జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా
ఒంగోలు: జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ఒంగోలు విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 26 నుంచి 28 వరకు విజయవాడలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 40వ జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ఒంగోలుకు చెందిన బాలబాలికలు బ్లాక్ బెల్ట్, కలర్ బెల్టు విభాగంలో బంగారు, వెండి, రజిత పతకాలను కై వసం చేసుకున్నారు. పతకాలు సాధించిన చిన్నారులను, శిక్షణ ఇచ్చిన అంతర్జాతీయ కోచ్ కరిముల్లాను జాతీయ తైక్వాండో అధ్యక్షుడు బీవీ రమణయ్య, ఏపీ పోర్టు వర్కర్ ఫెడరేషన్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లాబాషా, ఎమరన్ విజయ్, సీవీఎన్ పాలకమండలి సభ్యులు అభినందించారు.
బాలురు బ్లాక్ బెల్ట్ విభాగం: జి.మహదేవ్ కార్తీక్, జి.విజ్ఞాన్, జయప్రకాష్,ప్రశాంత్(బంగారు), విఘ్నేష్(వెండి)
బాలుర కలర్ బెల్టులు: షేక్ అబ్దుల్ అక్మల్, షేక్ సాదాబ్, రుత్విక్, శివసూర్య, లోహిత్‌రెడ్డి (వెండి), హేమంత్‌సాయి, అద్వితేజ్ (రజిత )
బాలికలు బ్లాక్ బెల్ట్: అభిషిక్త (బంగారు), కోమల నాగశ్రీ, నాగశ్రీ (వెండి)
బాలికల కలర్ బెల్ట్: సహస్త్రరెడ్డి, కావ్యశ్రీ, సాజీదాలు (రజిత) పతకాలను కై వసం చేసుకున్నారు ..


