
వైఎస్సార్ సీపీ ఒంగోలు అధ్యక్షునిగా శంకర్
ఒంగోలు టౌన్ : వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షునిగా కటారి శంకరరావును ఎంపిక చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఒంగోలు నగర కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కోడూరి కిషోర్, కొణికి రోశయ్య, జనరల్ సెక్రటరీలుగా దుగ్గిరెడ్డి జయరామిరెడ్డి, షేక్ మూసా, ఆవుల వెంకట సురేంద్ర, అంబటి అర్జున్, నెరుసుల రామకృష్ణను ప్రకటించారు. అలాగే కార్యదర్శులుగా పల్లపోతుల వెంకయ్య నాయుడు, షేక్ రమిజా, తేల్ల అవినాష్, ఆవుల రవితేజ, నంద్యాల సాయిరెడ్డి, తోటపల్లి రవి, కొక్కిలిగడ్డ వెంకటేశ్వర్లు, పొనుగోటి రాజేశ్వరి, షేక్ అబ్దుల్ సలాం, గోనెల శివకుమార్‌ను నియమించారు. వీరితో పాటు 37 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించారు.
అనుబంధ విభాగాల అధ్యక్షుల ఎన్నిక...
వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా కాకుమాను సునీల్‌రాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బత్తుల ప్రమీల, బీసీ సెల్ అధ్యక్షునిగా సూతరం శ్రీనివాసులు, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా పసుమర్తి గోపీచంద్, ఎస్టీ సెల్ అధ్యక్షునిగా గాలేటి వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ అధ్యక్షునిగా మహమ్మద్ చాన్‌బాషాలను నియమించారు. క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షునిగా కావూరి కృపాకిరీటి, విద్యార్థి విభాగం అధ్యక్షునిగా సయ్యద్ ఖాదర్ బాషా, మున్సిపల్ విభాగం అధ్యక్షునిగా షేక్ రషీద్ నాగూర్, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షునిగా తోటా సుధారాణి, వలంటీర్ల విభాగం అధ్యక్షునిగా అబ్దుల్‌ఖుద్దూస్‌ను నియమించారు. గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షునిగా షేక్ హిదాయతుల్లా, వాణిజ్య విభాగం అధ్యక్షునిగా ఏ యలమందారెడ్డి, చేనేత విభాగం అధ్యక్షునిగా మొగిలి ఆనందరావు, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షునిగా మిర్యాల శ్రీనివాసరావు, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా బడుగు ఇందిర, లీగల్ సెల్ అధ్యక్షునిగా కాకటూరి సంపత్ కుమార్, కల్చరల్ విభాగం అధ్యక్షునిగా పఠాన్ సమీర్‌ఖాన్, సోషల్ మీడియా అధ్యక్షునిగా చావల పీటర్‌పాల్, ఐటీ విభాగం అధ్యక్షునిగా ఉల్లగంటి సతీష్ కుమార్, దివ్యాంగుల విభాగం అధ్యక్షునిగా షేక్ మీరావలి, డాక్డర్స్ విభాగం అధ్యక్షునిగా కొల్లం దీపక్ సాహిత్య, పబ్లిసిటీ విభాగం అధ్యక్షునిగా పిగిలి శ్రీనివాసరావును నియమించారు.

వైఎస్సార్ సీపీ ఒంగోలు అధ్యక్షునిగా శంకర్