
పిల్లలం.. కాలువ ఈదేస్తాం..
వేసవి సెలవులంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. అదే ఉత్సాహాన్ని రెండింతలు చేసి, దేహ దారుఢ్యాన్ని పెంచుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈత కొట్టాల్సిందే.! గతంలో పల్లెటూర్లు, పట్టణ శివార్లలో అక్కడక్కడా బావులు ఉండేవి. కాలక్రమంలో పల్లెటూర్లలోని 80 శాతం బావులు పూడ్చేసిన పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు స్విమ్మింగ్ పూల్స్‌ను ఆశ్రయిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నారు. పల్లెటూర్లలో చెరువులు, కుంటలు ఈతకు యోగ్యంగా లేకపోవడంతో పిల్ల కాలువల్లో ఈదుతూ చిన్నారులు సరదా తీర్చుకుంటున్నారు.
– బేస్తవారిపేట