
దొంగ మస్టర్లతో నిధులు స్వాహా...
జిల్లాలో దొంగ మస్టర్ల వివాదం సంచలనం సృష్టిస్తోంది. ప్రతి మండలంలోనూ దొంగ మస్టర్ల దందా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్కన అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు దొంగ మస్టర్లకు తెరదీసినట్లు చెప్పుకుంటున్నారు. ఒక్కో మండలంలో 5 నుంచి 7 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు నమోదవుతోంది. వాస్తవానికి అందులో సగం మంది కూడా ఫీల్డ్‌లో కనిపించడం లేదు. ఇటీవల పుల్లలచెరువు మండలంలోని మర్రివేములలో రికార్డుల్లో చూపిన సంఖ్య కంటే ఫీల్డ్‌లో పనులు చేస్తున్న కూలీలు చాలా తక్కువగా కనిపించడంతో తనిఖీకి వెళ్లిన అధికారులు వామ్మో అంటూ నోరెళ్లబెట్టినట్లు తెలిసింది. ఉదయం 150 మంది మట్టి తవ్వకాలకు వచ్చినట్లు హాజరులో చూపించారు, తనిఖీ అధికారులకు 15 మందే కనిపించారు. దీనికితోడు ఒక్కో మస్టర్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలోని బేస్తవారిపేట, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, అర్ధవీడు, కొనకనమిట్ల మండలాల్లో దొంగ మస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

దొంగ మస్టర్లతో నిధులు స్వాహా...

దొంగ మస్టర్లతో నిధులు స్వాహా...