
పోలీస్ గ్రీవెన్స్‌కు 80 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి 80 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఏఆర్ దామోదర్, ఇతర పోలీసు అధికారులు అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన ఎస్పీ చట్టపరిధిలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసాలకు సంబందించిన ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ రవణ కుమార్, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, సీసీఎస్ సీఐ జగదీష్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.