
బైక్ అదుపు తప్పి ఆర్టీసీ ఉద్యోగి మృతి
ముండ్లమూరు(కురిచేడు): ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని వేంపాడు గ్రామం వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. ఒంగోలుకు చెందిన షేక్ మహబూబ్ బాషా(60) చీమకుర్తిలో నివాసముంటూ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పి పడటంతో బలమైన గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మహబూబ్ బాషా మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.
తేనెటీగల దాడిలో ఏడుగురికి గాయాలు
హనుమంతునిపాడు: జామాయిల్ కోతకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన హనుమంతునిపాడు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. కొండారెడ్డిపల్లి, కోటతిప్పల గ్రామాలకు చెందిన కూలీలు జామాయిల్ కర్ర కోతకు వెళ్లారు. ఈ క్రమంలో తోట గట్టు వెంట ముళ్ల పొదను జేసీబీతో తొలగిస్తుండగా అందులో ఉన్న తేనె తుట్టె కదిలింది. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా కూలీలను చుట్టుముట్టాయి. గాయం శివారెడ్డి, సీహెచ్ దశరథ, నర్సయ్య, వెంకటలక్ష్మిలతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఖేల్ ఇండియా బీచ్ గేమ్స్‌కు కొండరాజు
కొనకనమిట్ల: మండలంలోని నాగంపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు కసిబిసి కొండరాజు ఖేల్ ఇండియా బీచ్ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో ఎంపీడీ చదువుతున్న కొండరాజు ఈనెల 6వ తేదీన శాప్ ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీచ్ సెపక్‌తక్రా పోటీల్లో ప్రకాశం జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేల్ ఇండియా బీచ్ గేమ్స్ 2025లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు కొండరాజుకు అవకాశం దక్కిందని కోచ్ ఎం.ప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
రిటైర్డ్ ఎస్సై శిలార్ బాషా మృతి
కంభం: పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎస్సై, బిలాల్ మసీదు గౌరవాధ్యక్షుడు షేక్ శిలార్ బాషా(70) గురువారం ఉదయం మృతి చెందారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారని బంధువులు తెలిపారు. శిలార్‌బాషా మృతికి పలువురు సంతాపం తెలిపారు.

బైక్ అదుపు తప్పి ఆర్టీసీ ఉద్యోగి మృతి

బైక్ అదుపు తప్పి ఆర్టీసీ ఉద్యోగి మృతి