
ఉదయ్‌కృష్ణారెడ్డి నేటి యువతకు స్ఫూర్తి
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: నేటి యువతకు ఉదయ్ కృష్ణారెడ్డి స్ఫూర్తి అని, కష్టపడితే లక్ష్యాన్ని ఏ విధంగా సులువుగా సాధించవచ్చో సివిల్స్‌లో 350వ ర్యాంకు సాధించి నిరూపించారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ కొనియాడారు. మండలంలో ఊళ్లపాలెం గ్రామానికి చెందిన సివిల్ ర్యాంకర్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం స్వయంగా కలుసుకున్నారు. సివిల్స్ సాధనలో ఉదయ్ కృష్ణారెడ్డి కృషిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ చిన్నతనంలో తల్లిని, యుక్తవయస్సులో తండ్రిని కోల్పోయినా నాయనమ్మ సంరక్షణలో ఈ ఘనత సాధించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక మెమెంటో అందజేశారు. కృష్ణారెడ్డి నాయనమ్మ రమణమ్మకు ధన్యవాదములు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, కొండపి మండల అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఢాకా పిచ్చిరెడ్డి, పాకనాటి సుబ్బారెడ్డి, ఉప సర్పంచ్ కాళహస్తి వెంకారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా కిరణ్‌కుమార్, సర్పంచ్ భువనగిరి సత్యన్నారాయణ, షేక్ కరీం, పెరికాల సునీల్, పాలూరి శ్రీనివాసులరెడ్డి, చొప్పర శివ, సోమిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.