
భార్యను హత్య చేసిన భర్త
కంభం పంచాయతీ పరిధిలోని సాదుమియా వీధిలో నివాసం ఉంటున్న అర్థవీటి నాగ అంజలి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేస్తుండగా భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ వివాహాలు జరిగాయి. ప్రైవేటు స్కూల్లో పని చేస్తున్న తన భార్య ఇతరులతో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న అతను జనవరి 12వ తేదీ రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో దివాన్‌కాట్‌పై నిద్రిస్తుండగా ఓ పెద్ద సైజు కర్ర తీసుకొని ఆమె తలపై దాడి చేయడంతో బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.