వేధింపులు తాళలేక.. | - | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక..

May 5 2025 8:16 AM | Updated on May 5 2025 8:16 AM

వేధిం

వేధింపులు తాళలేక..

కరెంటు ఇవ్వండి సారూ..

పోలవరంలో మూడు రోజులుగా నిలిచిన విద్యుత్‌ సరఫరా

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రాస్తారోకో

ముండ్లమూరు (కురిచేడు): మండలంలోని పోలవరంలో మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఆదివారం గంటపాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో బోర్లు పనిచేయక తాగేందుకు ప్రజలకు, మూగజీవాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరాపురం వెళ్లి నీళ్లు తెచ్చుకుని గొంతు తడుపుకోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ జీవాలకు తాగునీరు లేక ఒక ఆవు చనిపోయిందని, విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవి ప్రాణంపోయిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా విద్యుత్‌ శాఖ అధికారులు వచ్చి మాట్లాడే వరకు రాస్తారోకో విరమించబోమని తేల్చిచెప్పారు. మండల టీడీపీ ఇన్‌చార్జి సోమేపల్లి శ్రీనివాసరావు రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడి విద్యుత్‌ పునరుద్ధరణ చేయిస్తానని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు.

కంభం: స్థానిక కాపవీధిలో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన షేక్‌ వలి (37) కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. మద్యం మత్తులో గొడవకు దిగడంతో అతని భార్యే కండువాను గొంతుకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అర్థవీడుకు చెందిన షేక్‌ వలి కంభం పంచాయతీ పరిధిలోని సాధుమియా వీధికి చెందిన మహిళను వివాహం చేసుకుని భార్యతో కలిసి కొంతకాలంగా కంభంలోని కాపవీధిలో నివాసం ఉంటున్నాడు. మృతుడు పెయింటింగ్‌ పనులకు వెవెళ్తుండగా, అతని భార్య రిజ్వాన కూలి పనులకు వెళ్తుంటుంది. మద్యానికి బానిసైన వలి తరచూ భార్యతో గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పనికి వెళ్లకుండా మద్యం సేవించి భార్యతో గొడవపడి ఇంట్లోనే పడుకున్నాడు. సుమారు రాత్రి 9 గంటల సమయంలో ఎంత నిద్రలేపినా లేవకపోవడంతో వెంటనే కంభం ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు. తొలుత పురుగుమంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, మద్యం సేవించి డీహైడ్రేషన్‌తో మృతి చెందాడని ప్రచారం జరిగింది. మృతుడి గొంతు వద్ద అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్యను విచారించిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది. మద్యం మత్తుకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవపడేవాడని, ఈ నేపథ్యంలో శనివారం భార్యతో గొడవపడి ఘర్షణకు దిగిన నేపథ్యంలో కండువాను భర్త మెడకు బిగించడంతో అతను ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుడి భార్య, బంధువులను విచారించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. డీఎస్పీ నాగరాజు దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు.

భర్తను హత్య చేసిన భార్య మద్యం మత్తులో గొడవకు దిగడంతో కండువా మెడకు చుట్టి హత్య కంభంలో అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు

వేధింపులు తాళలేక..1
1/2

వేధింపులు తాళలేక..

వేధింపులు తాళలేక..2
2/2

వేధింపులు తాళలేక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement