
మృత్యువులోనూ వీడని స్నేహం
గ్యాస్ లీకై .. మంటలు చెలరేగి..
● ఒకరికి గాయాలు
మార్కాపురం టౌన్: గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఒకరికి గాయాలైన సంఘటన బుధవారం పట్టణంలోని కంభం రోడ్డులో ఉన్న ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో బీహార్‌కు చెందిన సంతోష్‌కుమార్ పాశ్వాన్ బుధవారం వంట మాస్టర్‌గా పనిచేసేందుకు వచ్చాడు. గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన కొంత సమయం తర్వాత లైటర్‌తో వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాయపడిన సంతోష్‌కుమార్‌ను జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘ఆపద ప్రబంధన్’కు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సబర్బన్: భారత ప్రభుత్వం ఏటా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని అందిస్తున్న ఆపద ప్రబంధన్ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఆర్వో ఓబులేసు బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. విపత్తుల నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన వారికి జనవరి 23వ తేదీన నేతాజీ జయంతి సందర్భంగా అవార్డు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ పురస్కారానికి అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఈ నెల 30వ తేదీలోగా సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మార్కాపురం: అతి వేగం.. నిర్లక్ష్యం.. రెండు నిండు ప్రాణాలను బలిగొన్నది. మార్కాపురం మండలం చింతగుంట్ల–కుంట మధ్య బుధవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. తమ బంధువు మృతి చెందడంతో కడచూపు చూసేందుకు వారు కూడా మృత్యు ఒడిలోకి చేరారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మార్కాపురం మండలం వేములకోట పంచాయితీలోని వేములపేట గ్రామానికి చెందిన జంకె శ్రీనివాసరెడ్డి(53), తన బంధువు, స్నేహితుడైన కొండేపల్లి గ్రామానికి చెందిన చాగంటి గాలిరెడ్డి(63) బుధవారం ఉదయం పెద్దారవీడు మండలం సానికవరం గ్రామంలో మృతి చెందిన బంధువును చూసేందుకు స్కూటర్‌పై బయలుదేరారు. చింతగుంట్ల గ్రామ సమీపంలో హైవే రోడ్డు ఎక్కి కొద్ది దూరం వెళ్లగా.. రాచర్ల నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి ఢీట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డి, గాలిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మార్కాపురం రూరల్ ఏఎస్సైలు శ్రీనివాసరావు, రంగయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారై పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.
స్నేహ బంధం.. విషాదాంతం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరికీ చిరకాల స్నేహంతో పాటు బంధుత్వం కూడా ఉంది. మృతుడు జంకె శ్రీనివాసరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమారుడు కృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి 100 మీటర్ల దూరంలో ఉన్న సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె రమణమ్మకు వివాహమైంది. మరో కుమారుడు కాశిరెడ్డి 6వ తరగతి, కుమార్తె వెంకట కాశీశ్వరి 8వ తరగతి చదువుతున్నారు. మరో మృతుడు చాగంటి గాలిరెడ్డికి భార్య మంగమ్మతోపాటు కుమారులు రామాంజనేయరెడ్డి, రామిరెడ్డి ఉన్నారు. శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. వేములకోట, వేములపేట, కొట్టాలపల్లి, నికరంపల్లి గ్రామాలకు చెందిన పలువురు సంఘటనా స్థలంతోపాటు జీజీహెచ్‌కు తరలివచ్చారు.
స్కూటర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం కారు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణం మార్కాపురం మండలం చింతగుంట్ల వద్ద దుర్ఘటన బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే జంకె, అన్నా కృష్ణచైతన్య పరామర్శ
వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మార్కాపురం వైఎస్సార్ సీపీ నాయకుడు అన్నా కృష్ణ చైతన్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మృత్యువులోనూ వీడని స్నేహం

మృత్యువులోనూ వీడని స్నేహం

మృత్యువులోనూ వీడని స్నేహం