ఆమె ఆదేశం.. అధికారుల అత్యుత్సాహం! | - | Sakshi
Sakshi News home page

ఆమె ఆదేశం.. అధికారుల అత్యుత్సాహం!

May 6 2025 2:13 AM | Updated on May 6 2025 2:19 AM

ఆమె ఆ

ఆమె ఆదేశం.. అధికారుల అత్యుత్సాహం!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: దర్శి పట్టణంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల వ్యాపారాలపై కూటమి నేతల కక్షసాధింపులు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. అధికారులు సైతం కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతూ వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల దుకాణాలు తొలగించేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు. దర్శి టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి కనుసన్నల్లో సాగుతున్న కక్ష సాధింపుల పర్వానికి స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంస్కృతిని దర్శికి అలవాటు చేసి కూటమి మద్దతుదారులే వ్యాపారాలు చేయాలని భీష్మించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నగర పంచాయతీ అభివృద్ధిని గాలికొదిలేసి వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల వ్యాపారాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవానికి దర్శిలోని కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డు, తూర్పుచౌటపాలెం రోడ్డులో సైడు కాలువలు దాటి ముందుకు వచ్చి మరీ దుకాణాలు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటుంటే గుడ్లప్పగించి చూస్తున్న నగర పంచాయతీ అధికారులు.. కేవలం వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలనే టార్గెట్‌ చేస్తున్నారనేందుకు రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనే తాజా నిదర్శనం. కొణతం అపర్ణ, సురేష్‌రెడ్డికి చెందిన దుకాణాన్ని తొలగించేందుకు పదుల సంఖ్యలో పోలీసులను పురమాయించిన తీరు చూసి విస్తుపోవడం స్థానికుల వంతయింది. అద్దంకి రోడ్డు శివారులో వైఎస్సార్‌ సీపీ నాయకుడు తన ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న దుకాణాన్ని తొలగించారు. పొదిలి రోడ్డులో వైఎస్సార్‌ సీపీ నాయకుల దుకాణాలు రోడ్డుపైకి వచ్చాయంటూ వాటిని తొలగించారు. టీడీపీకి చెందిన వారి దుకాణాల జోలికి మాత్రం అధికారులు వెళ్లలేదు. టిఫిన్‌ సెంటర్‌ వంట సామగ్రి కాలువపై అడ్డుగా ఉందంటూనగర పంచాయతీ అధికారులు నిర్దాక్షిణ్యంగా ట్రాక్టరులో వేసుకుని వెళ్లారు. మరో షాపు రోడ్డుపై ఉందని చెప్పి బెదిరింపులకు దిగారు. డ్రెయినేజీ హద్దుకు లోపలి వైపు ఉన్న చిరు వ్యాపారులను సైతం బెదిరించి మూసేయించారు. కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డులో డ్రైనేజీ దాటి రోడ్డుపైకి వచ్చిమరీ దుకాణాలు నిర్వహిస్తున్నా టీడీపీ వ్యక్తులనే కారణంతో నగర పంచాయతీ కమిషనర్‌ మహేష్‌ పట్టించుకోవటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. దీనికి తోడు నగరపంచాయతీ కి చెందిన ఓ ఉద్యోగి చిరువ్యాపారుల వద్ద రోజూ అనధికార శిస్తు వసూలు చేసి కూటమి నేతలు, అధికారుల జేబులు నింపుతున్నాడని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆ ఉద్యోగి దోపిడీని ఎదిరించలేని చిరువ్యాపారులు మనోవేదన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించాలంటే అందరికీ ఒకే న్యాయం వర్తింపజేయాలని, ఇలా కొందరినే లక్ష్యంగా చేసుకుని వేధించడం సబబు కాదని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ట్రాఫిక్‌ పేరుతో దర్శిలో అడ్డగోలుగా దుకాణల తొలగింపు టీడీపీ సానుభూతిపరుల జోలికి వెళ్లని నగర పంచాయతీ అధికారులు టీడీపీ అయితే సరే.. వైఎస్సార్‌ సీపీ అయితే ఒప్పుకోమన్నట్లుగా తీరు

ఆమె ఆదేశం.. అధికారుల అత్యుత్సాహం!1
1/1

ఆమె ఆదేశం.. అధికారుల అత్యుత్సాహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement