
మురళీ నాయక్ భరతమాత ముద్దు బిడ్డ
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్‌కు శనివారం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలంలోని కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ బోర్డర్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతి చెందిన విషయం విదితమే. మురళీ నాయక్ భరతమాత ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే అభివర్ణించారు. ఆయన కుటుంబానికి యావత్ భారతదేశం అండగా ఉంటుందని అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు. ఆర్మీ జవాన్‌కు నివాళులర్పించిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జిల్లా కార్యదర్శి కె.ఓబులరెడ్డి, సర్పంచ్‌లు ఆర్.అరుణాబాయి, ఆవుల కోటివీరారెడ్డి, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పబ్బిశెట్టి శ్రీనివాసులు, వివిధ విభాగాల నాయకులు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, సయ్యద్ జబీవుల్లా, దొగిపర్తి సంతోష్‌కుమార్, పి.రాములు నాయక్, సయ్యద్ షాబీర్‌బాష, షేక్.బుజ్జి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు నాయక్, బ్రహ్మారెడ్డి, ఎం.సుబ్బారావు పాల్గొన్నారు.