సంద్రం.. అల్లంతదూరం!
సింగరాయకొండ: సముద్రుడు దోబూచులాడుతున్నాడు. సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెంలో అలలు తీరానికి సుమారు 20 మీటర్ల దూరం వెనక్కి వెళ్లాయి. గత కొద్ది నెలలుగా అలలు ముందుకొస్తూ రెండు అడుగల లోతు వరకు తీరం కోతకు గురైంది. దీంతో తీరంలోని విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతోపాటు రొయ్యల చెరువుల కట్టలు ధ్వంసమయ్యాయి. వేట నిషేధ సమయం కావడంతో మత్స్యకారులు ముందు జాగ్రత్తగా తమ బోట్లు, వలలను తీరానికి దూరంగా ఉంచారు. ఇంతలోనే అలలు 20 మీటర్ల మేర లోపలికి వెళ్లడంతో మత్స్యకారులతోపాటు పర్యాటకులు అయోమయానికి గురవుతున్నారు.
ఊళ్లపాలెంలో 20 మీటర్లు వెనక్కి వెళ్లిన అలలు


