
జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయం
కనిగిరి రూరల్: జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. శనివారం కనిగిరి వచ్చిన ఆయన స్థానిక వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌తో కలిసి మాట్లాడారు. దద్దాల నారాయణకు జగనన్న అండగా ఉన్నారని, పార్టీ శ్రేణులంతా సమష్టిగా, కష్టపడి పనిచేసి కనిగిరి కంచుకోటపై వైఎస్సార్ జెండా ఎగుర వేయాలని పిలుపు నిచ్చారు. గత ఎన్నికల్లో కూడా జిల్లాలో తక్కువ ఓట్లతో కనిగిరి ఓడిపోయామన్నారు. మంచివాడు, మృధుస్వభావి, అందరిలో ఒక్కడిగా ఉంటూ అందరినీ కలుపుకుని పోతున్న దద్దాల నారాయణకు పార్టీ శ్రేణులంతా అండగా ఉండాలన్నారు. 2029 ఎన్నికల్లో కనిగిరిలో వైఎస్సార్ సీపీ దెబ్బకొడితే దిమ్మతిరిగి పోవాలన్నారు. రాబోయే రోజులు వైఎస్సార్ సీపీవేనని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. పార్టీ కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మనమంతా కలిసి కట్టుకకు పనిచేసి జగనన్న సీఎం చేసుకుందామన్నారు. కష్టపడి పనిచేద్దాం.. ఇదే ఉత్సాహంతో కనిగిరి కొండపై వైఎస్సార్ సీపీ జెండా ఎగురు వేద్దామని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుందోని ధ్వజమెత్తారు. 11 నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. కూటమి సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఘాటుగా విమర్శించారు. తొలుత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, కనిగిరి పార్టీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ జన్నదిన వేడుకల్లో పాల్గొన్నారు. నారాయణకు పుష్పగుచ్ఛం అందజేసి కేక్ తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నారాయణ యాదవ్, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
వై.పాలెం ఎమ్మెల్యే
తాటిపర్తి చంద్రశేఖర్
ఘనంగా కనిగిరి ఇన్‌చార్జి దద్దాల జన్మదిన వేడుకలు