టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఎస్పీ అభినందనలు
ఒంగోలు టౌన్: టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఎస్పీ హర్షవర్థన్‌రాజు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు అధికారులతో రైజ్ కాలేజీలో నిర్వహించిన వార్షిక నేర సమీక్ష సమావేశంలో 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నమోదైన దొంగతనాలు, ఇతర నేరాల కేసులు, పోలీసులు తీసుకున్న నిర్ణయాల గురించి లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పనితీరును ప్రశంసించారు. సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. టాస్క్‌ఫోర్స్ సీఐ సుధాకర్, ఎస్సై సుదర్శన్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులుకు ప్రశంసపత్రాలు అందజేశారు.


