
పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి
రాచర్ల: పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..జేపీచెరువు గ్రామానికి చెందిన ఒంటేరు రంగయ్య, పామూరు శ్రీనివాసులు, గోతం వలి కలిసి గొర్రెల మేత కోసం నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగుపాటుకు 22 గొర్రెలు మృతి చెందాయి. ఒంటేరు రంగయ్యకు చెందిన 12 గొర్రెలు, పామూరు శ్రీనివాసులకు చెందిన 5, గోతం వలికి చెందిన 5 గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు.