క్రీడలతో శారీరక, మానసిక వికాసం
ఒంగోలు: విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 28వ అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడలు, ఆటల పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములకన్నా విజయాన్ని సాధించాలనే కాంక్ష, తపన పెరుగుతాయన్నారు. ఒంగోలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. పోటీల్లో ప్రతిభ చాటిన జట్లు జనవరిలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాల్‌బాల్, చదరంగం పోటీలు నిర్వహించారు.
అథ్లెటిక్స్: వంద మీటర్ల పరుగు: యు.ఉపేంద్ర (కంభం ), వి.పవన్‌కుమార్(కంభం), మదన్(ఒంగోలు డీఎ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ)
200 మీ. పరుగు: ఎం.జస్వంత్‌నాయక్(కంభం), వి.ధనుష్(కంభం ), ఎన్.కిరన్ (ఒంగోలు డీఎ ప్రభుత్వ పాలిటెక్నిక్)
400 మీ.పరుగు: ఎం.బాలత్రినేష్(అద్దంకి), వి.శ్రీధర్(కందుకూరు), పి.శ్రీకాంత్(అద్దంకి)
800 మీ.పరుగు: ఎన్.మహీంద్ర(ప్రకాశం పాలిటెక్నిక్), జి. డాన్‌కిసిక్(కందుకూరు ప్రభుత్వ), ఎం.గోపీకృష్ణ(ప్రకాశం పాలిటెక్నిక్)
1500 మీ పరుగు: కె.దేవేంద్ర(ప్రకాశం పాలిటెక్నిక్), జి.డాన్‌కిసిక్, వి.జస్వంత్( కందుకూరు ప్రభుత్వ)
4X100 మీ. రిలే: కంభం ఎస్‌వీకేపీ(ప్రథమ), రైజ్ పాలిటెక్నిక్ (ద్వితీయ) , పేస్ పాలిటెక్నిక్(తృతీయ)
4x400 మీ. రిలే: కందుకూరు ప్రభుత్వ(ప్ర ఎమ), కంభం ఎస్‌వీకేపీ(ద్వితీయ), డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ ( తృతీయ) బహుమతులు సాధించారు.
షాట్‌పుట్: పి.సుకుమార్(ప్రథమ), వి.ప్రీతం రాజు(ద్వితీయ), కె.పవన్(తృతీయ)
డిస్కస్‌త్రో: వి.ప్రీతంరాజు(కందుకూరు ప్రభుత్వ), కేవీ దుర్గారెడ్డి(వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ చీరాల), టి. రాజు(ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ)
క్రీడలతో శారీరక, మానసిక వికాసం
క్రీడలతో శారీరక, మానసిక వికాసం


