సత్తాచాటిన బొడిచర్ల ఎడ్లు
బేస్తవారిపేట: మండలంలోని జేసీ అగ్రహారంలో పట్టాభిరామస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో మార్కాపురం మండలం బొడిచర్లకు చెందిన టి.నక్షత్రారెడ్డి, ధ్రువసాయిరామ్ సంయుక్త ఎడ్ల జత 2,750 అడుగుల దూరం బండ లాగి మొదటి స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా అలగనూరు రోలిమోడం ఎడ్లు 2,516 అడుగులు, నంద్యాల జిల్లా జిల్లెలకు చెందిన గొటిక దినేష్‌రెడ్డి ఎడ్లు 2,509 అడుగులు, నంద్యాల జిల్లా పెసరవాయికి చెందిన సయ్యద్ కలాం ఎడ్లు 2,502 అడుగులు, బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి ఎడ్లు 2,384 అడుగులు, వీరాస్వామికి చెందిన మరో జత ఎడ్లు 2,266 అడుగులు, గిద్దలూరుకు చెందిన దుర్వాసుల అశ్వని ఎడ్లు 2,000 అడుగులు, జేసీ అగ్రహారానికి చెందిన లక్కు నాగశివశంకర్ ఎడ్లు 1,843 అడుగుల దూరం లాగి వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. గెలుపొందిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు, రూ.6 వేలను దాతలు పంపిణీ చేశారు.


