
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
యర్రగొండపాలెం: పోలీసులు తాను ఇచ్చిన కేసు నమోదు చేయడం లేదని స్థానిక అంబేడ్కర్ నగర్‌కు చెందిన అలేటి సురేష్ మంగళవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..సురేష్ పట్టణంలోని ఇద్దరు వ్యాపారుల వద్ద నుంచి కొంతమేర అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించడం లేదని వారు అతన్ని తీవ్రంగా హింసించడంతో పాటు దాడి చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ దాడిలో అతని కుడిచేయి విరిగిపోయింది. దీంతో సురేష్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఈ కేసును తీసుకోకుండా నిందితులను పిలిపించి విచారిస్తామని చెప్పి అతన్ని పంపించేవారు. పోలీస్‌స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. లేకుంటే దూకి ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించాడు. కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అతను కిందికి దిగివచ్చాడు.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతోనే.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దిగివచ్చిన వైనం

సెల్ టవర్ ఎక్కిన యువకుడు

సెల్ టవర్ ఎక్కిన యువకుడు