
ఐదు గ్రానైట్ టిప్పర్ల సీజ్
చీమకుర్తి:
ఓవర్ లోడుతో వెళ్తున్న ఐదు గ్రానైట్ టిప్పర్లను చీమకుర్తి సీఐ ఎం.సుబ్బారావు సోమవారం సీజ్ చేశారు. రామతీర్థం డంపింగ్‌ల నుంచి రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గ్రానైట్ వేస్ట్ రాళ్లతో వెళ్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఓవర్ లోడు కారణంగా తరచూ ట్రాఫిక్ అంతరాయం, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆర్టీఓ డిపార్టుమెంట్ అధికారులతో పాటు విజిలెన్స్ డిపార్టుమెంట్ వారు దృష్టి పెట్టి ఓవర్‌లోడుతో వెళ్లే వాహనాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.