చిత్తశుద్ధితో ఉద్యోగం చేయాలి
ఒంగోలు సబర్బన్:
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగాలు పొందిన 8 మందికి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పరిహారంలో భాగంగా ఉద్యోగాలు పొందిన ఇద్దరికి సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వ సర్వీసులోకి వస్తున్నందుకు వారిని అభినందించారు. విధి నిర్వహణలో నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
● సబ్‌కలెక్టరు కార్యాలయం ఎదుట హిందూ సంఘాల నిరసన
మార్కాపురం:
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన భూములను కాపాడాలని హిందూసంఘాల నాయకులు సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వీరారావు, ఉపాధ్యక్షుడు జీసీహెచ్ వెంకటరెడ్డి, కార్యదర్శి గురునాథం మాట్లాడుతూ దేవస్థానానికి చెందిన 250 ఎకరాల ఆలయ భూమిని ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించడం సరికాదన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఇనాముదారులు దేవాలయ అభివృద్ధి కోసం అప్పట్లో ఈ భూములను కేటాయించారని, వారి ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఎండోమెంట్ చట్టానికి విరుద్ధంగా ఏపీఐఐసీకి అప్పగించడం దారుణమని అన్నారు. స్వామి ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూ మార్పిడి విధానాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి.ప్రసన్న, రమాదేవీ, తులసీ, సునీత, గురుస్వామి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
చిత్తశుద్ధితో ఉద్యోగం చేయాలి


