
కొడుకుని చంపిన తల్లి
స్థానిక జయప్రకాశ్ వీధిలో నివాసం ఉంటున్న కదం శ్యాంప్రసాద్ చెడు వ్యసనాలకు బానిసై పనికి వెళ్లకుండా సంపాదన లేకుండా మద్యం తాగుతూ కుటుంబ సభ్యులను, బంధువులను ఇబ్బందులు పెట్టేవాడు. తన సమీప బంధువులైన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించగా పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి మందలించారు. ఫిబ్రవరి 8న తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో అన్న సుబ్రహ్మణ్యం, తమ్ముడు కాశీరావు అతడిని మందలించి భయపెట్టారు. అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సహనం కోల్పోయిన కుటుంబ సభ్యులు 13వ తేదీన తల్లి లక్ష్మీదేవి, అన్న సుబ్రహ్మణ్యం, తమ్ముడు కాశీరావులు శ్యాంప్రసాద్‌ను చంపేయాలని నిర్ణయించుకొని ఆటో డ్రైవర్ వల్లంశెట్టి మోహన్‌ను కలిసి అదేరోజు రాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని ఏం చెయ్యాలో అర్థంగాక నలుగురు కలిసి గొడ్డలి, కత్తితో 8 ముక్కలుగా నరికి అందుబాటులో ఉన్న మూడు గోతాల్లో కుక్కి ఎవరూ లేని సమయంలో మోసుకొని వెళ్లి ఇంటికి సమీపంలో ఉన్న పంట కాల్వ వెంబడి పడేశారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి, ఇద్దరు సోదరులతో పాటు హత్యకు సహకరించిన ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

కొడుకుని చంపిన తల్లి