
వైఎస్సార్ సీపీపై అభిమానం అభినందనీయం
● పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు సిటీ: మార్కాపురం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షునిగా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షునిగా పాటిబండ్ల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికవడం, వైఎస్సార్ సీపీ పట్ల వారు చూపిన అంకితభావం ఎంతో అభినందనీయమని పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అవుతుందనడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. జిల్లాలో పార్టీ ప్రతిష్ట పెంచుతూ నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుండి నడిపిస్తున్న జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.