మిర్చి రైతు కంట్లో కారం | - | Sakshi
Sakshi News home page

మిర్చి రైతు కంట్లో కారం

May 18 2025 1:05 AM | Updated on May 18 2025 1:05 AM

మిర్చ

మిర్చి రైతు కంట్లో కారం

కూటమి ప్రభుత్వం మిర్చి రైతు కంట్లో కారం కొడుతోంది. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారు. గుంటూరు యార్డులోనే క్వింటా ధర రకాన్ని బట్టి రూ.8500 నుంచి రూ.10 వేల మధ్య పలుకుతోంది. జిల్లాలో మిర్చి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో గుంటూరు వెళ్లి మిర్చి యార్డులో అమ్ముకోవాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి క్వింటా మిర్చిని రూ.11,740కి కొనుగోలు చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మబలికి రెండు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం హయాంలో క్వింటా మిర్చి రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు పలికింది. దీంతో మిర్చి రైతులు లాభాల బాట పట్టారు. మళ్లీ జీవితంలో ఆ పరిస్థితులను చూడలేమనుకుంటూ రైతులు నిట్టూరుస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలు జగనన్నకే సాధ్యం

తడిసి రంగుమారిన మిర్చిని కుప్పగా పోస్తున్న రైతు

ఆలయం వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

రాచర్ల: మండలంలోని నెమలిగుండ్లరంగనాయక స్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు అధిక సంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌ ఏర్పడింది. లక్ష్మమ్మ వనం నుంచి నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయానికి సుమారు కిలో మీటర్‌ ఉంటుంది. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయానికి వెళ్లేందుకు కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్‌ చేశారు. దీంతో వచ్చేపోయే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించి పోవడంతో కాలినడక వెళ్లే భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుని రంగస్వామి ఆలయం వద్ద వాహనాలు పార్కింగ్‌ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు

బేస్తవారిపేట: మండలంలోని పీవీ పురంలో పేరంటాలమ్మ–పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా శనివారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలు ప్రారంభించేందుకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వెళ్లారు. పార్టీలకు అతీతంగా పండగ జరుపుకుందామని, వైఎస్సార్‌ సీపీ, టీడీపీ నాయకులను ఎవరినీ బండ పందేలు ప్రారంభించేందుకు పిలవొద్దని గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు ముందే తీర్మానం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరికీ చెప్పకుండా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని పిలిపించి బండ ఎక్కించేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు, కమిటీ మెంబర్లు అడ్డుకున్నారు. గ్రామరాశి డబ్బుతో బండలాగుడు పోటీలు పెట్టామని, పార్టీల మధ్య గొడవలు వస్తాయని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించొద్దని ముందే నిర్ణయించుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గంట సేపు టీడీపీ నాయకులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి ఎంత ప్రయత్నించినా గ్రామస్తులు ఒప్పుకోలేదు. చేసేది లేక బండలాగుడు ఎడ్ల ముందు నిలబడి గ్రూప్‌ఫొటో దిగి ఎమ్మెల్యే ముత్తుముల వెనక్కి వెళ్లిపోయారు.

పీసీపల్లి: ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం జగనన్నకే సాధ్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పాలేటి గంగమ్మ తిరునాళ్లలో భాగంగా వెంగలాపురం సమీపంలో పాలేటి నది ఒడ్డున వెలసిన గంగమ్మ ప్రాంగణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాతకొట్టు పిచ్చిరెడ్డి, ఎన్నికల శ్రీనివాస్‌రెడ్డి, వడ్డంపుడి వెంకటేశ్వర్లు, వెంకట భాస్కర్‌, మరిమి వెంకటేశ్వర్లు చౌదరి, చెన్నుపాటి వెంకటేశ్వరరావు చౌదరి ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు ఇన్‌చార్జి చుండూరు రవిబాబు, కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌, చింతలచెరువు సత్యనారాయణరెడ్డితో కలిసి శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బూచేపల్లి మాట్లాడుతూ మళ్లీ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగనన్న సీఎం కావాలని ప్రజలంతా కోరుతున్నారన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని, పొగాకు, కంది రైతులంతా రోడ్డును పడ్డారన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయకుండా వలంటీర్‌ వ్యవస్థ కొనసాగిస్తానని చెప్పి పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు మోసగించారని బూచేపల్లి ధ్వజమెత్తారు. ఇది దోచుకుని దాచుకునే ప్రభుత్వమేనని, సంక్షేమ పథకాలు గాలికి వదిలారని మండిపడ్డారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లివెంకాయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ఓడిపోతారన్న భయంతోనే ఉమ్మడిగా వచ్చి మోసపూరితమైన మాటలు ప్రజలకు చెప్పి గెలిచారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేయడం వైఎస్‌ కుటుంబానికే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ చంద్రబాబు సంక్షేమ, పరిపాలన గాలికి వదిలి విలాసాలకి సొంతంగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదని సంక్షోభ ప్రభుత్వమని విమర్శించారు. చుండూరి రవిబాబు మాట్లాడుతూ రైతులు తరఫున గళం విప్పేందుకు త్వరలో జగనన్న జిల్లాకు వస్తున్నారని, మనమంతా కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌ మాట్లాడుతూ తాను అతి సామాన్యుడినని, మీలో ఒక్కడినని, ఎమ్మెల్యేగా అభ్యర్థిగా తనను ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబం పట్ల ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటానని స్పష్టం చేశారు. రెడ్డి కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ పేరుతో అందరినీ బెదిరిస్తోందని, ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడేవారు లేరన్నారు. కార్యక్రమంలో కేవీ రమణారెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ గోపవరపు బొర్రారెడ్డి, ఓకే రెడ్డి, పోలు జయరామ్‌రెడ్డి, మడతల కస్తూరిరెడ్డి, వీరంరెడ్డి బ్రహ్మారెడ్డి, మూల రాజశేఖర్‌రెడ్డి, కోన్‌ నరసింహారావు, లింగాలది నరసింహారెడ్డి, మడతల ఓబుల్‌రెడ్డి, నరాల కొండారెడ్డి, రేగుల బాలయ్య, భూమిరెడ్డి కొండారెడ్డి, శ్రీకాంత్‌, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, తమ్మినేని సుజాత పాల్గొన్నారు

క్లుప్తంగా

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి

– సాక్షి,ఒంగోలు

మిర్చి రైతు కంట్లో కారం1
1/8

మిర్చి రైతు కంట్లో కారం

మిర్చి రైతు కంట్లో కారం2
2/8

మిర్చి రైతు కంట్లో కారం

మిర్చి రైతు కంట్లో కారం3
3/8

మిర్చి రైతు కంట్లో కారం

మిర్చి రైతు కంట్లో కారం4
4/8

మిర్చి రైతు కంట్లో కారం

మిర్చి రైతు కంట్లో కారం5
5/8

మిర్చి రైతు కంట్లో కారం

మిర్చి రైతు కంట్లో కారం6
6/8

మిర్చి రైతు కంట్లో కారం

మిర్చి రైతు కంట్లో కారం7
7/8

మిర్చి రైతు కంట్లో కారం

మిర్చి రైతు కంట్లో కారం8
8/8

మిర్చి రైతు కంట్లో కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement