
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
మార్కాపురం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని డిపో మేనేజర్ ఏఎస్ నరసింహులు తెలిపారు. గత నెల 27న సాక్షిలో ‘ప్రయాణం.. చక్రబంధం’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. బస్టాండ్లో తాగునీటి సౌకర్యం లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని, శ్లాబ్ పెచ్చులూడి పోయి ప్రమాదకరంగా మారిన విషయాన్ని కథనంలో వివరించారు. దీనికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం ఆర్‌ఓ నీటి సౌకర్యం ఏర్పాటు చేశామని, పెచ్చులూడిన శ్లాబ్‌కు మరమ్మతులు చేయించామని, ప్రయాణికులు కూర్చునేందుకు బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని డీఎం తెలిపారు.
అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
ఆరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని డీఎం కోరారు. ప్రతి పౌర్ణమి ముందురోజు బస్సు బయలుదేరుతుందని, రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో టిక్కెట్ రూ.2,500 ధరగా నిర్ణయించామన్నారు.
బస్టాండ్లో తాగునీటి సౌకర్యం, శ్లాబుకు మరమ్మతులు ఆర్టీసీ డీఎం నరసింహులు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం