
కేబినెట్ మీటింగ్‌లు కావ్‌లే..!
కాకులు వరుసగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నాయ్..! మరి కాకులంటే మాటలా. లోకులతో పాటు తామూ తెలివైనవాళ్లమే అని వాటి ఫీలింగ్. నిజమే.. కాకులు ఆరేడేళ్ల పిల్లలతో సమానంగా ఐక్యూ కలిగి ఉంటాయని ఆర్నిథాలజిస్ట్‌లూ తేల్చారు. అంతకంటే ముందే.. కాకుల ప్రవర్తనను బట్టి భవిష్యత్‌ను అంచనా వేస్తూ ఏకంగా కాకి శాస్త్రమే రూపొందించారు మన పూర్వీకులు. ఇంతకీ విషయమేమిటంటే బేస్తవారిపేటలోని ఓ భవంతిపై వందలాది కాకులు తరచూ సమావేశమై వాటి భాషలో చర్చలు జరుపుతున్నాయ్. సాధారణంగా ఇవి గుంపుగూడాయంటే ఏదో జరగబోతోంది! ఎవరికో మూడింది! అని ఓ అంచనాకు వచ్చేయడం పరిపాటి. వాస్తవానికి ఆహారాన్ని సంపాదించుకోవడం, ముప్పును ఎదుర్కోవడంపై సంభాషించుకునేందుకు అవి ఇలా సమావేశమవుతాయట..!
– బేస్తవారిపేట

కేబినెట్ మీటింగ్‌లు కావ్‌లే..!