కక్ష సాధింపులు ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపులు ఇంకెన్నాళ్లు?

May 9 2025 1:47 AM | Updated on May 9 2025 2:03 AM

కక్ష సాధింపులు ఇంకెన్నాళ్లు?

కక్ష సాధింపులు ఇంకెన్నాళ్లు?

దొనకొండ:

ంక్షేమ పథకాలు అందించి మేలు చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, అరాచకాలకు పాల్పడుతోందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి విమర్శించారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించడం మానుకోవాలని హితవు పలికారు. దొనకొండ మండలంలోని ఆరవల్లిపాడు గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన సందర్భంగా బుధవారం రాత్రి వైఎస్సార్‌ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అక్రమ కేసులు బనాయించడంపైనే శ్రద్ధ చూపుతోందని ఎద్దేవా చేశారు. బడుగు బలహీనవర్గాలకు, రైతులకు, మహిళలకు అని రకాలుగా సంక్షేమాన్ని అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. గతంలో పొగాకు, మిర్చి, కంది, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత మాట దాటవేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు తేటతెల్లమైందన్నారు. సూపర్‌ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబునాయుడుతోపాటే రాష్ట్రంలోకి కరువు వచ్చిందని, అరకొరగా పండిన పంటను సైతం అమ్ముకోలేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాబోయే ఎన్నకల్లో వైఎస్సార్‌ సీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలే వైఎస్సార్‌ సీపీకి కొండంత బలమని, కేసులు పెట్టినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఈ నెలాఖరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించి రైతులతో మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కాకర్ల కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్‌ బాపనపల్లి శ్రీను, దర్శి నియోజకవర్గ బూత్‌ కమిటీ అధ్యక్షుడు కాలూరి రమణయ్య, జిల్లా యూత్‌ విభాగం అధ్యక్షులు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీ గుంటు పోలయ్య, దర్శి నియోజకవర్గ వలంటీర్‌ వింగ్‌ అధ్యక్షుడు కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా యాక్టివ్‌ మెంబర్‌ బత్తుల వెంకటసుబ్బయ్య, బీమిని వెంకటేశ్వర్లు, గొంగటి మహేష్‌రెడ్డి, కన్నెధార వెంకటసుబ్బయ్య, ఐలూరి శ్రీనివాసరెడ్డి, కసిబిసి నాగరాజు, తమ్మనేని సుబ్బారెడ్డి, ఇండ్ల శ్రీనివాసరావు, పులిమి శివ, కె.ప్రసాద్‌, ఆరవల్లిపాడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కేసులు పెడితే బెదిరేది లేదు

కార్యకర్తలే వైఎస్సార్‌ సీపీ బలం

సూపర్‌ 6 హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం

గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు సర్కారుకు సిగ్గుచేటు

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement