
పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి
విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో గంజాయి, ఇతర చెడు వ్యసనాలకు బానిసలై నేరస్తులుగా మారిపోతున్నారు. గంజాయి కేసులో పిల్లలు మొదటిసారి పట్టుబడితే ఒంగోలులోని రిహాబిలిటేషన్ సెంటరుకు పంపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. రెండోసారి పట్టుబడితే కేసు నమోదు చేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరైనా గంజాయి సేవిస్తున్నా, విక్రయాలు జరుపుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – కె.మల్లికార్జున, కంభం సీఐ