విద్యుత్ టవర్ల రక్షణకు పటిష్ట చర్యలు
మార్కాపురం: మండలంలోని దరిమడుగు సమీపంలోని మహమద్‌సాబ్ కుంట వద్ద ఉన్న విద్యుత్ టవర్ల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్‌కో ఈఈ మేకల రవిశంకర్ తెలిపారు. మట్టి మాఫియాతో ఏర్పడిన గుంతలు, ఇటీవల కురిసిన వర్షాలకు చేరిన నీటితో ప్రమాదం అంచున ఉన్న విద్యుత్ టవర్లపై ఈ నెల 19న సాక్షిలో శ్రీ220 కేవీ విద్యుత్ టవర్‌కు పొంచివున్న ముప్పుశ్రీ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఈఈ ఎస్‌కే అమీన్, సివిల్ ఈఈ నాగరాజు, డీఈ సుధీర్‌బాబు సందర్శించారు. తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్ పి.వెంకటేశ్వర్లుకు చెప్పామన్నారు.
గిద్దలూరు రూరల్: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని రాచర్లగేటు సమీపంలో రైల్వేట్రాక్‌పై ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నరవ గ్రామానికి చెందిన దుగ్గెపోగు రమేష్(33) పెయింటింగ్ కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో గిద్దలూరుకు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న నంద్యాల జీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మార్కాపురం: విద్యుదాఘాతానికి రైతు మృతి చెందాడు. ఈ సంఘటన తర్లుపాడు మండలంలోని జగన్నాథపురంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సయ్యద్ చాంద్‌బాషా (39) పొలానికి వెళ్లిన సమయంలో పొలం గట్టున ఉన్న విద్యుత్ కంచె తగిలి మృతి చెందాడు. తమ్ముడు ఖాశీంవలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
● అధికారులతో సమీక్షలో కలెక్టర్
రాజా బాబు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకును అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్‌లో రెడ్‌క్రాస్ సంస్థను అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు, అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెడ్‌క్రాస్ సంస్థలో బ్లడ్ కొరత లేకుండా బ్యాంకులో బ్లడ్ నిల్వలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకులో 300 యూనిట్లు బ్లడ్ నిల్వలు చేయడానికి అవకాశం ఉందని, కానీ ఇప్పటి వరకు 100 యూనిట్ల రక్తం నిల్వలు మాత్రమే ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో జరిగే రాష్ట్ర పండుగలకు, ప్రత్యేక రోజుల్లో నిర్వహించే ఉత్సవాల్లో బ్లడ్ క్యాంపు నిర్వహించి దాతల నుంచి రక్త సేకరణ చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు ఎం.నరసింహారావు, సి.ఆంజనేయులు, ఏ. వెంకట్రావు, ఏ.శ్రీనివాసరావు, డి.రవి ప్రకాష్ , బి.వి.ఎస్.కే కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ టవర్ల రక్షణకు పటిష్ట చర్యలు
విద్యుత్ టవర్ల రక్షణకు పటిష్ట చర్యలు
విద్యుత్ టవర్ల రక్షణకు పటిష్ట చర్యలు
విద్యుత్ టవర్ల రక్షణకు పటిష్ట చర్యలు


