
కర్రల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
త్రిపురాంతకం: కర్రల లోడ్ వెళ్తున్న ట్రాక్టర్‌ను మార్జిన్ గమనించక కారు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన త్రిపురాంతకం మండలంలోని గుట్లపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కురిచేడు మండలంలోని మృత్యుంజయపురం గ్రామానికి చెందిన వజ్రగిరి కొండమ్మ(45), కొదమల కుమారి, షారోన్, ప్రశాంత్‌రాజ్ పుల్లలచెరువు మండలంలోని చౌటపాచర్ల గ్రామంలో బంధువుల ఇంట శుభ కార్యానికి హాజరయ్యారు. కారులో స్వగ్రామానికి బయలుదేరిన వీరు మార్గమధ్యంలో గుట్లపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కర్రల లోడ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. వజ్రగిరి కొండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్రిపురాంతకం పోలీసులు తెలిపారు.
మహిళ మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
గుట్లపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన