దర్శి (కురిచేడు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో జిల్లాకు చెందిన వారిని పలువురిని నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి శనివారం తెలిపారు. ఆమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసిందన్నారు. రాష్ట్ర స్టూడెంట్ వింగ్ జోనల్ ప్రెసిడెంట్‌గా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర అంగన్వాడీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా కనిగిరికి చెందిన తమ్మినేని సుజాత, కార్యదర్శిగా దర్శికి చెందిన కందిమళ్ల గీతాంజలి, రాష్ట్ర ఎంప్లాయీస్, పెన్షనర్ల వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా సంతనూతలపాడుకు చెందిన డాక్టర్ నెట్టా సంజీవరావు, కార్యదర్శి గా మార్కాపురానికి చెందిన గోనావత్ ధర్మా నాయక్, సంయుక్త కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన యనమదల స్వరూప్‌ను నియమించినట్లు ఆయన తెలిపారు. నేడు రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాల్గవ, ఐదవ బహుమతుల కింద రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు అందజేస్తారన్నారు. పూర్తి వివరాలకు 7702292595 నంబరుకు సంప్రదించాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండాలి ● కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు సబర్బన్: ఇళ్ల నిర్మాణాల పురోగతిలో ప్రతివారం స్పష్టమైన పురోగతి ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలపై ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో శనివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో కేటగిరీల వారీగా పురోగతిపై ఆమె ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీ చెంచులకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం చేస్తున్నందున ఆ డబ్బులను ఇళ్ల నిర్మాణాలకి లబ్ధిదారులు ఖర్చు పెట్టేలా చూడాలని ఆమె ఆదేశించారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు సమన్వయంతో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇకపై మండలాల వారీగా కాకుండా వచ్చే సమావేశం నుంచి గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని చెప్పారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఈఈలు, డీఈలు, ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ఒంగోలు సబర్బన్: ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోనని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఎంపీడీఓలు, ఏపీఓలు వీటికి సంయుక్తంగా జవాబుదారీ అని చెప్పారు. ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో శనివారం ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యం మేరకు పనులు జరగకపోతే ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ పథకం కింద జిల్లాలో నిర్వహిస్తున్న పనులు, వాటి పురోగతిని డ్వామా పీడీ వివరించారు. ఫారం పాండ్స్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు మే నెలను శ్రీఫారం పాండ్స్ మాసం్ఙగా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీనిపై కలెక్టరు మాట్లాడుతూ ఈ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పశ్చిమ ప్రాంతంలో, ముఖ్యంగా యర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. నీటి తొట్టెల నిర్మాణాలను కూడా సత్వరమే పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. వాస్తవ గడువు గత నెలలోనే ముగిసినా ఇంకా వీటిని పూర్తి చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక సమాధానం చెప్పి మ్యానేజ్ చేసుకుందాములే అనుకుంటే ఊరుకోనని కలెక్టర్ హెచ్చరించారు. ఉపాధి కోరిన అందరికీ పని కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పనుల గుర్తింపునకు సంబంధించిన అనుమతులు ముందుగానే తీసుకోవాలని చెప్పారు. -
మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్ ప్రారంభం
మార్కాపురం: 54వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కమలా సీబీఎస్సీ స్కూల్గ్రౌండ్స్లో చైర్మన్ పవన్, లయన్స్ క్లబ్ చైర్మన్ రామకృష్ణలు చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వలన మానసిక, శారీరక దృఢత్వంతోపాటు పోటీతత్వం అలవడుతుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు, జిల్లా హ్యాండ్‌బాల్ సెక్రటరీలు రవికుమార్, శ్రీకాంత్, గణేష్, లక్ష్మణ్, మహబూబ్‌బాషా, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి చంద్రశేఖరరావు, సత్యప్రసాద్ పాల్గొన్నారు. -
వక్ఫ్ భూములు ఉఫ్!
ఆక్రమణకు గురవుతున్న వక్ఫ్ భూములు పొదిలి: వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలకు తావిస్తోంది. ఒకరిని చూసి మరొకరు వక్ఫ్ భూముల్లో పాగా వేస్తుండటంతో ఆస్తులు తరిగిపోవడంతోపాటు ఆదాయానికీ భారీగా గండి పడుతోంది. భూములు అన్యాక్రాంతమవుతున్న తీరుపై ముస్లింలు గగ్గోలు పెడుతున్నా సంబంధిత శాఖ అధికారులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి మండలానికి సంబంధించి ఒంగోలు రోడ్డులోని దర్గా దగ్గర కాలువ నుంచి మర్రిపూడి రోడ్డు వరకు, బుచ్చనపాలెం సమీపంలో కొంత మేర, కాటూరివారిపాలెం సమీపంలో మొత్తం 322.24 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 285, 325–1,325–2,325–3, 81–1, 407–2, 483–2, 806, 820, 885, 888–1, 888–2,888–4, 888–6, 889–1లో విస్తరించి ఉన్న ఈ భూములపై పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ఆపై తప్పుడు రికార్డులు సృష్టించి భూములు తమవని పేర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆక్రమణల జోరు.. ఒంగోలు–కర్నూలు రోడ్డులోని టైలర్స్ కాలనీ–రైల్వే బ్రిడ్జి మధ్యలో ఉన్న వక్ఫ్ భూములు ఎక్కువ భాగం ఆక్రమణకు గురయ్యాయి. గతంలో కొందరు ఆక్రమణదారులు చేసిన ప్రయత్నాలను అప్పటి అధికారులు అడ్డుకున్నారు. కానీ ప్రస్తుతం అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. అధికారులు కేవలం నోటీసులిచ్చేందుకు పరిమితం కావడం.. నోటీసులు షరా మామూలేననే ధోరణిలో ఆక్రమణదారులు ఉండటంతో విలువైన ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది. పొదిలిలో 52 మంది ఆక్రమణదారులకు అధికారులు నోటీసులు పంపించారు. మరో 40 మంది భూఆక్రమణదారులకు సైతం నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ఆక్రమిత భూములను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు లైట్ తీసుకోవడంపై స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ విచారణ వాయిదా వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతున్న తీరు, ఆక్రమణదారుల వ్యవహార శైలి గురించి పొదిలి పంచాయతీ వార్డు మాజీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు బాషా పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వక్ఫ్ సంస్థ భూములను కాపాడాలని కోరారు. దీంతో ఎట్టకేలకు డిప్యూటీ కలెక్టర్ ఇటీవల విచారణకు వచ్చారు. అయితే రికార్డులు అందుబాటులో లేవని, తహసీల్దార్ సెలవులో ఉన్నారనే కారణాలతో విచారణ వాయిదా వేశారు. మళ్లీ విచారణ ఎప్పుడు చేపడతారో స్పష్టత లేదు. ఆదాయానికి గండి వక్ఫ్ భూముల కౌలు వేలం ద్వారా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల్లో ఆదాయం వస్తోంది. ఒక్కో ఏడాది రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఆదాయం వస్తున్నట్లు స్థానిక ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. ఈ ఆదాయంలో నుంచే పొదిలిలోని పెద్ద మసీదు నిర్వహణకు కొంత మొత్తాన్ని వినియోగిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతు పనులకు సైతం వక్ఫ్ భూముల ఆదాయం నుంచే ఖర్చు చేస్తూ వస్తున్నారు. అయితే భూములు అన్యాక్రాంతం అవుతుండటంతో కౌలు వేలం ఆదాయం తగ్గిపోతోంది. భూవివాదాల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోగా సాధారణ విషయంగా పరిగణిస్తుండటంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది. ఆక్రమణలు తొలగించేంత వరకు పోరాటం వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తా. ఎన్నోమార్లు స్థానిక అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు ఆక్రమణలపై ఫిర్యాదు చేశా. కానీ వారు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ హైకోర్టు తీర్పును కూడా అధికారులు అమలు చేయడం లేదు. మళ్లీ కోర్టుకు వెళ్లయినా సరే అధికారులు చర్యలు తీసుకునేలా కృషి చేస్తా. – ముల్లా ఖాదర్‌బాషా, వైఎస్సార్ సీపీ నాయకుడు అధికారులు సహకరిస్తేనే ఆక్రమణల తొలగింపు ఆక్రమణల తొలగింపునకు సంబంధించి వ్యవహారం తుది దశకు చేరింది. కలెక్టర్, ఎస్పీని కలిసి పలుమార్లు విన్నవించాం. వారు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. స్థానిక అధికారులు, పోలీసుల అండతోనే ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. పని ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారు. వారు సహకరిస్తే త్వరలోనే ఆక్రమణలు తొలగిస్తాం. – అహ్మద్ బాషా, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్