ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట బందోబస్తు
● అధికారులను ఆదేశించిన కలెక్టర్
రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఉన్న ఈవీఎం గోదాములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్లలను, భద్రతా ఏర్పాట్లను క్షుణంగా పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఒంగోలు డీఆర్‌ఓ చిన ఓబులేసు, చీరాల ఆర్‌డీఓ చంద్రశేఖర్ నాయుడు, కలెక్టరేట్ సూపరింటిండెంట్ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, ఎనిమిది నియోజక వర్గాల డీటీలు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దదోర్నాల: కుందేలు మాంసంతో పట్టుబడిన యువకుడికి అటవీశాఖ అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. ఈ సంఘటన సోమవారం మండల పరిధిలోని తిమ్మాపురంలో జరిగింది. మండల పరిధిలోని తిమ్మాపురంలో కుందేలు మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న పిక్కిలి రవి అనే యువకుడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రథమ నేరంగా పరిగణిస్తూ రూ.లక్ష జరిమానా విధించినట్లు పెద్దదోర్నాల రేంజి అధికారి హరి తెలిపారు. వీఆర్వోత సునీత, బీట్ ఆఫీసర్ కృష్ణవేణి తదితరులు ఉన్నారు.


